dhruva movie
-
మెగా ఫోన్ పట్టనున్న రామ్ చరణ్ విలన్!
అరవింద స్వామి పేరు వినగానే గుర్తొచ్చేది దళపతి, బాంబే, రోజా చిత్రాలే. మణిరత్నం దర్శకత్వంలో రజినీకాంత్, మమ్ముట్టి వంటి దిగ్గజాలతో నటించిన దళపతి చిత్రంలో యువ కథానాయకుడిగా పరిచయమైన నటుడు అరవిందస్వామి. కొన్ని చిత్రాల తర్వాత వ్యక్తిగత కారణాల వల్ల నటనకు దూరంగా ఉన్నారు. అయితే టాలీవుడ్‌లోనూ రామ్ చరణ్ నటించిన ధృవ చిత్రంలో విలన్‌గా మెప్పించారు. (ఇది చదవండి: Bigg Boss 7: మళ్లీ దొరికిపోయిన శివాజీ.. అమర్ ఆ పాయింట్ చెప్పేసరికి!) అయితే ఆ తర్వాత మళ్లీ రీఎంట్రీ అయ్యి తనీ ఒరువన్ వంటి పలు చిత్రాల్లో ప్రతి నాయకుడు గానూ నటించి మెప్పించారు. ప్రస్తుతం పలు చిత్రాల్లో వివిధ రకాల పాత్రలు పోషిస్తూ బిజీగా ఉన్నా ఈయన త్వరలో మెగా ఫోన్ పట్టనున్నట్లు తెలిసింది. ఈయన ఇప్పటికే కథ కథనాన్ని సిద్ధం చేసుకున్నట్లు తెలిసింది. కాగా తాను దర్శకత్వం వహించనున్న చిత్రంలో ఆల్ ఇండియా స్టార్ ఫాహద్ ఫాజిల్‌ను ప్రధాన పాత్రలో నటింపజేయడానికి చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. కాగా ఇందులో అరవిందస్వామి కూడా ఓ కీలకపాత్రను పోషించనున్నట్లు తెలిసింది. ఈ చిత్రం 2024 ప్రథమార్థంలో సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉన్నట్లు సమాచారం. కాగా ఇటీవల ఉదయనిధి స్టాలిన్ కథానాయకుడిగా నటించిన మామన్నన్ చిత్రంలో విలన్‌గా తన విశ్వరూపం చూపించిన నటుడు ఫాహద్ ఫాజిల్ ప్రస్తుతం రజనీకాంత్ హీరోగా నటిస్తున్న చిత్రంలో ఆయనకు ప్రతి నాయకుడిగా నటిస్తున్నారు. కాగా అరవిందస్వామి దర్శకత్వం వహించే చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉందని భావిస్తున్నారు. (ఇది చదవండి: ఈ హీరోయిన్ని గుర్తుపట్టారా? నాలుగే సినిమాలు, టీమిండియా క్రికెటర్‌తో పెళ్లి!) -
ధృవకు సీక్వెల్.. ఇద్దరితో జోడీ కడుతున్న హీరో!
సాక్షి, తమిళ సినిమా: కోలీవుడ్‌లో ఇప్పుడు సీక్వెల్స్ ట్రెండ్ నడుస్తోంది. 2.ఓ (రోబో-2), సామీ స్క్వేర్, సండైకోళీ 2 (పందెం కోడి-2) వంటి చిత్రాలు నిర్మాణంలో ఉండగా త్వరలో కమలహాసన్ హీరోగా ఇండియన్ 2, ధనుష్ హీరోగా మారి 2 తదితర చిత్రాలు తెరకెక్కడానికి రెడీ అవుతున్నాయి. ఈ వరుసలో తాజాగా తనీఒరువన్ 2 (తెలుగులో ధృవ) చేరుతోంది. జయంరవి కథానాయకుడిగా ఆయన సోదరుడు మోహన్‌రాజా దర్వకత్వంలో తెరకెక్కిన ‘తనీఒరువన్’ 2015లో విడుదలై సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది. ఈ సినిమాలో జయం రవికి నయనతార జోడీ కట్టగా.. మోడ్రన్ విలన్‌గా అరవిందస్వామి రీ ఎంట్రీ ఇచ్చి అదరగొట్టాడు. అప్పటివరకూ రీమేక్ చిత్రాల దర్శకుడన్న ముద్ర మోస్తున్న మోహన్‌రాజా తనీఒరువన్తో దానిని బ్రేక్ చేశారు. ఈ సంచలన చిత్రానికిప్పుడు సీక్వెల్‌ను తెరకెక్కించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. తనీఒరువన్ చిత్రానికి ప్రధాన మూలస్తంభాలు నలుగురు అని చెప్పవచ్చు. వారు హీరో జయంరవి, విలన్ అరవిందస్వామి, హీరోయిన్ నయనతార, దర్శకుడు మోహన్‌రాజా. ఈ నలుగురిలో ముగ్గురు తనీఒరవన్ సీక్వెల్లోనూ కనిపింపచనున్నారు. సీక్వెల్లోనూ నయనతార మరోసారి జయంరవితో రొమాన్స్ చేయడానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారట. బిజీ షెడ్యూల్లోనూ మళ్లీ జయంరవికి నయన్ ఓకే చెప్పడం విశేషమే. తొలి పార్టులో జయంరవి పోలీస్ అధికారిగా, నయనతార ఫోరెన్సిక్ నిపుణురాలుగానూ నటించగా.. రెండో పార్టులోనూ వీరు అదే పాత్రల్లో నటించనున్నట్లు సమాచారం. అదనంగా సీక్వెల్లో మరో బ్యూటీ సాయోషా సైగల్ కూడా చేరనుందట. జయంరవికి జోడీగా ‘వనమగన్’ చిత్రంతో ఈ అమ్మడు కోలీవుడ్‌కు దిగుమతి అయిన తెలిసిందే. ఇప్పుడు తనీఒరువన్ సీక్వెల్లో మరోసారి ఆయనతో జోడీ కట్టబోతోంది. ఇప్పటికే సూర్యకు జంటగా కేవీ ఆనంద్ దర్శకత్వంలో నటిస్తున్న సాయేషాసైగల్ నటిస్తున్న సంగతి తెలిసిందే. తనీఒరువన్లో విలన్‌గా అరవిందస్వామి ప్రధాన పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. సీక్వెల్లో ఆయన పాత్ర ఎవరు పోషిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. హీరోకు దీటైన విలన్‌గా అరవింద్ స్వామి అద్భుతమైన అభినయం కనబర్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తనీఒరువన్- 2లో హీరో, విలన్ పాత్రలను ద్విపాత్రాభినయంతో జయంరవి పోషించే అవకాశం ఉన్నట్లు కోలీవుడ్‌లో వినిపిస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే తెలియనున్నాయి. -
ధృవ ట్విట్టర్ రివ్యూ: ఫస్టాఫ్ ఓకే అట..
తమిళంలో సూపర్ హిట్ అయిన తని ఒరువన్ సినిమా రీమేక్‌గా తెలుగులో తెరకెక్కిన ధృవ సినిమాపై ట్విట్టర్లో మిక్స్డ్ రియాక్షన్ వస్తోంది. ఫస్టాఫ్ బాగానే ఉందని, సెకండాఫ్ కూడా ఇలాగే ఉంటే సినిమాకు ఢోకా లేదని కొందరు అంటున్నారు. అయితే, విదేశాల్లో ఇప్పటికే పూర్తి షో చూసినవాళ్లు మాత్రం ఓ మాదిరిగా స్పందిస్తున్నారు. మొత్తమ్మీద ధృవ యావరేజి సినిమా అని, సెకండాఫ్‌లో సూరి మ్యాజిక్ క్రియేట్ చేయలేకపోయాడని ఒకరు ట్వీట్ చేశారు. ఓవర్సీస్లో ఒక మిలియన్ కష్టమేనని అంటున్నారు. కడపలో ఫస్టాఫ్‌కు పాజిటివ్ టాక్ వచ్చింది. స్క్రీన్‌ప్లే రేసీగా ఉందని, పాటల పిక్చరైజేషన్ కూడా బాగుందని మరో వ్యక్తి ట్వీట్ చేశారు. ఇక తెలుగు వ్యక్తిగా తాను ధృవ చూశానని, తమిళ సినిమా చూసి అంత ఎక్కువ ఆస్వాదించలేకపోయానని, ధృవ బాగుందని, దాన్ని మిస్ కావద్దని మరో ఎన్నారై చెప్పారు. మగధీర తర్వాత చరణ్‌కు ఇదే మంచి మూవీ అవుతుందని, రీమేక్ కూడా చాలా బాగుందని ఇంకొకరు చెప్పారు. రికార్డులు, ఇతర విషయాల సంగతి మర్చిపోతే.. చరణ్ మాత్రం బాగా చేశాడని అన్నారు. ప్రతి ఫ్రేములోనూ కష్టం కనిపిస్తోందని మరొకరు చెప్పారు. #dhruva on the whole an average fair...suri could not create magic in second half..OS lo 1 million kashtame.. — frinbe (@kselsm) 9 December 2016 Kadapa Morning show +ve talk from 1st half.. hope 2nd half kuda ede unte bomma blockbuster #Dhruva — Rustum !! (@DathuRulz) 9 December 2016 First half ayyindi.. bagane undi... Racy screenplay .. Songs Picturization #Dhruva — Laxman Anishetty (@laxman_219) 9 December 2016 As a Telugu guy, saw #Dhruva and didn't entertain myself with Tamil one. #Dhruva is too good. Don't miss this folks! — Dr. Appam (@appamkiran) 8 December 2016 #Dhruva - a successful and well adopted remake and best movie for Charan after #Magadheera. Forget about Records nd all..he performed well — Sriram Varma (@sriramForU) 8 December 2016