
వేదిక
రాఘవ లారెన్స్ హారర్ కామెడీ మూవీ ‘ముని’తో తెలుగు ఆడియన్స్‌కు పరిచయ మయ్యారు హీరోయిన్ వేదిక. ఆ తర్వాత తెలుగులో కొన్ని సినిమాలు చేసినా, ఎక్కువగా తమిళం, మలయాళ సినిమాలు చేస్తున్నారు. లేటెస్ట్‌గా వేదికకు బాలీవుడ్ నుంచి ఓ క్రేజీ ఆఫరొచ్చింది.
సీరియల్ కిస్సర్‌గా పేరు తెచ్చుకున్న ఇమ్రాన్ హష్మీతో మలయాళ దర్శకుడు జీతు జోసెఫ్ రూపొందిస్తున్న ‘ది బాడీ’ సినిమాలో హీరోయిన్‌గా వేదికను సెలెక్ట్ చేశారు. హిందీలో ఫస్ట్ మూవీలోనే ఇమ్రాన్ హష్మీ, రిషీ కపూర్‌తో యాక్ట్ చేసే చాన్స్ కొట్టేశారు వేదిక. ‘‘ఇన్ని రోజులు వెయిట్ చేసినందుకు సూపర్ ఎగై్జటింగ్ ప్రాజెక్ట్ వచ్చింది. చాలా హ్యాపీగా ఉంది’’ అని పేర్కొన్నారు వేదిక. స్పానిష్ మూవీ ‘ది బాడీ’కి రీమేక్‌గా ఈ సినిమాను వయాకామ్ 18 మూవీస్, సునీర్ కేటర్‌పాల్ నిర్మిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment