మరో రీమేక్ పై మనసుపడ్డాడు | Ramcharan trying for Racky Handsome remake rights | Sakshi
Sakshi News home page

మరో రీమేక్ పై మనసుపడ్డాడు

Published Sat, Jan 23 2016 9:08 AM | Last Updated on Sun, Sep 3 2017 4:10 PM

మరో రీమేక్ పై మనసుపడ్డాడు

మరో రీమేక్ పై మనసుపడ్డాడు

బ్రూస్ లీ సినిమాతో ఆశించిన స్థాయి విజయం సాధించలేకపోయిన రామ్ చరణ్ ఇప్పుడు తన నెక్ట్స్ సినిమాల మీద దృష్టిపెట్టాడు. కొత్త కథలతో ప్రయోగం చేసే కన్నా ఇప్పటికే హిట్ అయిన సినిమాలను రీమేక్ చేయటం బెటర్ అని భావిస్తున్నాడు. అందుకే తమిళంలో ఘనవిజయం సాధించిన తనీఒరువన్ సినిమాను తెలుగులో రీమేక్ చేయడానికి రెడీ అవుతున్నాడు. ఇప్పటికే డైరెక్టర్ సురేందర్ రెడ్డి, ఈ సినిమాను తెలుగు నేటివిటికి అనుగుణంగా మార్చే పనిలో బిజీగా ఉన్నాడు.

తనీఒరువన్ రీమేక్ తరువాత కూడా మరోసారి రీమేక్ సినిమానే చేయాలనే ఆలోచనలో ఉన్నాడు చెర్రీ. ప్రస్తుతం బాలీవుడ్లో జాన్ అబ్రహం హీరోగా తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్ రాఖీ హ్యాండ్సమ్ సినిమాను తెలుగులో రీమేక్ చేయాలని భావిస్తున్నాడట. రాఖీ హ్యాండ్సమ్ సినిమాలో హీరోయిన్గా నటించిన శృతిహాసన్ చెర్రీతో ఈ సినిమా కథ గురించి చెప్పడంతో, చరణ్ ఆ సినిమా రీమేక్ హక్కుల కోసం ప్రయత్నాలు ప్రారంభించాడన్న టాక్ వినిపిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement