
వైభవంగా మనోజ్-ప్రణతిరెడ్డి నిశ్చితార్థం
హైదరాబాద్ : యువ హీరో మంచు మనోజ్- ప్రణతిరెడ్డిల నిశ్చితార్థ వేడుక వైభవంగా జరిగింది. బుధవారం ఉదయం పార్క్ హయత్ హోటల్లో జరిగిన ఈ నిశ్చితార్థ వేడుకకు సినీ, రాజకీయ ప్రముఖులు విచ్చేశారు. కాబోయే వధువరూలు మనోజ్-ప్రణతిలను ఆశీర్వదించారు. అంతకు ముందు పురోహితులు ప్రణతిరెడ్డితో గౌరీపూజ, మనోజ్తో పూజ చేయించారు. అనంతరం మనోజ్-ప్రణతి తల్లిదండ్రులు లగ్నపత్రిక మార్చుకున్నారు. ఆ తర్వాత మనోజ్-ప్రణతి పరస్పరం ఉంగరాలు మార్చుకున్నారు.
ఈ వేడుకకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, వైఎస్ విజయమ్మ, భూమన కరుణాకర్ రెడ్డి, సుశీల్ కుమార్ షిండే, నిమ్మగడ్డ ప్రసాద్, తలసాని శ్రీనివాస్ యాదవ్, తమ్మారెడ్డి భరద్వాజ, అలీ, జస్టిస్ చలమేశ్వర్, దాసరి నారాయణరావు, పరుచూరి గోపాలకృష్ణ, బ్రహ్మాజీ, తాప్సీ, జయప్రద, శ్యాంప్రసాద్ రెడ్డి, తదితరులు హాజరయ్యారు.