Shivam
-
సస్పెన్స్ థ్రిల్లర్‌గా వస్తోన్న శివం భజే.. టీజర్ వచ్చేసింది!
అశ్విన్ బాబు, దిగంగనా జంటగా నటించిన చిత్రం 'శివం భజే'. గంగా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై మహేశ్వర్ రెడ్డి నిర్మాతగా.. అప్సర్ దర్శకత్వంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాను సస్పెన్స్, యాక్షన్ థ్రిల్లర్ జానర్లో రూపొందిస్తున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇప్పటికే టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ కాగా.. ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది.నిర్మాత మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ ''వైవిధ్యమైన కథతో మా సంస్థ నిర్మాణంలో వస్తోన్న చిత్రం 'శివం భజే'. టైటిల్, ఫస్ట్ లుక్కు మించి టీజర్‌కు స్పందన రావడం ఆనందంగా ఉంది. జూలైలో ప్రపంచవ్యప్తంగా విడుదల చేయడానికి సిద్దమవుతున్నాం. చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడిస్తాం' అని అన్నారు.దర్శకుడు అప్సర్ మాట్లాడుతూ.. " శివం భజే టైటిల్ తోనే అందరి దృష్టి ఆకర్షించాం. టీజర్‌కు ప్రేక్షకుల నుంచి ఊహించని విధంగా రెస్పాన్స్ రావడం చాలా సంతోషంగా ఉంది. నిర్మాత మహేశ్వర రెడ్డి పూర్తి సహకారంతో ఈ చిత్రం అద్భుతంగా రూపొందిస్తాం. విడుదల తేదీ వివరాలు త్వరలోనే తెలియజేస్తాం" అని అన్నారు.హీరో అశ్విన్ బాబు మాట్లాడుతూ.. "టీజర్‌కు అనూహ్య స్పందన వస్తున్నందుకు అందరికీ ధన్యవాదాలు. అన్ని వర్గాలు ప్రేక్షకులని అలరించే విధంగా ఈ చిత్రం ఉంటుంది. దర్శకుడు అప్సర్, నిర్మాత మహేశ్వర రెడ్డి ఈ చిత్రాన్ని ఊహించిన దానికంటే అద్భుతంగా తెరకెక్కిస్తున్నారు. మీ అందరి ఆశీర్వాదంతో త్వరలోనే మా చిత్రాన్ని మీ ముందుకి తెస్తాం" అని అన్నారు. కాగా.. ఈ చిత్రంలో అర్బాజ్ ఖాన్, హైపర్ ఆది, మురళీ శర్మ, సాయి ధీన, బ్రహ్మాజీ, తులసి, దేవి ప్రసాద్, అయ్యప్ప శర్మ, శకలక శంకర్, కాశీవిశ్వనాధ్, ఇనాయ సుల్తాన కీలక పాత్రలు పోషిస్తున్నారు. -
'తొలి పాన్ ఇండియా బాలల చిత్రం ‘లిల్లీ’గా గుర్తుండిపోతుంది'
'తొలి పాన్ ఇండియా బాలల చిత్రం ‘లిల్లీ’. ఈ సినిమాకి తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లోనూ మంచి స్పందన వస్తోంది. మా చిత్రాన్ని ఇండియాలోని అన్ని పాఠశాలల విద్యార్థులకు చూపించాలనేది మా లక్ష్యం' అని డైరెక్టర్ శివమ్ అన్నారు. బేబీ నేహా, బేబీ ప్రణతి రెడ్డి, మాస్టర్ వేదాంత్ వర్మ తదితరులు నటించిన బాలల చిత్రం ‘లిల్లీ’. శివమ్ దర్శకత్వంలో కె. బాబురెడ్డి, సతీష్ కుమార్ .జి నిర్మించిన ఈ సినిమా శుక్రవారం (జూలై 7న) పాన్ ఇండియా స్థాయిలో విడుదలైంది. ఈ సందర్భంగా శివమ్ మాట్లాడుతూ– 'కృష్ణా జిల్లాలోని పెదమద్దాలి నా స్వస్థలం. డైరెక్టర్ కావాలనుకుని 13ఏళ్ల కిందట హైదరాబాద్ వచ్చా. రైటర్‌గా, అసిస్టెంట్ డైరెక్టర్‌గా, యాడ్ ఫిల్మ్ మేకర్‌గా చేశాను. మణిరత్నంగారి ‘అంజలి’ స్ఫూర్తితో చిన్న పిల్లలతో ఓ సినిమా చేద్దామని ‘లిల్లీ’ కథ రాశాను. నేనే డైరెక్టర్‌గా, నిర్మాతగా ఈ సినిమాని స్టార్ట్ చేశాను. నా కాన్సెప్ట్, ఔట్పుట్ బాబురెడ్డిగారికి నచ్చడంతో ‘లిల్లీ’ని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో చేద్దామన్నారు. ఈ చిత్రంలో నటించిన పిల్లలందరూ కడపకు చెందిన కొత్తవారే. ఈ సినిమాని రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేసింది. నేను డైరెక్టర్ అయ్యేందుకు ప్రోత్సహించిన మా నాన్న నాంచారయ్య, అమ్మ వెంకటలక్ష్మి, నా భార్య సుధా శక్తి, ఫ్రెండ్స్‌కి, చాన్స్ ఇచ్చిన బాబురెడ్డిగారికి కృతజ్ఞతలు. గోపురం బ్యానర్లోనే నాలుగు సినిమాలు సైన్ చేశాను' అన్నారు. -
వివాదానికి తెర తీస్తున్న హీరో
శాండల్ వుడ్‌లోనే కాదు టాలీవుడ్లో కూడా తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు ఉపేంద్ర. తన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఎ, రా, ఉపేంద్ర సినిమాలు తెలుగులో కూడా సంచలనాలు నమోదు చేశాయి. అందుకే ఉపేంద్ర హీరోగా తెరకెక్కిన కన్నడ సినిమాలో తెలుగులోనూ రిలీజ్ అవుతుంటాయి. ఇటీవల ఉపేంద్ర హీరోగా తెరకెక్కిన కన్నడ సినిమా శివం. ముందుగా ఈ సినిమాకు బసవణ్ణ అనే టైటిల్‌ను నిర్ణయించిన వివాదాలు రావడంతో శివం పేరుతో రిలీజ్ చేసి విజయం సాధించారు. అయితే ఇప్పుడు ఈ సినిమాను తెలుగులో డబ్ చేసిన రిలీజ్ చేయనున్నారు. శివం సినిమా తెలుగు వర్షన్‌కు బ్రాహ్మణ అనే టైటిల్‌ను నిర్ణయించారు. ఇప్పటికే తెలుగు సినిమాల్లో బ్రాహ్మణులను కించపరుస్తున్నారంటూ చాలా రోజులుగా ఆరోపణలున్నాయి. ఇప్పుడు ఉపేంద్ర ఏకంగా ఓ యాక్షన్ సినిమాకు బ్రాహ్మణ అనే టైటిల్‌ను పెడితే ఊరుకుంటారా..? అయితే కథ కోసం ఈ టైటిల్‌ను పెట్టారా..? లేక వివాదాలతో పబ్లిసిటీ చేసుకోవాలన్న ఆలోచనలో పెట్టారో గాని.. ఉపేంద్ర సినిమా టైటిల్ మరోసారి టాలీవుడ్లో వివాదాలకు కారణం అవ్వటం ఖాయం అన్న టాక్ వినిపిస్తోంది. -
కందిరీగ కాంబినేషన్లో మరో సినిమా
శివమ్ సినిమా రిజల్ట్‌తో డీలా పడ్డ రామ్, వెంటనే తేరుకొని స్పీడు పెంచుతున్నాడు. ప్రస్థుతం కిశోర్ దర్శకత్వంలో స్రవంతి మూవీస్ బ్యానర్లో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తున్న ఈ యంగ్ హీరో, ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే మరో సినిమాకు కమిట్ అవుతున్నాడు. గతంలో తనకు సూపర్ హిట్ ఇచ్చిన కాంబినేషన్లోనే ఈ సినిమాను ప్లాన్ చేస్తున్నాడు రామ్. దేవదాస్, రెడీ లాంటి హిట్స్ తరువాత కెరీర్ కష్టాల్లో పడ్డ సమయంలో రామ్‌ను ఆదుకున్న సినిమా కందిరీగ. సంతోష్ శ్రీనివాస్‌ను దర్శకుడిగా పరిచయం చేస్తూ తెరకెక్కించిన ఈ సినిమా ఘనవిజయం సాధించి, రామ్ కెరీర్‌ను గాడిలో పెట్టింది. కందిరీగ తరువాత ఎన్టీఆర్ హీరోగా రభస సినిమా చేశాడు సంతోష్. అయితే ఆ సినిమా తఫ్లాప్ టాక్ సొంతం చేసుకోవటంతో చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్నాడు. శివమ్ సినిమాతో ఆకట్టుకోలేకపోయిన రామ్ మరోసారి సక్సెస్ కోసం సంతోష్ శ్రీనివాస్‌నే నమ్ముకున్నాడు. ప్రస్తుతం కిశోర్ దర్శకత్వంలో చేస్తున్న సినిమా పూర్తవ్వగానే కందిరీగ కాంబినేషన్లో మరో సినిమాకు రెడీ అవుతున్నాడు. కష్టాల్లో ఉన్న రామ్, సంతోష్ శ్రీనివాస్‌ల కెరీర్లను ఈ రిపీట్ కాంబినేషన్ మరోసారి సక్సెస్ ట్రాక్ ఎక్కిస్తుందేమో చూడాలి. -
'హరికథ' కాదు 'నేను శైలజ'
యంగ్ హీరో రామ్ మరోసారి ఆలోచనలో పడ్డాడు. రొటీన్ సినిమాలతో బోర్ కొట్టించిన యంగ్ హీరో చాలా రోజులుగా ఒక్క హిట్ కూడా లేకుండా కెరీర్ నెట్టుకొస్తున్నాడు. 'పండగ చేస్కో' సినిమాతో కాస్త ఫాంలోకి వచ్చినట్టుగానే కనిపించిన 'శివమ్' సినిమాతో మరోసారి నిరాశపరిచాడు. రొటీన్ కథా కథనాలతో తెరకెక్కిన ఈ సినిమా తెలుగు ఆడియన్స్‌ను మెప్పించలేకపోయింది. దీంతో తన తదుపరి సినిమాల విషయంలో చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడు రామ్. ప్రస్తుతం ఈ యంగ్ హీరో 'సెకండ్ హ్యాండ్' ఫేం కిశోర్ తిరుమల దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. సినిమా ప్రారంభానికి ముందే ఈ సినిమాకు 'హరికథ' అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. అయితే రామ్ ఈ టైటిల్ ను మార్చే ఆలోచనలో ఉన్నాడట. హరికథ అనే టైటిల్ పాతగా అనిపిస్తోందన్న ఉద్దేశంతో 'నేను శైలజ' అనే సాఫ్ట్ టైటిల్‌ను ఫైనల్ చేసే ఆలోచనలో ఉన్నాడట. ప్రస్తుతం యంగ్ హీరోలందరూ 'నాన్నకు ప్రేమతో', 'సన్నాఫ్ సత్యమూర్తి', 'అత్తారింటికి దారేది' లాంటి సాఫ్ట్ టైటిల్స్‌తో వస్తుంటే తను మాత్రం ప్రయోగం చేయటం ఎందుకు అని భావించిన రామ్, 'నేను శైలజ' టైటిల్‌కే ఫిక్స్ అయ్యే ఆలోచనలో ఉన్నాడట. త్వరలోనే చిత్రయూనిట్ ఈ టైటిల్‌ను అఫీషియల్‌గా ఎనౌన్స్ చేయనున్నారట. -
మూడేళ్ల తరువాత నిర్మాతలుండరేమో!
అరవై ఏళ్ళ జీవితం... నిర్మాతగా ముప్ఫై ఏళ్ళ కెరీర్... రిలీజ్‌కు రెడీగా 34వ సినిమా (‘శివమ్’)... షూటింగ్లో మరో సినిమా (‘హరికథ’)... వెరసి ‘స్రవంతి’ రవికిశోర్‌కు పాత జ్ఞాపకాలు, కొత్త అనుభవాలూ బోలెడు. వ్యాపారంగానే సినిమాల్లోకి వచ్చినా, తీస్తున్న సినిమాల్లో మనసు లెక్కలు మర్చిపోరీ ఆలిండియా సి.ఏ. ర్యాంకర్. ముప్ఫై ఏళ్ళ క్రితం ‘లేడీస్ టైలర్’తో మొదలుపెట్టిన ఆయన - ఈ అక్టోబర్ 2న ‘శివమ్’తో పలకరించ నున్నారు. ఈ సందర్భంగా ఆయనతో ‘సాక్షి’ ప్రత్యేక భేటీ... ఈ ముప్ఫై ఏళ్ళ జర్నీని తలుచుకొంటే ఏమనిపిస్తుంటుంది? వ్యాపారంగానే సినిమాల్లోకొచ్చా. వచ్చాక వంశీ, తనికెళ్ళ, సీతారామ శాస్త్రి, ఇళయరాజా మొదలు ఇవాళ్టి దేవిశ్రీ ప్రసాద్ దాకా ఎందరో క్రియేటివ్ పీపుల్‌తో కలసి జర్నీ చేశా. ఈ అదృష్టం ఎందరికొస్తుంది! సినిమాల్లోకి రాక పోతే, ఎవరి లెక్కల్లోనో తప్పులు దిద్దుతూ, పి.వి. రవికిశోర్గా మిగిలేవాణ్ణి. అసలు సినిమా రంగంలోకి తొలి అడుగు ఎలా వేశారు? సినిమాల్లోకి రావడం నా డ్రీమ్ ఏమీ కాదు. అప్పట్లో దర్శకుడు వంశీతో పరిచయంతో ‘ఆలాపన’ లాంటి షూటింగ్లకెళ్ళేవాణ్ణి. జర్నలిస్టు వేమూరి సత్యనారాయణ లాంటి వాళ్ళు తోడయ్యారు. ఒకసారి అరకులో ఉండగా తొలిచిత్రం ‘లేడీస్టైలర్’ (1986)కి బీజం పడింది. అది గట్టి పునాది. అప్పటి నుంచి ‘నువ్వేకావాలి’ మీదుగా ఇప్పటి దాకా జర్నీ కంటిన్యూస్. నిర్మాణంతో పాటు డిస్ట్రిబ్యూషన్లోనూ ఉన్నట్లున్నారు? అవును. 1987 నుంచే డిస్ట్రిబ్యూషన్లోనూ ఉన్నా. కాకపోతే, నిర్మాతగా చేతిలో 13 పేకముక్కలుంటాయి. ఉన్న ముక్కలేమిటో మనకు తెలుసు. కానీ, డిస్ట్రిబ్యూషన్ మూడు ముక్కలాట లాంటిది. ఏ ముక్కలో ఏముందో తెలియకుండా పందెం కాస్తాం. అలా చాలా డబ్బులు పొగొట్టుకున్నా. చేదు అనుభవాలెదురైనా, పెట్టాబేడా సర్దుకొని వెళ్ళిపోదామని అనుకోలేదు. లేడీస్ టైలర్’ నాటికీ, ఇప్పటికీ చిత్ర నిర్మాణంలోని మార్పులపై మీ వ్యాఖ్య? అప్పట్లో నూటికి 90 మంది గుడికెళ్ళినంత పవిత్రంగా ఈ రంగాని కొచ్చేవారు. ఇవాళ నూటికి 70 మంది సినిమాపై మోజుతో వస్తు న్నారు. నౌ ఉయ్ ఆర్ మేకింగ్ ఫిల్మ్స్ విత్ అవర్ హెడ్స. నాట్ విత్ అవర్ హార్ట్స. ఇవాళ ఆడియన్సలో కూడా చాలా మార్పు వచ్చింది కదా? ఒకప్పుడు అర్థవంతమైన పాటలు, సినిమా చూశాక మంచి విషయం ఇంటికి తీసుకెళ్ళాలనే ఆలోచన ఉండేవి. ఇప్పుడు వినోదమే ఆశిస్తున్నారు. అప్పట్లో కథెక్కువ, కామెడీ తక్కువ. ఇప్పుడు కామెడీ ఎక్కువ, కథ తక్కువ. కానీ, మారిన కాలానికి తగ్గట్లు దర్శక, నిర్మాతలం మారాల్సిందే. లేకపోతే, మనం హిస్టరీగా మారతాం. ఐ డోంట్ వాంట్ టు బికమ్ పాస్ట్ ఆర్ హిస్టరీ. మీ సమకాలీన నిర్మాతల మధ్య పోటీ ఉండేదట... శ్యామ్ ప్రసాద్‌రెడ్డి, అరవింద్, పోకూరి బాబూరావు, గోపాలరెడ్డి - ఇలా చాలామంది ఉండేవాళ్ళం. హెల్దీ కాంపిటీషనుండేది. ‘భలే భలే మగాడి వోయ్’ హిట్ తర్వాత అరవింద్ పార్టీ ఇచ్చి, నెక్స్ట్ పార్టీ మీదే అన్నారు. మరి మీ రాబోయే ‘శివమ్ ’, ‘హరికథ’ ఎలా ఉంటాయ్? ఫ్యామిలీ అంతా చూసే ఎంటర్టైనర్ ‘శివమ్ ’. తండ్రీ కూతుళ్ళ మధ్య అనుబంధంతో హార్టటచింగ్గా డిసెంబర్లో ‘హరికథ’ వస్తుంది. ఒక డబ్బింగ్‌తో కలిపి ఈ ఏడాది ఏకంగా 3 సినిమాలు ప్రొడ్యూస్ చేశారే? (నవ్వేస్తూ...) ‘రఘువరన్ బిటెక్’ (తమిళ ‘వి.ఐ.పి’) కూడా రీమేక్ చేద్దామనుకున్నా. కానీ, ధనుష్ బాగా చేశాడని డబ్బింగ్ చేశాం. మిగిలిన రెండు సినిమాలంటారా, వాటి స్క్రిప్ట్ ముందే చేసేశాం. ఇప్పుడు చేస్తున్నది కేవలం ఎగ్జిక్యూషనే. అందుకే, ఈసారి మూడు సినిమాలు తీయగలిగా. మీ తమ్ముడి కొడుకు రామ్‌తోనే కొన్నేళ్ళుగా సినిమాలు చేస్తున్నారేం? ఇప్పుడు డబ్బులు పెట్టేవాళ్ళనే తప్ప, అవసరమైతే హీరోనూ, దర్శ కుణ్ణీ ప్రశ్నించే నిర్మాతల్ని ఎవరూ ఇష్టపడడం లేదు. కోరుకోవడం లేదు. కోట్లమంది ప్రేక్షకులకు నచ్చేది కాకుండా, హీరో ఒక్కడికి నచ్చితే చాలు... కోట్ల మందికి నచ్చుతుందనే భ్రమలో సినిమా తీయడం వేస్ట్. అందుకే, 2008 నుంచి రామ్‌తోనే చేస్తున్నా. మా వాడితో అయితే, ఆ సమస్య ఉండదుగా! రామ్ అనే హీరో చేయూత లేకపోతే, నేనూ ఇబ్బంది పడేవాణ్ణి. ఇంటి హీరో కావడంతో ఆర్థికంగానూ మీకు వెసులుబాటు ఉంటుందేమో! (నవ్వుతూ) భారీ అడ్వాన్సులివ్వక్కర్లేదు. దానికి అప్పులు తేనక్కర్లేదు. రామ్ కెరీర్లో, నిర్ణయాల్లో మీ ప్రభావం? సిన్మా చేసేముందు మంచీచెడు చర్చించుకుంటాం. తీసుకెళ్ళిన ప్రాజె క్ట్‌లు తనకు సరిపోవని, ఎనాలిసిస్‌తో నన్ను కన్విన్స చేసిన ఘట్టాలున్నాయి. మరి, మీరు అతణ్ణి కన్విన్స చేసిన సందర్భాలు ? రామ్ పూర్తిగా ఇష్టపడకుండా చేసింది ‘మసాలా’. మల్టీస్టారర్ చేయడం ఇష్టమైనా, క్యారెక్టరైజేషన్ తనకు నచ్చలేదు. నా వల్ల చేయాల్సి వచ్చింది. పెదనాన్నగా కాకుండా, హీరోగా రామ్ లో మీకు నచ్చే విషయం? ఇంటెలిజెంట్ బాయ్. ఆల్వేస్ ఫోకస్డ్. విశ్లేషణా సామర్థ్యం ఎక్కువ. పైగా అంత హార్డవర్క చేసే హీరోను ఈ మధ్య చూడలేదు. అదే శ్రీరామరక్ష. ‘నువ్వేకావాలి’, ‘నువ్వు నాకు నచ్చావ్’, ‘మసాలా’ లాంటివి ఇతర నిర్మాత లతో పార్టనర్‌షిప్‌లో తీశారు. ఇప్పుడలాంటి ప్రయత్నాలు మానేశారేం? అలా చేస్తే, ఆర్థిక వెసులుబాటు ఉంటుంది. కానీ, ఇండిపెండెంట్‌గా పనిచేసినవాళ్ళం, మనకి మనం బాస్‌గా కాకుండా, మరొక బాస్ కింద పని చేయడం కొంత కష్టమే. నిర్ణయానికి మరొకరి కోసం నిరీక్షించడం ఇబ్బందే. ఇన్నేళ్ళ కెరీర్లో నిర్మాతగా మోస్ట్ డిజప్పాయింటింగ్ ఫిల్మ్? (క్షణం ఆలోచించి) ‘ఎందుకంటే ప్రేమంట’. నేను, రామ్ ప్రాణం పెట్టి పనిచేశాం. ఆడలేదు. అలాంటి తరహాదే ఆమిర్‌ఖాన్ ‘తలాష్’ చేస్తే అది ఆడింది. ఎక్కడో మేం తప్పు చేశామన్న మాట. ఇక, కెరీర్లో బెస్ట్ఫిల్మ్ ‘నువ్వు నాకు నచ్చావ్’. ప్రతి క్షణం ఆస్వాదిస్తూ, చేశా. కెరీర్లో తీవ్రంగా పశ్చాత్తాపపడిన సందర్భం, సంఘటన? అలా ఏమీ లేదు. ప్రతి వ్యక్తినీ, సందర్భాన్నీ ఒకలా అంచనా వేస్తాం. అది తప్పని తేలితే రెండోసారి జాగ్రత్తపడతాం. అంతకు మించి పగ, ప్రతీకారం లాంటివుండకూడదు. నేర్చుకొంటే, ఇక్కడ ప్రతీదీ అనుభవమే. రాబోయే రోజుల్లో సినీ నిర్మాణం ఎలా ఉండనుంది? తెలుగు పరిశ్రమ గట్టి దెబ్బలు కొట్టడంతో కార్పొరేట్ సంస్థలు గుమ్మం దగ్గరే నిలబడిపోయాయి కానీ, అవి వస్తాయి. మూడేళ్ళ తర్వాత స్వతంత్ర నిర్మాతలంటూ ఎవరూ మిగలకపోవచ్చు. అసోసియేట్, లైన్ ప్రొడ్యూసర్, వర్కింగ్ పార్‌టనర్‌సగా కార్పొరేట్స్‌తో చేతులు కలపాల్సి వస్తుంది. ‘నువ్వే కావాలి’ టైమ్ కే నేను ఊహించిన పరిణామం 15 ఏళ్ళు ఆలస్యమైంది. ఈ 30 ఏళ్ళ సినీ కెరీర్లో ఏం తెలుసుకున్నారు? అందరిలా తప్పులు చేశాం. సక్సెస్ ప్రమాదకరం. తలకెక్కి తప్పుదోవ పట్టిస్తుంది. సక్సెస్ ఒక్కరిది కాదు, టీమ్వర్కని మర్చిపోతుంటాం. అందుకే, ఫెయిల్యూర్ కన్నా సక్సెస్ వచ్చినప్పుడే ఇంకా జాగ్రత్తగా ఉండాలి. కొత్తగా రానున్న చిత్ర నిర్మాతలకు మీరిచ్చే సలహాలు, సూచనలు? ఇక్కడ ప్రతివాడూ పక్కవాడి కంటే తాను గొప్పనుకుంటాడు. కాబట్టి, సలహాలు చెప్పి, నవ్వులపాలు కాకూడదు. ఇక్కడ ఎవరూ వినరు, మారరు. మీ ‘స్రవంతి’ సంస్థను ముందుకు తీసుకెళ్ళడానికి వారసులు సిద్ధమేనా? నా రెండో తమ్ముడి కొడుకు రామ్ హీరో. ఇక, న్యూజిలాండ్‌లో కమర్షి యల్ పైలట్ కోర్స చేసిన రామ్ వాళ్ళ అన్నయ్య కృష్ణచైతన్య నా వెంటే ఉంటూ ప్రొడక్షన్ చూస్తున్నాడు. నా మొదటి తమ్ముడు డాక్టర్ రమేశ్ కొడుకు రాజా నిశాంత్ అమెరికాలో డెరైక్షన్ కోర్స చేశాడు. భవిష్యత్తు వీళ్ళదే. - రెంటాల జయదేవ -
‘శివమ్’మూవీ వర్కింగ్ స్టిల్స్
-
మెగా మూవీ వాయిదా
ముకుంద సినిమాతో వెండితెరకు పరిచయం అయిన మెగా వారసుడు వరుణ్ తేజ్. తొలి ప్రయత్నంలోనే తన ప్రత్యేకత చూపించిన వరుణ్, రెండో సినిమాతో కూడా అదే ఫార్ములాను కంటిన్యూ చేస్తున్నాడు. గమ్యం ఫేం క్రిష్ దర్శకత్వంలో కంచె సినిమా చేశాడు వరుణ్. రెండో ప్రపంచ యుద్ధకాలంలో జరిగే ప్రేమకథగా తెరకెక్కిన ఈ పీరియాడిక్ డ్రామాలో వరుణ్ డిఫరెంట్ లుక్‌లో కనిపిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆడియో, ఇటీవల సినీ ప్రముఖుల సమక్షంలో గ్రాండ్‌గా రిలీజ్ అయింది. రెండో ప్రపంచ యుద్ధ నేపధ్యంలో తెరకెక్కిన ఈ సినిమాను గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న రిలీజ్ చేయాలని భావించారు. అయితే ఈ సినిమాను నవంబర్ 6వ తేదీన రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించాడు హీరో వరుణ్. వాయిదాకు కారణాలను త్వరలోనే వెల్లడిస్తామని తెలిపాడు. ముఖ్యంగా అక్టోబర్ 2న రామ్ హీరోగా తెరకెక్కిన శివం రిలీజ్ అవుతుండటంతో పాటు వరుసగా రుద్రమదేవి, బ్రూస్లీ, అఖిల్ సినిమాలు రిలీజ్ కానున్నాయి. దీంతో కంచెను నవంబర్‌కు వాయిదా వేశారన్న టాక్ వినిపిస్తుంది. టాలీవుడ్లో ఆలస్యంగా రిలీజ్ అయిన సినిమాలు ఆకట్టుకున్న సందర్భాలు చాలా తక్కువ కావటంతో కంచె యూనిట్‌తో పాటు అభిమానులు కూడా టెన్షన్ పడుతున్నారు. Hey guys...there has been a change in the release date of our movie #kanche to November 6th.. The reason behind this will be answered soon.. — Varun Tej Konidela (@IAmVarunTej) September 22, 2015 -
హై వోల్టేజ్ లవ్
ఆ కుర్రాడు స్నేహానికి ప్రాణమిస్తారు. దేవదాసు, మజ్నూలు తనకిప్పుడు ఫ్రెండ్స్ అయితే వాళ్ల ప్రేమను సక్సెస్ చేస్తానంటాడు. మరి ఇలాంటి కుర్రాడికి రాశీఖన్నా లాంటి అందమైన అమ్మాయి ‘ఐ లవ్ యూ’ చెప్పేసింది. ఇంకేముంది... ఏదో మాయ చేసి ఆ ప్రేమను పెళ్లి దాకా తీసుకెళ్లాడు. మరి తన ప్రేమ కోసం ఈ యువకుడు చేసిన సందడి తెలియాలంటే ‘శివమ్’ చూడాల్సిందే. రామ్, రాశీఖన్నా జంటగా శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై శ్రీనివాసరెడ్డి దర్శకత్వంలో ‘స్రవంతి’ రవికిశోర్ నిర్మించిన చిత్రం ‘శివమ్’. ఈ చిత్రం అక్టోబర్ 2న విడుదల కానుంది. ‘‘హై వోల్టేజ్ యాక్షన్ లవ్‌స్టోరీతో రూపొందిన ఈ చిత్రంలో అన్ని వర్గాలను ఆకట్టుకునే అంశాలున్నాయి. దర్శకుడు శ్రీనివాసరెడ్డికి ఇది తొలి చిత్రమైనా, బాగా తీశాడు. ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే హైలైట్. నార్వే, స్వీడన్‌లలోని అందమైన లొకేషన్స్‌లో చిత్రీకరించిన పాటలు కలర్‌ఫుల్ గా ఉంటాయి’’ అని నిర్మాత రవికిశోర్ అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ- ‘‘రామ్, రాశీఖన్నాల మధ్య మంచి కెమిస్ట్రీ వర్క్‌వుట్ అయింది, వాళ్ల జంట చూడచక్కగా ఉంటుంది’’ అని చెప్పారు. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం మరో హైలెట్. -
వరుణ్ వెనుకడుగు వేస్తున్నాడా..?
ముకుంద సినిమాతో వెండితెరకు పరిచయం అయిన మెగా వారసుడు వరుణ్ తేజ్. తొలి ప్రయత్నంలోనే తన ప్రత్యేకత చూపించిన వరుణ్, రెండో సినిమాతో కూడా అదే ఫార్ములాను కంటిన్యూ చేస్తున్నాడు. గమ్యం ఫేం క్రిష్ దర్శకత్వంలో కంచె సినిమా చేశాడు వరుణ్. రెండో ప్రపంచ యుద్ధకాలంలో జరిగే ప్రేమకథగా తెరకెక్కిన ఈ పీరియాడిక్ డ్రామాలో వరుణ్ డిఫరెంట్ లుక్‌లో కనిపిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆడియో, ఇటీవల సినీ ప్రముఖుల సమక్షంలో గ్రాండ్‌గా రిలీజ్ అయింది. రెండో ప్రపంచ యుద్ధ నేపధ్యంలో తెరకెక్కిన ఈ సినిమాను గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న రిలీజ్ చేయాలని భావించారు. అయితే అదే సమయంలో మరిన్ని సినిమాల రిలీజ్ ఉండటంతో కంచె రిలీజ్‌ను వాయిదా వేసే ఆలోచనలో ఉన్నారు చిత్రయూనిట్. ముఖ్యంగా అక్టోబర్ 2న రామ్ హీరోగా తెరకెక్కిన శివం రిలీజ్ అవుతుండటంతో పాటు వరుసగా రుద్రమదేవి, బ్రూస్లీ, అఖిల్ సినిమాలు రిలీజ్ కానున్నాయి. దీంతో కంచెను నవంబర్‌కు వాయిదా వేయాలని భావిస్తున్నారు. ఇప్పటివరకు అఫీషియల్ ఎనౌన్స్మెంట్ లేకపోయినా వరుణ్, క్రిష్‌ల కంచె వాయిదా పడటం దాదాపుగా కన్ఫామ్ అన్న టాక్ వినిపిస్తోంది. -
ఘనంగా ’శివమ్’ ఆడియో ఫంక్షన్
-
రామ్‌కి ఇంకా మంచి భవిష్యత్తు ఉంది
- అల్లు అరవింద్ ‘‘రవికిశోర్‌తో నాది 30 ఏళ్ల స్నేహం. ఆయనకు సినిమా అంటే చాలా ఇష్టం. 30 ఏళ్లుగా నిరాటంకంగా ఓ సంస్థ సినిమాలు నిర్మించడం చిన్న విషయం కాదు. ఇన్నేళ్లు నిలబడిన నిర్మాణ సంస్థలు చాలా చాలా అరుదు. ఇక, రామ్ గురించి చెప్పాలంటే... ఇప్పటికే స్టార్ అయిపోయాడు. ఇంకా మంచి భవిష్యత్తు ఉంది’’ అని నిర్మాత అల్లు అరవింద్ అన్నారు. రామ్, రాశీఖన్నా జంటగా కృష్ణ చైతన్య సమర్పణలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిశోర్ నిర్మించిన చిత్రం ‘శివమ్’. శ్రీనివాసరెడ్డి దర్శకుడు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్రం పాటల వేడుక హైదరాబాద్‌లో జరిగింది. ఈ సినిమా పాటలను నిర్మాత అల్లు అరవింద్ విడుదల చేశారు. ‘‘ప్రస్తుతం ‘శివమ్’, ‘హరికథ’ సినిమాలు ఒకేసారి చేస్తున్నా. స్రవంతి నా సొంత సంస్థ. ఈ సంస్థ 30 ఏళ్లు పూర్తి చేసుకున్న సమయంలో మా ‘శివమ్’ రావడం ఆనందంగా ఉంది. మా పెదనాన్న నాకు బ్యాక్‌బోన్‌లా నిలిచారు. ఈ సినిమా విడుదలయ్యాక దర్శకుడు శ్రీనివాస్ రెడ్డి బిజీ అవుతాడు’’ అని రామ్ చెప్పారు. ‘దిల్’ రాజు మాట్లాడుతూ- ‘‘స్రవంతి బ్యానర్లో వచ్చిన సినిమాలంటే చాలా ఇష్టం. ఇవాళ నేను నిర్మాతగా మారడానికి కారణమైన నిర్మాతల్లో ‘స్రవంతి’ రవికిశోర్ ఒకరు. రామ్ ఈ సినిమాలో డ్యాన్స్, ఫైట్స్ అన్నీ ఇర గదీశాడు’’ అన్నారు. ‘లేడీస్ టైలర్’ చిత్ర బృందానికి సన్మానం స్రవంతి మూవీస్ సంస్థ 30 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆ సంస్థ మొదటి చిత్రం ‘లేడీస్ టైలర్’ చిత్రదర్శకుడు వంశీ, మాటల రచయిత తనికెళ్ల భరణి, గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి, సినిమాటోగ్రాఫర్ హరి అనుమోలు, కథానాయిక సంధ్యలను ‘స్రవంతి’ రవికిశోర్ సత్కరించారు. తనికెళ్ల మాట్లాడుతూ- ‘‘30 ఏళ్ల క్రితం మా ‘స్రవంతి’ మొదలైంది. అప్పుడే మా సినీ ప్రయాణం కూడా మొదలైంది. స్రవంతి ఆఫీస్‌లో తినేవాళ్లం, రాసుకునేవాళ్లం, పోట్లాడుకునేవాళ్లం. నేను ఆనందంగా ఉండటానికి కారణమైన సినిమా ‘లేడీస్ టైలర్’. ఈ టీమ్ లేకపోతే మేం సినీ పరిశ్రమలో ఇంత వైభవంగా ఉండేవాళ్లం కాదేమో. కాకపోతే వేరే రకంగా ఉండేవాళ్లం’’ అన్నారు. సిరివెన్నెల మాట్లాడుతూ - ‘‘ఇది నాకు పండగ రోజు. 30 ఏళ్లుగా దిగ్విజయంగా ఓ నిర్మాణ సంస్థ కొనసాగడం అనేది గొప్ప విషయం. నేను, రవికిశోర్ ఒకేసారి చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టాం. ఈ సంస్థలో 80 పాటలు రాశాను. నిర్మాతీహ రోయిజమ్ను నిలబెట్టిన సంస్థ స్రవంతి మూవీస్. పాటలు రాయడం మొదలుపెట్టాక స్రవంతి నా ఇల్లుగా మారింది’’ అన్నారు. ఈ వేడుకలో నటులు బ్రహ్మానందం, భాస్కరభట్ల, ఎస్.వి.కృష్ణారెడ్డి, కె. విజయ్‌భాస్కర్, అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
‘శివం’ మూవీ స్టిల్స్
-
శివమ్
లవర్స్‌కి కోఠీ కూడా ఊటీ లాగానే అనిపి స్తుంది. పరిసరాలతో పని లేకుండా అక్కడ తామిద్దరమే ఉన్నామన్నట్లుగా రొమాన్స్‌లో మునిగి పోతారు. ఆ సమయంలో తామున్నది డేంజరస్ రోడ్లో అయినా ఆ ప్రమాదాన్ని పసిగట్టరు. రామ్, రాశీ ఖన్నా ఇటీవల అలాంటి డేంజరస్ లొకేషన్లో రొమాంటిక్ డ్యూయెట్ పాడుకున్నారు. ‘శివమ్’ సినిమా కోసం ‘అందమైన లోకం.. అందులోన నువ్వొక అద్భుతం...’ అంటూ ప్రపంచంలోనే ప్రమాదకరమైన రహదారి అయిన నార్వేలోని అట్లాంటిక్ ఓషన్ రోడ్డులో పాడుకున్నారు. ఈ పాటతో పాటు మరో రెండు పాట లను నార్వే, స్వీడన్లలో ఇంతవరకు ఏ ఇండియన్ సినిమా తీయని బ్యూటిఫుల్ లొకేషన్స్‌లో తీశారు. రసూల్ ఈ పాటలను కెమెరాలో అందంగా బంధించారు. కృష్ణచైతన్య సమర్పణలో శ్రీస్రవంతి మూవీస్ పతాకంపై శ్రీనివాసరెడ్డి దర్శకత్వంలో ‘స్రవంతి’ రవికిశోర్ నిర్మిస్తున్న ఈ చిత్రం రిలీజ్ అక్టోబర్ 2న. -
శివమ్ వీరంగమ్
ఎనర్జీకి చిరునామా అన్నట్లుగా ఉంటారు రామ్. ఇప్పటివరకూ ఎన్నో ఎనర్జిటిక్ క్యారెక్టర్స్ చేసిన ఆయన ‘శివమ్’లో మరింత ఎనర్జిటిక్‌గా వీరంగమ్ చేయనున్నారు. ఎందుకంటే, ఇది హై ఓల్టేజ్ లవ్‌స్టోరీ మూవీ. శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై రామ్, రాశీఖన్నా జంటగా స్రవంతి రవికిశోర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి శ్రీనివాసరెడ్డి దర్శకుడు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. బుధవారంతో ఈ షెడ్యూల్ కంప్లీట్ అవుతుందని, పాటలు మినహా టాకీ పూర్తవుతుందని నిర్మాత తెలిపారు. మూడు పాటల చిత్రీకరణను నార్వే, స్వీడెన్‌లో జరపనున్నారు. ఈ నెల 18న ఈ చిత్రీకరణ ప్రారంభించనున్నామని నార్వే, స్వీడెన్లలో ‘రంగం’ పాటలను చిత్రీకరించినకలర్ఫుల్ లొకేషన్స్‌లో ‘శివమ్’ పాటలను చిత్రీకరించనున్నామని రవికిశోర్ పేర్కొన్నారు. ఈ నెలాఖరు వరకూ ఈ చిత్రీకరణ జరుగుతుందని కూడా చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్, కెమెరా: రసూల్ ఎల్లోర్, యాక్షన్: పీటర్ హెయిన్స్, సమర్పణ: కృష్ణచైతన్య. -
వినాయకచవితికి ఈ శివుడు
మొన్న సమ్మర్‌కు ‘పండగ చేస్కో’ సినిమాతో పెద్ద కమర్షియల్ హిట్ సాధించిన యువ హీరో రామ్. ఇప్పుడు ఆయన తరువాతి సీజన్‌కు సిద్ధమైపోతున్నారు. ఈ వినాయక చవితికి ‘శివం’ చిత్రంతో ప్రేక్షకుల్ని పలకరించడానికి అన్ని సన్నాహాలూ చేసుకుంటున్నారు. ఈ ప్రేమకథా చిత్రాన్ని శ్రీ స్రవంతీ మూవీస్ పతాకంపై రామ్ పెదనాన్న పి. రవికిశోర్ నిర్మిస్తున్నారు. ప్రసిద్ధ దర్శకుడు సురేందర్ రెడ్డి దగ్గర దర్శకత్వ శాఖలో పని చేసిన శ్రీనివాసరెడ్డి ఈ చిత్రానికి తొలిసారిగా మెగాఫోన్ చేత పట్టారు. ఇప్పటికే అత్యధిక భాగం షూటింగ్ పూర్తయింది. మిగిలిన టాకీ భాగం షెడ్యూల్ సోమవారం హైదరాబాద్‌లోని ఆర్.ఎఫ్.సి.లో మొదలైంది. ‘‘జూలై 31 వరకు ఈ షెడ్యూల్ జరుగుతుంది. దాంతో, పాటలు మినహా మిగతా సినిమా చిత్రీకరణంతా పూర్తయిపోతుంది. ఆగస్టులో పాటల చిత్రీకరణ జరుపుతాం’’ అని నిర్మాత రవికిశోర్ తెలిపారు. ఒకపక్క ఈ పాటల చిత్రీకరణ సాగుతుండగానే, మరోపక్క పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంతో జరపడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. సెప్టెంబర్ 17న వినాయక చవితి పర్వదినం కానుకగా ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తారు. ఈ చిత్రంలో రామ్ సరసన రాశీఖన్నా కథా నాయిక. అభిమన్యు సింగ్ ప్రతి నాయక పాత్రధారి. బ్రహ్మానందం, జయప్రకాశ్‌రెడ్డి, పోసాని కృష్ణమురళి తదితర ప్రముఖులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. ‘‘దర్శకుడు కొత్తవాడైనప్పటికీ, ఎక్కడా అలా అనిపించడం లేదు. చాలా చక్కగా ఈ హై ఓల్టేజ్ లవ్‌స్టోరీని తెర కెక్కిస్తున్నారు’’ అని రవికిశోర్ వ్యాఖ్యానించారు. రసూల్ ఎల్లోర్ (కెమేరా), దేవిశ్రీ ప్రసాద్ (సంగీతం), పీటర్ హెయిన్ (యాక్షన్), ఏ.ఎస్. ప్రకాశ్ (ఆర్ట) లాంటి అనుభవజ్ఞులైన టెక్నీషియన్స ఈ చిత్రానికి మరో అండ. ఆ మధ్య ‘రఘువరన్ బి.టెక్’ చిత్రానికి మాటలు రాసి, ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న రామ్ ‘హరికథ’ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్న కిశోర్ తిరుమల ఈ సినిమాకు మాటలు అందిస్తుండడం విశేషం. లవ్, కామెడీ, సెంటిమెంట్, యాక్షన్ -ఇలా అన్ని అంశాలతో రావ్‌ు ఎనర్జీ స్థాయికి తగినట్లుండే ఈ ‘శివం’తో రావ్‌ు ఈ ఏడాది మరో హిట్ సాధిస్తారా? లెటజ్ వెయిట్ అండ్ సీ. -
అటు ‘శివమ్’... ఇటు ‘హరికథ’
ఒకప్పుడు హీరోలు ఒకేసారి మూడు, నాలుగు సినిమాలు చేసేవాళ్లు. కానీ, ఇప్పుడు ఒక సినిమాకే పరిమితమవుతున్నారు. ఒకవేళ మంచి కథలు దొరికితే అప్పుడు ఒకేసారి రెండు సినిమాలు చేస్తున్నారు. ఇప్పుడు రామ్ ఒకవైపు ‘శివమ్’, మరోవైపు ‘హరికథ’ చిత్రాలు చేస్తున్నారు. ఈ రెండు చిత్రాలను శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిశోర్ నిర్మిస్తున్నారు. ‘శివమ్’కి దర్శకుడు శ్రీనివాసరెడ్డి. ‘హరికథ’కు ‘రఘువరన్ బీటెక్’ సంభాషణల రచయిత కిశోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ రెండు చిత్రాల షూటింగూ వైజాగ్‌లో జరుగుతోంది. ఈ రెండు చిత్రాల లొకేషన్స్ చుట్టూ తిరుగుతూ రామ్ ఫుల్ బిజీగా ఉన్నారు. ఈ నెలాఖరు వరకూ వైజాగ్ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ జరుగుతుంది. -
రామ్డు శివమెత్తాడు
యువ హీరో రామ్ ఇప్పుడు మంచి జోరు మీద ఉన్నారు. ఇవాళ పుట్టినరోజు జరుపుకొంటున్న ఈ కథానాయకుడు ఈ నెలాఖరులో ‘పండగ చేస్కో’తో ప్రేక్షకులను పలకరించనున్నారు. మరోపక్క ఇంకో రెండు సినిమాల షూటింగ్‌లతో బిజీ బిజీగా ఉన్నారు. ఆ రెండు సినిమాలూ ఆయన పెదనాన్న ‘స్రవంతి’ రవికిశోర్ నిర్మిస్తున్నవే! రెండూ కొత్త దర్శకుల సారథ్యంలో రూపొందుతున్నవే కావడం విశేషం. రచయిత కిశోర్ తిరుమల ఒక చిత్రంతో, శ్రీనివాసరెడ్డి (దర్శకుడు సురేందర్ రెడ్డి సహాయకుడు) మరో చిత్రంతో దర్శకులుగా పరిచయమవుతున్నారు. శ్రీనివాసరెడ్డి దర్శకత్వంలో పి. కృష్ణ చైతన్య సమర్పణలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై రూపొందిస్తున్న సినిమాకు తాజాగా ‘శివం’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. రామ్ పుట్టిన రోజు సందర్భంగా ‘శివం’లో హీరో ఫస్ట్ లుక్ స్టిల్‌ను విడుదల చేశారు. రాశీ ఖన్నా హీరో యిన్ అయిన ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. ‘‘ఇది పూర్తి స్థాయి యాక్షన్ ఎంటర్టైనర్. ఇందులో రామ్ పాత్ర చిత్రణ ఎక్స్ట్రార్డినరీగా ఉంటుంది. క్లాస్‌నీ, మాస్‌ని ఆకట్టుకునే అంశాలు ఇందులో పుష్కలంగా ఉంటాయి. ఏప్రిల్ 27 నుంచి హైదరాబాద్‌లో చిత్రీకరణ చేస్తున్నాం. వచ్చే నెల 10 వరకు ఇక్కడే షెడ్యూలు జరుపుతాం’’ అని నిర్మాత ‘స్రవంతి’ రవికిశోర్ తెలిపారు. బ్రహ్మానందం, అభిమన్యు సింగ్, జయప్రకాశ్ రెడ్డి, పోసాని కృష్ణమురళి తదితరులు ఈ ‘శివం’లో నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ (సంగీతం), రసూల్ (కెమేరా), పీటర్ హేన్ (ఫైట్స్) లాంటి అగ్రశ్రేణి సాంకేతిక నిపుణులు ఈ చిత్రానికి పనిచేస్తుండడం విశేషం. ఈ సమ్మర్‌కు ‘పండగ చేస్కో’ అంటున్న రామ్ ఈ ఏడాదే ‘శివమ్’తోనూ, మూడో సినిమాతోనూ జనం ముందుకు రావాలని కృషి చేస్తున్నారు. ఒక హీరోకు ఒకే ఏడాది మూడు రిలీజ్లంటే... ఈ రోజుల్లో గ్రేటే! కీపిటప్ రామ్!