childrens film
-
'తొలి పాన్ ఇండియా బాలల చిత్రం ‘లిల్లీ’గా గుర్తుండిపోతుంది'
'తొలి పాన్ ఇండియా బాలల చిత్రం ‘లిల్లీ’. ఈ సినిమాకి తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లోనూ మంచి స్పందన వస్తోంది. మా చిత్రాన్ని ఇండియాలోని అన్ని పాఠశాలల విద్యార్థులకు చూపించాలనేది మా లక్ష్యం' అని డైరెక్టర్ శివమ్ అన్నారు. బేబీ నేహా, బేబీ ప్రణతి రెడ్డి, మాస్టర్ వేదాంత్ వర్మ తదితరులు నటించిన బాలల చిత్రం ‘లిల్లీ’. శివమ్ దర్శకత్వంలో కె. బాబురెడ్డి, సతీష్ కుమార్ .జి నిర్మించిన ఈ సినిమా శుక్రవారం (జూలై 7న) పాన్ ఇండియా స్థాయిలో విడుదలైంది. ఈ సందర్భంగా శివమ్ మాట్లాడుతూ– 'కృష్ణా జిల్లాలోని పెదమద్దాలి నా స్వస్థలం. డైరెక్టర్ కావాలనుకుని 13ఏళ్ల కిందట హైదరాబాద్ వచ్చా. రైటర్‌గా, అసిస్టెంట్ డైరెక్టర్‌గా, యాడ్ ఫిల్మ్ మేకర్‌గా చేశాను. మణిరత్నంగారి ‘అంజలి’ స్ఫూర్తితో చిన్న పిల్లలతో ఓ సినిమా చేద్దామని ‘లిల్లీ’ కథ రాశాను. నేనే డైరెక్టర్‌గా, నిర్మాతగా ఈ సినిమాని స్టార్ట్ చేశాను. నా కాన్సెప్ట్, ఔట్పుట్ బాబురెడ్డిగారికి నచ్చడంతో ‘లిల్లీ’ని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో చేద్దామన్నారు. ఈ చిత్రంలో నటించిన పిల్లలందరూ కడపకు చెందిన కొత్తవారే. ఈ సినిమాని రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేసింది. నేను డైరెక్టర్ అయ్యేందుకు ప్రోత్సహించిన మా నాన్న నాంచారయ్య, అమ్మ వెంకటలక్ష్మి, నా భార్య సుధా శక్తి, ఫ్రెండ్స్‌కి, చాన్స్ ఇచ్చిన బాబురెడ్డిగారికి కృతజ్ఞతలు. గోపురం బ్యానర్లోనే నాలుగు సినిమాలు సైన్ చేశాను' అన్నారు. -
వండర్ బుక్‌లో ‘ఆదిత్య’కు చోటు
బాలల చిత్రం ‘‘ఆదిత్య’ క్రియేటివ్ జినియస్’కి వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ మరియు జీనియస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ పురస్కారం రావడంపై తమిళనాడు మాజీ గవర్నర్ కె.రోశయ్య హర్షం వ్యక్తం చేశారు. భీమగాని సుధాకర్ గౌడ్ స్వీయ దర్శకత్వంలో ఈ బాలల చిత్రాన్ని రూపొందించారు. నవంబర్4, 2015న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా విశ్లేషకుల ప్రశంసలు అందుకుంది. 19వ అంతర్జాతీయ బాలల చిత్రోత్సవాల్లో ఏకైక తెలుగు చిత్రంగా పురస్కారం గెల్చుకుంది. గతేడాది సెప్టెంబర్ లో జరిగిన ఇండీవుడ్ చిత్రోత్సవంలో అవార్డ్‌ను అందుకుంది. దాదాపు వంద దేశాల్లో అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో ప్రదర్శితమైన ఘనత పొందింది ఆదిత్య క్రియేటివ్ జీనియస్. వంద శాతం పన్ను రాయితీ పొందిన బాలల చిత్రంగా కూడా పేరు తెచ్చుకుంది. ఈ సందర్భంగా చిత్రయూనిట్ అభిమానులతో తమ ఆనందాన్ని పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో తమిళనాడు మాజీ గవర్నర్ రోశయ్య, నటులు బ్రహ్మానందం, సుమన్, చిత్రయూనిట్ పాల్గొన్నారు. -
చిన్నారులకు ప్రేరణ కలిగించేలా ‘చిరు తేజ్ సింగ్’
ప్రస్తుతం వెండితెర మీద బయోపిక్‌ల ట్రెండ్ నడుస్తోంది. అద్భుత విజయాలు సాధించిన ఎంతో మంది విజయగాథాలు సినిమాలుగా రూపొందుతున్నాయి. అదే ఫార్ములా ఇప్పుడు షార్ట్ ఫిలింస్‌లోనూ కనిపిస్తుంది. తన మేధాశక్తితో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న చిన్నారి చిరు తేజ్ సింగ్ జీవిత కథ ఆధారంగా తన పేరుతోనే తనే ప్రధాన పాత్రలో ఓ లఘు చిత్రాన్ని తెరకెక్కించారు. N.S NAIK నిర్మాతగా అవార్డ్ విన్నింగ్ లఘు చిత్రాల దర్శకులు డా. ఆనంద్ కుమార్ దర్శకత్వంలో ఈ షార్ట్ ఫిలిం రూపొందింది. ఫ్యాషన్ డిజైనర్ ఫేమ్ మనాలి రాథోడ్, కాటమరాయుడు ఫేమ్ సౌమ్యవేణుగోపాల్ ప్రధానపాత్రల్లో నటించారు. కేవలం 3 నిమిషాల వ్యవధిలో 236 ప్రపంచ పటాలను గుర్తించి, బాల మేధావిగా ఎన్నో పతకాలను, ప్రశంసలను సొంతం చేసుకొని తెలుగు జాతి, మరియు భారతదేశ ప్రతిష్టను పెంచిన చిరుతేజ్ సింగ్ చిత్రం విశ్లేషకులు ప్రశంసలు అందుకుంటోంది. తల్లి కూతురి మధ్య ప్రేమ, టీచర్ స్టూడెంట్ మధ్య వున్న ఆసక్తికరమైన మనసుకు హత్తుకునే సన్నివేశాలతో ఎంతోమంది చిన్నారులకు ప్రేరణ కలిగించేలా ఈ లఘు చిత్రాన్ని రూపొందించారు దర్శకులు డాక్టర్ ఆనంద్ కుమార్. ఈ చిత్రాన్ని ప్రత్యేకంగా అనాధ పిల్లకోసం అన్నపూర్ణ స్టూడియో ప్రివ్యూ థియేటర్ లో వేయడం జరిగింది. వారితో పాటు ఈ షార్ట్ ఫిలిం చూసిన సమంత యూనిట్ సభ్యులకు అభినందనలు తెలియచేశారు. నిర్మాత రాజ్ కందుకూరి,దర్శకులు మధుర శ్రీధర్, వీరశంకర్, సాగర్ చంద్ర, సంగీత దర్శకులు రఘు కుంచె, యువ హీరో అభిజిత్, నటి సీత నారాయణ్‌లతో పాటు ఎంతోమంది సినీ ప్రముఖులు ఈ ప్రయత్నాన్ని ప్రశంసించారు. -
పిడుగుల్లాంటి పిల్లలతో ‘సంగుచక్రం’
తమిళ సినిమా: మైడియర్ కుట్టి సాతాన్ చిత్రం తరహాలో సంగుచక్రం చిత్రం ఉంటుందని ఆ చిత్ర దర్శకుడు మారశన్ పేర్కొన్నారు. ఇంతకుముందు నడువుల కొంచెం పక్కత్తు కానోమ్, ఇదర్కుదానే ఆశైపట్టాయ్ బాలకుమారా వంటి విజయవంతమైన చిత్రాలను నిర్మించిన లియోవిజన్ వీఎస్.రాజ్‌కుమార్, సినిమావాలా పిక్చర్స్ కే.సతీష్ కలిసి నిర్మించిన తాజా చిత్రం సంగుచక్రం. ఈ సినిమాలో దిలీప్ సుబ్బరాయన్, గీతా, జర్నిరోస్తో పాటు పలువురు బాల తారలు ప్రధాన పాత్రలు పోషించారు. ఫబీర్ సంగీతం అందించిన ఈ చిత్రం ఈ నెల 29న విడుదలకు సిద్ధం అవుతోంది. ఈ సందర్భంగా చిత్రయనిట్ చెన్నైలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో దర్శకుడు తెలుపుతూ.. ఇది పిల్లల ఇతి వృత్తంతో కూడిన వినోదాన్ని మేళవించిన హారర్ థ్రిల్లర్ కథా చిత్రంగా ఉంటుందన్నారు. ఇందులో పది మందికి పైగా బాల తారలు ముఖ్య పాత్రల్లో నటించారని చెప్పారు. 30 ఏళ్ల క్రితం తెరపైకి వచ్చి అనూహ్య విజయాన్ని సొంతం చేసుకున్న మైడియర్ కుట్టి సాతాన్ చిత్రం తరహాలో దెయ్యం ఇతి వృత్తంతో సాగే కథా చిత్రం ఇదని తెలిపారు. చిత్రంలో పిల్లలే దెయాన్ని భయపెడతారని చెప్పారు. ఇందులో కథానాయకిగా నటించిన గీత షూటింగ్ 20 రోజుల్లో భూమి మీద ఉన్న దాని కంటే తాడుతో కట్టబడి పైన వేలాడిన రోజులే అధికం అని చెప్పారు. అయినా పాత్రకు ప్రాధాన్యత ఉండటంతో గీత నొప్పిని భరించి నటించారని తెలిపారు. చిత్రాన్ని ఈ నెల 29న విడుదల చేయనున్నట్లు దర్శకుడు మారీశన్ తెలిపారు. ఈయన అసలు పేరు రంజిత్. మరణించిన తన తండ్రి మారి జ్ఞాపకార్థం తన పేరును మారీశన్‌గా మార్చుకున్నారు. -
పిల్లల కోసం సినిమా తీస్తున్న సూర్య
తమిళంతో పాటు తెలుగులో కూడా అభిమానులను సొంతం చేసుకున్న సూర్య.. ఇప్పుడు పిల్లల కోసం ఓ సినిమా తీస్తున్నారు. ఇంకా పేరు పెట్టని ఈ సినిమాకు పాండిరాజ్ దర్శకత్వం వహిస్తారు. సింగం-2 విజయంతో మంచి ఊపుమీదున్న సూర్య.. ఇప్పుడు కొత్తగా పిల్లల చిత్రం తీయడానికి సిద్ధమయ్యారు. ఈ సినిమాకు ఆయన నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సినిమా కథను తాను సూర్యకు చెప్పగానే వెంటనే ఆయన దాన్ని నిర్మించడానికి ఒప్పుకొన్నారని, ఈ తరహా సినిమాలు పిల్లలను బాగా ఆకట్టుకుంటాయని చెప్పారని పాండ్యరాజ్ తెలిపారు. ఇప్పటికే షూటింగ్ కూడా మొదలైపోయిందని అన్నారు. ఈ సినిమాలో ఇద్దరు పిల్లలు ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. దీన్ని దర్శకుడు పాండిరాజ్, సూర్యల సొంత బేనర్ 2డి ఎంటర్టైన్మెంట్ మీద తీస్తున్నారు. జాతీయ అవార్డు పొందిన తమిళ పిల్లల చిత్రం పసంగాకు కూడా పాండిరాజే దర్శకుడు.