భయానికి రహ‘దారి’.. | Atlantic Ocean Road Ranked One World most | Sakshi
Sakshi News home page

భయానికి రహ‘దారి’..

Published Thu, Nov 20 2014 2:58 AM | Last Updated on Sat, Sep 2 2017 4:45 PM

భయానికి రహ‘దారి’..

భయానికి రహ‘దారి’..

 ఈ వంతెన చూడండి.. ఆకాశంలోంచి ఊడిపడ్డట్లు కనిపించడం లేదూ.. ఈ బ్రిడ్జి నార్వేలోని అట్లాంటిక్ ఓషన్ రోడ్‌లో భాగం.. నార్వేను, ఎవిరాయ్ ద్వీపాన్ని కలిపే ఈ రోడ్డు పొడవు 8 కిలోమీటర్లు. ఇంతకీ ఇక్కడ విషయమేమిటంటే.. ఇది ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన రహదార్లలో ఒకటి. మామూలు టైమ్‌లో కొంచెం పరవాలేదు గానీ.. వాతావరణం కొంచెం తేడా కొట్టిందంటే మాత్రం.. నరకం కనిపిస్తుంది. పక్కనే అట్లాంటిక్ మహాసముద్రం.. మధ్యలో రోడ్డు.. ఇంకేముంది.. భారీ అలలు, గాలులతో ఒంట్లో వణుకు పుట్టిస్తుందట. దానికి తోడు మధ్యలో సముద్రంపై నిర్మించిన ఈ వంక ర టింకర వంతెన.. 850 అడుగుల పొడవుంటే ఈ వంతెనను స్థానికంగా ‘తాగుబోతు వంతెన’ అని పిలుస్తారు. దాని వంకరటింకర రూపం వల్ల ఈ వంతెనను అలా పిలుస్తారు. పైగా.. సముద్రపు అలల వల్ల రోడ్డంతా ఎప్పుడూ తడిసి ఉంటుంది. దీని వల్ల టైరు కాస్త జారిందంటే.. శాల్తీ గల్లంతే.. గతంలో పలువురు ఇలా మరణించారు కూడా.
 

Advertisement

పోల్

Advertisement