వంద కోట్ల క్లబ్‌లో గ్రాండ్ మస్తీ
వంద కోట్ల క్లబ్‌లో గ్రాండ్ మస్తీ
Published Mon, Oct 7 2013 2:27 AM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM
ఎలాంటి అంచనాలు లేకుండా బాలీవుడ్‌లో విడుదలైన ’గ్రాండ్ మస్తీ’ వంద కోట్ల క్లబ్‌లో చేరింది. అసభ్యత హద్దులు దాటిందని క్రిటిక్స్‌తో పాటు పలువురు ఈ చిత్రాన్ని విమర్శిస్తున్నారు. ఈ చిత్రం ఘోర పరాజయాన్ని చవిచూస్తుందని కొంతమంది ఊహించారు. అయితే ఆ ఊహలకు భిన్నంగా వసూళ్ల సునామీ సృష్టించడం విశేషం.
ఇంద్రకుమార్ దర్శకత్వంలో రితేష్ దేశ్‌ముఖ్, అఫ్తాబ్ శివదానీ, వివేక్ ఒబెరాయ్‌లు నటించిన ఈ చిత్రం ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలయ్యింది. అయితే విడుదలైన వెంటనే శృంగారభరితమైన కామెడీ చిత్రంగా బ్రాండ్ పడటం, సోషల్ మీడియాలో ప్రచారం ఊపందుకోవడం ఈ చిత్రానికి కలిసి వచ్చిందని సినీ విమర్శకులు అభిప్రాయపడుతున్నారు. ఇండియాలో ఈ స్థాయిలో వసూళ్లు సాధించిన మొదటి ‘అడల్ట్ సెక్స్ కామెడీ’ చిత్రం ఇదేనని ట్రేడ్ వర్గాలవారు విశ్లేషించారు.
తొలివారంలో 66.4 కోట్ల రూపాయల్ని వసూలు చేసిన ‘గ్రాండ్ మస్తీ’ మూడోవారానికి వందకోట్ల మార్కును దాటింది. ఈ చిత్రంపై వస్తున్న విమర్శలను చిత్రదర్శకుడు ఇంద్రకుమార్ పట్టించుకోవడం లేదు. సరికదా... ఈ విజయంతో ప్రేక్షకుల అభిరుచిలో మార్పు వచ్చిందని, శృంగారభరితమైన హాస్య చిత్రాలకు ప్రేక్షకుల నుంచి ఆదరణ లభిస్తుందని రుజువయ్యిందని పేర్కొనడం గమనార్హం.
Advertisement
Advertisement