రామ్గోపాల్వర్మ దర్శకత్వంలో బ్రూస్ లీ | Ramgopal varma brucelee trailer Released | Sakshi
Sakshi News home page

రామ్గోపాల్వర్మ దర్శకత్వంలో బ్రూస్ లీ

Published Thu, Oct 1 2015 12:47 PM | Last Updated on Sun, Sep 3 2017 10:18 AM

రామ్గోపాల్వర్మ దర్శకత్వంలో బ్రూస్ లీ

రామ్గోపాల్వర్మ దర్శకత్వంలో బ్రూస్ లీ

సంచలన దర్శకుడు రామ్గోపాల్ వర్మ మరో వివాదానికి తెరతీశాడు. ఇప్పటివరకు ఎలాంటి ఎనౌన్స్మెంట్ లేకపోయినా బ్రూస్లీ పేరుతో ఏకంగా ట్రైలర్ రిలీజ్ చేశాడు. మార్షల్ ఆర్ట్స్ చేస్తున్న ఓ అమ్మాయికి సంబంధించిన వీడియోతో రూపొందించిన ఈ ట్రైలర్లో ఇది తొలి భారతీయ మార్షల్ ఆర్ట్స్ చిత్రమని ప్రకటించాడు వర్మ.

అయితే ఇప్పటికే బ్రూస్లీ పేరుతో తెలుగులో రామ్చరణ్ హీరోగా సినిమా విడుదలకు సిద్ధం అవుతుండగా, తమిళ్లో జివి ప్రకాష్ హీరోగా మరో సినిమాను తెరకెక్కిస్తున్నారు. తాజాగా రేసులోకి వర్మ కూడా వచ్చి చేరాడు. అయితే వర్మ చేస్తున్న ఈ సినిమా, ఏ భాషలో చేస్తున్నాడు, ఇందులో నటీనటులు ఎవరెవరు అన్న విషయాలు మాత్రం ఇంతవరకు ప్రకటించలేదు. బ్రూస్ లీకి వీరాభిమాని అయిన వర్మ.. ట్రైలర్ లో ఆయన గొంతును కూడా అక్కడక్కడ ఉపయోగించినట్లు చెప్పాడు.

తన ప్రతి సినిమాను వివాదాల తోనే ప్రమోట్ చేసుకునే వర్మ ఈ సారి తన సినిమా ప్రమోషన్ కోసం టైటిల్ వివాదాన్ని తెరమీదకు తెచ్చాడన్న వాదన వినిపిస్తుంది. మరి రామ్గోపాల్ వర్మ బ్రూస్ లీ పై రామ్చరణ్ బ్రూస్లీ యూనిట్ ఎలా స్పందించారో చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement