
వరుణ్ వెనుకడుగు వేస్తున్నాడా..?
ముకుంద సినిమాతో వెండితెరకు పరిచయం అయిన మెగా వారసుడు వరుణ్ తేజ్. తొలి ప్రయత్నంలోనే తన ప్రత్యేకత చూపించిన వరుణ్, రెండో సినిమాతో కూడా అదే ఫార్ములాను కంటిన్యూ చేస్తున్నాడు. గమ్యం ఫేం క్రిష్ దర్శకత్వంలో కంచె సినిమా చేశాడు వరుణ్. రెండో ప్రపంచ యుద్ధకాలంలో జరిగే ప్రేమకథగా తెరకెక్కిన ఈ పీరియాడిక్ డ్రామాలో వరుణ్ డిఫరెంట్ లుక్లో కనిపిస్తున్నాడు.
ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆడియో, ఇటీవల సినీ ప్రముఖుల సమక్షంలో గ్రాండ్గా రిలీజ్ అయింది. రెండో ప్రపంచ యుద్ధ నేపధ్యంలో తెరకెక్కిన ఈ సినిమాను గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న రిలీజ్ చేయాలని భావించారు. అయితే అదే సమయంలో మరిన్ని సినిమాల రిలీజ్ ఉండటంతో కంచె రిలీజ్ను వాయిదా వేసే ఆలోచనలో ఉన్నారు చిత్రయూనిట్.
ముఖ్యంగా అక్టోబర్ 2న రామ్ హీరోగా తెరకెక్కిన శివం రిలీజ్ అవుతుండటంతో పాటు వరుసగా రుద్రమదేవి, బ్రూస్లీ, అఖిల్ సినిమాలు రిలీజ్ కానున్నాయి. దీంతో కంచెను నవంబర్కు వాయిదా వేయాలని భావిస్తున్నారు. ఇప్పటివరకు అఫీషియల్ ఎనౌన్స్మెంట్ లేకపోయినా వరుణ్, క్రిష్ల కంచె వాయిదా పడటం దాదాపుగా కన్ఫామ్ అన్న టాక్ వినిపిస్తోంది.