ధృవ ట్విట్టర్ రివ్యూ: ఫస్టాఫ్ ఓకే అట.. | first half ok, says twitteratti on dhruva movie | Sakshi
Sakshi News home page

ధృవ ట్విట్టర్ రివ్యూ: ఫస్టాఫ్ ఓకే అట..

Published Fri, Dec 9 2016 8:14 AM | Last Updated on Sat, Aug 25 2018 6:37 PM

ధృవ ట్విట్టర్ రివ్యూ: ఫస్టాఫ్ ఓకే అట.. - Sakshi

ధృవ ట్విట్టర్ రివ్యూ: ఫస్టాఫ్ ఓకే అట..

తమిళంలో సూపర్ హిట్ అయిన తని ఒరువన్ సినిమా రీమేక్‌గా తెలుగులో తెరకెక్కిన ధృవ సినిమాపై ట్విట్టర్‌లో మిక్స్‌డ్ రియాక్షన్ వస్తోంది. ఫస్టాఫ్ బాగానే ఉందని, సెకండాఫ్ కూడా ఇలాగే ఉంటే సినిమాకు ఢోకా లేదని కొందరు అంటున్నారు. అయితే, విదేశాల్లో ఇప్పటికే పూర్తి షో చూసినవాళ్లు మాత్రం ఓ మాదిరిగా స్పందిస్తున్నారు. మొత్తమ్మీద ధృవ యావరేజి సినిమా అని, సెకండాఫ్‌లో సూరి మ్యాజిక్ క్రియేట్ చేయలేకపోయాడని ఒకరు ట్వీట్ చేశారు. ఓవర్సీస్‌లో ఒక మిలియన్ కష్టమేనని అంటున్నారు. కడపలో ఫస్టాఫ్‌కు పాజిటివ్ టాక్ వచ్చింది. 
 
స్క్రీన్‌ప్లే రేసీగా ఉందని, పాటల పిక్చరైజేషన్ కూడా బాగుందని మరో వ్యక్తి ట్వీట్ చేశారు. ఇక తెలుగు వ్యక్తిగా తాను ధృవ చూశానని, తమిళ సినిమా చూసి అంత ఎక్కువ ఆస్వాదించలేకపోయానని, ధృవ బాగుందని, దాన్ని మిస్ కావద్దని మరో ఎన్నారై చెప్పారు. మగధీర తర్వాత చరణ్‌కు ఇదే మంచి మూవీ అవుతుందని, రీమేక్ కూడా చాలా బాగుందని ఇంకొకరు చెప్పారు. రికార్డులు, ఇతర విషయాల సంగతి మర్చిపోతే.. చరణ్ మాత్రం బాగా చేశాడని అన్నారు. ప్రతి ఫ్రేములోనూ కష్టం కనిపిస్తోందని మరొకరు చెప్పారు. 
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement