ప్రభాస్పై మోహన్ బాబు అలిగారా? | Prabhas attend Manchu manoj marriage | Sakshi
Sakshi News home page

ప్రభాస్పై మోహన్ బాబు అలిగారా?

May 20 2015 11:14 AM | Updated on Sep 3 2017 2:23 AM

ప్రభాస్పై మోహన్ బాబు అలిగారా?

ప్రభాస్పై మోహన్ బాబు అలిగారా?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్పై మంచు మోహన్ బాబు అలిగారట. పెళ్లికి ఆలస్యంగా రావటంతో పాటు కుటుంబ సభ్యులను తీసుకు రాలేదని ...

హైదరాబాద్ : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్పై మంచు మోహన్ బాబు అలిగారట.  పెళ్లికి ఆలస్యంగా రావటంతో పాటు కుటుంబ సభ్యులను తీసుకు రాలేదని ఆయన కొద్దిసేపు ప్రభాస్పై అలక వహించినట్లు తెలుస్తోంది. దాంతో ప్రభాస్, మోహన్బాబును గట్టిగా హత్తుకుని, గెడ్డం పట్టుకుని బతిమాలి.. నూతన వధూవరుల దగ్గరకు అలాగే వెళ్లారు.

అనంతరం పెళ్లికొడుకు, పెళ్లికూతుర్ని అక్షింతలు వేసి ఆశీర్వదించాలని మోహన్ బాబు కోరగా వద్దులే ఎందుకు కలిసి ఫొటోలు దిగుదామంటూ... ఫొటోలు తీయించుకున్నారు. అయినా కూడా మోహన్ బాబు ఊరుకోకుండా కొత్త దంపతులతో ప్రభాస్ కాళ్లకు దండం పెట్టించి, అక్షింతలు వేయించారు. ఇక ఛత్రపతి సినిమాలో కాట్రాజుగా చేసిన సుప్రీత్ కూడా ప్రభాస్తో కలిసి సందడి చేశారు. అలాగే లక్ష్మీ ప్రసన్న కూతురు విద్యానిర్వాణతో ప్రభాస్ ముచ్చట్లు పెట్టాడు. ఈ సందర్భంగా ప్రభాస్తో పలువురు ఫొటోలు దిగారు. ఇక తమిళ హీరో సూర్య, హీరో రాజశేఖర్, జమున, తదితరులు విచ్చేశారు.

మరోవైపు తెలంగాణ రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల, మాజీ మంత్రి డీకే అరుణ విచ్చేసి మనోజ్, ప్రణతి దంపతులను ఆశీర్వదించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement