తల్లి పేరు సన్నీ లియోన్‌.. షాక్‌తో మైండ్‌ బ్లాక్‌ | Sunny Leone and Emraan Hashmi as Parents to A Bihar Student | Sakshi
Sakshi News home page

తల్లి సన్నీ లియోన్‌.. తండ్రి ఇమ్రాన్‌ హష్మి

Published Thu, Dec 10 2020 11:48 AM | Last Updated on Thu, Dec 10 2020 12:14 PM

Sunny Leone and Emraan Hashmi as Parents to A Bihar Student - Sakshi

పట్నా: హెడ్డింగ్‌ చూడగానే వీరిద్దరికి వివాహం ఎప్పుడు అయ్యిందని ఆశ్చర్యపోతున్నారు. ఆగండి ఇంకో విషయం కూడా చెప్తాము.. ఆ తర్వాత మీ ఆశ్చర్యం మరి కాస్తా ఎక్కువవతుంది. అది ఏంటంటే వీరిద్దరు ఉత్తర బిహార్‌లోని ఓ టౌన్‌లో ఉంటున్నారని.. వీరికి 20 ఏళ్ల కుమారుడు కూడా ఉన్నాడు. చదువుతుంటేనే గందరగోళంగా అనిపిస్తుంది కదా.. హాల్‌టికెట్‌ తీసుకుని చూసుకున్న తర్వాత సదరు యువకుడు మనకంటే ఎక్కువ ఆశ్చర్యపోయుంటాడు. ఇంకా చెప్పాలంటే షాక్‌తో మైండ్‌ బ్లాక్‌ అయి ఉంటుంది. విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలుస్తుంది ఈ ఘటన. ఓ కాలేజీ స్టూడెంట్‌ అడ్మిట్‌ కార్డ్‌ మీద అతడి తల్లి దండ్రుల పేర్ల స్థానంలో ఇమ్రాన్‌ హష్మి, సన్నీ లియోన్‌ పేర్లు ప్రింట్‌ చేశారు కాలేజీ యాజమాన్యం. (చదవండి: జాతీయగీతం మర్చిపోయిన విద్యాశాఖ మంత్రి)

వివరాలు.. కుందన్‌ కుమార్‌(20) అనే యువకుడు ధనరాజ్‌ మహ్తో డిగ్రీ కాలేజీలో బీఏ రెండో సంవత్సరం చదువుతున్నాడు. ఈ క్రమంలో పరీక్షలు జరుగుతుండటంతో హాల్‌ టికెట్‌ తీసుకునేందుకు కాలేజీకి వెళ్లాడు. దాన్ని చూసిన అతడు ఒక్కసారి షాక్‌ అయ్యాడు. ఎందుకంటే దాని మీద అతడి తండ్రి పేరుకు బదులు ఇమ్రాన్‌ హష్మి అని.. తల్లి పేరు దగ్గర సన్నీ లియోన్‌ అని ఉంది. దీని గురించి కాలేజీ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లడంతో ప్రస్తుతం ఈ అడ్మిట్‌ కార్డ్‌ తెగ వైరలవుతోంది. యూనివర్సిటీ రిజాస్టారర్‌ రామ్‌ కృష్ణ ఠాకూర్‌ మాట్లాడుతూ.. ‘విద్యార్థి వల్లనే ఈ తప్పిదం జరిగి ఉంటుందని భావిస్తున్నాం. దర్యాప్తు చేస్తున్నాం.. బాధితుల మీద కఠిన చర్యలు తీసుకుంటాం’ అని తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement