మంచువారి 'పెళ్లికొడుకు' | Manchu manoj turns pellikoduku | Sakshi
Sakshi News home page

మంచువారి 'పెళ్లికొడుకు'

Published Sat, May 16 2015 10:37 AM | Last Updated on Tue, Oct 16 2018 2:49 PM

మంచువారి 'పెళ్లికొడుకు' - Sakshi

మంచువారి 'పెళ్లికొడుకు'

మంచువారి ఫ్యామిలీ పెళ్లి సందడిలో మునిగితేలుతోంది. ప్రముఖ నటుడు మోహన్ బాబు చిన్న కుమారుడు మనోజ్ ఈ నెల 20న స్నేహితురాలు ప్రణీత మెడలో మూడుముళ్లు వేయబోతున్నాడు. పెళ్లి దగ్గర పడుతుండటంతో ఆ కుటుంబంలో పెళ్లి పనుల్లో తలమునకలై ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే వారింట పెళ్లి సందడి ధూమ్ ధామ్గా మొదలైంది. మార్చి 4న మనోజ్-ప్రణితల నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే.

కుటుంబ సభ్యులు గురువారం సొట్ట బుగ్గల చిన్నోడు... మనోజ్ను పెళ్లి కొడుకును చేశారు. మనోజ్తో కలిసి మోహన్ బాబు ఆయన సతీమణి నిర్మల, విష్ణు, వెరోనిక, లక్ష్మిప్రసన్న, ఆండీ శ్రీనివాస్, విష్ణు ఇద్దరు కూతుళ్లు దిగిన ఫ్యామిలీ ఫోటో స్పెషల్ ఎట్రాక్షన్గా నిలిచింది. ఇక  శంషాబాద్లోని మోహన్ బాబు నివాసంలో జరిగిన ఈ కార్యక్రమానికి కుటుంబ సన్నిహితులతో పాటు పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. చిరంజీవి,బాలకృష్ణ,రవితేజ, జూనియర్ ఎన్టీఆర్ సతీమణి ప్రణతి,ఊహాతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, వైఎస్. భారతి, శిల్పారెడ్డి తదితరులు విచ్చేసి కాబోయే పెళ్లికొడుకు ఆశీర్వదించారు.

కాగా ఈ నెల 17న నగరంలోని ఓ స్టార్ హోటల్లో సంగీత్ నిర్వహించనున్నారు. ఇందుకోసం మంచు ఫ్యామిలీ..ఓ నృత్య దర్శకుడి ఆధ్వర్యంలో రిహార్సిల్ కూడా చేసినట్లు సమాచారం.ఈ సంగీత్ కార్యక్రమానికి మంచు లక్ష్మి యాంకరింగ్ చేయనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement