సంగీత్కు 'తారలు' దిగి వచ్చారు | Today Manchu Manoj-Pranathi sangeeth Ceremony, dance with the starts | Sakshi
Sakshi News home page

సంగీత్కు 'తారలు' దిగి వచ్చారు

Published Tue, May 19 2015 11:13 AM | Last Updated on Tue, Oct 16 2018 2:49 PM

Today Manchu Manoj-Pranathi sangeeth Ceremony, dance with the starts

మంచువారి ఇంట్లో జరిగిన మనోజ్ సంగీత్ కార్యక్రమానికి 'తారలు' దిగి వచ్చారు.  సంగీత్ కార్యక్రమంలో నాటి తరం నటీనటుల నుంచి నేటి తరం యంగ్ హీరోహీరోయిన్లు స్టెప్స్ వేశారు. కొడుకు పెళ్లి సందడిలో మునిగి తేలుతున్న మోహన్ బాబు కూడా ఉత్సాహంగా నృత్యం చేశారు.  ఇక మంచు లక్ష్మి, ఆండ్రీ అయితే ఓ రేంజ్లో డాన్స్ చేసి దుమ్ము రేపారు. వారిద్దరి కలిసి ఓ పాటకు చేసిన డాన్స్ హైలెట్గా నిలిచింది. . ఈ నెల 20వ తేదీ బుధవారం ఉదయం 9.10 గంటలకు మనోజ్-ప్రణతి వివాహం జరుగబోతున్న విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి ఏర్పాటు చేసిన సంగీత్ కార్యక్రమంలో వధువరుల కుటుంబాలతో పాటు పలువురు సినీ తారలు హాజరై సందడి చేశారు.  హైదరాబాద్లోని పార్క్ హయత్ హోటల్ ఈ వేడుకకు వేదికైంది.  తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ సినిమా రంగాలకు చెందిన సినీస్టార్స్ ...మనోజ్ సంగీత్ ఫంక్షన్లో పాల్గొన్నారు.

ఈ వేడుకలో కాబోయే వధూవరులు, మోహన్ బాబు తనతో నటించిన హీరోయిన్లు జయసుధ, సుమలత, రవీనా టండన్తో కలిసి డాన్స్ చేస్తే... ఇక మంచు విష్ణు, వెరొనికా ఓ తెలుగు పాటకు నృత్యం చేశారు.

తమిళ చిత్ర పరిశ్రమ నుంచి హీరో ఆర్య, త్రిష, హన్సికతో పాటు పలువురు హాజరు కాగా, ఇక టాలీవుడ్ యంగ్ యాక్టర్స్ అల్లరి నరేష్, నాని, శ్రీకాంత్, హీరో బాలకృష్ణతో పాటు రాజకీయ నేతలు సుశీల్ కుమార్ షిండే, దానం నాగేందర్, కేవీపీ రామచంద్రరావుతో పాటు పలువురు హాజరయ్యారు. మే 16న మంచు మనోజ్ను పెళ్లికొడుకు చేసిన కార్యక్రమం కూడా కుటుంబ సభ్యులు గ్రాండ్గా నిర్వహించిన విషయం తెలిసిందే.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement