మళ్లీ మళ్లీ రావాలి... | Film 'Aditya', Creative Genius is the subtitle | Sakshi
Sakshi News home page

మళ్లీ మళ్లీ రావాలి...

Published Tue, Feb 10 2015 11:17 PM | Last Updated on Fri, Nov 9 2018 4:14 PM

మళ్లీ మళ్లీ రావాలి... - Sakshi

మళ్లీ మళ్లీ రావాలి...

ప్రతిభ ఉన్న విద్యార్థి ఓ ప్రొఫెసర్ వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటే ఆ విద్యార్థి భవిష్యత్తు ఏంటి...? అన్న పరిణామాల నేపథ్యంలో సాగే చిత్రం ‘ఆదిత్య’. క్రియేటివ్ జీనియస్ అనేది ఉపశీర్షిక. బ్రహ్మానందం, సుమన్, ఎమ్మెస్ నారాయణ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు .సంతోష్ ఫిలింస్ పతాకంపై భీమగాని సుధాకర్ గౌడ్ స్వీయ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మంగళవారం హైదరాబాద్‌లో ఈ సినిమా ప్రచార చిత్రాన్ని బ్రహ్మానందం ఆవిష్కరించారు. బ్రహ్మానందం మాట్లాడుతూ -‘‘సుధాకర్ నాకు బాగా కావాల్సిన వ్యక్తి.

ఈ చిత్రంలో ఓ ఫాల్స్ ప్రొఫెసర్‌గా నటించా. ఇలాంటి చిత్రాలు మళ్లీ మళ్లీ రావాల్సిన అవసరం ఉంది’’అన్నారు. సుధాకర్‌గౌడ్  మాట్లాడుతూ -‘‘సందేశంతో పాటు వినోదం ఉన్న సినిమా ఇది’’అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో శాసన సభ్యుడు చింతల రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement