Atlantic Ocean Road
-
శివమ్
లవర్స్‌కి కోఠీ కూడా ఊటీ లాగానే అనిపి స్తుంది. పరిసరాలతో పని లేకుండా అక్కడ తామిద్దరమే ఉన్నామన్నట్లుగా రొమాన్స్‌లో మునిగి పోతారు. ఆ సమయంలో తామున్నది డేంజరస్ రోడ్లో అయినా ఆ ప్రమాదాన్ని పసిగట్టరు. రామ్, రాశీ ఖన్నా ఇటీవల అలాంటి డేంజరస్ లొకేషన్లో రొమాంటిక్ డ్యూయెట్ పాడుకున్నారు. ‘శివమ్’ సినిమా కోసం ‘అందమైన లోకం.. అందులోన నువ్వొక అద్భుతం...’ అంటూ ప్రపంచంలోనే ప్రమాదకరమైన రహదారి అయిన నార్వేలోని అట్లాంటిక్ ఓషన్ రోడ్డులో పాడుకున్నారు. ఈ పాటతో పాటు మరో రెండు పాట లను నార్వే, స్వీడన్లలో ఇంతవరకు ఏ ఇండియన్ సినిమా తీయని బ్యూటిఫుల్ లొకేషన్స్‌లో తీశారు. రసూల్ ఈ పాటలను కెమెరాలో అందంగా బంధించారు. కృష్ణచైతన్య సమర్పణలో శ్రీస్రవంతి మూవీస్ పతాకంపై శ్రీనివాసరెడ్డి దర్శకత్వంలో ‘స్రవంతి’ రవికిశోర్ నిర్మిస్తున్న ఈ చిత్రం రిలీజ్ అక్టోబర్ 2న. -
ఈ రూటు.. మహా డేంజరు గురూ..!
-
భయానికి రహ‘దారి’..
ఈ వంతెన చూడండి.. ఆకాశంలోంచి ఊడిపడ్డట్లు కనిపించడం లేదూ.. ఈ బ్రిడ్జి నార్వేలోని అట్లాంటిక్ ఓషన్ రోడ్లో భాగం.. నార్వేను, ఎవిరాయ్ ద్వీపాన్ని కలిపే ఈ రోడ్డు పొడవు 8 కిలోమీటర్లు. ఇంతకీ ఇక్కడ విషయమేమిటంటే.. ఇది ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన రహదార్లలో ఒకటి. మామూలు టైమ్‌లో కొంచెం పరవాలేదు గానీ.. వాతావరణం కొంచెం తేడా కొట్టిందంటే మాత్రం.. నరకం కనిపిస్తుంది. పక్కనే అట్లాంటిక్ మహాసముద్రం.. మధ్యలో రోడ్డు.. ఇంకేముంది.. భారీ అలలు, గాలులతో ఒంట్లో వణుకు పుట్టిస్తుందట. దానికి తోడు మధ్యలో సముద్రంపై నిర్మించిన ఈ వంక ర టింకర వంతెన.. 850 అడుగుల పొడవుంటే ఈ వంతెనను స్థానికంగా ‘తాగుబోతు వంతెన’ అని పిలుస్తారు. దాని వంకరటింకర రూపం వల్ల ఈ వంతెనను అలా పిలుస్తారు. పైగా.. సముద్రపు అలల వల్ల రోడ్డంతా ఎప్పుడూ తడిసి ఉంటుంది. దీని వల్ల టైరు కాస్త జారిందంటే.. శాల్తీ గల్లంతే.. గతంలో పలువురు ఇలా మరణించారు కూడా.