టీవీలో 'గ్రాండ్ మస్తీ'కి లైన్ క్లియర్ | HC allows TV telecast of 'Grand Masti' | Sakshi
Sakshi News home page

టీవీలో 'గ్రాండ్ మస్తీ'కి లైన్ క్లియర్

Published Tue, Oct 20 2015 7:40 PM | Last Updated on Sat, Aug 11 2018 8:29 PM

HC allows TV telecast of 'Grand Masti'

న్యూఢిల్లీ: అడల్ట్ కామెడీ సినిమా 'గ్రాండ్ మస్తీ'ను టీవీలో ప్రసారం చేయడానికి లైన్ క్లియర్ అయింది. సినిమాటోగ్రఫి చట్టం-1952లోని నిబంధనలను కచ్చితంగా పాటిస్తూ ఈ సినిమాను టీవీల్లో ప్రదర్శించాలని ఢిల్లీ హైకోర్టు మంగళవారం తీర్పున్చింది. చీఫ్ జస్టిస్, జస్టిస్ జీ రోహిణి, జస్టిస్ జయంత్ నాథ్ తో కూడిన ధర్మాసనం ఈ సినిమా ప్రదర్శనపై విధించిన స్టేను ఎత్తివేసింది. ఇప్పటికే టీవీల్లో ఈ సినిమా మూడుసార్లు ప్రదర్శితమైన విషయాన్ని ధర్మాసనం గుర్తుచేసింది.


బాలీవుడ్ నటులు రితేష్ దేశ్ముఖ్, వివేక్ ఒబ్రరాయ్, అఫ్తాబ్ శివదాసని నటించిన 'గ్రాండ్ మస్తీ' సినిమాకు యూ/ఏ సర్టిఫికెట్ ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ ఎదారా గోపీచంద్ అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. ఈ అడల్డ్ కామెడీ సినిమాలో డబుల్ మీనింగ్ డైలాగులు, అభ్యంతరకరమైన సన్నివేశాలు ఉన్నాయని కోర్టుకు నివేదించారు. దీంతో ఈ చిత్రాన్ని టీవీల్లో ప్రదర్శించరాదని గత ఆగస్టులో హైకోర్టు స్టే విధించింది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement