బాలల చిత్రం ‘‘ఆదిత్య’ క్రియేటివ్ జినియస్’కి వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ మరియు జీనియస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ పురస్కారం రావడంపై తమిళనాడు మాజీ గవర్నర్ కె.రోశయ్య హర్షం వ్యక్తం చేశారు. భీమగాని సుధాకర్ గౌడ్ స్వీయ దర్శకత్వంలో ఈ బాలల చిత్రాన్ని రూపొందించారు. నవంబర్4, 2015న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా విశ్లేషకుల ప్రశంసలు అందుకుంది.
19వ అంతర్జాతీయ బాలల చిత్రోత్సవాల్లో ఏకైక తెలుగు చిత్రంగా పురస్కారం గెల్చుకుంది. గతేడాది సెప్టెంబర్ లో జరిగిన ఇండీవుడ్ చిత్రోత్సవంలో అవార్డ్‌ను అందుకుంది. దాదాపు వంద దేశాల్లో అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో ప్రదర్శితమైన ఘనత పొందింది ఆదిత్య క్రియేటివ్ జీనియస్. వంద శాతం పన్ను రాయితీ పొందిన బాలల చిత్రంగా కూడా పేరు తెచ్చుకుంది. ఈ సందర్భంగా చిత్రయూనిట్ అభిమానులతో తమ ఆనందాన్ని పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో తమిళనాడు మాజీ గవర్నర్ రోశయ్య, నటులు బ్రహ్మానందం, సుమన్, చిత్రయూనిట్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment