full stop
-
గోల్డ్ బాండ్లకు చెక్..!
ఫిజికల్‌గా పసిడి కొనుగోలుకు చెక్ పెడుతూ కేంద్ర ప్రభుత్వం సావరిన్ గోల్డ్ బాండ్ల పథకానికి తెరతీసింది. యూనిట్ల(ఒక గ్రాము)లో జారీ చేయడం ద్వారా నెమ్మదిగా రిటైల్ ఇన్వెస్టర్లను ఆకట్టుకుంది. తద్వారా దిగుమతుల భారాన్ని తగ్గించుకునే ప్రణాళికలు వేసింది. అయితే బంగారం ధర ప్రతీ ఏడాది రేసు గుర్రంలా పరుగు తీయడంతో బాండ్ల గడువు ముగిసేసరికి రుణ భారం భారీగా పెరిగిపోతూ వచ్చింది. వెరసి ఇకపై వీటికి ఫుల్స్టాప్ పెట్టనున్నట్లు ప్రభుత్వ వర్గాల అంచనా. వివరాలు చూద్దాం.. కేంద్ర ఆర్థిక శాఖ వచ్చే ఆర్థిక సంవత్సరం(2025–26) నుంచి సావరిన్ గోల్డ్ బాండ్ల(ఎస్‌జీబీలు) జారీని నిలిపివేసే అవకాశముంది. ప్రభుత్వ రుణాలను తగ్గించుకునే బాటలో ప్రభుత్వం ఎస్‌జీబీల జారీని నిలిపివేయాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. నిజానికి ఫిజికల్‌గా బంగారం దిగుమతులను తగ్గించుకునే యోచనతో ప్రభుత్వం వీటిని ప్రవేశపెట్టింది. దీనిలో భాగంగా ఈ ఏడాది జూలైలో వెలువడిన బడ్జెట్లో రూ. 18,500 కోట్ల విలువైన ఎస్‌జీబీల జారీకి ప్రణాళికలు వేసింది. అయితే గతేడాది జారీ చేసిన రూ. 26,852 కోట్లతో పోలిస్తే అంచనాలను భారీగా తగ్గించింది. ఎస్‌జీబీల గడువు ముగిశాక ప్రభుత్వం బంగారం మార్కెట్ ధరకు అనుగుణంగా ఇన్వెస్టర్లకు తిరిగి చెల్లించవలసి ఉంటుంది. అంతేకాకుండా వీటిపై నిరంతరంగా వడ్డీని సైతం చెల్లిస్తుంది. ఫలితంగా ప్రభుత్వంపై అదనపు రుణభారానికి ఆస్కారం ఏర్పడుతోంది. ప్రస్తుతం ప్రభుత్వం 2026–27కల్లా స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ)లో రుణ(డెట్) నిష్పత్తిని తగ్గించుకునే ప్రణాళికల్లో ఉంది. దీంతో ఇకపై ఎస్జీబీలను జారీ చేసే యోచనకు ప్రభుత్వం స్వస్తి పలకవచ్చని ఆర్థికవేత్తలు అభిప్రాయపడుతున్నారు. 14.7 కోట్ల యూనిట్లు జారీ2015 మొదలు ఆర్బీఐ 67 ఎస్జీబీ పథకాల ద్వారా మొత్తం 14.7 కోట్ల యూనిట్లను జారీ చేసినట్లు అంచనా. అయితే పసిడి విలువ ఎప్పటికప్పుడు పరుగు తీస్తుండటంతో వీటి విలువ సైతం పెరుగుతూ వస్తోంది. ఉదాహరణకు 2016లో గ్రాము(యూనిట్)కు రూ. 3,007 ధరలో ఎస్జీబీలను విడుదల చేసింది. వీటి గడువు తీరేసరికి విలువ రూ. 4,781 జంప్‌చేసి రూ. 7,788కు చేరింది. అంటే 8 ఏళ్లలో 159% వృద్ధి. అంతేకాకుండా వార్షికంగా 2.5% వడ్డీ కూడా లభించింది. దీంతో ఆర్బీఐ 2017 మే నెలలో, 2020 మార్చిలో జారీ చేసిన ఎస్జీబీలను ముందుగానే చెల్లించేందుకు ఈ ఏడాది ఆగస్ట్‌లో నిర్ణయించింది. తద్వారా ప్రభు త్వ రుణభారాన్ని తగ్గించేందుకు సంకలి్పంచింది. మరోవైపు ప్రభుత్వం సైతం జూలై బడ్జెట్లో పసిడిపై దిగుమతుల సుంకాన్ని 15% నుంచి 6 శాతానికి భారీగా తగ్గించింది.ఎస్‌జీబీలంటే కేంద్ర ప్రభుత్వం తరఫున రిజర్వ్ బ్యాంక్ ఎస్జీబీలను జారీ చేస్తుంది. ఒక గ్రాము బంగారాన్ని ఒక యూనిట్‌గా జారీ చేస్తుంది. అప్పటి మార్కెట్ ధర ఆధారంగా వీటిని కేటాయిస్తుంది. అంటే ఇది పేపర్ గోల్డ్. కాలపరిమితి 8 ఏళ్లుకాగా.. ఐదేళ్ల తదుపరి ఎప్పుడైనా వీటిని విక్రయించేందుకు వీలుంటుంది. అప్పటి బంగారం మార్కెట్ ధర ఆధారంగా మెచ్యూరిటీ విలువ ఉంటుంది. అంతేకాకుండా వీటిపై తొలి ఏడాది నుంచి 2.5 శాతం వార్షిక వడ్డీ అందుతుంది. ఈ బాండ్లు బీఎస్ఈ, ఎన్ఎస్ఈలలో ట్రేడవుతాయి. పసిడి మెరుపులు అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం ధరలు నిరంతరం బలపడుతూనే ఉన్నాయి. భవిష్యత్‌లోనూ మరింత పెరిగే అవకాశముంది. ఇందుకు రాజకీయ, భౌగోళిక అనిశి్చతులు, ప్రభుత్వాల విధానాలు, యుద్ధ భయాలు వంటి అంశాలు కారణంకానున్నట్లు ఫారెక్స్ వర్గాలు పేర్కొంటున్నాయి. దేశీయంగా 2015లో ఎస్జీబీలను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఫిజికల్‌గా పసిడి కొనుగోళ్లకు చెక్ పెట్టే యోచనతో రిటైల్ ఇన్వెస్టర్లను ఆకట్టుకునేందుకు వీటిని తీసుకువచి్చంది. తద్వారా ఫిజికల్ గోల్డ్ నుంచి పేపర్ గోల్డ్‌కు ఇన్వెస్టర్లను మళ్లించే ప్రయత్నం చేసింది. తొలుత 8 ఏళ్ల కాలపరిమితితో వీటికి శ్రీకారం చుట్టింది. ఐదేళ్ల గడువు తదుపరి మార్కెట్ ధరలకు అనుగుణంగా రిడీమ్ చేసుకునేందుకు వీలు కల్పించింది. 2017–18లో వ్యక్తులు, కుటుంబాలకు ఒక ఆర్థిక సంవత్సరంలో 4 కేజీలవరకూ పెట్టుబడులకు అనుమతించింది. ట్రస్ట్‌లు, సంబంధిత సంస్థలు 20 కేజీలవరకూ ఇన్వెస్ట్ చేసేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచి్చంది. 2015–16లో జారీ చేసిన బాండ్ల ముఖ విలువపై 2.75 శాతం, తదుపరి కాలంలో జారీ చేసిన బాండ్లపై 2.5 శాతం వడ్డీ చెల్లింపునకు తెరతీసింది. రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ) చివరిసారిగా ఈ ఏడాది ఫిబ్రవరి 21న రూ. 8,008 కోట్ల విలువైన ఎస్జీబీలను జారీ చేసింది.– సాక్షి, బిజినెస్ డెస్క్ -
అమ్మా నాన్న ఒక ఆరిల్
సినిమాలకు దూరమైనా సరే, నటులపై ఆసక్తి మాత్రం దూరం కాదు. ‘ఫలానా నటుడు ఇప్పుడు ఏం చేస్తున్నాడో తెలుసా? ‘ఫలానా కథానాయిక ఇప్పుడు ఏ దేశంలో ఉంటుందో తెలుసా?’... ఇలాంటి విషయాలు అభిమానులకు ఎప్పుడూ ఆసక్తికరమే. ‘గజిని’ ‘అమ్మా నాన్న ఒక తమిళ అమ్మాయి’ ‘ఘర్షణ’... మొదలైన సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఆశిన్ పెళ్లి తరువాత నటనకు దూరమైంది. కొన్ని నెలల క్రితం... ఆసిన్ భర్త నుంచి విడాకులు తీసుకుందని, మళ్లీ సినిమాలలో నటించనుందని రూమర్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ‘అలాంటిది ఏమీ లేదండీ బాబూ. నేను మళ్లీ సినిమాల్లో నటించడం లేదు’ అని ఆసిన్ స్వయంగా ప్రకటించింది. తాజాగా... ప్యారిస్‌లో జరిగిన కుమార్తె ఆరిన్ పుట్టినరోజు వేడుకలకు సంబంధించిన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది ఆసిన్. వీటిలో ఆమె భర్త రాహుల్ శర్మ కూడా ఉన్నాడు. ఇక రూమర్స్‌కు ఫుల్స్టాప్ పడినట్లే కదా! -
బ్రేకప్ గురించి మాట్లాడను
‘‘యాక్టర్స్ జీవితాల్లో ఏం జరుగుతోందో తెలుసుకోవాలనే ఆసక్తి ప్రేక్షకులకు కచ్చితంగా ఉంటుంది. నా గురించి ఏదైనా చెప్పగలను. కానీ, నా రిలేషన్షిప్ గురించి ఏం మాట్లాడలేను. రిలేషన్షిప్ అంటే నేను మాత్రమే కాదు.. నాతో పాటు ఇంకొకరు ఉంటారు. వాళ్ల గురించి నేను మాట్లాడలేను’’ అన్నారు ఇలియానా. ఆస్ట్రేలియన్ ఫొటోగ్రాఫర్ ఆండ్రూ నీబోన్‌తో ఇలియానా కొన్నాళ్లు రిలేషన్షిప్లో ఉన్నారు. ఇటీవల వీళ్లిద్దరూ రిలేషన్‌షిప్‌కు ఫుల్స్టాప్ పెట్టారు. అయితే ఈ బ్రేకప్ గురించి ఇలియానా ఎక్కడా మాట్లాడలేదు. ఈ విషయం గురించి తాజాగా ఆమె స్పందిస్తూ– ‘‘రిలేషన్షిప్ ఇద్దరు వ్యక్తులకు సంబంధించిన విషయం. దాని గురించి మనం ఏం మాట్లాడినా అది వాళ్ల గురించి కూడా మాట్లాడినట్టే. అది వాళ్ల్ల ప్రైవసీని (గోప్యత) గౌరవించనట్టే. రిలేషన్‌షిప్‌కి సంబంధించిన విషయాలు సరిగ్గా వ్యక్తపరచకపోయినా, ఆ టాపిక్‌లోని కొన్ని వ్యాఖ్యలు తీసుకొని హైలెట్ చే సినా వేరేవాళ్ల ప్రైవసీని ఇబ్బందుల్లో పెట్టినట్టే. వారి ప్రైవసీని గౌరవిస్తాను. నేను విమర్శలు తీసుకుంటున్నాను. వాళ్లను కూడా దీనికి బాధితులను చేయలేను. అందుకే నా రిలేషన్షిప్ గురించి మాట్లాడాలనుకోవడం లేదు’’ అన్నారు. -
వాట్సప్‌తో కటీఫ్
ఇంట్లో వాళ్లు, ఫ్రెండ్స్ ఎప్పుడు టచ్‌లో ఉండాలన్నా.. ఆఫీస్ పనులు అన్నింటికీ టచ్‌లో ఉండాలన్నా సులువైన మార్గం వాట్సప్. ‘‘అన్ని పనులకు దగ్గరగా ఉంటున్న ఈ యాప్‌కు దూరంగా ఉంటున్నాను’’ అన్నారు మలయాళ నటుడు మోహన్‌లాల్. ఈ విషయం గురించి మోహన్‌లాల్ మాట్లాడుతూ – ‘‘ఉదయం లేవగానే ప్రేయర్ చేయడం నాకు అలవాటు. ఈ మధ్య ఫోన్ చూడటం అలవాటైంది. కొన్ని వీడియోలు, ఫొటోలు డిస్ట్రబ్ చేస్తున్నాయి. అలాగే ప్రయాణాల్లో కారు కిటికిలో నుంచి చెట్లు, బిల్డింగ్‌లను గమనిస్తూ ఉండేవాణ్ణి. కానీ ఇప్పుడు ఫోన్లోనే ఉంటున్నాను. ఎయిర్‌పోర్ట్‌లో కొత్త స్నేహితులను కలవడం, వాళ్లతో కబుర్లు చెప్పడం వంటి వాటికి ఫుల్స్టాప్ పడింది. అందుకే వాట్సప్‌కు బైబై చెప్పాను. ఇప్పుడు చాలా ప్రశాంతంగా ఉంది. ఉదయాన్నే మళ్లీ న్యూస్‌పేపర్‌తో రోజుని మొదలుపెడుతున్నాను. సగం చదివిన పుస్తకాల్ని పూర్తి చేస్తున్నాను. నా ఆలోచనల్ని విశ్లేషించుకోవడానికి చాలా సమయం దొరుకుతోంది. పనిలో ఉన్నప్పుడు కొన్ని వీడియోలు నెగటివ్ ఇంపాక్ట్ చూపించేవి. అలాగే ప్రేమను పంచుకోవడానికి మెయిల్స్ కూడా ఉన్నాయి. వాట్సప్‌కి దూరంగా ఉండమని నాతో ఎవరూ అనలేదు. మిగతా వాళ్లను కూడా అలా చేయమని అనడం లేదు’’ అని పేర్కొన్నారాయన. ప్రస్తుతం ‘మరక్కార్’ అనే పీరియాడికల్ భారీ బడ్జెట్ చిత్రంలో నటిస్తున్నారు మోహన్‌లాల్. -
ఎక్కడి పనులు అక్కడే
డెల్టా ఆధునికీకరణకు నేటితో ఫుల్స్టాప్ రేపటి నుంచి కాలువలకు నీరు విడుదల తూడు, గుర్రపు డెక్క తొలగింపు పనులపై దృష్టి ఏలూరు : డెల్టా ఆధునికీకరణ పనులకు ఫుల్స్టాప్ పాడింది. బుధవారం నుంచి పనులు నిలిపివేయాలని యంత్రాంగం నిర్ణయిం చింది. ఏప్రిల్ 20న ఈ పనులు ప్రారంభించగా, గురువారం నుంచి కాలువలకు నీటిని విడుదల చేస్తుండటంతో ఎక్కడి పనులను అక్కడే నిలిపివేయాలని ఆదేశాలు అందాయి. ఈ సీజన్లో రూ.73.93 కోట్ల విలువైన 25 కాలువ పనులు, 14 డ్రెయిన్ల పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించారు. గడువు ముగిసే సమయానికి సుమారు రూ.30 కోట్ల విలువైన పనులను మాత్రమే పూర్తి చేయగలిగారు. ఇక వచ్చే ఏడాదే ఈ వేసవిలో కాలువలకు నీటి విడుదల నిలి పివేత సమయం (క్లోజర్ పీరియడ్) తక్కువగా ఉండటంతో ఆధునికీకరణ పనులు అరకొరగానే చేశారు. మిగిలిపోయిన పనులను వచ్చే ఏడాది ఏప్రిల్‌లో చేపట్టాలని జల వనరుల శాఖ భావిస్తోంది. రాబోయే రోజుల్లో ఈపీసీ (ఈ-ప్రొక్యూర్మెంట్) విధానాన్ని తొలగించి, నాన్ ఈపీసీలో టెండర్లు పిలవాలన్న యోచనలో ఉన్నారు. రేపటి నుంచి కాలువలకు నీరు జిల్లా నీటి పారుదల సలహా మండలి తీర్మా నం మేరకు ఈ నెల 11వ తేదీ నుంచి కాలువలకు నీటిని విడుదల చేయనున్నారు. విజ్జేశ్వరం హెడ్ స్లూయిజ్ ద్వారా డెల్టాకు నీరి వ్వడానికి ఏర్పాట్లు చేశామని ఇరిగేషన్ ఎస్ఈ ఎన్.వెంకటరమణ తెలిపారు. ఆ రోజు నుంచే డ్రెయిన్లు, కాలువలలో గుర్రపుడెక్క, తూడు తొలగింపు పనులు చేపట్టేందుకు నిర్ణయించామన్నారు. -
తేలనున్న ‘ఇంటి’గుట్టు
జేఎన్‌ఎన్‌ఆర్‌యూఎం ఇళ్ల కేటాయింపుపై కమిటీ రెవెన్యూ..యూసీడీ సంయుక్త సర్వే సంక్రాంతిలోగా అందజేయనున్న నివేదిక బినామీలలో మొదలైన కలవరం విశాఖపట్నం సిటీ : అవకతవకలమయమైన జేఎన్‌ఎన్‌ఆర్‌యూఎం ఇళ్ల కేటాయింపుపై అధికారులు దృష్టి సారించారు. మహా విశాఖలో జేఎన్ఎన్యూఆర్ఎం కింద నిర్మితమైన గృహాల వ్యవహారం నిగ్గుతేల్చాలని తాజాగా సంకల్పించారు. అనర్హులే ఎక్కువగా ఉన్నారనే ఫిర్యాదులు అందడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఇప్పటికే కోర్టుల నుంచి మొట్టికాయలు వేయించుకున్న మహా నగర పాలక సంస్థ నివేదికల్లో వాస్తవాలను బయటపెట్టేందుకు రెవెన్యూ యంత్రాంగం సైతం కదిలింది. దీనిలో భాగంగా అర్బన్ కమ్యూనిటీ డెవలప్మెంట్ అధికారులు, రెవెన్యూ బృందాలు సంయుక్తంగా సర్వే చేసి అర్హుల నిగ్గు తేల్చేందుకు నడుం బిగించాయి. అసంపూర్తిగా ఎన్ని ఇళ్లు వున్నాయి... కేటాయింపు జరిగిన గృహాల్లో ఎవరెవరు ఉంటున్నారు...ఉంటున్న వారు అర్హులా..కాదా...రిజర్వుడు కేటగిరీల కింద ఎంత మంది ఉంటున్నారు... ఆక్రమించిన వారికి ఎవరెవరు సిఫార్సు చేశారు... బినామీల పేర్లతో ఎవరెవరు ఎన్ని ఇళ్లు ఆక్రమించారు తదితర అంశాలపై రెవెన్యూ వారు నిగ్గు తేల్చనున్నారు. ఇందుకు 33 బృందాలను ఏర్పాటు చేశారు. బృందంలో ముగ్గురు నలుగురు చొప్పున అధికారులుంటారు. ఒకటి రెండు రోజుల్లోనే ఈ బృందాలు సర్వే చేపట్టనున్నాయి. సంక్రాంతి లోగా వీరిచ్చే నివేదిక ఆధారంగానే అర్హులను గుర్తించి, వారికి అన్ని సదుపాయాలు కల్పించేందుకు యంత్రాంగం ఏర్పాట్లు చేయనుంది. 14,203 ఇళ్లు నిర్మాణం విశాఖ అర్బన్‌లో జేఎన్ఎన్యూఆర్ఎం హౌసింగ్ ప్రాజెక్టును 2006లో ప్రారంభించినా 2008 వరకూ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ మాత్రమే పర్యవేక్షించేది. ఆ తర్వాత నుంచీ జీవీఎంసీకి ప్రభుత్వం అప్పగించింది. అప్పటి నుంచి లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ చేపట్టి 15,320 ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. అయితే స్థల వివాదాలు, కోర్టు వ్యాజ్యాలు వల్ల 14,203 ఇళ్లను మాత్రమే 38 లే అవుట్లలో నిర్మించారు. ఇందులో 12,947 ఇళ్లకు కేటాయింపు చేశారు. ఇంకా 1,256 ఇళ్లు మాత్రమే అధికారికంగా ఖాళీ వున్నట్టు లెక్కలేస్తున్నారు. కానీ వాస్తవ పరిస్థితికొచ్చేసరికి 5 వేలకు పైగా ఇళ్లు ఖాళీగా ఉన్నాయని అంచనా వేస్తున్నారు. ఇవన్నీ బినామీలే. రాజకీయ నేతల అనుయాయులు తాళాలు వేసి తమ వారి కోసం సిద్ధంగా ఉంచుకున్నారు. గతంలోనే అప్పటి కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేల అనుచరులే ఎక్కువ ఇళ్లను స్వాహా చేసినట్టు అధికారులు లెక్కలేస్తున్నారు. అప్పటి ఎమ్మెల్యే, మంత్రుల అనుచరులు కాజేయడంతో ఇప్పటి మంత్రులు, ఎమ్మెల్యేలకు జీవీఎంసీ అధికారులపై ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. గతంలో స్వాహా చేసిన వారికే వత్తాసు పలుకుతున్నారంటే తమ పరిస్థితి ఏంటని మల్లగుల్లాలు పడుతున్నారు. మొత్తానికి ఆ ఇళ్లల్లో ఎవరెవరు ఉంటున్నారనేదానిపై లోతుగా అధ్యయనం చేస్తున్నారు. అన్నీ సమస్యలే..! జెఎన్‌ఎన్‌యుఆర్‌ఎం ఇళ్ల నిర్మాణానికి కేంద్రం నుంచి రూ. 300 కోట్లు రావాల్సి వుంది. ఆ మొత్తం ఉమ్మడి రాష్ట్రంలో వుండిపోయాయి. అక్కడి నుంచి ఆ మొత్తం తెచ్చుకోవాలంటే రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో సంప్రదింపులు జరపాల్సి ఉంది. ఇదంతా ఇప్పట్లో అయ్యే పని కాదని తేలడంతో ఇంజనీరింగ్ అధికారులు పనులకు ఫుల్స్టాప్ పెట్టారు. ఎక్కడి పనులు అక్కడే ఆపేశారు. రోడ్లు, డ్రైనేజీలు, విద్యుత్, నీటి సదుపాయాల్లేవు. అందుకే ఇళ్ల కేటాయింపులు జరిగినా మెజార్టీ ఇళ్లు తాళాలు వేసే ఉన్నాయి. అర్హుల గుర్తింపు ఇలా..! జేఎన్ఎన్యూఆర్ఎం ఇళ్లు కేటాయించేందుకు అర్హులను ఇలా గుర్తించాలంటూ ప్రభుత్వం మార్గ దర్శకాలు జారీ చేసింది. మొత్తం ఇళ్లల్లో ఎస్సీలకు 16శాతం, ఎస్టీలకు 6 శాతం, మైనార్టీలకు 5 శాతం ఇళ్లను కేటాయించాలని సూచించింది. మిగిలిన ఇళ్లల్లో రహదారుల విస్తరణలో ఇళ్లు కోల్పోయిన వారికి, గెడ్డలు, కెనాల్స్‌పై ఉంటున్న వారికి, కొండ ప్రాంతాల్లో వారికి, రైల్వే,డిఫెన్స్, పోర్టు స్థలాల్లో అనధికారికంగా ఉంటున్న వారికి ప్రాధాన్యమివ్వాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. అలాగే ఇళ్లు కాలిపోయిన వారికి, ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసుల్లోని బాధితులు, వికలాంగులు, హెచ్ఐవీ బాధితులకు, అనాథలకు నిబంధనల మేరకు ఇళ్లు కేటాయింపులు చేయాలని సూచించారు. జరుగుతుందిలా..! రాజకీయ నేతలు సిఫార్సు చేసిన వారికి, మంత్రులు, ఎమ్మెల్యేల అనుయాయులకు కేటాయింపులు చేస్తున్నారు. జీవీఎంసీలోని మాజీ కార్పొరేటర్లకు, రాజకీయ పార్టీల్లోని ముఖ్య నేతల అనుయాయులకు, వాళ్ల ఇళ్లల్లో పనిచేసే వారికి మాత్రమే ఇస్తున్నారు. అధికారిక పార్టీల వార్డు అధ్యక్షులు రూపొం దించే నివేదికలకే పచ్చజెండా చూపుతున్నారు. జన్మభూమి కమిటీలు జోక్యం పెరిగిపోవడంతో వార్డు నేతల చుట్టూ ఇళ్ల కోసం ప్రదక్షిణలు చేస్తున్నారు. ఓడీఏ బెటర్..! విశాఖలో ఓడీఏ పేరుతో పలు మురికివాడలను నిర్మించి అభివృద్ధి చేసిన ఘనత ఓవర్సీస్ డెవలప్మెంట్ అడ్మినిస్ట్రేషన్‌దే. ఎలాంటి అభివృద్ధి లేని సమయంలో ఆరిలోవలో 10 సెక్టార్లను అభివృద్ధి చేసింది. ఇప్పుడు ఆరిలోవలో ఎలాం టి సదుపాయాలున్నాయో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పరిస్థితి లేదు. కానీ ఇప్పుడు నిర్మిస్తున్న జేఎన్ఎన్యుఆర్ఎం ఇళ్లల్లో అలాంటి సదుపాయాలున్నాయో లేదో అధికారులకే తెలియాలి. సదుపాయాలు లేని ఇళ్లు ఇవే..! చాలా ఇళ్లల్లో కనీస సదుపాయాలు కల్పించేందుకు నగర పాలక సంస్థ మీనమేషాలు లెక్కిస్తోంది. ఇళ్లు కట్టేశామంటూ గొప్పలు చెప్పే ఇంజినీరింగ్ శాఖ అక్కడ కనీస సదుపాయాలున్నాయో లేదో చూడడం లేదు. వేలాది గృహ సముదాయాలను రూ. కోట్లు వెచ్చించి నిర్మిస్తున్నా కనీస అవసరాలు తీర్చే నీటి, విద్యుత్ సదుపాయాలు కల్పించడంలో విఫలమైంది. ఈ ఇళ్ల వద్ద కమ్యూనిటీ కేంద్రాలు, దుకాణ సముదాయాలు, పాఠశాల, అంగన్వాడీ భవనం, డిస్పెన్సరీ, పై అంతస్తులోని వారికి నీరు వెళ్లేందుకు అవసరమైన మోటార్లు, ట్యాంకులు ఏర్పాటుపై దృష్టి పెట్టాలి. స్థానికంగానే ఉపాధికి అవసరమైన పరిశ్రమలు ఏర్పాటు చేస్తే తప్పా అక్కడ ప్రజలు నివాసముండలేరని అధికారులే చెబుతున్నారు. ఖాళీగా ఉన్న ఇళ్లు పరదేశిపాలెం-1లో 927 బక్కన్నపాలెం-2లో 512 కొమ్మాది-2లో 890 సింహాచలం దరి అప్పన్న పాలెంలో 480 పెందుర్తి దరి 1472 తాగునీటికి ఇబ్బందులు మాది నిరుపేద కుటుం బం. ప్రభుత్వం ఇళ్లు మంజూరు చేస్తాదంటే దరఖాస్తు చేసుకున్నాం. ఇక్కడ ఓ ఇంటిని కేటాయించారు. కనీసం తాగేందుకు నీరు కూడా అందించడంలేదు. పిల్లాపాపలతో చాలా ఇబ్బందులు పడుతున్నాం. - టి.లక్ష్మి వెళ్లాలంటే నరకమే ఇళ్లు కేటాయించిన అధికారులు ఇటువైపు కన్నెత్తి చూడలేదు. కనీసం రోడ్లు కూడా సక్రమంగా నిర్మించలేదు. ఇక్కడికి రావాలంటే నరకం చూడాల్సిందే. - ఎం. నాగేశ్వరరావు విద్యుత్ సదుపాయం లేదు మా నివాసాలకు విద్యుత్ సదుపాయం లేదు. రాత్రి సమయాల్లో చాలా భయంగా ఉంటుంది. కాలువలు, నీటి సదుపాయం లేదు. బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నాం. - టి. సత్యవతి -
కొత్త పాఠం...!
ఇటు స్కూళ్లు తెరుచుకున్నాయి. సెలవుల జోష్నుంచి తేరుకున్న విద్యార్థులు పుస్తకాలతో పాఠశాలలకు గురువారం పరుగులు తీశారు. అమ్మల రెస్ట్‌కు కాస్త ఫుల్స్టాప్ పడి..పిల్లలను రెడీ చేస్తూ హడావిడిగా కనిపించారు. తొలిరోజు స్కూలుకు వెళ్లేందుకు మొరాయించిన చిట్టి తమ్ముళ్లను అక్కలే ఓర్పుగా..బడి వైపు అడుగులేయించారు. కొత్త పాఠాలు వినేందుకు వచ్చిన స్టూడెంట్స్, బోధనకోసం వచ్చిన గురువులతో ప్రభుత్వ, ప్రైవేటు బడులు కళకళలాడాయి. కొత్తదనం సంతరించుకున్నాయి. అటు పల్లెలు ఏరువాక పౌర్ణమికి ముస్తాబయ్యాయి. సాగు యజ్ఞానికి రైతులు ఉపక్రమించారు. శక్తులన్నీ కూడగట్టుకొని కొత్త ఆశలతో వ్యవసాయాన్ని చేసేందుకు పలుగు,పార, అరక సిద్ధం చేసుకున్నారు. తమ జీవన నేస్తాలైన బసవన్నలకు ముచ్చటగా అలంకరించి శ్రమసాయానికి రెడీ చేశారు. ఇళ్లవద్ద సాంప్రదాయ బద్ధంగా మామిడి తోరణాలు కట్టి ‘పచ్చ’గా పంటలు ఎదగాలని వేయి దేవుళ్లకు మొక్కారు. విత్తనం వేసింది మొదలు...ఫలసాయం వచ్చే వరకూ కాపాడాలని వేడుకున్నారు. -
‘హై సెక్యూరిటీ’కి బ్రేక్!
నాణ్యత ప్రమాణాలు నిల్ వాహనదారుల ఫిర్యాదుపై స్పందన విశాఖపట్నం, న్యూస్‌లైన్: హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్ల ప్రక్రియకు ఫుల్ స్టాప్ పడింది. నాణ్య త ప్రమాణాలు పాటించడం లేదని అభ్యంతరాలు వ్యక్తం కావడంతో సేవలు నిలిచాయి. బోర్డుల తయారీ సక్రమంగా జరగడం లేదని తెలిసి అధికారులు అడ్డుకట్ట వేశారు. బుధవారం నుంచి బోర్డుల ప్రక్రియ కొనసాగడం లేదు. రక్షణ, భద్రత లక్ష్యం గా అమలులోకి వచ్చిన ‘హై సెక్యూరిటీ’ నంబర్ బోర్డుల విధానం విమర్శలకు దారి తీస్తోంది. బోర్డుల తయారీపై ఆరోపణలు వచ్చాయి. మోటారు వాహనాల చట్టంలో తెలిపిన ప్ర మాణాలు తయారీ సంస్థ పాటించడం లేదని, చెల్లించిన ధరకు తగ్గట్టుగా బోర్డులు లేవంటూ వాహనదారులు ఫిర్యాదులు చేశారు. విశాఖలో మార్చి 10 నుంచి హైసెక్యూరిటీ బోర్డుల వినియోగం అమలు జరుగుతోంది. బోర్డుల తయారీలో నాణ్యత పట్ల వాహన యజమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రాష్ర్టంలో బోర్డులను ‘లింక్ ఆటో టెక్’ సంస్థ తయారీ చేస్తోంది. బోర్డుల నాణ్యత, తయారీ అంశాలను రవాణా, ఆర్టీసీ అధికారులు పర్యవేక్షిస్తారు. తయారీ సంస్థ నిబంధనలు పాటించకపోవడంతో సర్వత్రా విమర్శలు వస్తు న్నాయి. చట్టంలో నిబంధనలు తయారీ సంస్థ సక్రమంగా అమలు చేస్తోందా, లేదా అనే విషయాన్ని ధ్రువీకరించాల్సి ఉంది. ఒక వేళ ప్రమాణాలకు విరుద్ధమని తెలిస్తే సంస్థ బాధ్యత వహించాలి. ఈ విషయమై ఇప్పటికే తయారీ సంస్థకు సూచనలు, హెచ్చరికలు జారీ చేసి నట్టు సమాచారం. బోర్డుల తయారీలో నాణ్యత పాటించి సరఫరా చేయాలని ఆదేశించినట్లు తెలిసింది. -
‘కామా’కు ఫుల్స్టాప్!
లండన్: ఆంగ్ల భాష వాక్య నిర్మాణంలో విరివిగా ఉపయోగించే విరామ చిహ్నమైన ‘కామా’ వాడకానికి ‘ఫుల్స్టాప్’ పెట్టొచ్చని ఓ అమెరికా విద్యావేత్త సూచించారు. ఆధునిక అమెరికా వాచకాల నుంచి ఈ చిహ్నాన్ని తొలగించినా వాక్యాల స్పష్టత విషయంలో ఎటువంటి నష్టం జరగదని కొలంబియా యూనివర్సిటీకి చెందిన తులనాత్మక సాహిత్య, ఆంగ్ల అసోసియేట్ ప్రొఫెసర్ జాన్ మెక్వోర్టర్ అభిప్రాయపడ్డారు. నెటిజన్లతోపాటు ఆధునిక రచయితలు వారికి తోచినట్లుగా లిపిని వాడుతున్నారని, ‘కామా’ను వాడటానికి ఇష్టపడటంలేదని చెప్పారు. ఇటువంటి వాటి వాడకం కేవలం సంప్రదాయమేనని... కాలానుగుణంగా అవి మారుతుంటాయన్నారు. -
సమూల మార్పులు
మిర్యాలగూడ, న్యూస్‌లైన్: మాధ్యమిక విద్యలో సమూల మార్పులు తీసుకువచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పదవ తరగతి తర్వాత చదువులకు ఫుల్స్టాప్ పెట్టే విద్యార్థుల జీవన ప్రమాణాల్లో మార్పులు తేవడానికి విద్యాశాఖ సిద్ధమైంది. ఆర్థిక, ఇతర కారణాల వల్ల పై చదువులకు వెళ్లలేని వారికి మెరుగైన అవకాశాలు కల్పిస్తూ సరికొత్త మార్పులకు శ్రీకారం చుట్టింది. ఈ విద్యా సంవత్సరం నుంచే డ్రాపౌట్స్‌ను గుర్తించి, వారిలో మార్పు తీసుకువచ్చి ఉన్నత విద్య వైపు మళ్లించేందుకు చర్యలు చేపట్టింది. 2013-14 విద్యా సంవత్సరంలో జిల్లా వ్యాప్తంగా 48,811 మంది పదవ తరగతిలో ఉత్తీర్ణత సాధించగా వీరిలో 4023 మంది అంతటితోనే చదువుకు ఫుల్స్టాప్ పెట్టేశారు. 23నుంచి ప్రారంభమైన సమీక్ష సమావేశాలు ఎస్ఎస్సీ, ఇంటర్మీడియట్ బోర్డు ఉన్నతాధికారులు ఇటీవల సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా 2013-14లో 10.70 లక్షల మంది విద్యార్థులు పదవ తరగతిలో ఉత్తీర్ణత సాధించగా కేవలం 8.70 లక్షల మంది విద్యార్థులు ఇంటర్లో ఉత్తీర్ణులయ్యారు. 70 వేల మంది ఐటీఐ, పాలిటెక్నిక్ కళాశాలల్లో చేరగా 1.30 లక్షల మంది ఏ కళాశాలల్లో చేరకుండా డ్రాపౌట్స్‌గా ఉన్నట్లు పరిశీలనలో తేలింది. డ్రాపౌట్స్ విద్యార్థులను వృత్తి విద్య వైపునకు మళ్లించి వారి జీవన ప్రమాణాల్లో మార్పులు తెచ్చేందుకు గాను జిల్లా, మండల స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేశారు. అందుకు గాను జిల్లాలో డివిజన్ల వారీగా ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపాళ్లతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ నెల 23న నల్లగొండ, దేవరకొండ డివిజన్లలో సమావేశాలు నిర్వహించగా 25వ తేదీన మిర్యాలగూడ, సూర్యాపేటలలో నిర్వహించారు. 27న భువనగిరి డివిజన్లో నిర్వహించనున్నారు. కమిటీల ఏర్పాటు జిల్లా విద్యాధికారి, ఇంటర్మీడియట్ రీజనల్ అధికారి (ఆర్ఐఓ), జిల్లా ఒకేషన్ విద్యాధికారి, ఆర్జేడీలతో జిల్లా స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేశారు. మండల స్థాయిలో మండల విద్యాధికారి, ఉప విద్యాధికారి, మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్, ఉన్నత పాఠశాలల ప్రధానోపాద్యాయులు కమిటీలో సభ్యులుగా ఉంటారు. 31లోగా జాబితాలు అందజేయాలి పదవ తరగతిలో ఫెయిల్ అయిన, చదువులు నిలిపి వేసిన విద్యార్థులను మండల స్థాయి కమిటీలు గుర్తించి జాబితా సిద్ధం చేయాల్సి ఉంది. ఈ నెల 31వ తేదీ లోగా జిల్లా స్థాయి కమిటీలకు జాబితా అందజేయాలి. అదే విధంగా పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థుల కోసం కౌన్సెలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయాలి. కౌన్సెలింగ్ కేంద్రంలో చేయాల్సినవి ఉత్తీర్ణత ప్రమాణాలను, నాణ్యతను పెంచడం ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులతో మంతనాలు చేయడం డ్రాపౌట్స్ విద్యార్థులను, ఫెయిల్ అయిన వారిని గుర్తించడం ఫెయిల్ అయిన విద్యార్థులను ఓపెన్ టెన్త్, ఓపెన్ ఇంటర్, ఓపెన్ డిగ్రీ కోర్సులలో చేర్పించాలి చదువు నిలిపి వేసిన విద్యార్థులను వృత్తి విద్యా కోర్సుల వైపు ప్రేరేపించి జీవన నైపుణ్యాలను పెంపొందించాలి