తమన్నాకు ఫిక్స్ అయ్యారు | thamanna special song in bruclee | Sakshi
Sakshi News home page

తమన్నాకు ఫిక్స్ అయ్యారు

Published Fri, Sep 18 2015 1:54 PM | Last Updated on Sun, Sep 3 2017 9:35 AM

తమన్నాకు ఫిక్స్ అయ్యారు

తమన్నాకు ఫిక్స్ అయ్యారు

రామ్చరణ్ హీరోగా శ్రీనువైట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫ్యామిలీ యాక్షన్ డ్రామా బ్రూస్లీ. దాదాపు ఏడాది తరువాత రిలీజ్ అవుతున్న చరణ్ సినిమా కావటంతో అన్ని రకాల హంగులతో పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్గా ఈ సినిమాను తీర్చిదిద్దుతున్నారు. ఇప్పటికే  చిరంజీవి స్పెషల్ క్యారెక్టర్ చేస్తున్నాడన్న వార్తతో భారీ ప్రచారం లభించిన ఈ సినిమాకు ఇప్పుడు మరో ఎట్రాక్షన్ యాడ్ అయ్యింది.

బ్రూస్లీలో ఓ యాక్షన్ సీన్తో పాటు స్పెషల్ సాంగ్లో కూడా నటిస్తున్నాడు చిరంజీవి. చాలా కాలం తరువాత 'చిరు' వెండితెర మీద కనిపిస్తుండటంతో ఈ సాంగ్ను భారీ స్థాయిలో తెరకెక్కించడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే థమన్ అదిరిపోయే ట్యూన్ అందించాడన్న టాక్ వినిపిస్తుండగా, చిరుతో చిందేసే అందాల భామ కోసం చాలా రోజులుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ముందుగా ఈ సాంగ్ కోసం ఇలియానాను సంప్రదించినా,. తను భారీ మొత్తం డిమాండ్ చేయటంతో పక్కన పెట్టారు.

ఫైనల్గా మెగాస్టార్ ఫేవరెట్ హీరోయిన్ తమన్నాను ఈ సాంగ్ కోసం సెలెక్ట్ చేశారట. ఇటీవల బాహుబలి సక్సెస్తో ఫుల్ జోష్లో ఉన్న తమన్న ఈ క్రేజీ ఆఫర్ తో మరింత ఆనందంలో మునిగితేలుతోంది. ఇప్పటికే తమన్నను సంప్రదించిన బ్రూస్లీ టీం ఆమె అంగీకారాన్ని కూడా తీసుకున్నారు.. త్వరలోనే ఈ పాటను భారీగా తెరకెక్కించడానికి ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న బ్రూస్లీ దసర కానుకగా ఆడియన్స్ ముందుకు రానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement