రామ్‌కి ఇంకా మంచి భవిష్యత్తు ఉంది | There is still a good future to ram | Sakshi
Sakshi News home page

రామ్‌కి ఇంకా మంచి భవిష్యత్తు ఉంది

Published Sun, Sep 13 2015 10:27 PM | Last Updated on Sun, Sep 3 2017 9:20 AM

రామ్‌కి ఇంకా మంచి భవిష్యత్తు ఉంది

రామ్‌కి ఇంకా మంచి భవిష్యత్తు ఉంది

- అల్లు అరవింద్
‘‘రవికిశోర్‌తో నాది 30 ఏళ్ల స్నేహం. ఆయనకు సినిమా అంటే చాలా ఇష్టం. 30 ఏళ్లుగా నిరాటంకంగా ఓ సంస్థ సినిమాలు నిర్మించడం చిన్న విషయం కాదు. ఇన్నేళ్లు నిలబడిన నిర్మాణ సంస్థలు చాలా చాలా అరుదు. ఇక, రామ్ గురించి చెప్పాలంటే... ఇప్పటికే స్టార్ అయిపోయాడు. ఇంకా మంచి భవిష్యత్తు ఉంది’’ అని నిర్మాత అల్లు అరవింద్ అన్నారు. రామ్, రాశీఖన్నా జంటగా కృష్ణ చైతన్య సమర్పణలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిశోర్ నిర్మించిన చిత్రం ‘శివమ్’. శ్రీనివాసరెడ్డి దర్శకుడు.

దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్రం పాటల వేడుక హైదరాబాద్‌లో జరిగింది. ఈ సినిమా పాటలను నిర్మాత అల్లు అరవింద్ విడుదల చేశారు. ‘‘ప్రస్తుతం ‘శివమ్’, ‘హరికథ’ సినిమాలు ఒకేసారి చేస్తున్నా. స్రవంతి నా సొంత సంస్థ. ఈ సంస్థ 30 ఏళ్లు పూర్తి చేసుకున్న సమయంలో మా ‘శివమ్’ రావడం ఆనందంగా ఉంది. మా పెదనాన్న నాకు బ్యాక్‌బోన్‌లా నిలిచారు. ఈ సినిమా విడుదలయ్యాక దర్శకుడు శ్రీనివాస్ రెడ్డి బిజీ అవుతాడు’’ అని రామ్ చెప్పారు. ‘దిల్’ రాజు మాట్లాడుతూ- ‘‘స్రవంతి బ్యానర్‌లో వచ్చిన సినిమాలంటే చాలా ఇష్టం. ఇవాళ నేను నిర్మాతగా మారడానికి కారణమైన నిర్మాతల్లో ‘స్రవంతి’ రవికిశోర్ ఒకరు. రామ్ ఈ సినిమాలో డ్యాన్స్, ఫైట్స్ అన్నీ ఇర గదీశాడు’’ అన్నారు.
 
‘లేడీస్ టైలర్’ చిత్ర బృందానికి సన్మానం
స్రవంతి మూవీస్ సంస్థ 30 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆ సంస్థ మొదటి చిత్రం ‘లేడీస్ టైలర్’ చిత్రదర్శకుడు వంశీ, మాటల రచయిత తనికెళ్ల భరణి, గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి, సినిమాటోగ్రాఫర్ హరి అనుమోలు, కథానాయిక సంధ్యలను ‘స్రవంతి’  రవికిశోర్ సత్కరించారు. తనికెళ్ల మాట్లాడుతూ- ‘‘30 ఏళ్ల క్రితం మా ‘స్రవంతి’ మొదలైంది. అప్పుడే మా సినీ ప్రయాణం కూడా మొదలైంది. స్రవంతి ఆఫీస్‌లో తినేవాళ్లం, రాసుకునేవాళ్లం, పోట్లాడుకునేవాళ్లం.

నేను ఆనందంగా ఉండటానికి కారణమైన సినిమా ‘లేడీస్ టైలర్’. ఈ టీమ్ లేకపోతే మేం సినీ పరిశ్రమలో ఇంత వైభవంగా ఉండేవాళ్లం కాదేమో. కాకపోతే వేరే రకంగా ఉండేవాళ్లం’’ అన్నారు. సిరివెన్నెల మాట్లాడుతూ - ‘‘ఇది నాకు పండగ రోజు. 30 ఏళ్లుగా  దిగ్విజయంగా ఓ నిర్మాణ సంస్థ కొనసాగడం అనేది గొప్ప విషయం. నేను, రవికిశోర్ ఒకేసారి చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టాం. ఈ  సంస్థలో 80  పాటలు రాశాను. నిర్మాతీహ రోయిజమ్‌ను నిలబెట్టిన సంస్థ స్రవంతి మూవీస్. పాటలు రాయడం మొదలుపెట్టాక స్రవంతి నా ఇల్లుగా మారింది’’ అన్నారు. ఈ వేడుకలో నటులు  బ్రహ్మానందం, భాస్కరభట్ల, ఎస్.వి.కృష్ణారెడ్డి, కె. విజయ్‌భాస్కర్, అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement