అడల్ట్ సిన్మాలకు రెడీ కానీ...: హీరోయిన్‌ | I might do a sex comedy in America, but not in India, says Nargis Fakhri | Sakshi
Sakshi News home page

అడల్ట్ సిన్మాలకు రెడీ కానీ...: హీరోయిన్‌

Published Sun, Apr 24 2016 4:17 PM | Last Updated on Sun, Sep 3 2017 10:39 PM

అడల్ట్ సిన్మాలకు రెడీ కానీ...: హీరోయిన్‌

అడల్ట్ సిన్మాలకు రెడీ కానీ...: హీరోయిన్‌

అడల్ట్‌ చిత్రాలు, సెక్స్ కామెడీ సినిమాల్లో నటించడానికి తాను సిద్ధమే కానీ, బాలీవుడ్‌లో మాత్రం అలాంటి సినిమాలు చేయబోనని అంటోంది హీరోయిన్ నర్గీస్ ఫక్రీ. ప్రస్తుతం 'హౌస్‌ఫుల్‌-3' సినిమాలో నటిస్తున్న ఈ ముద్దుగుమ్మ ఇండియాలో అలాంటి సినిమాలు చేయలేనని, అమెరికా లేదా ఇతర విదేశాల్లో అయితే అలాంటి సినిమాలు చేసినా ఎలాంటి అభ్యంతరముండదని చెప్పుకొచ్చింది.

అమెరికాకు చెందిన 36 ఏళ్ల మోడల్ అయిన నర్గీస్ కు ప్రస్తుతం బాలీవుడ్‌లో మంచి ఆఫర్లే వస్తున్నాయి. 'నేను ఇక్కడ అలాంటి (అడల్ట్‌, సెక్స్ కామెడీ) సినిమాలు చేయబోను. ఆ విషయంలో సెన్స్‌ హ్యూమర్‌ ఇండియాలో చాలా భిన్నంగా ఉంటుంది. అదే అమెరికా, జర్మనీ, లండన్‌లో అయితే వాళ్ల సెన్స్ ఆఫ్ హ్యుమర్‌ వేరే రకంగా ఉంటుంది. అమెరికాలో అయితే నేను తప్పకుండా ఆ సినిమాల్లో నటిస్తా. ఇక్కడ మాత్రం చేయను' అని నర్గీస్‌ తాజాగా సెలవిచ్చింది.

బాలీవుడ్‌లో ఇప్పుడు అడల్ట్ కామెడీ సినిమాలకు మంచి మార్కెట్టే ఉంది. గ్రాండ్ మస్తీ, క్యా కూల్ హై హమ్, మస్తీజాదే వంటి పెద్దల సినిమాలు బాగానే కాసులు కురిపించాయి. అయితే, ఇప్పటివరకు బాలీవుడ్‌లో వచ్చిన అడల్ట్ కామెడీ సినిమాలు చూడలేదని నర్గీస్ తెలిపింది. అక్షయ్‌ కుమార్, అభిషేక్ బచ్చన్‌, రితేశ్‌ దేశ్‌ముఖ్, జాక్వలిన్ ఫెర్నాండెజ్, లిసా హెడెన్‌ వంటి ప్రముఖ తారాగణంతో సాజిద్-పర్హాద్ ద్వయం 'హౌస్‌ఫుల్-3'ను తెరకెక్కిస్తోంది. ఈ సినిమాతోపాటు అజారుద్దీన్ జీవిత చరిత్రతో తెరకెక్కుతున్న 'అజార్‌' సినిమాలోనూ నర్గీస్ నటిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement