రాశీఖన్నాకు క్రేజీ ఆఫర్ | Rashi Khanna opposite Siddharth in Tamil movie | Sakshi
Sakshi News home page

రాశీఖన్నాకు క్రేజీ ఆఫర్

Published Fri, Sep 23 2016 1:43 PM | Last Updated on Mon, Sep 4 2017 2:40 PM

రాశీఖన్నాకు క్రేజీ ఆఫర్

రాశీఖన్నాకు క్రేజీ ఆఫర్

ప్రజెంట్ టాలీవుడ్లో యంగ్ హీరోయిన్స్ మధ్య టఫ్ కాంపిటీషన్ నడుస్తోంది. రకుల్ ప్రీత్ సింగ్, రాశీఖన్నా, లావణ్య త్రిపాఠి లాంటి వారు వరుస అవకాశాలతో స్టార్ ఇమేజ్ కోసం పోటి పడుతున్నారు. అయితే వీరిలో రకుల్ ప్రీత్ సింగ్ టాప్ హీరోల సరసన నటిస్తూ ఒక అడుగు ముందే ఉంది. ఇప్పుడు రాశీ కూడా ఈ లిస్ట్లో చేరేందుకు రెడీ అవుతోంది.

యంగ్ హీరో రామ్ సరసన రాశీఖన్నా హీరోయిన్గా నటిస్తున్న హైపర్ సినిమా రిలీజ్కు రెడీ అవుతున్న నేపథ్యంలో తాజాగా మరో ఇంట్రస్టింగ్ ఆఫర్ రాఖీ తలుపు తట్టింది. ఇప్పటి వరకు తెలుగులో మాత్రమే సినిమాలు చేస్తున్న ఈబ్యూటి కోలీవుడ్ ఆఫర్ వరించింది. అది కూడా సిద్దార్థ్ లాంటి సీనియర్ హీరో సరసన కావటం విశేషం.

సిద్దార్థ్ హీరోగా కార్తీక్ జి క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం సిద్దార్థ్ స్వయంగా రాశీఖన్నాను హీరోయిన్గా సెలెక్ట్ చేశాడు. త్వరలో సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ సినిమా తమిళ్తో పాటు తెలుగులోనూ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement