pranathi reddy
-
'తొలి పాన్ ఇండియా బాలల చిత్రం ‘లిల్లీ’గా గుర్తుండిపోతుంది'
'తొలి పాన్ ఇండియా బాలల చిత్రం ‘లిల్లీ’. ఈ సినిమాకి తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లోనూ మంచి స్పందన వస్తోంది. మా చిత్రాన్ని ఇండియాలోని అన్ని పాఠశాలల విద్యార్థులకు చూపించాలనేది మా లక్ష్యం' అని డైరెక్టర్ శివమ్ అన్నారు. బేబీ నేహా, బేబీ ప్రణతి రెడ్డి, మాస్టర్ వేదాంత్ వర్మ తదితరులు నటించిన బాలల చిత్రం ‘లిల్లీ’. శివమ్ దర్శకత్వంలో కె. బాబురెడ్డి, సతీష్ కుమార్ .జి నిర్మించిన ఈ సినిమా శుక్రవారం (జూలై 7న) పాన్ ఇండియా స్థాయిలో విడుదలైంది. ఈ సందర్భంగా శివమ్ మాట్లాడుతూ– 'కృష్ణా జిల్లాలోని పెదమద్దాలి నా స్వస్థలం. డైరెక్టర్ కావాలనుకుని 13ఏళ్ల కిందట హైదరాబాద్ వచ్చా. రైటర్‌గా, అసిస్టెంట్ డైరెక్టర్‌గా, యాడ్ ఫిల్మ్ మేకర్‌గా చేశాను. మణిరత్నంగారి ‘అంజలి’ స్ఫూర్తితో చిన్న పిల్లలతో ఓ సినిమా చేద్దామని ‘లిల్లీ’ కథ రాశాను. నేనే డైరెక్టర్‌గా, నిర్మాతగా ఈ సినిమాని స్టార్ట్ చేశాను. నా కాన్సెప్ట్, ఔట్పుట్ బాబురెడ్డిగారికి నచ్చడంతో ‘లిల్లీ’ని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో చేద్దామన్నారు. ఈ చిత్రంలో నటించిన పిల్లలందరూ కడపకు చెందిన కొత్తవారే. ఈ సినిమాని రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేసింది. నేను డైరెక్టర్ అయ్యేందుకు ప్రోత్సహించిన మా నాన్న నాంచారయ్య, అమ్మ వెంకటలక్ష్మి, నా భార్య సుధా శక్తి, ఫ్రెండ్స్‌కి, చాన్స్ ఇచ్చిన బాబురెడ్డిగారికి కృతజ్ఞతలు. గోపురం బ్యానర్లోనే నాలుగు సినిమాలు సైన్ చేశాను' అన్నారు. -
తిరిగి వస్తున్నాను
కొంతకాలంగా మంచు మనోజ్ సినిమాలకు దూరంగా ఉంటున్నారు. కొత్త సినిమాలేమీ చేయడం లేదు. సినిమాలకు వచ్చిన విరామానికి కారణమేంటో క్లారిటీగా తెలియదు. అయితే సినిమాల్లో వచ్చిన ఈ గ్యాప్‌కి వ్యక్తిగత విషయాలే కారణాలని మనోజ్ తెలిపారు. అంతేకాకుండా తన భార్య ప్రణతి నుంచి విడిపోయినట్టు ప్రకటించారు. ఈ విషయాన్నంతా ఓ లేఖ ద్వారా పంచుకున్నారు మనోజ్. ఆ లేఖ సారాంశం ఈ విధంగా... ‘‘నా వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితంలో ప్రస్తుతం జరుగుతున్న విషయాలను మీతో (ప్రేక్షకులు/అభిమానులు) పంచుకోవాలనుకుంటున్నాను. మా వివాహ బంధాన్ని విడాకులతో ముగించాం అని బరువైన హృదయంతో తెలియజేస్తున్నాను. అభిప్రాయబేధాలతో మేమిద్దరం కొన్ని రోజులు బాధపడ్డాం. ఆ తర్వాత బాగా ఆలోచించి విడివిడిగానే మా జీవితాలను కొనసాగించాలని విడిపోవాలనే నిర్ణయానికి వచ్చాం. విడిపోయినప్పటికీ మా ఇద్దరికీ ఒకరంటే ఒకరికి గౌరవం, మర్యాదలు ఉన్నాయి. మా నిర్ణయాన్ని అందరూ అర్థం చేసుకొని మా ప్రైవసీని గౌరవించాలని కోరుకుంటున్నాను. ఇక సినిమాల విషయానికి వస్తే.. ఈ సమయంలో నా మనసు మనసులా లేకపోవడంతో నేను ఏ పనీ సరిగ్గా చేయలేకపోయాను. ఈ మానసిక అలజడిని దాటగలుగుతున్నానంటే మా కుటుంబం, స్నేహితులు, ముఖ్యంగా నా అభిమానులు నాతో నిలబడటమే కారణం. ఇలాంటి సమయాల్లో నన్ను సపోర్ట్ చేసిన అందరికీ రుణపడి ఉంటాను. నేను ఎంతో ప్రేమించే పని, నాకు తెలిసిన ఒక్కటే పని.. సినిమాల్లో నటించడం. అది చేయడానికి తిరిగొస్తున్నాను. నా ఫ్యాన్స్‌ను అలరించడానికి కçష్టపడతాను. సినిమాలే నా ప్రపంచం. నా చివరి క్షణాల వరకు సినిమాలోనే రాక్ చేయాలనుకుంటున్నాను’’ అన్నారు. -
విడాకులపై స్పందించిన మంచు మనోజ్
ప్రముఖ హీరో మంచు మనోజ్ విడాకులు తీసుకున్నారు. తన భార్య ప్రణతిరెడ్డితో విడాకులు తీసుకున్నట్టు ఆయన అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. భార్యభర్తలుగా తమ ప్రయాణానికి ముగింపు పలికామని తెలిపిన మనోజ్..విడిపోయినప్పటికీ ఒక్కరంటే మరొకరికి గౌరవం అలాగే ఉంటుందన్నారు. అలాగే ఈ సమయంలో తన కుటుంబం ఎంతో అండగా నిలిచిందని పేర్కొన్నారు. తనకు సపోర్ట్‌గా నిలిచిన ప్రతి ఒక్కరికీ రుణపడి ఉంటానని తెలిపారు. చివరి శ్వాస వరకు సినిమాల్లో కొనసాగుతానని వెల్లడించారు. ‘నా వ్యక్తిగత జీవితం, కేరీర్‌కు సంబంధించి కొన్ని అంశాలను మీతో పంచుకుంటున్నాను. నేను నా భార్యతో విడాకులు తీసుకున్నాను. భార్యభర్తలుగా మా ఇద్దరి ప్రయాణానికి అధికారికంగా ముగింపు పలికాం. ఇది చెప్పడానికి నేను చాలా బాధపడుతున్నాను. మేమిద్దరం కలిసి ఉన్నంతకాలం మా ప్రయాణం చాలా ఆనందంగా కొనసాగింది. మా మధ్య కొన్ని విభేదాలు తలెత్తడంతో.. చాలా ఆలోచించి కష్టమైనప్పటికీ ఎవరి దారి వాళ్లు చూసుకోని ముందుకు సాగాలని నిర్ణయించుకున్నాం. మేమిద్దరం విడిపోయినప్పటికీ..మాకు ఒకరిపై మరొకరికి గౌరవం అలాగే ఉంటుంది. మీరందరు కూడా ఈ నిర్ణయాన్ని మద్దతుగా నిలిచి మా ప్రైవసీని గౌరవిస్తారని భావిస్తున్నాను. కొంతకాలంగా నా మనసు బాగోకపోవడంతో.. పని మీద శ్రద్ధ పెట్టలేకపోయాను. అలాగే సినిమాల్లో నటించలేకపోయాను. ఈ సమయంలో నా కుటుంబం చాలా అండంగా నిలిచింది. వారు నా వెంట లేకపోతే ఈ కష్ట సమయాన్ని అధిగమించలేకపోయేవాడిని. నేను కష్ట సమయంలో ఉన్నప్పుడు బాసటగా నిలిచిన ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటాను. నాకు తెలిసిన ఏకైక పని సినిమాల్లో నటించడం.. అందుకోసం నేను తిరిగొచ్చాను. నేను ఈ స్థాయిలో ఉన్నానంటే నా అభిమానుల వల్లే. నా చివరి శ్వాస వరకు సినిమాల్లోనే కొనసాగుతాను. అందరికీ భగవంతుని ఆశీస్సులు ఉండాలి’ అని మనోజ్ తెలిపారు. గతంలో మనోజ్ దంపతులు విడాకులు తీసుకున్నారని వార్తలు వచ్చిప్పటికీ ఆయన వాటిని కొట్టిపారేశారు. కాగా, 2015లో మనోజ్, ప్రణతిరెడ్డిల వివాహం జరిగింది. -
విడాకులపై మంచు మనోజ్ స్పందన
‘టాలీవుడ్ దర్శకుడు క్రిష్ అలియాస్ జాగర్లముడి రాధాకృష్ణ తన వివాహ బంధానికి గుడ్‌బై చెప్పాడు.. ఆయనతో పాటు మరికొందరు సినీ ప్రముఖులు కూడా విడాకులు తీసుకోబోతున్నారు.. వారిలో మంచు వారి అబ్బాయి కూడా ఉన్నారు.. మంచు మనోజ్ కూడా విడాకులుకు అప్లై చేశారు’... ఇది గత వారం రోజులుగా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం. భార్య ప్రణతితో విభేదాలు వచ్చాయని, ఆమెతో విడాకులు తీసుకునేందుకు మనోజ్ సిద్ధంగా ఉన్నాడని పుకార్లు షికారు చేస్తున్నాయి. అయితే ఈ ప్రచారంపై మంచు మనోజ్ నోరువిప్పాడు. విడాకులు తీసుకున్నట్టు వస్తున్న వార్తలు నిజాలు కావని స్పష్టం చేశాడు. ఇదే విషయంపై ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు మనోజ్ స్పందిస్తూ.. ‘వాళ్ల బొంద. రూమర్స్ పుట్టించేవాళ్లకు ఏం తెలుసు మా గురించి’ అని ఖండించారు. అంతే కాకుండా ‘ 2010 నుండి ప్రణతి నా జీవితంలో అడుగు పెట్టింది.. నా గుండె ఆగిపోయేంతవరకు తనే నా దేవత అంటూ’ బదులిచ్చాడు. మరి ఇప్పటికైనా మనోజ్, ప్రణతిల విడాకుల రూమర్స్‌కి ఫుల్ స్టాప్ పడుతుందేమో చూడాలి. -
అంగరంగ వైభవంగా మంచు మనోజ్-ప్రణతి వివాహం
-
వైభవంగా మనోజ్-ప్రణతి వివాహం
-
ప్రభాస్‌పై మోహన్ బాబు అలిగారా?
-
మనోజ్ పెళ్లికి గవర్నర్ నరసింహన్ దంపతులు
-
ప్రభాస్‌పై మోహన్ బాబు అలిగారా?
హైదరాబాద్ : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌పై మంచు మోహన్ బాబు అలిగారట. పెళ్లికి ఆలస్యంగా రావటంతో పాటు కుటుంబ సభ్యులను తీసుకు రాలేదని ఆయన కొద్దిసేపు ప్రభాస్‌పై అలక వహించినట్లు తెలుస్తోంది. దాంతో ప్రభాస్, మోహన్‌బాబును గట్టిగా హత్తుకుని, గెడ్డం పట్టుకుని బతిమాలి.. నూతన వధూవరుల దగ్గరకు అలాగే వెళ్లారు. అనంతరం పెళ్లికొడుకు, పెళ్లికూతుర్ని అక్షింతలు వేసి ఆశీర్వదించాలని మోహన్ బాబు కోరగా వద్దులే ఎందుకు కలిసి ఫొటోలు దిగుదామంటూ... ఫొటోలు తీయించుకున్నారు. అయినా కూడా మోహన్ బాబు ఊరుకోకుండా కొత్త దంపతులతో ప్రభాస్ కాళ్లకు దండం పెట్టించి, అక్షింతలు వేయించారు. ఇక ఛత్రపతి సినిమాలో కాట్రాజుగా చేసిన సుప్రీత్ కూడా ప్రభాస్‌తో కలిసి సందడి చేశారు. అలాగే లక్ష్మీ ప్రసన్న కూతురు విద్యానిర్వాణతో ప్రభాస్ ముచ్చట్లు పెట్టాడు. ఈ సందర్భంగా ప్రభాస్‌తో పలువురు ఫొటోలు దిగారు. ఇక తమిళ హీరో సూర్య, హీరో రాజశేఖర్, జమున, తదితరులు విచ్చేశారు. మరోవైపు తెలంగాణ రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల, మాజీ మంత్రి డీకే అరుణ విచ్చేసి మనోజ్, ప్రణతి దంపతులను ఆశీర్వదించారు. -
హాస్యనటులు అంతా ఒక్కచోట చేరి...
-
సంపూ, వేణుమాధవ్ మాటామంతీ...
హైదరాబాద్ : మంచు మనోజ్ పెళ్లిలో హాస్యనటులు అంతా ఒక్కచోట చేరి.. కావల్సినంత సందడి చేశారు. మాదాపూర్ హైటెక్స్‌లో మనోజ్-ప్రణతి వివాహం బుధవారం నాడు వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. ఈ వేడుకకు హాస్యనటులు వేణుమాధవ్, సంపూర్ణేశ్ బాబు, రఘుబాబు తదితరులు హాజరై కొత్త దంపతులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా వేణుమాధవ్, సంపూలు ముచ్చట్లు పెట్టారు. చాలాసేపు వాళ్లిద్దరూ నవ్వుకుంటూ మాట్లాడుకోవడం కనిపించింది. దొంగాట సినిమాలో ఒక పాత్రలో సంపూర్ణేష్ బాబు నటించడంతో పాటు.. తాజాగా సంపు హీరోగా చేసిన 'సింగం 123' సినిమాకు కూడా మంచు విష్ణు నిర్మాత అన్న విషయం తెలిసిందే. అందుకే ఈ విషయాలన్నింటినీ వేణు ప్రస్తావించి సంపుతో చాలాసేపు మాట్లాడుతూ కనిపించారు. మరోవైపు వేణు మాధవ్‌తో ఫొటోలు దిగేందుకు పెళ్లికి వచ్చిన పలువురు చిన్నారులు ఉత్సాహం చూపారు. -
మనోజ్ పెళ్లికి మహేష్, నమ్రత..
-
మనోజ్ పెళ్లికి మహేష్, నమ్రత..
హైదరాబాద్ : ప్రిన్స్ మహేష్ బాబు సతీసమేతంగా మంచు మనోజ్ వివాహానికి హాజరయ్యాడు. నూతన వధూవరులు మనోజ్-ప్రణతిలను మహేష్ బాబు, ఆయన భార్య నమ్రతా శిరోద్కర్ ఆశీర్వదించారు. మరోవైపు రాష్ట్ర గవర్నర్ నరసింహన్, ఆయన సతీమణి విమలారామన్ విచ్చేసి మనోజ్, ప్రణతిలను దీవించారు. ఈ సందర్భంగా మోహన్ బాబు... మహేష్ బాబును గవర్నర్ నరసింహన్‌తో పాటు కాంగ్రెస్ సీనియర్ నేత సుశీల్ కుమార్ షిండేకు పరిచయం చేశారు. అలాగే ఘట్టమనేని ఆదిశేషగిరిరావు, ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ, దైవజ్ఞశర్మ, దర్శక, నిర్మాత రవిరాజా పినిశెట్టి, ఆది,సినీ రచయిత బీవీఎస్ రవి, టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి, మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు, హాస్యనటుడు అలీ, కాంగ్రెస్ నేత దానం నాగేందర్, మాజీ స్పీకర్ కేఆర్ సురేష్ రెడ్డి తదితరులు ఈ పెళ్లికి హాజరయ్యారు. -
మనోజ్ పెళ్లికి ఎవరెవరు వచ్చారంటే..
హైదరాబాద్ : మంచు మనోజ్ వివాహ వేడుకకు తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు విచ్చేశారు. మాదాపూర్ హైటెక్స్‌లో మనోజ్-ప్రణతిల వివాహం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా నూతన వధూవరులైన మనోజ్-ప్రణతిలను ప్రముఖులు ఆశీర్వదించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, వైఎస్ విజయమ్మ, భూమన కరుణాకర్ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నేత సుబ్బరామిరెడ్డి, సుశీల్ కుమార్ షిండే, ఈనాడు చైర్మన్ రామోజీరావు, దర్శకుడు, కేంద్ర మాజీ మంత్రి దాసరి నారాయణరావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, పొన్నాల లక్ష్మయ్య తదితరులు విచ్చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి జగదీశ్ రెడ్డి విచ్చిస్తే నూతన దంపతులను ఆశీర్వదించారు. ఇక ప్రముఖ హీరో బాలకృష్ణ, బ్రహ్మానందం, రాజా రవీంద్ర, రాఘవేంద్రరావు, తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్, సంగీత దర్శకుడు ఇళయరాజా, జయసుధ, కోటా శ్రీనివాసరావు, గొల్లపూడి మారుతీరావు, గిరిబాబు, కాట్రగడ్డ మురారీ, మురళీమోహన్, తమ్మారెడ్డి భరద్వాజ, శ్యాం ప్రసాద్ రెడ్డి, గుణ్ణం గంగరాజు, ఎస్వీ కృష్ణారెడ్డి, సునీల్, కొండేటి సురేష్, సుమలత, తనికెళ్ల భరణి, శివ బాలాజీ, మధుమిత, అశోక్ బాబు, హాస్యనటుడు వేణుమాధవ్, పరుచూరి వెంకటేశ్వరరావు, బెనర్జీ, అలనాటి హీరోయిన్ గీతాంజలి తదితరులు హాజరయ్యారు. -
వైభవంగా మనోజ్-ప్రణతి వివాహం
-
మనోజ్ దంపతులకు వైఎస్ జగన్ ఆశీస్సులు
-
మనోజ్ పెళ్లికి హాజరైన వైఎస్ జగన్
-
పల్లకిలో పెళ్లి కూతురు..
-
వైభవంగా మనోజ్-ప్రణతి వివాహం
హైదరాబాద్ : మంచువారి అబ్బాయి ఓ ఇంటివాడయ్యాడు. ప్రముఖ సినీనటుడు మోహన్ బాబు చిన్న కుమారుడు మనోజ్ వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. మాదాపూర్ హైటెక్స్‌లో బుధవారం ఉదయం 9 గంటల 10 నిమిషాలకు మనోజ్-ప్రణతిల వివాహం సంప్రదాయబద్ధంగా జరిగింది. సరిగ్గా సుముహూర్తం సమయానికి ప్రణతి మెడలో మంచు మనోజ్ తాళి కట్టాడు. సోదరి లక్ష్మీప్రసన్న దగ్గరుండి ఈ తంతును పూర్తిచేయించారు. ఈ వివాహానికి దక్షిణాది చిత్ర పరిశ్రమతో పాటు రాజకీయ ప్రముఖులు, వాణిజ్యవేత్తలు హాజరై నూతన వధువరూలను ఆశీర్వదించారు. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ చిత్ర పరిశ్రమకు చెందిన నటీనటులు హాజరయ్యారు. మరోవైపు మంచువారి పెళ్లికి భారీ భద్రత ఏర్పాటు చేశారు. అంతకు ముందు మనోజ్‌తో పురోహితులు పూజ చేయించారు. -
మనోజ్ దంపతులకు వైఎస్ జగన్ ఆశీస్సులు
హైదరాబాద్ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం మంచు మనోజ్-ప్రణతి వివాహానికి హాజరయ్యారు. బుధవారం మాదాపూర్ హైటెక్స్ లో ఈ వివాహం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ వివాహానికి తన తల్లి వైఎస్ విజయమ్మ, పార్టీ సీనియర్ నేత భూమన కరుణాకర్ రెడ్డి తదితరులతో కలిసి స్వయంగా హాజరైన వైఎస్ జగన్, సుముహూర్తం అనంతరం కొత్త దంపతులను ఆశీర్వదించారు. వైఎస్ విజయమ్మ తదితరులు కూడా కొత్త దంపతులు మనోజ్- ప్రణతిలకు తమ ఆశీస్సులు అందజేశారు. ఈ సందర్భంగా మోహన్ బాబు, విష్ణు దగ్గరుండి అతిథులను ఆహ్వానించారు. -
భలే ’మంచు’ రోజూ
-
పల్లకిలో పెళ్లికూతురు...
హైదరాబాద్ : మాదాపూర్ హైటెక్ సిటీలో మంచువారి పెళ్లి ధూంధాంగా జరుగుతోంది. నూతన వధువు ప్రణతిని పల్లకిలో పెళ్లి వేదికకు తీసుకు వచ్చారు. మరోవైపు మంచు మనోజ్ వివాహానికి తెలుగు చిత్ర పరిశ్రమ ప్రముఖులు తరలి వస్తున్నారు. అతిథులను మంచు విష్ణు దగ్గరుండి రిసీవ్ చేసుకుంటున్నాడు. ప్రముఖ నటుడు బాలకృష్ణ, రాఘవేంద్రరావు, గొల్లపూడి మారుతీరావు, దాసరి నారాయణరావు తదితరులు విచ్చేశారు. -
హైటెక్స్‌లో మంచువారి పెళ్లిసందడి..
హైదరాబాద్ : మంచువారి పెళ్లికి సినీ తారలు తరలి వస్తున్నారు. మంచు మనోజ్-ప్రణతి వివాహం బుధవారం ఉదయం మాదాపూర్ హైటెక్‌లో వైభవంగా జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ వివాహానికి సినీ, రాజకీయ, వాణిజ్య ప్రముఖులు తరలి వస్తున్నారు. ఈ నేపథ్యంలో కనీవినీ ఎరుగని రీతిలో హైటెక్స్ పరిసరాల్లో భారీగా భద్రతా ఏర్పాట్లు చేశారు. -
సంగీత్‌కు 'తారలు' దిగి వచ్చారు
మంచువారి ఇంట్లో జరిగిన మనోజ్ సంగీత్ కార్యక్రమానికి 'తారలు' దిగి వచ్చారు. సంగీత్ కార్యక్రమంలో నాటి తరం నటీనటుల నుంచి నేటి తరం యంగ్ హీరోహీరోయిన్లు స్టెప్స్ వేశారు. కొడుకు పెళ్లి సందడిలో మునిగి తేలుతున్న మోహన్ బాబు కూడా ఉత్సాహంగా నృత్యం చేశారు. ఇక మంచు లక్ష్మి, ఆండ్రీ అయితే ఓ రేంజ్లో డాన్స్ చేసి దుమ్ము రేపారు. వారిద్దరి కలిసి ఓ పాటకు చేసిన డాన్స్ హైలెట్‌గా నిలిచింది. . ఈ నెల 20వ తేదీ బుధవారం ఉదయం 9.10 గంటలకు మనోజ్-ప్రణతి వివాహం జరుగబోతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి ఏర్పాటు చేసిన సంగీత్ కార్యక్రమంలో వధువరుల కుటుంబాలతో పాటు పలువురు సినీ తారలు హాజరై సందడి చేశారు. హైదరాబాద్‌లోని పార్క్ హయత్ హోటల్ ఈ వేడుకకు వేదికైంది. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ సినిమా రంగాలకు చెందిన సినీస్టార్స్ ...మనోజ్ సంగీత్ ఫంక్షన్లో పాల్గొన్నారు. ఈ వేడుకలో కాబోయే వధూవరులు, మోహన్ బాబు తనతో నటించిన హీరోయిన్లు జయసుధ, సుమలత, రవీనా టండన్‌తో కలిసి డాన్స్ చేస్తే... ఇక మంచు విష్ణు, వెరొనికా ఓ తెలుగు పాటకు నృత్యం చేశారు. తమిళ చిత్ర పరిశ్రమ నుంచి హీరో ఆర్య, త్రిష, హన్సికతో పాటు పలువురు హాజరు కాగా, ఇక టాలీవుడ్ యంగ్ యాక్టర్స్ అల్లరి నరేష్, నాని, శ్రీకాంత్, హీరో బాలకృష్ణతో పాటు రాజకీయ నేతలు సుశీల్ కుమార్ షిండే, దానం నాగేందర్, కేవీపీ రామచంద్రరావుతో పాటు పలువురు హాజరయ్యారు. మే 16న మంచు మనోజ్‌ను పెళ్లికొడుకు చేసిన కార్యక్రమం కూడా కుటుంబ సభ్యులు గ్రాండ్‌గా నిర్వహించిన విషయం తెలిసిందే. -
మంచువారి 'పెళ్లికొడుకు'
మంచువారి ఫ్యామిలీ పెళ్లి సందడిలో మునిగితేలుతోంది. ప్రముఖ నటుడు మోహన్ బాబు చిన్న కుమారుడు మనోజ్ ఈ నెల 20న స్నేహితురాలు ప్రణీత మెడలో మూడుముళ్లు వేయబోతున్నాడు. పెళ్లి దగ్గర పడుతుండటంతో ఆ కుటుంబంలో పెళ్లి పనుల్లో తలమునకలై ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే వారింట పెళ్లి సందడి ధూమ్ ధామ్‌గా మొదలైంది. మార్చి 4న మనోజ్-ప్రణితల నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కుటుంబ సభ్యులు గురువారం సొట్ట బుగ్గల చిన్నోడు... మనోజ్‌ను పెళ్లి కొడుకును చేశారు. మనోజ్‌తో కలిసి మోహన్ బాబు ఆయన సతీమణి నిర్మల, విష్ణు, వెరోనిక, లక్ష్మిప్రసన్న, ఆండీ శ్రీనివాస్, విష్ణు ఇద్దరు కూతుళ్లు దిగిన ఫ్యామిలీ ఫోటో స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచింది. ఇక శంషాబాద్‌లోని మోహన్ బాబు నివాసంలో జరిగిన ఈ కార్యక్రమానికి కుటుంబ సన్నిహితులతో పాటు పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. చిరంజీవి,బాలకృష్ణ,రవితేజ, జూనియర్ ఎన్టీఆర్ సతీమణి ప్రణతి,ఊహాతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, వైఎస్. భారతి, శిల్పారెడ్డి తదితరులు విచ్చేసి కాబోయే పెళ్లికొడుకు ఆశీర్వదించారు. కాగా ఈ నెల 17న నగరంలోని ఓ స్టార్ హోటల్లో సంగీత్ నిర్వహించనున్నారు. ఇందుకోసం మంచు ఫ్యామిలీ..ఓ నృత్య దర్శకుడి ఆధ్వర్యంలో రిహార్సిల్ కూడా చేసినట్లు సమాచారం.ఈ సంగీత్ కార్యక్రమానికి మంచు లక్ష్మి యాంకరింగ్ చేయనుంది. -
హీరో మనోజ్-ప్రణతిల నిశ్చితార్థం
-
వైభవంగా మనోజ్-ప్రణతిరెడ్డి నిశ్చితార్థం
-
మనోజ్-ప్రణతిలను ఆశీర్వదించిన జగన్
-
వైభవంగా మనోజ్-ప్రణతిరెడ్డి నిశ్చితార్థం
హైదరాబాద్ : యువ హీరో మంచు మనోజ్- ప్రణతిరెడ్డిల నిశ్చితార్థ వేడుక వైభవంగా జరిగింది. బుధవారం ఉదయం పార్క్ హయత్ హోటల్లో జరిగిన ఈ నిశ్చితార్థ వేడుకకు సినీ, రాజకీయ ప్రముఖులు విచ్చేశారు. కాబోయే వధువరూలు మనోజ్-ప్రణతిలను ఆశీర్వదించారు. అంతకు ముందు పురోహితులు ప్రణతిరెడ్డితో గౌరీపూజ, మనోజ్‌తో పూజ చేయించారు. అనంతరం మనోజ్-ప్రణతి తల్లిదండ్రులు లగ్నపత్రిక మార్చుకున్నారు. ఆ తర్వాత మనోజ్-ప్రణతి పరస్పరం ఉంగరాలు మార్చుకున్నారు. ఈ వేడుకకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, వైఎస్ విజయమ్మ, భూమన కరుణాకర్ రెడ్డి, సుశీల్ కుమార్ షిండే, నిమ్మగడ్డ ప్రసాద్, తలసాని శ్రీనివాస్ యాదవ్, తమ్మారెడ్డి భరద్వాజ, అలీ, జస్టిస్ చలమేశ్వర్, దాసరి నారాయణరావు, పరుచూరి గోపాలకృష్ణ, బ్రహ్మాజీ, తాప్సీ, జయప్రద, శ్యాంప్రసాద్ రెడ్డి, తదితరులు హాజరయ్యారు. -
నేడు మనోజ్, ప్రణతి నిశ్చితార్థం
హైదరాబాద్ : ప్రముఖ సినీ నటుడు, నిర్మాత డాక్టర్ ఎం. మోహన్‌బాబు చిన్న కుమారుడు, హీరో మంచు మనోజ్ నిశ్చితార్థం నేడు ప్రణతిరెడ్డితో జరగనుంది. బంజారాహిల్స్ రోడ్ నెం. 2లోని పార్క్ హయత్ హోటల్లో ఉదయం 10.30 గంటలకు ఈ వేడుక నిర్వహించనున్నారు. ఇందుకోసం మోహన్‌బాబు కుటుంబం అన్ని ఏర్పాట్లు చేసింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు కేసీఆర్, చంద్రబాబు నాయుడుతో పాటు తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్, బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కూడా హాజరు కానున్నట్టు సమాచారం. కాగా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు రానుండటంతో మంగళవారం హోటల్ వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నారు. తమ కుటుంబంలోకి రాబోయే 'ప్రణతిరెడ్డి' తనకు మూడో కూతురు అని హీరో మోహన్ బాబు ట్విట్ చేసిన విషయం తెలిసిందే. మంచు లక్ష్మి, విరానికాలాగా తనకు ఆమె మరో కుమార్తెగా ఆయన అన్నారు. తన స్నేహితురాలు ప్రణతిరెడ్డితో మనోజ్‌కు పెళ్లి కుదిరిన సంగతి తెలిసిందే. ఈ నిశ్చితార్థ వేడుకను తెలుగు సంప్రదాయ పద్ధతుల్లోనే చేయాలని రెండు కుటుంబాలు నిర్ణయించిన విషయం తెలిసిందే. మొదట మనోజ్ ఇంట్లో పూజ నిర్వహిస్తారు. తరువాత హోటల్లో ఉంగరాలు మార్చుకున్నట్లు తెలుస్తోంది. ప్రణతి రెడ్డి బిట్స్ పిలానిలో మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసింది. అంతేకాకుండా మంచు విష్ణు భార్య విరానికాకు క్లాస్మేట్ అనే విషయం తెలిసిందే.