
సినిమాలకు దూరమైనా సరే, నటులపై ఆసక్తి మాత్రం దూరం కాదు. ‘ఫలానా నటుడు ఇప్పుడు ఏం చేస్తున్నాడో తెలుసా? ‘ఫలానా కథానాయిక ఇప్పుడు ఏ దేశంలో ఉంటుందో తెలుసా?’... ఇలాంటి విషయాలు అభిమానులకు ఎప్పుడూ ఆసక్తికరమే. ‘గజిని’ ‘అమ్మా నాన్న ఒక తమిళ అమ్మాయి’ ‘ఘర్షణ’... మొదలైన సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఆశిన్ పెళ్లి తరువాత నటనకు దూరమైంది.
కొన్ని నెలల క్రితం... ఆసిన్ భర్త నుంచి విడాకులు తీసుకుందని, మళ్లీ సినిమాలలో నటించనుందని రూమర్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ‘అలాంటిది ఏమీ లేదండీ బాబూ. నేను మళ్లీ సినిమాల్లో నటించడం లేదు’ అని ఆసిన్ స్వయంగా ప్రకటించింది. తాజాగా... ప్యారిస్‌లో జరిగిన కుమార్తె ఆరిన్ పుట్టినరోజు వేడుకలకు సంబంధించిన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది ఆసిన్. వీటిలో ఆమె భర్త రాహుల్ శర్మ కూడా ఉన్నాడు. ఇక రూమర్స్‌కు ఫుల్‌స్టాప్ పడినట్లే కదా!
Comments
Please login to add a commentAdd a comment