భార్య యంగ్‌గా కనిపిస్తే.. మరీ భర్త..! | Riteish Deshmukh Post About Genelia | Sakshi
Sakshi News home page

భార్య యంగ్‌గా కనిపిస్తే.. మరీ భర్త..!

Published Sat, Oct 22 2016 6:40 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

భార్య యంగ్‌గా కనిపిస్తే.. మరీ భర్త..! - Sakshi

భార్య యంగ్‌గా కనిపిస్తే.. మరీ భర్త..!

‘అంతేనా.. వీలుంటే నాలుగు మాటలు.. కుదరితే కప్పు’ అంటూ ‘బొమ్మరిల్లు’లో ఆకట్టుకున్న జెనీలియా గుర్తుంది కదా! పలు తెలుగు సినిమాల్లో నటించి అలరించిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు బాలీవుడ్‌ హీరో రితేష్‌ దేశ్‌ముఖ్‌ను పెళ్లి చేసుకొని హాయిగా వైవాహిక జీవితాన్ని గడుపుతోంది. బాలీవుడ్‌లోని క్యూటెస్ట్‌ జంటలలో రితేశ్‌-జెనీలియా జోడీ ఒకటని చెప్పవచ్చు.

ప్రేమించి పెళ్లి చేసుకున్న వీరు అప్పుడప్పుడు సోషల్‌ మీడియాలో తమ ప్రేమకథలోని ఒక్కో పేజీని అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. ఇటీవల ఓ స్మార్ట్‌ఫోన్‌ ప్రమోషన్‌ కార్యక్రమంలో జెనీలియా పాల్గొన్నది. ఈ సందర్భంగా ఆమెతో దిగిన ఫొటోను పెట్టి రితేష్‌ ఓ ఆసక్తికరమైన కామెంట్‌ పెట్టాడు. ‘మీ భార్య టీనేజర్‌లా మరీ యంగ్‌గా కనిపిస్తే.. మీరు ఆమెకు తండ్రిలా కనిపిస్తారు’అంటూ ఫన్నీ కామెంట్‌ పెట్టాడు. నిజమే జెనీలియా ఇప్పటికీ తన చార్మింగ్‌ లుక్‌ను కోల్పోలేదు. రితేష్‌-జెనీలియా దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. రెండేళ్ల రియాన్‌, ఐదేళ్ల రహిల్‌ను శ్రద్ధగా చూసుకుంటూ తల్లిగా తాను మురిసిపోతున్నట్టు జెనీలియా చెప్తోంది.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement