మంచు మనోజ్, ప్రణతి
‘టాలీవుడ్ దర్శకుడు క్రిష్ అలియాస్ జాగర్లముడి రాధాకృష్ణ తన వివాహ బంధానికి గుడ్‌బై చెప్పాడు.. ఆయనతో పాటు మరికొందరు సినీ ప్రముఖులు కూడా విడాకులు తీసుకోబోతున్నారు.. వారిలో మంచు వారి అబ్బాయి కూడా ఉన్నారు.. మంచు మనోజ్ కూడా విడాకులుకు అప్లై చేశారు’... ఇది గత వారం రోజులుగా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం. భార్య ప్రణతితో విభేదాలు వచ్చాయని, ఆమెతో విడాకులు తీసుకునేందుకు మనోజ్ సిద్ధంగా ఉన్నాడని పుకార్లు షికారు చేస్తున్నాయి. అయితే ఈ ప్రచారంపై మంచు మనోజ్ నోరువిప్పాడు.
విడాకులు తీసుకున్నట్టు వస్తున్న వార్తలు నిజాలు కావని స్పష్టం చేశాడు. ఇదే విషయంపై ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు మనోజ్ స్పందిస్తూ.. ‘వాళ్ల బొంద. రూమర్స్ పుట్టించేవాళ్లకు ఏం తెలుసు మా గురించి’ అని ఖండించారు. అంతే కాకుండా ‘ 2010 నుండి ప్రణతి నా జీవితంలో అడుగు పెట్టింది.. నా గుండె ఆగిపోయేంతవరకు తనే నా దేవత అంటూ’ బదులిచ్చాడు. మరి ఇప్పటికైనా మనోజ్, ప్రణతిల విడాకుల రూమర్స్‌కి ఫుల్ స్టాప్ పడుతుందేమో చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment