సౌత్‌లో మంచి జోరుమీదున్న పూజాహెగ్డే హిందీలో మూడో చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా? అంటే అవుననే అంటున్నాయి బాలీవుడ్ వర్గాలు. సంజయ్ గుప్తా దర్శకత్వంలో హిందీలో ‘ముంబై సాగ’ అనే ఓ గ్యాంగ్‌స్టర్ డ్రామా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఇందులో జాన్ అబ్రహాం, ఇమ్రాన్ హష్మి హీరోలుగా నటించనున్నారు. ఈ సినిమాలో కథానాయికగా పూజా హెగ్డేని తీసుకున్నారని బీటౌన్‌లో కథనాలు వస్తున్నాయి.
మరి.. సంజయ్‌గుప్తా వెండితెర మాఫియాలో పూజా జాయిన్ అవుతారా? వెయిట్ అండ్ సీ. హృతిక్‌రోషన్ ‘మొహెంజోదారో’, అక్షయ్‌కుమార్ ‘హౌస్‌ఫుల్ 4’ చిత్రాల్లో పూజా కథానాయికగా నటించిన విషయం తెలిసిందే. జాకీష్రాఫ్, సునీల్æశెట్టి, ప్రతీక్ బబ్బర్ తదితరులు నటిస్తున్న ‘ముంబై సాగ’ సినిమాను వచ్చే ఏడాది విడుదల చేయాలనుకుంటున్నారు. తెలుగులో ప్రభాస్ (‘జాన్’వర్కింగ్ టైటిల్), అల్లు అర్జున్, వరుణ్‌తేజ్ (వాల్మీకి) సినిమాల్లో పూజాహెగ్డే కథానాయికగా నటిస్తున్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment