
శివమ్
లవర్స్‌కి కోఠీ కూడా ఊటీ లాగానే అనిపి స్తుంది. పరిసరాలతో పని లేకుండా అక్కడ తామిద్దరమే ఉన్నామన్నట్లుగా రొమాన్స్‌లో మునిగి పోతారు. ఆ సమయంలో తామున్నది డేంజరస్ రోడ్‌లో అయినా ఆ ప్రమాదాన్ని పసిగట్టరు. రామ్, రాశీ ఖన్నా ఇటీవల అలాంటి డేంజరస్ లొకేషన్‌లో రొమాంటిక్ డ్యూయెట్ పాడుకున్నారు. ‘శివమ్’ సినిమా కోసం ‘అందమైన లోకం.. అందులోన నువ్వొక అద్భుతం...’ అంటూ ప్రపంచంలోనే ప్రమాదకరమైన రహదారి అయిన నార్వేలోని అట్లాంటిక్ ఓషన్ రోడ్డులో పాడుకున్నారు. ఈ పాటతో పాటు మరో రెండు పాట లను నార్వే, స్వీడన్‌లలో ఇంతవరకు ఏ ఇండియన్ సినిమా తీయని బ్యూటిఫుల్ లొకేషన్స్‌లో తీశారు. రసూల్ ఈ పాటలను కెమెరాలో అందంగా బంధించారు. కృష్ణచైతన్య సమర్పణలో శ్రీస్రవంతి మూవీస్ పతాకంపై శ్రీనివాసరెడ్డి దర్శకత్వంలో ‘స్రవంతి’ రవికిశోర్ నిర్మిస్తున్న ఈ చిత్రం రిలీజ్ అక్టోబర్ 2న.