brucelee
-
ఎలాంటి పాత్రకైనా రెడీ!
తమిళ సినిమా : ఎలాంటి పాత్రకైనా రెడీ అంటోంది నటి కృతి కర్బంద. ఈ ఢిల్లీ భామ మోడలింగ్ రంగం నుంచి సినీరంగానికి పరిచయమైంది. చాలా మంది ఉత్తరాది తారల మాదిరిగానే తొలుత తెలుగులో ‘బోణి’ కొట్టిన ఈ బ్యూటీ ఆ తరువాత కన్నడం, హిందీ, తమిళం భాషాల్లో వరుసగా ఎంట్రీ ఇచ్చేసింది. అయితే తెలుగు, కన్నడ, హిందీ భాషల్లోనే ఎక్కువగా నటిస్తున్న కృతి కర్బంధ తమిళంలో జీవీ.ప్రకాశ్‌కుమార్‌తో బ్రూస్లీ అనే ఒక్క చిత్రంలోనే రొమాన్స్ చేసింది. ఆ చిత్రం ఆశించిన విజయాన్ని సాధించలేదు. అందుకేనేమో ఆ తరువాత ఇక్కడ మళ్లీ కనిపించలేదు. తాజాగా మళ్లీ కోలీవుడ్‌లో ఎలాగైనా అవకాశాలందుకోవాలని ఆరాట పడుతోంది. తన అభిప్రాయాలను అభిమానులతో పంచుకునేందుకు ఓ ఆసక్తికర ట్వీట్ చేశారు. ‘నాకు వైవిధ్యభరిత కథా చిత్రాల్లో నటించే అవకాశాలే వస్తుండడం సంతోషంగా ఉంది. ఎలాంటి పాత్రల్లో నటించాలని ఆశ పడుతున్నారు అని అడుగుతుంటారు. నటనకు అవకాశం ఉన్న ఎలాంటి పాత్రల్లో నటించడానికైనా నేను రెడీ. పాత్రలను బట్టి లంగా ఓణి, చీరలు, మోడ్రన్ ఇలా అన్ని రకాల దుస్తులైనా ధరించాల్సి ఉంటుంది. అలా ఆయా పాత్రలకు తగ్గట్టుగా నన్ను నేను తయారు చేసుకుంటాను. అయితే ఢిల్లీ అమ్మాయిని కదా స్వతహాగా నాకు మోడ్రన్ దుస్తులు ధరించడమంటేనే ఇష్టం. అలాంటి పాత్రలైతే మరింత ఆసక్తి. ఇకపోతే తమిళంలో మంచి పాత్రల్లో నటించాలనుంది. అలాంటి అవకాశాలు ఆశిస్తున్నాను’ అన్నారు. -
డ్రంకన్ డ్రైవ్ కేసులో బ్రూస్లీ విలన్
బ్రూస్ లీ సినిమాలో రామ్ చరణ్‌కు ప్రతీనాయకుడిగా నటించి టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అయిన తమిళ నటుడు అరుణ్ విజయ్ డ్రంకన్ డ్రైవ్ కేసులో పట్టుబడ్డాడు. శుక్రవారం అర్థరాత్రి ఓ ప్రైవేట్ ఫంక్షన్లో పాల్గొని తన భార్యతో కలిసి తిరిగి వస్తున్న సమయంలో చెన్నై నుగంబాక్కం పోలీస్ స్టేషన్ పరిథిలో పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
బాలీవుడ్లో రామ్ చరణ్ సిస్టర్
తెలుగు, కన్నడ ఇండస్ట్రీలో 20కి పైగా సినిమాల్లో నటించినా స్టార్ ఇమేజ్ సాధించలేకపోయిన ముద్దుగుమ్మ కృతి కర్బంద. హీరోయిన్ వేశాలు పక్కన పెట్టి బ్రూస్ లీ సినిమాలో రామ్ చరణ్‌కు అక్కగా నటించినా.. అది కూడా వర్క్ అవుట్ కాలేదు. దీంతో సౌత్ సినిమాలకు గుడ్ బై చెప్పేసిన ఈ బ్యూటి ప్రస్తుతం బాలీవుడ్లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. బాలీవుడ్ సీరియల్ కిస్సర్ ఇమ్రాన్ హష్మీ హీరోగా తెరకెక్కుతున్న రాజ్ రీబూట్‌లో హీరోయిన్గా నటిస్తున్న ఈ బ్యూటి.., ప్రచార కార్యక్రమాల్లో జోరుగా పాల్గొంటుంది. తొలిసారిగా తన సినిమాకు తానే డబ్బింగ్ చెప్పుకుంటున్న కృతి.. నటించటం కన్నా డబ్బింగ్ చెప్పటమే కష్టమంటోంది. 'షూటింగ్ సమయంలో ఫ్లోలో యాక్ట్ చేసేస్తాం.. కానీ డబ్బింగ్ చెప్పాలంటే మళ్లీ మనం అదే మూడ్‌ను రీ క్రియేట్ చేసుకోవాలి.. అది చాలా కష్టం' అని తెలిపింది. -
శ్రీను వైట్లకు హీరో దొరికాడు..!
ఆగడు, బ్రూస్ లీ సినిమాల ఫెయిల్యూర్స్‌తో కష్టాల్లో పడ్డ శ్రీను వైట్ల ప్రస్తుతం తనని తాను ప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. స్టార్ హీరోలతో సినిమా చేయడానికి ప్రయత్నించినా ఇప్పట్లో ఎవరూ డేట్స్ ఇచ్చే ఛాన్స్ కనిపించకపోవటంతో ఇక యంగ్ హీరోల మీద దృష్టి పెట్టాడు. తన మార్క్ కామెడీ సబ్జెక్ట్‌తో తిరిగి బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టాలని ప్లాన్ చేస్తున్నాడు. ఇన్నాళ్లు రామ్‌తో సినిమా చేయడానికి వెయిట్ చేసిన శ్రీను వైట్ల, రామ్ వరుస సినిమాలతో బిజీగా ఉండటంతో మరో హీరో కోసం ప్రయత్నాలు ప్రారంభించాడు. లోఫర్ సినిమా తరువాత ఇంత వరకు సినిమా స్టార్ట్ చేయని వరుణ్ తేజ్‌తో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. ఇప్పటికే శ్రీను వైట్ల చెప్పిన కథ నాగబాబు, వరుణ్‌లకు నచ్చిందన్న టాక్ వినిపిస్తోంది. మరి వరుణ్‌తో అయినా శ్రీను వైట్ల సినిమా పట్టాలెక్కుతుందేమో చూడాలి. -
మెగా మూవీస్‌కు బ్రేక్
మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ సినిమా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మెగా అభిమానులకు మరో షాక్ తగిలింది. త్వరలోనే 150వ సినిమా ఎనౌన్స్ చేస్తారనుకున్న సమయంలో చిరు ఇంట్లో పెళ్లి సందడి మొదలు కావటంతో, మరోసారి చిరు సినిమా వాయిదా పడింది. చిరంజీవి చిన్న కూతురు శ్రీజ పెళ్లి సందర్భంగా తన రీ ఎంట్రీ సినిమాను రెండు నెలలు వాయిదా చేశాడు మెగాస్టార్. అంతేకాదు చరణ్ కూడా చెల్లి పెళ్లి కోసం బ్రేక్ తీసుకుంటున్నాడట. బ్రూస్ లీ సినిమా తరువాత ఇంతవరకు షూటింగ్లో పాల్గొనని రామ్ చరణ్, ఈ నెలాఖరున షూటింగ్ మొదలు పెడతారని భావించారు. అయితే శ్రీజ పెళ్లి పనులతో బిజీగా ఉండటంతో మరో పది రోజుల పాటు షూటింగ్‌కు హాజరు కాలేనంటూ దర్శక నిర్మాతలకు చెప్పేశాడట. మరి ఇప్పటికే రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ చేసుకున్న చెర్రీ అనుకున్న సమయానికి సినిమాను ఎలా రెడీ చేస్తాడో చూడాలి. -
మహేష్ నిర్మాణంలో సుధీర్ హీరోగా..!
శ్రీమంతుడు సినిమాతో తొలిసారిగా నిర్మాణ బాధ్యతలు తీసుకున్న మహేష్ బాబు, ఇప్పుడు మరో ప్రయోగానికి రెడీ అవుతున్నాడు. తను హీరోగా తెరకెక్కే సినిమాలకు మాత్రమే కాకుండా ఇతర హీరోలతో కూడా సినిమాలు నిర్మించడానికి రెడీ అవుతున్నాడు. అందులో భాగంగా తన బావ సుధీర్ బాబు హీరోగా ఓ కమర్షియల్ ఎంటర్టైనర్ను నిర్మించడానికి ప్లాన్ చేసుకుంటున్నాడు సూపర్ స్టార్. మహేష్ బాబుకు 'దూకుడు' లాంటి బ్లాక్ బస్టర్‌తో పాటు 'ఆగడు' లాంటి డిజాస్టర్ సినిమాను ఇచ్చిన శ్రీనువైట్ల ఆ తరువాత బ్రూస్ లీ ఫెయిల్యూర్‌తో మరింత డీలాపడిపోయాడు. దీంతో ఎలాగైనా హిట్ కొట్టాలన్న ఆలోచనతో ఓ పక్కా కమర్షియల్ కథతో మహేష్‌ను సంప్రదించాడు. అయితే తన బావను కమర్షియల్‌గా నిలబెట్టడం కోసం ఆ సినిమాను సుధీర్ బాబు హీరోగా తెరకెక్కించాలని సూచించాడు మహేష్. శ్రీను వైట్ల కూడా ఆ ప్రాజెక్ట్‌కు అంగీకరించాడన్న టాక్ వినిపిస్తోంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ ఎనౌన్స్మెంట్ వచ్చే అవకాశం ఉంది. -
చెర్రీతో శైలజ
చాలా రోజులుగా సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న రామ్‌ను సక్సెస్ ట్రాక్ ఎక్కించిన సినిమా నేను శైలజా, రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది మళయాలి ముద్దుగుమ్మ కీర్తి సురేష్. క్యూట్ క్యూట్ ఎక్స్ ప్రెషన్స్‌తో ఆకట్టుకున్న ఈ బొద్దుగుమ్మ మరో భారీ ఆఫర్‌ను సొంతం చేసుకుంది. తొలి సినిమాతోనే మంచి నటిగా ప్రూవ్ చేసుకున్న ఈ బ్యూటి రామ్ చరణ్ నెక్ట్స్ సినిమాలో హీరోయిన్గా ఫైనల్ అయ్యిందన్న టాక్ వినిపిస్తోంది. బ్రూస్ లీ సినిమా రిలీజ్ అయి ఇన్ని రోజులు గడుస్తున్నా, చరణ్ చేయబోయే నెక్ట్స్ సినిమా విషయంలో మాత్రం ఇంత వరకు క్లారిటీ రాలేదు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తనీఒరువన్ సినిమాను రీమేక్ చేయబోతున్నట్టుగా ప్రకటించినా.. ఆ సినిమా ఎప్పుడు మొదలవుతుంది అన్న విషయంపై మాత్రం క్లారిటీ లేదు. దీనికి తోడు నటీనటుల ఎంపిక కూడా పూర్తవ్వకపోవటంతో సినిమా మొదలవ్వటానికి మరింత సమయం పట్టేలా ఉంది. ఇప్పటికే విలన్‌గా ఒరిజినల్ వర్షన్లో చేసిన అరవింద్ స్వామినే కన్ఫామ్ చేయగా హీరోయిన్ పాత్రకు కీర్తి సురేష్‌ను ఎంపిక చేశారన్న టాక్ వినిపిస్తోంది. మరిన్ని వివరాలు తెలియాలంటే మాత్రం అఫీషియల్ ఎనౌన్స్మెంట్ వరకు వెయిట్ చేయాల్సిందే. -
ఆ ఇద్దరు విడిపోయినట్టేనా..?
కోన వెంకట్, గోపి మోహన్... ఈ రెండు పేర్లు ఒకప్పుడు టాలీవుడ్లో సక్సెస్‌కు కేరాఫ్ అడ్రస్. కథ, స్క్రీన్ ప్లే, మాటలు రాయటంలో తమ మార్క్ స్పష్టంగా చూపించిన ఈ జోడీ భారీ విజయాలతో ఇండస్ట్రీ ఫేట్ మార్చేసింది. ఒకే కథను మళ్లీ మళ్లీ రాస్తారన్న పేరున్నా, అదే కథను అన్నిసార్లు ఒప్పించటంలోనూ సక్సెస్ అయ్యారు కోన వెంకట్, గోపి మోహన్. అయితే ఇటీవల కాలంలో ఈ జోడీ మ్యాజిక్ పెద్దగా వర్కవుట్ కావటం లేదు. ముఖ్యంగా భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన సినిమాలు కూడా బాక్సాఫీస్ ముందు బోల్తా కొడుతున్నాయి. షాడో, అల్లుడు శీను, బ్రూస్ లీ లాంటి సినిమాలతో ఫ్లాప్ టాక్ రావటమే కాదు.. ఈ ఇద్దరి పెన్ను పవర్ తగ్గిపోయిందన్న అపవాదు కూడా తీసుకొచ్చాయి. ప్రస్తుతం కోన వెంకట్ రచన మీద కన్న నిర్మాణ రంగం మీదే ఎక్కువ దృష్టి పెడుతున్నాడు. త్వరలోనే దర్శకుడిగా కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని ప్లాన్ చేస్తున్నాడు. అదే బాటలో గోపి మోహన్ కూడా దర్శకత్వం వైపు అడుగులు వేస్తున్నాడు. దాదాపు దశాబ్ద కాలం నుంచి కలిసి పనిచేస్తున్న ఈ ఇద్దరు స్టార్ రైటర్లు పెన్ను పక్కన పెట్టి మెగాఫోన్ పట్టుకోవటంతో ఇక మీదట వీరి కాంబినేషన్ కొనసాగుతుందా అన్న ప్రశ్న ఇండస్ట్రీ వర్గాలను వేదిస్తుంది. ఒక్కసారి దర్శకుడిగా మారిన తర్వాత తిరిగి రచయితలుగా పనిచేసే ప్రయత్నం చేయరు కనుక.. ఇక కోన వెంకట్, గోపి మెహన్ల జోడీ విడిపోయినట్టే అన్న టాక్ వినిపిస్తోంది. అయితే ఈ విషయంపై మరింత క్లారిటీ రావాలంటే మాత్రం ఈ ఇద్దరిలో ఎవరో ఒకరు నోరు విప్పాల్సిందే. -
చెర్రీ హీరోయిన్ ఫిక్స్ అయ్యింది
బ్రూస్ లీ సినిమాతో అభిమానులను తీవ్రంగా నిరాశపరిచిన మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ తన నెక్ట్స్ సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. తమిళ సూపర్ హిట్ సినిమా తనీ ఒరువన్‌ను రీమేక్ చేస్తున్నట్టుగా ప్రకటించిన చెర్రీ ఆ సినిమా కాస్టింగ్ విషయంలో కూడా ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. సినిమాలో కీలకమైన విలన్ విషయంలో ఇప్పటికీ ఓ క్లారిటీ రాకపోయినా హీరోయిన్ విషయంలో మాత్రం ఫైనల్ డెసిషన్ తీసుకున్నారట. రామ్‌చరణ్‌తో ఎవడు సినిమాలో కలిసి నటించిన శృతిహాసన్ తనీఒరువన్ రీమేక్‌లోనూ చరణ్‌తో కలిసి నటిస్తోంది. ఇప్పటికే శృతి కూడా తన అంగీకారాన్ని తెలపటంతో ఇక మిగతా పనుల మీద దృష్టిపెట్టారు చిత్రయూనిట్. విలన్ పాత్రలో అరవింద్ స్వామి నటిస్తారని భావించినా భారీ రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తుండటంతో ఇతర నటీనటులను ప్రయత్నిస్తున్నారట. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. -
స్పీడు పెంచుతున్న రామ్ చరణ్
బ్రూస్ లీ సినిమా ఫ్లాప్ తరువాత ఫారిన్ ట్రిప్‌లో ఉన్న రామ్ చరణ్, అక్కడి నుంచే భవిష్యత్ కార్యాచరణను రూపొందిస్తున్నాడు. ఇన్నాళ్లు చిరు 150వ సినిమా కోసం నెమ్మదిగా సినిమాలు అంగీకరిస్తూ వస్తున్న చెర్రీ, ఆ విషయం ఇప్పట్లో తేలే అవకాశం కనిపించకపోవటంతో ఇక వరుస సినిమాలకు రెడీ అవుతున్నాడు. గతంలో తను కమిట్ అయిన సినిమాలనే వరుసగా సెట్స్ మీదకు తీసుకురావాలని ప్లాన్ చేసుకుంటున్నాడు చెర్రీ. ప్రస్తుతం అమెరికాలో ఉన్న చరణ్ తిరిగి రాగానే సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తమిళ సూపర్ హిట్ సినిమా తనీఒరువన్ రీమేక్‌లో నటించనున్నాడు. ఈ సినిమాతో పాటు చాలా రోజులుగా వాయిదా పడుతూ వస్తున్న, గౌతమ్ మీనన్ సినిమాను కూడా ఫైనల్ చేసే ఆలోచనలో ఉన్నాడు. ఈ రెండు సినిమాలను 2016లోనే రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. పవన్ కళ్యాణ్ నిర్మాణంలో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కనున్న సినిమాను కూడా వచ్చే ఏడాదిలోనే పట్టాలెక్కించాలని భావిస్తున్నాడు. ఇప్పటి వరకు ఈ సినిమాకు కథ, దర్శకులు ఫైనల్ కాకపోయిన త్రివిక్రమ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కే ఛాన్స్ ఉందంటున్నారు. ఈ మూడు సినిమాలు పూర్తయ్యే లోపు యువి క్రియేషన్స్ బ్యానర్లో మరో సినిమాను సెట్స్ మీదకు తీసుకురావాలని భావిస్తున్నాడు. ఈ సినిమాకు జిల్ రాధాకృష్ణ దర్శకత్వం వహించనున్నాడు. -
మిర్చి బ్యానర్లో చెర్రీ
బ్రూస్ లీ పరాజయం నుంచి ఇప్పుడిప్పుడే బయట పడుతున్న రామ్ చరణ్ తన తర్వాతి ప్రాజెక్ట్స్ మీద దృష్టి పెడుతున్నాడు. చిరంజీవి ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న 150వ సినిమా మరింత ఆలస్యం అవుతుండటంతో వరుస సినిమాలకు రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం ఫారిన్లో హాలీడేస్ ఎంజాయ్ చేస్తున్న చెర్రీ, తిరిగి రాగానే తను తరువాత చేయబోయే సినిమాల మీద క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. తమిళ్లో ఘనవిజయం సాధించిన తనీ ఒరువన్ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నాడు చరణ్. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాను వీలైనంత త్వరగా సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నాడు. అల్లు అరవింద్, డివివి దానయ్యలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు సంబందించి నటీనటుల ఎంపిక జరుగుతోంది. ఈ సినిమాతో పాటు వీలైనంత త్వరగా మరో సినిమాను కూడా ఫైనల్ చేసే ఆలోచనలో ఉన్నాడు మగధీరుడు. మిర్చి లాంటి బ్లాక్ బస్టర్ హిట్ అందించిన యువీ క్రియేషన్స్ బ్యానర్లో ఓ సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. ఇప్పటి వరకు వరుస సూపర్ హిట్స్ అందించిన ఈ బ్యానర్లో సినిమా చేయటం, తన కెరీర్‌కు కూడా ప్లస్ అవుతుందని భావిస్తున్నాడట చరణ్. ఈ సినిమాకు అదే బ్యానర్లో జిల్ సినిమాను డైరెక్ట్ చేసిన రాధాకృష్ణ దర్శకత్వం వహించనున్నాడు. -
ఫేస్బుక్ ఆఫీస్‌లో రామ్‌చరణ్
'బ్రూస్ లీ' రిజల్ట్‌తో కాస్త నిరుత్సాహపడిన రామ్ చరణ్, ప్రస్తుతం తన భార్య ఉపాసనతో కలిసి హాలీడేస్ ఎంజాయ్ చేస్తున్నాడు. తన నెక్ట్స్ సినిమాను స్టార్ట్ చేయడానికి గ్యాప్ తీసుకున్న మెగా పవర్ స్టార్, అమెరికాలోని వివిధ ప్రాంతాల్లో తన అభిమానులను కలుస్తున్నాడు. శాన్ఫ్రాన్సిస్కోలోని ఫేస్బుక్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించాడు చరణ్. అక్కడ ఉన్న తెలుగు వారితో పాటు ఆయన అభిమానులతో సరదా గడిపిన చరణ్ వారితో కలిసి ఫొటోలు దిగాడు. ఈ ఫొటోలను తన అఫీషియల్ ఫేస్బుక్ పేజ్‌పై పోస్ట్ చేస్తూ తనకు విలువైన బహుమతులు ఇచ్చిన వారికి కృతజ్ఞతలు తెలియజేశాడు. విదేశాల నుంచి తిరిగి రాగానే చరణ్ తమిళ సినిమా తనీఒరువన్ రీమేక్‌గా తెరకెక్కుతున్న సినిమా షూటింగ్లో పాల్గొననున్నాడు. ఈ సినిమాను సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కించాలని భావిస్తున్నారు. బ్రూస్ లీ సినిమాకు నిర్మాతగా వ్యవహరించిన డివివి దానయ్య మరోసారి ఈ సినిమాకు నిర్మాణ బాధ్యతలు తీసుకుంటున్నాడు. -
రొటీన్ సినిమా వద్దంటున్న చెర్రీ!
బ్రూస్ లీ సినిమా రిజల్ట్ తో నిరాశలో ఉన్న రామ్ చరణ్ నెక్ట్స్ ప్రాజెక్ట్స్ మీద దృష్టి పెట్టాడు. ఇప్పటికే తనీ ఒరువన్ రీమేక్ చేస్తున్నట్టుగా ప్రకటించిన మెగా హీరో, తరువాత చేయబోయే సినిమాల విషయంలో కూడా ఇప్పటి నుంచే జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. వరుసగా కమర్షియల్ ఎంటర్టైనర్లు మాత్రమే చేస్తున్న ఈ యంగ్ హీరో, తదుపరి సినిమాల విషయంలో కొత్తగా ఆలోచిస్తున్నాడు. చరణ్ నెక్ట్స్ చేయబోయే తనీ ఒరువన్ రీమేక్ కూడా రెగ్యులర్ కమర్షియల్ సినిమా కాదు. క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కనున్న ఈ సినిమా, కోలీవుడ్‌లో ఘనవిజయం సాధించింది. జయం రవి హీరోగా, రాజ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా తెలుగు వర్షన్‌ను సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం తనీ ఒరువన్ కథకు తెలుగు నేటివిటికి తగ్గట్టుగా మార్పులు చేసే పనిలో ఉన్నారు చిత్రయూనిట్. ఈ సినిమా తరువాత కూడా మరో ప్రయోగాత్మక చిత్రానికి రెడీ అవుతున్నాడు చరణ్. గమ్యం, వేదం లాంటి సినిమాలతో క్రియేటివ్ డైరెక్టర్‌గా గుర్తింపు తెచ్చుకున్న క్రిష్ దర్శకత్వంలో, చరణ్ ఓ సినిమా చేయాలని భావిస్తున్నాడట. ప్రస్తుతం వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కిన కంచె సినిమా రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్న క్రిష్, ఆ సినిమా తరువాత చరణ్ సినిమా కోసం కథ రెడీ ఛాన్స్ కనిపిస్తుంది. -
చిరు బ్రూస్ లీ చేయడం 'ప్రజారాజ్యం' లాంటి తప్పే: వర్మ
-
చిరు బ్రూస్ లీ చేయడం 'ప్రజారాజ్యం' లాంటి తప్పే: వర్మ
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి తన ట్విట్టర్‌కు పని చెప్పాడు. నిన్నంతా ( శుక్రవారం) బ్రూస్ లీ సినిమా మీద మాటల దాడి చేసిన వర్మ... తాజాగా మెగాస్టార్ చిరంజీవిని టార్గెట్ చేశాడు. బ్రూస్ లీ యూనిట్ చెబుతున్న లెక్కలు ఎలా ఉన్నా, తను మాత్రం చిరంజీవిని 150వ సారి వెండితెర మీద చూశానని, ఇదే చిరు 150వ సినిమా అంటూ తేల్చేశాడు వర్మ. 150వ సినిమాగా బ్రూస్ లీ సినిమాను ఎంచుకోవడం ప్రజారాజ్యం పార్టీ పెట్టడం లాంటి మెగా తప్పేనని వర్మ చెప్పాడు. అయితే ఆయన 151వ సినిమా మాత్రం ఎంటర్ ద డ్రాగన్ లాంటి మంచి సినిమా అవుతుందని ఆశిస్తున్నానన్నాడు. 'చిరు 151వ సినిమాగా ఓ తమిళ రీమేక్ సినిమాను చేస్తున్నాడని వస్తున్న వార్తలు అవాస్తమని భావిస్తున్నా, ఆ సినిమా బాహుబలిలా ఒరిజినల్ సినిమా అయి ఉండాలని కోరుకుంటున్నా. రాజమౌళి ఎంత గొప్ప అన్నది విషయం కాదు, మెగాస్టార్ అన్నది అన్నింటికంటే పెద్ద విషయం, అందుకే తమిళ సినిమా రీమేక్ లో నటించి తెలుగు వారి గౌరవాన్ని దెబ్బతీయోద్దు, రాజమౌళిలా తెలుగు వారి గౌరవాన్ని మరింతగా పెంచాలి. మెగా ఫ్యామిలీ అభిమానిగా చెబుతున్నా.. చిరు 151వ సినిమాగా రీమేక్ సినిమాను చేయొద్దు, ఒరిజినల్ సినిమానే చేయాలి. అది కూడా బాహుబలిని మించే భారీ సినిమా చేయాలి. మిగతా మెగా అభిమానులు కూడా చిరంజీవి రీమేక్ సినిమా చేయొద్దని కోరాలి. చిరంజీవి లాంటి మెగాస్టార్ తమిళ కాపీ సినిమా చేయటం అనేది తెలుగు వారికి అవమానం, అందుకే చిరంజీవి తమిళ రీమేక్ లో నటిస్తున్నాడన్న వార్త రూమర్ అనుకుంటున్నా'. అంటూ ట్వీట్ చేశాడు. బాహుబలి సినిమా వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా కూడా ఇంట్రస్టింగ్ ట్వీట్ చేశాడు వర్మ. ' బాహుబలి సినిమా వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా శుభాకాంక్షలు. రాజమౌళి ఇండియన్ సినిమాకు రియల్ బ్రూస్ లీ. రాజమౌళి గారూ.. చాలా మంది బ్రూస్ లీలు తాకి గర్వపడటం కోసం మీ కాళ్ల ఫొటోను ట్వీట్ చేయండి' అంటూ కామెంట్ చేశాడు. Congrats on 100 days to Bahubali Rajmouli Real Bruce Lee of Cinema..Rajmouli sir pls tweet ur feet for all us wannabe Bruce Lee's to touch — Ram Gopal Varma (@RGVzoomin) October 16, 2015 And I hope rumours are wrong and telugu Mega Star for 151st will not do copy of Tamil film and be as mega original as Rajmouli in Bahubali — Ram Gopal Varma (@RGVzoomin) October 16, 2015 No matter how big Rajmouli is,Mega is bigger and Telugus will be hurt if Mega imports Tamil pride while Rajmouli is exporting telugu pride — Ram Gopal Varma (@RGVzoomin) October 16, 2015 For Mega star to do Bruce Lee as 150th is as big a Mega wrong decision as Prajarajyam party but am sure 151st will be Enter the Dragon — Ram Gopal Varma (@RGVzoomin) October 16, 2015 -
బ్లాక్‌లో బ్రూస్లీ.. నలుగురి అరెస్ట్
ఏలూరు సెంట్రల్ : పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో శుక్రవారం బ్లాక్‌లో టిక్కెట్లు అమ్ముతున్న నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు చెప్పిన సమాచారం ప్రకారం...అంబికా థియేటర్లో రామ్ చరణ్ నటించిన బ్రూస్లీ విడుదలైంది. థియేటర్ వద్ద బ్లాక్‌లో టిక్కెట్లను విక్రయిస్తుండగా నలుగురిని అదుపులోకి తీసుకున్నామని అన్నారు. వారి నుంచి 71 టికెట్లు, రూ.1350 నగదు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. వారిపై కేసు నమోదు చేసి స్టేషన్‌కు తరలించమన్నారు. -
రామ్‌గోపాల్‌వర్మ దర్శకత్వంలో బ్రూస్ లీ
సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ మరో వివాదానికి తెరతీశాడు. ఇప్పటివరకు ఎలాంటి ఎనౌన్స్మెంట్ లేకపోయినా బ్రూస్లీ పేరుతో ఏకంగా ట్రైలర్ రిలీజ్ చేశాడు. మార్షల్ ఆర్ట్స్ చేస్తున్న ఓ అమ్మాయికి సంబంధించిన వీడియోతో రూపొందించిన ఈ ట్రైలర్లో ఇది తొలి భారతీయ మార్షల్ ఆర్ట్స్ చిత్రమని ప్రకటించాడు వర్మ. అయితే ఇప్పటికే బ్రూస్లీ పేరుతో తెలుగులో రామ్‌చరణ్ హీరోగా సినిమా విడుదలకు సిద్ధం అవుతుండగా, తమిళ్లో జివి ప్రకాష్ హీరోగా మరో సినిమాను తెరకెక్కిస్తున్నారు. తాజాగా రేసులోకి వర్మ కూడా వచ్చి చేరాడు. అయితే వర్మ చేస్తున్న ఈ సినిమా, ఏ భాషలో చేస్తున్నాడు, ఇందులో నటీనటులు ఎవరెవరు అన్న విషయాలు మాత్రం ఇంతవరకు ప్రకటించలేదు. బ్రూస్ లీకి వీరాభిమాని అయిన వర్మ.. ట్రైలర్ లో ఆయన గొంతును కూడా అక్కడక్కడ ఉపయోగించినట్లు చెప్పాడు. తన ప్రతి సినిమాను వివాదాల తోనే ప్రమోట్ చేసుకునే వర్మ ఈ సారి తన సినిమా ప్రమోషన్ కోసం టైటిల్ వివాదాన్ని తెరమీదకు తెచ్చాడన్న వాదన వినిపిస్తుంది. మరి రామ్‌గోపాల్ వర్మ బ్రూస్ లీ పై రామ్‌చరణ్ బ్రూస్లీ యూనిట్ ఎలా స్పందించారో చూడాలి. -
రామ్‌గోపాల్‌వర్మ దర్శకత్వంలో బ్రూస్లీ
-
మెగా మూవీ వాయిదా
ముకుంద సినిమాతో వెండితెరకు పరిచయం అయిన మెగా వారసుడు వరుణ్ తేజ్. తొలి ప్రయత్నంలోనే తన ప్రత్యేకత చూపించిన వరుణ్, రెండో సినిమాతో కూడా అదే ఫార్ములాను కంటిన్యూ చేస్తున్నాడు. గమ్యం ఫేం క్రిష్ దర్శకత్వంలో కంచె సినిమా చేశాడు వరుణ్. రెండో ప్రపంచ యుద్ధకాలంలో జరిగే ప్రేమకథగా తెరకెక్కిన ఈ పీరియాడిక్ డ్రామాలో వరుణ్ డిఫరెంట్ లుక్‌లో కనిపిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆడియో, ఇటీవల సినీ ప్రముఖుల సమక్షంలో గ్రాండ్‌గా రిలీజ్ అయింది. రెండో ప్రపంచ యుద్ధ నేపధ్యంలో తెరకెక్కిన ఈ సినిమాను గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న రిలీజ్ చేయాలని భావించారు. అయితే ఈ సినిమాను నవంబర్ 6వ తేదీన రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించాడు హీరో వరుణ్. వాయిదాకు కారణాలను త్వరలోనే వెల్లడిస్తామని తెలిపాడు. ముఖ్యంగా అక్టోబర్ 2న రామ్ హీరోగా తెరకెక్కిన శివం రిలీజ్ అవుతుండటంతో పాటు వరుసగా రుద్రమదేవి, బ్రూస్లీ, అఖిల్ సినిమాలు రిలీజ్ కానున్నాయి. దీంతో కంచెను నవంబర్‌కు వాయిదా వేశారన్న టాక్ వినిపిస్తుంది. టాలీవుడ్లో ఆలస్యంగా రిలీజ్ అయిన సినిమాలు ఆకట్టుకున్న సందర్భాలు చాలా తక్కువ కావటంతో కంచె యూనిట్‌తో పాటు అభిమానులు కూడా టెన్షన్ పడుతున్నారు. Hey guys...there has been a change in the release date of our movie #kanche to November 6th.. The reason behind this will be answered soon.. — Varun Tej Konidela (@IAmVarunTej) September 22, 2015 -
వరుణ్ వెనుకడుగు వేస్తున్నాడా..?
ముకుంద సినిమాతో వెండితెరకు పరిచయం అయిన మెగా వారసుడు వరుణ్ తేజ్. తొలి ప్రయత్నంలోనే తన ప్రత్యేకత చూపించిన వరుణ్, రెండో సినిమాతో కూడా అదే ఫార్ములాను కంటిన్యూ చేస్తున్నాడు. గమ్యం ఫేం క్రిష్ దర్శకత్వంలో కంచె సినిమా చేశాడు వరుణ్. రెండో ప్రపంచ యుద్ధకాలంలో జరిగే ప్రేమకథగా తెరకెక్కిన ఈ పీరియాడిక్ డ్రామాలో వరుణ్ డిఫరెంట్ లుక్‌లో కనిపిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆడియో, ఇటీవల సినీ ప్రముఖుల సమక్షంలో గ్రాండ్‌గా రిలీజ్ అయింది. రెండో ప్రపంచ యుద్ధ నేపధ్యంలో తెరకెక్కిన ఈ సినిమాను గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న రిలీజ్ చేయాలని భావించారు. అయితే అదే సమయంలో మరిన్ని సినిమాల రిలీజ్ ఉండటంతో కంచె రిలీజ్‌ను వాయిదా వేసే ఆలోచనలో ఉన్నారు చిత్రయూనిట్. ముఖ్యంగా అక్టోబర్ 2న రామ్ హీరోగా తెరకెక్కిన శివం రిలీజ్ అవుతుండటంతో పాటు వరుసగా రుద్రమదేవి, బ్రూస్లీ, అఖిల్ సినిమాలు రిలీజ్ కానున్నాయి. దీంతో కంచెను నవంబర్‌కు వాయిదా వేయాలని భావిస్తున్నారు. ఇప్పటివరకు అఫీషియల్ ఎనౌన్స్మెంట్ లేకపోయినా వరుణ్, క్రిష్‌ల కంచె వాయిదా పడటం దాదాపుగా కన్ఫామ్ అన్న టాక్ వినిపిస్తోంది. -
తమన్నాకు ఫిక్స్ అయ్యారు
రామ్‌చరణ్ హీరోగా శ్రీనువైట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫ్యామిలీ యాక్షన్ డ్రామా బ్రూస్లీ. దాదాపు ఏడాది తరువాత రిలీజ్ అవుతున్న చరణ్ సినిమా కావటంతో అన్ని రకాల హంగులతో పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్గా ఈ సినిమాను తీర్చిదిద్దుతున్నారు. ఇప్పటికే చిరంజీవి స్పెషల్ క్యారెక్టర్ చేస్తున్నాడన్న వార్తతో భారీ ప్రచారం లభించిన ఈ సినిమాకు ఇప్పుడు మరో ఎట్రాక్షన్ యాడ్ అయ్యింది. బ్రూస్లీలో ఓ యాక్షన్ సీన్‌తో పాటు స్పెషల్ సాంగ్‌లో కూడా నటిస్తున్నాడు చిరంజీవి. చాలా కాలం తరువాత 'చిరు' వెండితెర మీద కనిపిస్తుండటంతో ఈ సాంగ్‌ను భారీ స్థాయిలో తెరకెక్కించడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే థమన్ అదిరిపోయే ట్యూన్ అందించాడన్న టాక్ వినిపిస్తుండగా, చిరుతో చిందేసే అందాల భామ కోసం చాలా రోజులుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ముందుగా ఈ సాంగ్ కోసం ఇలియానాను సంప్రదించినా,. తను భారీ మొత్తం డిమాండ్ చేయటంతో పక్కన పెట్టారు. ఫైనల్‌గా మెగాస్టార్ ఫేవరెట్ హీరోయిన్ తమన్నాను ఈ సాంగ్ కోసం సెలెక్ట్ చేశారట. ఇటీవల బాహుబలి సక్సెస్‌తో ఫుల్ జోష్‌లో ఉన్న తమన్న ఈ క్రేజీ ఆఫర్ తో మరింత ఆనందంలో మునిగితేలుతోంది. ఇప్పటికే తమన్నను సంప్రదించిన బ్రూస్లీ టీం ఆమె అంగీకారాన్ని కూడా తీసుకున్నారు.. త్వరలోనే ఈ పాటను భారీగా తెరకెక్కించడానికి ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న బ్రూస్లీ దసర కానుకగా ఆడియన్స్ ముందుకు రానుంది. -
’బ్రూస్లీ’లో కనిపించబోతున్న చిరు