ఫేస్బుక్ ఆఫీస్లో రామ్చరణ్ | Ramcharan visits Facebook head office | Sakshi
Sakshi News home page

ఫేస్బుక్ ఆఫీస్లో రామ్చరణ్

Published Fri, Nov 13 2015 2:08 PM | Last Updated on Thu, Jul 26 2018 5:23 PM

ఫేస్బుక్ ఆఫీస్లో రామ్చరణ్ - Sakshi

ఫేస్బుక్ ఆఫీస్లో రామ్చరణ్

'బ్రూస్ లీ' రిజల్ట్తో కాస్త నిరుత్సాహపడిన రామ్ చరణ్, ప్రస్తుతం తన భార్య ఉపాసనతో కలిసి హాలీడేస్ ఎంజాయ్ చేస్తున్నాడు. తన నెక్ట్స్ సినిమాను స్టార్ట్ చేయడానికి గ్యాప్ తీసుకున్న మెగా పవర్ స్టార్, అమెరికాలోని వివిధ ప్రాంతాల్లో తన అభిమానులను కలుస్తున్నాడు.

శాన్ఫ్రాన్సిస్కోలోని ఫేస్బుక్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించాడు చరణ్. అక్కడ ఉన్న తెలుగు వారితో పాటు ఆయన అభిమానులతో సరదా గడిపిన చరణ్ వారితో కలిసి ఫొటోలు దిగాడు. ఈ ఫొటోలను తన అఫీషియల్ ఫేస్బుక్ పేజ్పై పోస్ట్ చేస్తూ తనకు విలువైన బహుమతులు ఇచ్చిన వారికి కృతజ్ఞతలు తెలియజేశాడు.

విదేశాల నుంచి తిరిగి రాగానే చరణ్ తమిళ సినిమా తనీఒరువన్ రీమేక్గా తెరకెక్కుతున్న సినిమా షూటింగ్లో పాల్గొననున్నాడు. ఈ సినిమాను సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కించాలని భావిస్తున్నారు. బ్రూస్ లీ సినిమాకు నిర్మాతగా వ్యవహరించిన డివివి దానయ్య మరోసారి ఈ సినిమాకు నిర్మాణ బాధ్యతలు తీసుకుంటున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement