
అరవింద స్వామి పేరు వినగానే గుర్తొచ్చేది దళపతి, బాంబే, రోజా చిత్రాలే. మణిరత్నం దర్శకత్వంలో రజినీకాంత్, మమ్ముట్టి వంటి దిగ్గజాలతో నటించిన దళపతి చిత్రంలో యువ కథానాయకుడిగా పరిచయమైన నటుడు అరవిందస్వామి. కొన్ని చిత్రాల తర్వాత వ్యక్తిగత కారణాల వల్ల నటనకు దూరంగా ఉన్నారు. అయితే టాలీవుడ్‌లోనూ రామ్ చరణ్ నటించిన ధృవ చిత్రంలో విలన్‌గా మెప్పించారు.
(ఇది చదవండి: Bigg Boss 7: మళ్లీ దొరికిపోయిన శివాజీ.. అమర్ ఆ పాయింట్ చెప్పేసరికి!)
అయితే ఆ తర్వాత మళ్లీ రీఎంట్రీ అయ్యి తనీ ఒరువన్ వంటి పలు చిత్రాల్లో ప్రతి నాయకుడు గానూ నటించి మెప్పించారు. ప్రస్తుతం పలు చిత్రాల్లో వివిధ రకాల పాత్రలు పోషిస్తూ బిజీగా ఉన్నా ఈయన త్వరలో మెగా ఫోన్ పట్టనున్నట్లు తెలిసింది. ఈయన ఇప్పటికే కథ కథనాన్ని సిద్ధం చేసుకున్నట్లు తెలిసింది. కాగా తాను దర్శకత్వం వహించనున్న చిత్రంలో ఆల్ ఇండియా స్టార్ ఫాహద్ ఫాజిల్‌ను ప్రధాన పాత్రలో నటింపజేయడానికి చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.
కాగా ఇందులో అరవిందస్వామి కూడా ఓ కీలకపాత్రను పోషించనున్నట్లు తెలిసింది. ఈ చిత్రం 2024 ప్రథమార్థంలో సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉన్నట్లు సమాచారం. కాగా ఇటీవల ఉదయనిధి స్టాలిన్ కథానాయకుడిగా నటించిన మామన్నన్ చిత్రంలో విలన్‌గా తన విశ్వరూపం చూపించిన నటుడు ఫాహద్ ఫాజిల్ ప్రస్తుతం రజనీకాంత్ హీరోగా నటిస్తున్న చిత్రంలో ఆయనకు ప్రతి నాయకుడిగా నటిస్తున్నారు. కాగా అరవిందస్వామి దర్శకత్వం వహించే చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉందని భావిస్తున్నారు.
(ఇది చదవండి: ఈ హీరోయిన్‌ని గుర్తుపట్టారా? నాలుగే సినిమాలు, టీమిండియా క్రికెటర్‌తో పెళ్లి!)