Grand Masti
-
అడల్ట్ సిన్మాలకు రెడీ కానీ...: హీరోయిన్
అడల్ట్ చిత్రాలు, సెక్స్ కామెడీ సినిమాల్లో నటించడానికి తాను సిద్ధమే కానీ, బాలీవుడ్లో మాత్రం అలాంటి సినిమాలు చేయబోనని అంటోంది హీరోయిన్ నర్గీస్ ఫక్రీ. ప్రస్తుతం 'హౌస్‌ఫుల్-3' సినిమాలో నటిస్తున్న ఈ ముద్దుగుమ్మ ఇండియాలో అలాంటి సినిమాలు చేయలేనని, అమెరికా లేదా ఇతర విదేశాల్లో అయితే అలాంటి సినిమాలు చేసినా ఎలాంటి అభ్యంతరముండదని చెప్పుకొచ్చింది. అమెరికాకు చెందిన 36 ఏళ్ల మోడల్ అయిన నర్గీస్ కు ప్రస్తుతం బాలీవుడ్లో మంచి ఆఫర్లే వస్తున్నాయి. 'నేను ఇక్కడ అలాంటి (అడల్ట్, సెక్స్ కామెడీ) సినిమాలు చేయబోను. ఆ విషయంలో సెన్స్ హ్యూమర్ ఇండియాలో చాలా భిన్నంగా ఉంటుంది. అదే అమెరికా, జర్మనీ, లండన్‌లో అయితే వాళ్ల సెన్స్ ఆఫ్ హ్యుమర్ వేరే రకంగా ఉంటుంది. అమెరికాలో అయితే నేను తప్పకుండా ఆ సినిమాల్లో నటిస్తా. ఇక్కడ మాత్రం చేయను' అని నర్గీస్ తాజాగా సెలవిచ్చింది. బాలీవుడ్లో ఇప్పుడు అడల్ట్ కామెడీ సినిమాలకు మంచి మార్కెట్టే ఉంది. గ్రాండ్ మస్తీ, క్యా కూల్ హై హమ్, మస్తీజాదే వంటి పెద్దల సినిమాలు బాగానే కాసులు కురిపించాయి. అయితే, ఇప్పటివరకు బాలీవుడ్లో వచ్చిన అడల్ట్ కామెడీ సినిమాలు చూడలేదని నర్గీస్ తెలిపింది. అక్షయ్ కుమార్, అభిషేక్ బచ్చన్, రితేశ్ దేశ్‌ముఖ్, జాక్వలిన్ ఫెర్నాండెజ్, లిసా హెడెన్ వంటి ప్రముఖ తారాగణంతో సాజిద్-పర్హాద్ ద్వయం 'హౌస్‌ఫుల్-3'ను తెరకెక్కిస్తోంది. ఈ సినిమాతోపాటు అజారుద్దీన్ జీవిత చరిత్రతో తెరకెక్కుతున్న 'అజార్' సినిమాలోనూ నర్గీస్ నటిస్తోంది. -
టీవీలో 'గ్రాండ్ మస్తీ'కి లైన్ క్లియర్
న్యూఢిల్లీ: అడల్ట్ కామెడీ సినిమా 'గ్రాండ్ మస్తీ'ను టీవీలో ప్రసారం చేయడానికి లైన్ క్లియర్ అయింది. సినిమాటోగ్రఫి చట్టం-1952లోని నిబంధనలను కచ్చితంగా పాటిస్తూ ఈ సినిమాను టీవీల్లో ప్రదర్శించాలని ఢిల్లీ హైకోర్టు మంగళవారం తీర్పున్చింది. చీఫ్ జస్టిస్, జస్టిస్ జీ రోహిణి, జస్టిస్ జయంత్ నాథ్ తో కూడిన ధర్మాసనం ఈ సినిమా ప్రదర్శనపై విధించిన స్టేను ఎత్తివేసింది. ఇప్పటికే టీవీల్లో ఈ సినిమా మూడుసార్లు ప్రదర్శితమైన విషయాన్ని ధర్మాసనం గుర్తుచేసింది. బాలీవుడ్ నటులు రితేష్ దేశ్‌ముఖ్, వివేక్ ఒబ్రరాయ్, అఫ్తాబ్ శివదాసని నటించిన 'గ్రాండ్ మస్తీ' సినిమాకు యూ/ఏ సర్టిఫికెట్ ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ ఎదారా గోపీచంద్ అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. ఈ అడల్డ్ కామెడీ సినిమాలో డబుల్ మీనింగ్ డైలాగులు, అభ్యంతరకరమైన సన్నివేశాలు ఉన్నాయని కోర్టుకు నివేదించారు. దీంతో ఈ చిత్రాన్ని టీవీల్లో ప్రదర్శించరాదని గత ఆగస్టులో హైకోర్టు స్టే విధించింది. -
వంద కోట్ల క్లబ్లో గ్రాండ్ మస్తీ
ఎలాంటి అంచనాలు లేకుండా బాలీవుడ్లో విడుదలైన ’గ్రాండ్ మస్తీ’ వంద కోట్ల క్లబ్లో చేరింది. అసభ్యత హద్దులు దాటిందని క్రిటిక్స్‌తో పాటు పలువురు ఈ చిత్రాన్ని విమర్శిస్తున్నారు. ఈ చిత్రం ఘోర పరాజయాన్ని చవిచూస్తుందని కొంతమంది ఊహించారు. అయితే ఆ ఊహలకు భిన్నంగా వసూళ్ల సునామీ సృష్టించడం విశేషం. ఇంద్రకుమార్ దర్శకత్వంలో రితేష్ దేశ్‌ముఖ్, అఫ్తాబ్ శివదానీ, వివేక్ ఒబెరాయ్‌లు నటించిన ఈ చిత్రం ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలయ్యింది. అయితే విడుదలైన వెంటనే శృంగారభరితమైన కామెడీ చిత్రంగా బ్రాండ్ పడటం, సోషల్ మీడియాలో ప్రచారం ఊపందుకోవడం ఈ చిత్రానికి కలిసి వచ్చిందని సినీ విమర్శకులు అభిప్రాయపడుతున్నారు. ఇండియాలో ఈ స్థాయిలో వసూళ్లు సాధించిన మొదటి ‘అడల్ట్ సెక్స్ కామెడీ’ చిత్రం ఇదేనని ట్రేడ్ వర్గాలవారు విశ్లేషించారు. తొలివారంలో 66.4 కోట్ల రూపాయల్ని వసూలు చేసిన ‘గ్రాండ్ మస్తీ’ మూడోవారానికి వందకోట్ల మార్కును దాటింది. ఈ చిత్రంపై వస్తున్న విమర్శలను చిత్రదర్శకుడు ఇంద్రకుమార్ పట్టించుకోవడం లేదు. సరికదా... ఈ విజయంతో ప్రేక్షకుల అభిరుచిలో మార్పు వచ్చిందని, శృంగారభరితమైన హాస్య చిత్రాలకు ప్రేక్షకుల నుంచి ఆదరణ లభిస్తుందని రుజువయ్యిందని పేర్కొనడం గమనార్హం.