హై వోల్టేజ్ లవ్ | High voltage action Love Story | Sakshi
Sakshi News home page

హై వోల్టేజ్ లవ్

Published Tue, Sep 22 2015 11:33 PM | Last Updated on Sun, Sep 3 2017 9:47 AM

హై వోల్టేజ్ లవ్

హై వోల్టేజ్ లవ్

ఆ కుర్రాడు స్నేహానికి ప్రాణమిస్తారు. దేవదాసు, మజ్నూలు తనకిప్పుడు ఫ్రెండ్స్ అయితే వాళ్ల ప్రేమను సక్సెస్ చేస్తానంటాడు. మరి ఇలాంటి కుర్రాడికి రాశీఖన్నా లాంటి అందమైన అమ్మాయి ‘ఐ లవ్ యూ’ చెప్పేసింది. ఇంకేముంది... ఏదో మాయ చేసి ఆ ప్రేమను పెళ్లి దాకా తీసుకెళ్లాడు. మరి తన ప్రేమ కోసం ఈ యువకుడు చేసిన సందడి తెలియాలంటే  ‘శివమ్’ చూడాల్సిందే. రామ్, రాశీఖన్నా జంటగా శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై శ్రీనివాసరెడ్డి దర్శకత్వంలో ‘స్రవంతి’ రవికిశోర్ నిర్మించిన చిత్రం ‘శివమ్’. ఈ చిత్రం అక్టోబర్ 2న విడుదల కానుంది.

‘‘హై వోల్టేజ్ యాక్షన్ లవ్‌స్టోరీతో రూపొందిన ఈ చిత్రంలో అన్ని వర్గాలను ఆకట్టుకునే అంశాలున్నాయి. దర్శకుడు శ్రీనివాసరెడ్డికి ఇది తొలి చిత్రమైనా, బాగా తీశాడు. ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే హైలైట్. నార్వే, స్వీడన్‌లలోని అందమైన లొకేషన్స్‌లో చిత్రీకరించిన పాటలు కలర్‌ఫుల్ గా ఉంటాయి’’ అని నిర్మాత రవికిశోర్ అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ- ‘‘రామ్, రాశీఖన్నాల మధ్య మంచి కెమిస్ట్రీ వర్క్‌వుట్ అయింది, వాళ్ల జంట చూడచక్కగా ఉంటుంది’’ అని చెప్పారు. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం మరో హైలెట్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement