Delta modernization
-
ఎక్కడి పనులు అక్కడే
డెల్టా ఆధునికీకరణకు నేటితో ఫుల్స్టాప్ రేపటి నుంచి కాలువలకు నీరు విడుదల తూడు, గుర్రపు డెక్క తొలగింపు పనులపై దృష్టి ఏలూరు : డెల్టా ఆధునికీకరణ పనులకు ఫుల్స్టాప్ పాడింది. బుధవారం నుంచి పనులు నిలిపివేయాలని యంత్రాంగం నిర్ణయిం చింది. ఏప్రిల్ 20న ఈ పనులు ప్రారంభించగా, గురువారం నుంచి కాలువలకు నీటిని విడుదల చేస్తుండటంతో ఎక్కడి పనులను అక్కడే నిలిపివేయాలని ఆదేశాలు అందాయి. ఈ సీజన్లో రూ.73.93 కోట్ల విలువైన 25 కాలువ పనులు, 14 డ్రెయిన్ల పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించారు. గడువు ముగిసే సమయానికి సుమారు రూ.30 కోట్ల విలువైన పనులను మాత్రమే పూర్తి చేయగలిగారు. ఇక వచ్చే ఏడాదే ఈ వేసవిలో కాలువలకు నీటి విడుదల నిలి పివేత సమయం (క్లోజర్ పీరియడ్) తక్కువగా ఉండటంతో ఆధునికీకరణ పనులు అరకొరగానే చేశారు. మిగిలిపోయిన పనులను వచ్చే ఏడాది ఏప్రిల్‌లో చేపట్టాలని జల వనరుల శాఖ భావిస్తోంది. రాబోయే రోజుల్లో ఈపీసీ (ఈ-ప్రొక్యూర్మెంట్) విధానాన్ని తొలగించి, నాన్ ఈపీసీలో టెండర్లు పిలవాలన్న యోచనలో ఉన్నారు. రేపటి నుంచి కాలువలకు నీరు జిల్లా నీటి పారుదల సలహా మండలి తీర్మా నం మేరకు ఈ నెల 11వ తేదీ నుంచి కాలువలకు నీటిని విడుదల చేయనున్నారు. విజ్జేశ్వరం హెడ్ స్లూయిజ్ ద్వారా డెల్టాకు నీరి వ్వడానికి ఏర్పాట్లు చేశామని ఇరిగేషన్ ఎస్ఈ ఎన్.వెంకటరమణ తెలిపారు. ఆ రోజు నుంచే డ్రెయిన్లు, కాలువలలో గుర్రపుడెక్క, తూడు తొలగింపు పనులు చేపట్టేందుకు నిర్ణయించామన్నారు. -
రాజధానికీ తాగునీరు
సాక్షి ప్రతినిధి, గుంటూరు : కొండవీటి వాగు ముంపు నివారణతోపాటు కొత్త రాజధాని ప్రాంతంలో తాగునీటి అవసరాలను తీర్చే విధంగా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఈ రెండు సమస్యలకు పరిష్కారం చూపే దిశలో ఇంజనీర్లు ప్రాథమికంగా కొన్ని ప్రతిపాదనలు రూపొందిస్తున్నారు. డెల్టా ఆధునీకరణకు నియమించిన నిపుణుల కమిటీ అక్టోబరు నెలలో ఈ ప్రాంతంలో పర్యటించింది. కొండ వీటి వాగు ముంపు కారణంగా పంటలు, పరిసర గ్రామాలు నష్టపోతున్న విధానాన్ని పూర్తిగా అధ్యయనం చేసింది. ఈ మేరకు తయారు చేసిన నివేదిక ఆధారంగా హైదరాబాద్‌లో ఇరిగేషన్ శాఖ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించింది. మంగళగిరి, తాడికొండ నియోజకవర్గాల్లోని 20 వేల హెక్టార్లలో పంటలను కొండవీటి వాగు వరద నుంచి కాపాడటమే కాకుండా, రాజధాని తాగునీటి అవసరాలను తీర్చాలని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు అనుగుణంగా గుంటూరు సర్కిల్ ఇంజనీర్లకు కొన్ని సూచనలు చేయడంతో క్షేత్రస్థాయి పరిశీలన జరిపి ఆ మేరకు ప్రతిపాదనలు తయారు చేస్తున్నారు. కొండవీటి వాగు నుంచి వచ్చే వరద నీటిని రెండు చెరువుల్లో నిల్వచేసి, ప్రజల అవసరాల కోసం మళ్లించేం దుకు వీలుగా అంచనాలు తయారు చేస్తున్నారు. ఈ చెరువుల్లో దాదాపు రెండు టీఎంసీల నీటిని నిల్వ చేసే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. రెండు చెరువుల నిర్మాణాలకు 1200 ఎకరాల భూమి అవసరం కాగలదని ప్రాథమికంగా అంచనా వేశారు. అనంతవరం కొండల నుంచి వాగుకు ఎక్కువగా వరద వస్తుండటంతో అక్కడకు సమీపంలోని వడ్డమాను చెరువుకు అనుకుని ఒక రిజర్వాయరు నిర్మించాలని, మరో రిజర్వాయరును దీనికి 18 కిలోమీటర్ల దూరంలో నిర్మించేందుకు ప్రతిపాదనలు తయారు చేస్తున్నారు. కొండవీటివాగు నుంచి వచ్చే నీటిని రెండో చెరువులో నిల్వ చేసేందుకు అనుగుణంగా అంచనాలు తయారు చేస్తున్నారు. ఈ రెండు చెరువుల నిర్మాణాలకు అవసరమైన 1200 ఎకరాలను రైతుల నుంచి ఏ విధంగా తీసుకుంటారో ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని ఇంజనీర్లు చెబుతున్నారు. -
జవాబుదారీ తప్పనిసరి
డెల్టా ఆధునికీకరణ వేగవంతం చేయాలి ఖరీఫ్‌లో సమస్యలు ఉత్పన్నం కాకుండా చూడాలి ఉల్లి ధరలు తగ్గించటానికి చర్యలు తీసుకోండి రెండో వారంలో జిల్లాలో సీఎం పర్యటన, సమీక్ష జిల్లా సమీక్ష సమావేశంలో మంత్రి దేవినేని హాజరైన రాష్ట్ర మంత్రులు కామినేని, కొల్లు జిల్లా మంత్రులు ముగ్గురూ అధికారులతో సోమవారం సమీక్షించారు. అన్ని శాఖలఅధికారులతో వివిధ అంశాలపై చర్చించారు. రానున్న రోజుల్లో జిల్లా అంతటా తనిఖీలు నిర్వహిస్తామని హెచ్చరించారు. పాలనా పరమైన అంశాల్లో పలు ఆదేశాలు, సూచనలు చేశారు. సాక్షి, విజయవాడ : జిల్లాలో 46 లక్షల మంది ప్రజల బాధ్యత మాదే.. ప్రజలకు జవాబుదారీగా ఉండేలా అధికారులు పనిచేయాలి.. ఎక్కడ సమస్యలు ఉత్పన్నం కాకుండా వ్యవస్థను గాడిలో పెట్టి సమర్థవంతంగా పనిచేయాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు సూచించారు. తమది రైతు ప్రభుత్వమని, అధికారులందరూ రైతుల వైపు ఉండి వారివైపు ఆలోచించి సమస్యలను తమదృష్టికి తీసుకురావాలని వాటిని సంబంధిత మంత్రులు, ఆయా శాఖల కమిషనర్లతో మాట్లాడి పరిష్కరిస్తామని చెప్పారు. సోమవారం విజయవాడలోని నీటిపారుదల శాఖ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో శాఖల వారీగా సమీక్ష నిర్వహించారు. సమస్యల పరిష్కారమే ఎజెండా... మంత్రి దేవినేని మాట్లాడుతూ జిల్లాలో సమస్యల పరిష్కారమే ఎజెండాగా ముగ్గురు మంత్రులం కలసి పనిచేస్తామని చెప్పారు. జూలై రెండో వారంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పర్యటన జిల్లాలో ఉందని అధికారులతో జిల్లా సమస్యలపై సమీక్ష నిర్వహిస్తారని తెలిపారు. ప్రధానంగా ఈ ఖరీఫ్ సీజన్లో రైతులకు సకాలంలో నీరు, విత్తనాలు, ఎరువులు అందేలా వ్యవసాయ అధికారులు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని సూచించారు. జిల్లాలోని అన్ని ప్రధాన శాఖల్లో తాము తనిఖీలు చేస్తామన్నారు. ఆగస్టు కల్లా సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రి పనులు పూర్తి కావాలని, ముఖ్యమంత్రి దానిని ప్రారంభిస్తారని చెప్పారు. జిల్లాలో అనధికారికంగా ఉన్న చేపల చెరువుల విషయంలో అధికారులు సీరియస్‌గా స్పందించాలన్నారు. డెల్టా ఆధునికీకరణ పనులను వేగవంతం చేయాలని నీటిపారుదల శాఖ అధికారులను మంత్రి ఆదేశించారు. బుడమేరు ముంపు కారణంగా నగరంలోని 10 డివిజన్లు ముంపునకు గురికాకుండా ఉండేందుకు నీటిపారుదల శాఖ, ఉడా, నగరపాలకసంస్థ అధికారులు సమన్వయం చేసుకోవాలన్నారు. ఏలూరు, బందరు రైవస్ కాలువల్లో కలిసే మురుగునీటి కాల్వలను తక్షణమే మూసివేయాలని అధికారులను ఆదేశించారు. గూడూరులోని అగ్ని ప్రమాద బాధితులకు వెంటనే న్యాయం జరగాలని, ఇళ్ల నిర్మాణాలకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు. బహిరంగ మార్కెట్లో ఉల్లి ధరలు కిలో రూ.30కి చేరాయని, పౌరసరఫరాల శాఖ అధికారులు స్థానికంగా ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ధరల నియంత్రణకు చర్యలు చేపట్టాలన్నారు. సబ్స్టేషన్లకు స్థలాలు మంజూరు చేయాలి... మంత్రి కామినేని శ్రీనివాస్ మాట్లాడుతూ రానున్న ఆరునెలల్లో కృష్ణపట్నం పవర్‌ప్లాంటు నుంచి అదనపు విద్యుత్ పొందటానికి చర్యలు తీసుకోవాలని, కొత్తగా ప్రతిపాదించిన విద్యుత్ సబ్స్టేషన్లకు స్థలాలు మంజూరు చేయాలని కలెక్టర్‌కు ఆదేశించారు. పాత చెరువుల మరమ్మతులకు ఉన్న నిబంధనలను కొంత సడలించాలని సూచించారు. చెరువుల్లో పూడిక మట్టిని ట్రాక్టర్ల ద్వారా తరలించటానికి ఉన్న అభ్యంతరాలను సడలించాలని కలెక్టర్‌ను కోరారు. విద్యుత్ బకాయిలు ఉన్నాయనే కారణంతో ఎత్తిపోతల పథకాలకు, గ్రామ పంచాయతీలకు విద్యుత్ సరఫరా నిలిపివేయటం సరికాదన్నారు. మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ సుపరిపాలన అందిచటమే తమ ప్రభుత్వ ధ్యేయం అని, ఆ దిశగా అధికారులు కూడా పనిచేయాలని సూచించారు. సమీక్షలో జిల్లా కలెక్టర్ ఎం.రఘునందనరావు, జేసీ మురళీ, ఉడా వీసీ ఉషాకుమారి, సబ్ కలెక్టర్లు పాల్గొన్నారు. -
పంట కాల్వలు ఇలా..సాగుకు నీరెలా?
పూడికతీత చేపట్టలేదు రసాయనాల పిచికారీకి అనుమతులు రావాలట దుస్థితిలో పంట కాలువలు సాగుపై అన్నదాతల ఆందోళన ఖరీఫ్ సీజన్ ముంచుకొస్తోంది. మరికొద్దిరోజుల్లో రుతుపవనాలు వచ్చే అవకాశాలూ కనిపిస్తున్నాయి. దీంతో రైతులు సాగుకు సన్నద్ధమవుతున్నారు. సాగునీటిని సరఫరా చేసే పంట కాలువల పరిస్థితి మాత్రం దయనీయంగా ఉంది. అనేక కాలువలు చెత్తాచెదారం, గుర్రపుడెక్కతో నిండిపోయాయి. కాలువ గట్లు బలహీనంగా ఉన్నాయి. దెబ్బతిన్న రివిట్మెంట్లకు మరమ్మతులు లేవు. డెల్టా ఆధునికీకరణ పేరుతో కాలువల్లో పూడికతీత పనులను పక్కన పెట్టేశారు. దీంతో ఈ ఏడాది సాగు జరిగేదెలా అని అన్నదాతలు ఆందోళనకు గురవుతున్నారు. మచిలీపట్నం, న్యూస్‌లైన్ : జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో 6.34 లక్షల ఎకరాల్లో వరిసాగు జరుగుతుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. వాతావరణ పరిస్థితులు అనుకూలిస్తే జూన్ నెలాఖరు నాటికి నారుమడులు పోసుకునేందుకు రైతులు సన్నద్ధమవుతున్నారు. సాగునీటి కాలువల్లో పూడికతీతకు కనీస చర్యలు చేపట్టకపోవటంతో రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. గత నాలుగేళ్లుగా డెల్టా ఆధునికీకరణ పేరుతో సాగునీటి కాలువల్లో పూడికతీత పనులను పక్కన పెట్టేశారు. కేఈబీ తదితర కాలువలపై డెల్టా ఆధునికీకరణ పేరుతో వంతెనలను మాత్రమే నిర్మించారు. కాలువల్లో గుప్పెడు మట్టి తీసిన దాఖలాలు లేవు. 2011-12లో డెల్టా ఆధునికీకరణలో 20 శాతం, 2012-13లో కేవలం ఎనిమిది శాతం మాత్రమే పనులు చేసి సరిపెట్టారు. జిల్లా రైతులు రెండేళ్లపాటు రెండో పంటను వదులుకున్నా ఆధునికీకరణ పనులు ఆశించిన స్థాయిలో జరగలేదు. రసాయనాల పిచికారీకి అనుమతులు రావాల్సిందే... ఏటా వేసవిలో సాగునీటి కాలువల్లో పేరుకుపోయిన గుర్రపుడెక్క, తూటుకాడ, నాచులను నిర్మూలించేందుకు రసాయనాలు పిచికారీ చేస్తారు. మండు వేసవిలో ఈ రసాయనాలు పిచికారీ చేస్తే ఉపయోగం ఉంటుందని రైతులు చెబుతున్నారు. జూన్‌లో వర్షాలు కురిసే సమయంలో రసాయనాలు పిచికారీ చేసినా ఉపయోగం ఉండదనేది అధికారుల వాదన. రసాయనాలు పిచికారీ చేసిన ఒకటి రెండు రోజులకు వర్షం కురిస్తే నాచు, తూటుకాడ మళ్లీ పిలకలు తొడుగుతుందని రైతులు అంటున్నారు. ఈ ఏడాది జిల్లా వ్యాప్తంగా సాగునీటి కాలువల్లో రసాయనాలను పిచికారీ చేసేందుకు రూ.2.50 కోట్లతో అంచనాలు తయారుచేసి అనుమతుల కోసం పంపినట్లు నీటిపారుదల శాఖాధికారులు చెబుతున్నారు. ప్రభుత్వం నుంచి అనుమతి వస్తేనే రసాయనాల పిచికారీ ఉంటుందని పేర్కొంటున్నారు. ప్రభుత్వం ఈ పనులకు ఎప్పటికి అనుమతులిస్తుంది.. ఎప్పటికి పనులు పూర్తిచేస్తారనే అంశంపై రైతుల్లో సందిగ్ధత నెలకొంది. జిల్లాలోని పలు కాలువల పరిస్థితి ఇదీ... డెల్టా ప్రాంతానికి శివారున ఉన్న అవనిగడ్డ, నాగాయలంక, కోడూరు, బంటుమిల్లి, కృత్తివెన్ను మండలాలకు సాగునీటిని సరఫరా చేసే ప్రధాన కాలువల్లో కనీస పూడికతీత పనులు చేయటం లేదు. అవనిగడ్డ, కేఈబీ కాలువకు పులిగడ్డ-అవనిగడ్డల మధ్య రిటైనింగ్ వాల్ పనులు నత్తనడకన సాగుతున్నాయి. గుడివాడ తదితర ప్రాంతాల్లో బల్లిపర్రు, దోసపాడు తదితర చానళ్లు ఉన్నాయి. వీటిలో తూడుకాడ, గుర్రపుడెక్క పేరుకుపోవటంతో పాటు కాలువలు పూడుకుపోయాయి. గట్లు దెబ్బతిన్నాయి. ఈ కాలువల కనీస మరమ్మతులు ఇంతవరకు చేపట్టలేదని ఆ ప్రాంత రైతులు చెబుతున్నారు. బంటుమిల్లి చానల్‌కు సాతులూరు - చినతుమ్మిడి గ్రామాల మధ్య ఆధునికీకరణ పనుల్లో భాగంగా గత ఏడాది వంతెన నిర్మించారు. ఈ వంతెనకు అప్రోచ్ పనులను కాంట్రాక్టర్లు పక్కన పెట్టేశారని రైతులు చెబుతున్నారు. కోడూరు, నాగాయలంక కాలువలకు అండర్ టన్నెల్ నిర్మించేందుకు పునాదులు వేశారు. ఇవి నీటి ప్రవాహానికి అడ్డుగా ఉన్నాయని రైతులు మొరపెట్టుకుంటున్నా పట్టించుకునే నాథుడే లేకుండా పోయాడు. వీటి ప్రభావంతో రామకృష్ణాపురం, మందపాకల తదితర ప్రాంతాలకు సాగునీటి విడుదలలో తీవ్ర జాప్యం జరుగుతోంది. కైకలూరు, కలిదిండి తదితర ప్రాంతాలకు పోల్‌రాజ్ కాలువ, క్యాంప్‌బెల్ కాలువ, సీబీ చానల్ ద్వారా సాగునీటి సరఫరా జరుగుతోంది. ఈ ప్రధాన కాలువల్లో ఈ ఏడాది ఇంతవరకు పూడికతీత పనులే చేపట్టలేదు. క్రస్ట్ గేట్లు, లాకులకు కనీస మరమ్మతులు చేయలేదు. మైలవరంలో వెల్వడం, చెవుటూరు మేజర్ చానల్స్‌తో పాటు బొర్రగూడెం, మైనర్ కాలువలు పూడుకుపోయాయి. ఏళ్ల తరబడి ఈ కాలువలకు మరమ్మతులు చేయకపోవటంతో గట్లు దెబ్బతిన్నాయి. శివారు ప్రాంతాలకు సాగునీరు అందించేందుకు అధికంగా నీరు విడుదల చేస్తే గండ్లు పడుతున్న ఘటనలు ఏటా జరుగుతున్నాయి. దీంతో శివారుకు సాగునీందని పరిస్థితి నెలకొంటోంది. ఇబ్రహీంపట్నం కటికలపూడి ఎత్తిపోతల పథకం పనిచేయటం లేదు. ఎన్ఎస్పీ కాలువలో మూడేళ్ల క్రితం నామమాత్రంగా పూడికతీత పనులు చేశారు. ఈ పనుల వల్ల ఉపయోగం లేకుండాపోయిందని స్థానిక రైతులు చెబుతున్నారు. బందరు మండలంలోని నాగులేరు, రామరాజుపాలెం కాలువలకు గత పదేళ్లుగా మరమ్మతులు చేయలేదు. పూడికతీత పనులు చేపట్టలేదు. రామరాజుపాలెం కాలువ ద్వారా బందరు, పెడన, గూడూరు మండలాలకు సాగునీరు విడుదలవుతుంది. ఈ కాలువ గట్లు బలహీనంగా మారాయి. గూడూరు సమీపంలో కాలువ గట్లకు రివిట్మెంట్ పూర్తిగా దెబ్బతింది. కనీస మరమ్మతులు ఇక్కడ చేయటం లేదు. పెడన మండలానికి సాగునీటిని సరఫరా చేసే న్యూ ఎస్వీఎస్, ఓల్డ్ ఎస్వీఎస్, పుల్లపాడు చానళ్లకు పదేళ్లుగా మరమ్మతులు లేవు. దీంతో ఈ కాలువలు పూడుకుపోయి శివారు ప్రాంతాలకు సాగునీరందని పరిస్థితి నెలకొంది. -
పనులను పరుగెత్తించండి
ఏలూరు, న్యూస్‌లైన్ :డెల్టా ఆధునికీకరణ, ఇతర సాగునీటి ప్రాజెక్టుల పనులు వేగవంతం చేయూలని కలెక్టర్ సిద్ధార్థజైన్ నీటిపారుదల శాఖ అధికారులను ఆదేశించారు. ఇందుకోసం ప్రతినెలా ఇరి గేషన్ డే పాటించాలన్నారు. డెల్టా ఆధునికీకరణ పనులు, భూసేకరణ తదితర అంశాలపై కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో సంబంధిత శాఖల అధికారులతో శుక్రవారం ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులకు శాశ్వత ప్రయోజనం చేకూర్చేందుకు కాలువలు, డ్రెరుున్ల మరమ్మతు పనులను వేగంగా పూర్తి చేయూలన్నారు. ఈ అంశాలపై క్షేత్రస్థారుులో అధికారి, పనివారీగా సమీక్ష నిర్వహిస్తామని కలెక్టర్ తెలిపారు. పనుల్లో జాప్యాన్ని, నిర్లక్ష్యాన్ని సహించబోమని హెచ్చరించారు. కాలువల మూసివేతతో సంబంధం లేని పనులను తక్షణమే చేపట్టి సకాలంలో పూర్తి చేయూలని ఆదేశించారు. సేకరించిన భూమిని తక్షణమే ఇరిగేషన్ అధికారులకు అప్పగించాలని భూసేకరణ అధికారులకు సూచించారు. డెల్టా కాలువల ఆధునికీకరణ పనులు ఏ ప్రాంతంలో చేపట్టారనే విషయంతోపాటు వాటి వివరాలను ఆయా ప్రాంతాల్లోని రైతులకు, నీటి సంఘాల ప్రతినిధులకు తెలి యజేయాలన్నారు. దీనివల్ల పనుల్లో పారద ర్శకత పెరుగుతుందన్నారు. సమావేశంలో ఇరి గేషన్ ఎస్ఈ వైఎస్ సుధాకర్, వ్యవసాయశాఖ జే డీ వీడీవీ కృపాదాస్, ఇందిరాసాగర్ ప్రాజెక్టు డెప్యూటీ కలెక్టర్ నాగలక్ష్మి పాల్గొన్నారు. -
సాగు.....జాగు !
=నీటి విడుదలకు సర్కారు పచ్చజెండా =సమాయత్తంకాని వ్యవసాయ శాఖ =అధికారుల సమన్వయలోపం.. రైతుకు శాపం =జిల్లాలో దాళ్వాపై కొరవడిన స్పష్టత సాక్షి, మచిలీపట్నం : డెల్టా ఆధునికీకరణ సాకుతో జిల్లాలో రెండేళ్లుగా దాళ్వా లేదు. కృష్ణా ఈస్ట్ బ్రాంచి (కేఈబీ) కెనాల్‌పై ఉన్న ఆయకట్టుకు మాత్రం మూడేళ్లుగా రబీ సాగు ఇవ్వలేదు. పోనీ ఆధునికీకరణ పనులన్నా బాగా జరిగాయా అంటే అదీ లేదు. గత మూడేళ్లలో కేవలం 20 శాతం మాత్రమే అయ్యాయనిపించారు. సాగునీరివ్వలేక డెల్టా ఆధునికీకరణ ముసుగు వేసి జిల్లా రైతాంగానికి రబీసాగు లేకుండా మొండిచెయ్యి చూపించారు. ఎట్టకేలకు దాళ్వాకు నీరిస్తామని ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన నీటిపారుదల శాఖ ఉన్నత స్థాయి సమావేశం నిర్ణయించింది. జిల్లాలో సుమారు మూడు లక్షల ఎకరాల్లో వరి, మరో 3.50 లక్షల ఎకరాల్లో ఆరుతడి పంటలకు సాగునీరు ఇచ్చేందుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. ఈ నెలాఖరులోగా నీటి విడుదలకు నీటిపారుదల శాఖ కసరత్తు చేస్తోంది. సాగునీటి విడుదల జాప్యంతో దాళ్వా సాగు ఆలస్యమయ్యే అవకాశం ఉంది. నెలాఖరులోగా నీటిని విడుదల చేస్తే అప్పుడు నారుమళ్లు వేస్తే వరినాట్లు వేసేసరికి జనవరి నెలాఖరు, ఫిబ్రవరి మొదటి వారం అవుతుంది. రైతుల్లో అయోమయం.. సాగు విషయంలో అధికారికంగా ఇప్పటికీ స్పష్టతలేకపోవడంతో రైతుల్లో అయోమయం నెలకొంది. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే కాలువలు, డ్రైయిన్లను ఆనుకుని ఉన్న రైతులు ఆయిల్ ఇంజిన్ల సాయంతో నీరు తోడుకుని వరి నారుమడులు సిద్ధం చేసుకుంటున్నారు. దాళ్వా ఉంటుందో లేదో తెలియక మరికొన్ని చోట్ల ఆరుతడి పంటలవైపు రైతులు దృష్టి పెట్టారు. భారీ వర్షాలు, తుపానులకు జరిగిన పంట నష్టాల అంచనాలపై పూర్తిస్థాయిలో దృష్టిపెట్టిన వ్యవసాయ శాఖ.. దాళ్వాను మరిచిపోయినట్లుంది. దాళ్వాకు అనుమతిస్తే ఎకరాకు కనీసం 25 కిలోల విత్తనాలు అవసరమవుతాయి. ఈ లెక్కన కనీసం మూడు లక్షల ఎకరాల్లో సాగుకు 75 లక్షల కిలోల వరి విత్తనాలు కావాల్సి ఉంటుంది. దాళ్వాలో ఎంటీయూ 1001, ఎంటీయూ 1010 రకాలను రైతులు సాగు చేస్తారు. రైతుల వద్ద ప్రస్తుతం విత్తనాలు ఉండే అవకాశం లేనందున ఏపీ సీడ్స్ కార్పొరేషన్, ఇతర ప్రైవేటు విత్తన వ్యాపారుల వద్ద విత్తనాలను సిద్ధం చేయడంలో వ్యవసాయ శాఖ దృష్టి సారించాల్సి ఉంది. దీనికితోడు రబీ సాగుకు అవసరమైన ఎరువులను కూడా తగినంత నిల్వలను సిద్ధం చేసేలా వ్యవసాయ శాఖ ఇప్పటి నుంచే కసరత్తు చేయాల్సి ఉంటుంది. -
వీడని ముంపు
=భారీవర్షాలకు నీటమునిగిన పంటలు = రెండు క్రాప్హాలిడేలు ఇచ్చినా జరగని పనులు =ఆధునికీకరణ పూర్తయితే నష్టం తప్పేది =ఈ నిర్లక్ష్యం ప్రభుత్వానిదే అంటున్న అన్నదాతలు జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రూ. 683 కోట్ల నష్టం వాటిల్లింది. డెల్టాలో 39 వేల హెక్టార్లలో వరి పంట ముంపు బారిన పడింది. డెల్టా ఆధునికీకరణ పనులు పూర్తయితే రైతులకు ఇంత పంట నష్టం జరిగేది కాదు. వైఎస్ రాజశేఖరరెడ్డి మరణానంతరం డెల్టా ఆధునికీకరణ పనులపై ప్రభుత్వం శ్రద్ధ చూపడం లేదు. ఆ పనులు పూర్తయితే తమ కష్టాలు తీరతాయన్న భావనతో రైతన్న వరుసగా రెండేళ్లపాటు రబీలో క్రాప్హాలిడేకి అంగీకరించినా.. పనులు మాత్రం మూడో వంతు కూడా పూర్తికాలేదు. అసలు సర్కారు నిర్లక్ష్యం వల్లే తమకీ దుర్గతి పట్టిందని ఆరోపిస్తున్నారు. సాక్షి, విజయవాడ : జిల్లాలో ఆధునికీకరణ పనులు నత్తనడకన జరుగుతుండడంతో రైతులను ముంపు బెడద వెంటాడుతోంది. చాలా ప్యాకేజీల గడువు ఈ ఏడాది డిసెంబర్‌కు ముగుస్తుండగా, కొన్ని ప్యాకేజీలు ఇప్పటికే అదనపు గడువు తీసుకున్నాయి. అయినా ఇప్పటివరకు జరిగిన పనులు చూస్తే మరో పదేళ్లయినా ఆధునికీకరణ పూర్తయ్యే అవకాశం కనపడడం లేదు. రెండుసార్లు క్రాప్‌హాలిడే ప్రకటించినా పనులు అనుకున్న స్థాయిలో జరగలేదు. గత ఏడాది సీఎం కిరణ్ కనీసం సమీక్షలైనా చేశారు. ఈ ఏడాది ఉన్నతస్థాయి సమీక్షలు జరిగిన పాపాన పోలేదు. అధికార పార్టీ ప్రజాప్రతినిధులు వీటిని పట్టించుకోవడం లేదు. అధికారులు కూడా మొక్కుబడిగానే పనులు పూర్తి చేయించారు. రైతాంగానికి ఉపయోగపడేలా కాల్వలు వెడల్పు చేయడం, డ్రైనేజీలలో డ్రెడ్జింగ్ పనులు చేసి ఉంటే పొలాల్లో నుంచి నీరు త్వరగా వెళ్లిపోయి ఉండేది. కాంట్రాక్టర్లు అసలు కాలువలను వెడల్పు చేయడం, లైనింగ్ పనులు మాని బ్రిడ్జిలు, రెగ్యులేటర్ల నిర్మాణానికే పరిమితం కావటం వల్ల ఇప్పటివరకూ జరిగిన పనులు కూడా రైతులకు ఉపయోగం లేకుండా పోయాయి. కీలక ప్రాంతాల్లో కాల్వల లైనింగ్ పనులు ప్రారంభమే కాలేదు. ఆధునికీకరణకు వైఎస్ నిర్ణయం.. గతంలో ఓగ్ని తుపాను సమయంలో డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేక జిల్లా వ్యాప్తంగా పంటపొలాలు నీట మునిగాయి. డెల్టా ప్రాంతంలో వారం రోజుల పాటు నీరు పొలాల నుంచి బయటకు వెళ్లని పరిస్థితి ఏర్పడింది. జిల్లా పర్యటనకు వచ్చిన అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి పరిస్థితిని లోతుగా సమీక్షించారు. 150 ఏళ్ల క్రితం ఏర్పాటు చేసిన సాగునీటి విధానం తప్ప, ఆ తర్వాత కాలంలో ఎటువంటి ఆధునికీకరణ జరగలేదని గుర్తించారు. దీంతో డెల్టాను పూర్తిస్థాయిలో ఆధునికీకరించాలని నిర్ణయించారు. కృష్ణా తూర్పు డెల్టాలో పంట కాల్వల ఆధునికీకరణకు 20 ప్యాకేజీలుగా టెండర్లు పిలిచారు. ఇందుకు రూ. 2,180 కోట్లకు పరిపాలనాపరంగా అనుమతి లభించింది. 14 ప్యాకేజీల కింద రూ. 1429.25 కోట్ల పనులకు ఆమోద ముద్ర పడింది. మొబలైజేషన్ అడ్వాన్సుల కింద రూ. 45.64 కోట్లు చెల్లించారు. ఐదేళ్లలో ఇప్పటివరకూ ఖర్చు పెట్టింది రూ. 412.32 కోట్లు మాత్రమే. ఈ సీజన్లో రూ. 429 కోట్ల విలువైన డెల్టా ఆధునీకరణ పనులు లక్ష్యంగా ఇరిగేషన్ అధికారులు నిర్ణయించారు. తర్వాత దీన్ని రూ. 327 కోట్లకు కుదించారు. ఈ సీజన్ కూడా పూర్తి అయిన తర్వాత చేసింది సగం కూడా లేదు. కేవలం రూ. 161 కోట్ల పనులు చేయించి మమ అనిపించారు. రైవస్ కాల్వ కిందే అధిక ఆయకట్టు.. తూర్పు డెల్టాలో కేఈ మెయిన్ కెనాల్ నుంచి తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద ఏలూరు, రైవస్, బందరు కాల్వలుగా విడిపోతుంది. ఒక్క రైవస్ కాల్వ కిందే ఎక్కువ ఆయకట్టు ఉంది. ఈ మూడు కాల్వలను నగరంలో వాటి సామర్ధ్యానికి అనుగుణంగా విస్తరించి లైనింగ్ చేయాల్సి ఉంది. వీటిని ఒకటో ప్యాకేజీలో చేర్చారు. సుమారు రూ. 204 కోట్ల విలువైన ఈ ప్యాకేజీ కింద కృష్ణామెయిన్ కెనాల్, ఏలూరు, బందర్ కాల్వలపై రెగ్యులేటర్ల పనులు మాత్రమే జరుగుతున్నాయి. రైవస్ కాల్వపై రెగ్యులేటర్ ఈ మధ్య కాలంలోనే నిర్మించడంతో గేట్లు మాత్రమే మారుస్తున్నారు. దిగువ ప్రాంతంలో లైనింగ్ పనులు జరుగుతున్నాయి. కాంట్రాక్టర్లు రెగ్యులేటర్లను పూర్తి చేసి చేతులు దులుపుకొనే అవకాశం కనపడుతోంది. అసలు బందరు కాల్వ ఆధునికకీరణకు ఇప్పటి వరకూ టెండర్లు రాలేదు.