పిల్లల్లో ఆత్మవిశ్వాసం పెంపొందిస్తే ఏదైనా సాధించగలుగుతారనేది ప్రధానాంశంగా చేసుకుని స్వీయదర్శకత్వంలో భీమగాని సుధాకర్ గౌడ్ నిర్మించిన చిత్రం ‘ఆదిత్య’. శ్రీ లక్ష్మీ ఎడ్యుకేషన్ చారిటబుల్ ట్రస్ట్ సమర్పణలో సంతోష్ ఫిలింస్ నిర్మించిన ఈ చిత్రానికి వందేమాతరం శ్రీనివాస్ పాటలు స్వరపరిచారు. ఈ చిత్రం ఆడియో వేడుకలో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి టి.రాజయ్య సీడీని విడుదల చేసి, హైకోర్ట్ న్యాయమూర్తి బి.చంద్రకుమార్‌కి ఇచ్చారు. విద్యార్థులకు స్ఫూర్తినిచ్చే చిత్రం రూపొందించిన సుధాకర్ గౌడ్‌ని అభినందిస్తున్నానని టి.రాజయ్య అన్నారు. బాలల చిత్రంలో నటించలేదనే కొరత ఈ చిత్రంతో తీరిందని సుమన్ అన్నారు. సుధాకర్ గౌడ్ మాట్లాడుతూ - ‘‘ఇందులో నేనో కీలక పాత్ర చేశాను. విద్యార్థుల్లో సృజనాతక్మ శక్తి పెంపొందిస్తే వాళ్లు మంచి పౌరులుగా ఎదుగుతారనేది ఈ చిత్రం ఇతివృత్తం. వచ్చే నెల విడుదల చేస్తాం’’ అని చెప్పారు.
విద్యార్థులకు స్ఫూర్తిగా...
Published Sun, Nov 16 2014 10:53 PM | Last Updated on Sat, Sep 2 2017 4:35 PM
Advertisement