'తొలి పాన్ ఇండియా బాలల చిత్రం ‘లిల్లీ’. ఈ సినిమాకి తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లోనూ మంచి స్పందన వస్తోంది. మా చిత్రాన్ని ఇండియాలోని అన్ని పాఠశాలల విద్యార్థులకు చూపించాలనేది మా లక్ష్యం' అని డైరెక్టర్ శివమ్ అన్నారు. బేబీ నేహా, బేబీ ప్రణతి రెడ్డి, మాస్టర్ వేదాంత్ వర్మ తదితరులు నటించిన బాలల చిత్రం ‘లిల్లీ’. శివమ్ దర్శకత్వంలో కె. బాబురెడ్డి, సతీష్ కుమార్ .జి నిర్మించిన ఈ సినిమా శుక్రవారం (జూలై 7న) పాన్ ఇండియా స్థాయిలో విడుదలైంది.
ఈ సందర్భంగా శివమ్ మాట్లాడుతూ– 'కృష్ణా జిల్లాలోని పెదమద్దాలి నా స్వస్థలం. డైరెక్టర్ కావాలనుకుని 13ఏళ్ల కిందట హైదరాబాద్ వచ్చా. రైటర్‌గా, అసిస్టెంట్ డైరెక్టర్‌గా, యాడ్ ఫిల్మ్ మేకర్‌గా చేశాను. మణిరత్నంగారి ‘అంజలి’ స్ఫూర్తితో చిన్న పిల్లలతో ఓ సినిమా చేద్దామని ‘లిల్లీ’ కథ రాశాను. నేనే డైరెక్టర్‌గా, నిర్మాతగా ఈ సినిమాని స్టార్ట్ చేశాను. నా కాన్సెప్ట్, ఔట్‌పుట్ బాబురెడ్డిగారికి నచ్చడంతో ‘లిల్లీ’ని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో చేద్దామన్నారు. ఈ చిత్రంలో నటించిన పిల్లలందరూ కడపకు చెందిన కొత్తవారే. ఈ సినిమాని రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేసింది. నేను డైరెక్టర్ అయ్యేందుకు ప్రోత్సహించిన మా నాన్న నాంచారయ్య, అమ్మ వెంకటలక్ష్మి, నా భార్య సుధా శక్తి, ఫ్రెండ్స్‌కి, చాన్స్ ఇచ్చిన బాబురెడ్డిగారికి కృతజ్ఞతలు. గోపురం బ్యానర్‌లోనే నాలుగు సినిమాలు సైన్ చేశాను' అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment