డెల్టా ఆధునికీకరణకు
నేటితో ఫుల్‌స్టాప్
రేపటి నుంచి
కాలువలకు నీరు విడుదల
తూడు, గుర్రపు డెక్క తొలగింపు పనులపై దృష్టి
ఏలూరు : డెల్టా ఆధునికీకరణ పనులకు ఫుల్‌స్టాప్ పాడింది. బుధవారం నుంచి పనులు నిలిపివేయాలని యంత్రాంగం నిర్ణయిం చింది. ఏప్రిల్ 20న ఈ పనులు ప్రారంభించగా, గురువారం నుంచి కాలువలకు నీటిని విడుదల చేస్తుండటంతో ఎక్కడి పనులను అక్కడే నిలిపివేయాలని ఆదేశాలు అందాయి. ఈ సీజన్‌లో రూ.73.93 కోట్ల విలువైన 25 కాలువ పనులు, 14 డ్రెయిన్ల పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించారు. గడువు ముగిసే సమయానికి సుమారు రూ.30 కోట్ల విలువైన పనులను మాత్రమే పూర్తి చేయగలిగారు.
ఇక వచ్చే ఏడాదే
ఈ వేసవిలో కాలువలకు నీటి విడుదల నిలి పివేత సమయం (క్లోజర్ పీరియడ్) తక్కువగా ఉండటంతో ఆధునికీకరణ పనులు అరకొరగానే చేశారు. మిగిలిపోయిన పనులను వచ్చే ఏడాది ఏప్రిల్‌లో చేపట్టాలని జల వనరుల శాఖ భావిస్తోంది. రాబోయే రోజుల్లో ఈపీసీ (ఈ-ప్రొక్యూర్‌మెంట్) విధానాన్ని తొలగించి, నాన్ ఈపీసీలో టెండర్లు పిలవాలన్న యోచనలో ఉన్నారు.
రేపటి నుంచి కాలువలకు నీరు జిల్లా నీటి పారుదల సలహా మండలి తీర్మా నం మేరకు ఈ నెల 11వ తేదీ నుంచి కాలువలకు నీటిని విడుదల చేయనున్నారు. విజ్జేశ్వరం హెడ్ స్లూయిజ్ ద్వారా డెల్టాకు నీరి వ్వడానికి ఏర్పాట్లు చేశామని ఇరిగేషన్ ఎస్‌ఈ ఎన్.వెంకటరమణ తెలిపారు. ఆ రోజు నుంచే డ్రెయిన్లు, కాలువలలో గుర్రపుడెక్క, తూడు తొలగింపు పనులు చేపట్టేందుకు నిర్ణయించామన్నారు.
ఎక్కడి పనులు అక్కడే
Published Wed, Jun 10 2015 12:34 AM | Last Updated on Sun, Sep 3 2017 3:28 AM
Advertisement