'రాయబారి'ని పక్కన పెట్టేశారా..? | Varun Tej, Krish Rayabhari movie detailes | Sakshi
Sakshi News home page

'రాయబారి'ని పక్కన పెట్టేశారా..?

Published Tue, Feb 16 2016 1:50 PM | Last Updated on Sun, Sep 3 2017 5:46 PM

'రాయబారి'ని పక్కన పెట్టేశారా..?

'రాయబారి'ని పక్కన పెట్టేశారా..?

కంచె సినిమాతో మెగా ప్రిన్స్ వరుణ్కు మంచి సక్సెస్ అందించిన దర్శకుడు క్రిష్. మరోసారి అదే హీరోతో పని చేయాలని భావించాడు. కంచె సినిమాలో వరుణ్ను రెండో ప్రపంచ యుద్ధ కాలం నాటి సైనికుడిగా చూపించిన క్రిష్, రెండో సినిమాలో రా ఏజెంట్గా చూపించాలని భావించాడు. ఈ సినిమాకు రాయబారి అనే టైటిల్ను కూడా ఫిక్స్ చేశాడు క్రిష్.

అయితే ఇక పట్టాలెక్కటమే తరువాయి అనుకున్న తరుణంలో రాయబారి ఆగిపోయిందన్న టాక్ వినిపిస్తోంది. ఇంత వరకు స్క్రిప్ట్ ఫైనల్ కాకపోవటంతో పాటు ఎక్కువ శాతం సినిమా విదేశాల్లో షూట్ చేయాల్సి ఉండటంతో అక్కడి లోకేషన్ల పర్మిషన్లు కూడా కష్టంగా మారాయట. దీంతో ఈ ప్రాజెక్ట్ను పక్కన పెట్టేసి వేరే సినిమా స్టార్ట్ చేయటం బెటర్ అని భావిస్తున్నాడు వరుణ్.

ఇప్పటికే వరుణ్ తేజ్, దిల్ రాజు నిర్మాణంలో వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి అంగీకరించాడు. అయితే రాయబారి తరువాత ప్రారంభం కావాల్సిన ఈ సినిమాను ముందుగానే పట్టాలెక్కించాలని భావిస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ వచ్చే అవకాశం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement