పనులను పరుగెత్తించండి | Delta modernization, and other irrigation projects, irrigation works in order | Sakshi
Sakshi News home page

పనులను పరుగెత్తించండి

Published Sat, Dec 28 2013 2:21 AM | Last Updated on Sat, Sep 2 2017 2:01 AM

డెల్టా ఆధునికీకరణ, ఇతర సాగునీటి ప్రాజెక్టుల పనులు వేగవంతం చేయూలని కలెక్టర్ సిద్ధార్థజైన్ నీటిపారుదల శాఖ అధికారులను ఆదేశించారు.

ఏలూరు, న్యూస్‌లైన్ :డెల్టా ఆధునికీకరణ, ఇతర సాగునీటి ప్రాజెక్టుల పనులు వేగవంతం చేయూలని కలెక్టర్ సిద్ధార్థజైన్ నీటిపారుదల శాఖ అధికారులను ఆదేశించారు. ఇందుకోసం ప్రతినెలా ఇరి గేషన్ డే పాటించాలన్నారు. డెల్టా ఆధునికీకరణ పనులు, భూసేకరణ తదితర అంశాలపై కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో సంబంధిత శాఖల అధికారులతో శుక్రవారం ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులకు శాశ్వత ప్రయోజనం చేకూర్చేందుకు కాలువలు, డ్రెరుున్ల మరమ్మతు పనులను వేగంగా పూర్తి చేయూలన్నారు. ఈ అంశాలపై క్షేత్రస్థారుులో అధికారి, పనివారీగా సమీక్ష నిర్వహిస్తామని కలెక్టర్ తెలిపారు. పనుల్లో జాప్యాన్ని, నిర్లక్ష్యాన్ని సహించబోమని హెచ్చరించారు. 
 
 కాలువల మూసివేతతో సంబంధం లేని పనులను తక్షణమే చేపట్టి సకాలంలో పూర్తి చేయూలని ఆదేశించారు. సేకరించిన భూమిని తక్షణమే ఇరిగేషన్ అధికారులకు అప్పగించాలని భూసేకరణ అధికారులకు సూచించారు. డెల్టా కాలువల ఆధునికీకరణ పనులు ఏ ప్రాంతంలో చేపట్టారనే విషయంతోపాటు వాటి వివరాలను ఆయా ప్రాంతాల్లోని రైతులకు, నీటి సంఘాల ప్రతినిధులకు తెలి యజేయాలన్నారు. దీనివల్ల పనుల్లో పారద ర్శకత పెరుగుతుందన్నారు. సమావేశంలో ఇరి గేషన్ ఎస్‌ఈ వైఎస్ సుధాకర్, వ్యవసాయశాఖ జే డీ వీడీవీ కృపాదాస్, ఇందిరాసాగర్ ప్రాజెక్టు డెప్యూటీ కలెక్టర్ నాగలక్ష్మి పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement