బాలీవుడ్లో రామ్ చరణ్ సిస్టర్
తెలుగు, కన్నడ ఇండస్ట్రీలో 20కి పైగా సినిమాల్లో నటించినా స్టార్ ఇమేజ్ సాధించలేకపోయిన ముద్దుగుమ్మ కృతి కర్బంద. హీరోయిన్ వేశాలు పక్కన పెట్టి బ్రూస్ లీ సినిమాలో రామ్ చరణ్కు అక్కగా నటించినా.. అది కూడా వర్క్ అవుట్ కాలేదు. దీంతో సౌత్ సినిమాలకు గుడ్ బై చెప్పేసిన ఈ బ్యూటి ప్రస్తుతం బాలీవుడ్లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది.
బాలీవుడ్ సీరియల్ కిస్సర్ ఇమ్రాన్ హష్మీ హీరోగా తెరకెక్కుతున్న రాజ్ రీబూట్లో హీరోయిన్గా నటిస్తున్న ఈ బ్యూటి.., ప్రచార కార్యక్రమాల్లో జోరుగా పాల్గొంటుంది. తొలిసారిగా తన సినిమాకు తానే డబ్బింగ్ చెప్పుకుంటున్న కృతి.. నటించటం కన్నా డబ్బింగ్ చెప్పటమే కష్టమంటోంది. 'షూటింగ్ సమయంలో ఫ్లోలో యాక్ట్ చేసేస్తాం.. కానీ డబ్బింగ్ చెప్పాలంటే మళ్లీ మనం అదే మూడ్ను రీ క్రియేట్ చేసుకోవాలి.. అది చాలా కష్టం' అని తెలిపింది.