Ms Narayana
-
నీ యాక్టింగ్ కి అవార్డు కూడా ఇస్తారా అని హేళన చేశారు..!
-
నన్ను కొట్టడానికి రౌండప్ చేశారు.. కానీ ఏమైందంటే..!
-
నా జీవితానికి ఒక నటుడిగా ఇది చాలు..!
-
సూపర్ స్టార్ కృష్ణ వీరాభిమాని..కానీ కలుద్దాం అంటే భయమేసింది..!
-
నాకు Jr ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టం ఎందుకంటే..!
-
సత్కారాల కంటే అవమానాలు ఎక్కువ జరిగాయి
-
ఎమ్మెస్ నారాయణ చెంప పగలకొట్టా: సీనియర్ డైరెక్టర్
దర్శకుడిగా ఎంతో సక్సెస్ అయ్యాడు విద్యాసాగర్ రెడ్డి. ఆయన డైరెక్ట్ చేసిన రామసక్కనోడు మూవీ మూడు నంది అవార్డులు గెలుచుకుంది. ఇంకా ఎన్నో సినిమాలతో హిట్స్ అందుకున్న ఆయన నిర్మాతగా మాత్రం అంతగా రాణించలేకపోయాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో సాగర్.. కోట శ్రీనివాసరావు, ఎమ్మెస్ నారాయణల మీద ఫైర్ అయిన సంఘటనలను పంచుకున్నాడు. 'సినిమా షూటింగ్ ఎప్పుడు పెట్టుకుందామని కోట శ్రీనివాసరావును అడిగితే ఆయన ఓ తారీఖు చెప్పాడు. సరేనని ఆరోజు అందరం సెట్స్‌కు వచ్చేస్తే అతడు మాత్రం రాలేనన్నాడు. మళ్లీ ఆయన్ను అడిగి వేరే తేదీ సెట్ చేశాం, ఆరోజు కూడా అలాగే హ్యాండిచ్చాడు. నేను తన దగ్గరకు వెళ్లి ఏం కోట, ఏంటిదంతా.. నన్ను ఇంకో యాంగిల్లో చూడొద్దు. పిచ్చోడిలా కనిపిస్తున్నానా? షూటింగ్‌కు రా అని సీరియస్ అయ్యాను. అతడు షూటింగ్‌కు వచ్చాడు, పూర్తి చేశాం. నిజానికి ఆయన ఇంట్లో ఎవరో చనిపోయారు, అందుకే రాలేదు. కానీ రెండుసార్లు అతడే ఒక తేదీ చెప్పి సరిగ్గా సమయానికి రాకపోతే ఎలా ఉంటుంది? ఓసారి ఎమ్మెస్ నారాయణ కూడా ఎక్కువ వాగాడు. అతడికి నిర్మాత పదివేలు ఇవ్వాల్సి ఉండగా వచ్చి ఇస్తానన్నాడు. ఎమ్మెస్ నారాయణ రాత్రి ఊరెళ్లాల్సి ఉంది. మందు తాగుతూ తింటున్నాడు. ఆ మత్తులో నిర్మాతను బూతులు తిడుతూ.. ఎప్పుడూ ఇలాగే చెప్తారండీ వీళ్లు అన్నాడు. నాకు కోపం వచ్చి చెంప చెళ్లుమనిపించాను. అలా తిట్టడం తప్పు కదా అన్నాను. ఇది జరిగిన నిమిషానికే నిర్మాత మనిషి వచ్చి అతడికి పది వేలిచ్చి వెళ్లిపోయాడు. ఇప్పుడు నీ మాట వెనక్కు తీసుకోగలవా? అని అడిగాను' అని సాగర్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు ఫిల్మీదునియాలో వైరల్‌గా మారాయి. చదవండి: జోర్దార్ సుజాతను స్మశానానికి తీసుకెళ్లిన రాకింగ్ రాకేశ్ యువతితో ప్రముఖ నటుడి రెండో పెళ్లి? -
ఎంఎస్ చివరి క్షణాలను గుర్తు చేసుకుని కన్నీరు పెట్టుకున్న బ్రహ్మానందం
Brahmanandam About MS Narayana In Latest Interview: టాలీవుడ్ హాస్య బ్రహ్మ అనగానే వెంటనే గుర్తొచ్చే పేరు ప్రముఖ కమెడియన్ బ్రహ్మానందం. తెలుగు కమెడియన్స్ జాబితాలో ఆయనది అగ్రస్థానం. ఇక ఆయన తర్వాత ఎంఎస్ నారాయణ ఉంటారు. ఒకప్పుడు వీరిద్దరి లేకుండా సినిమాలు ఉండేవే కాదు. అంతగా తమ కామెడీతో ప్రేక్షకులను నవ్వించారు. ఇక వీరద్దరూ కలిసి చేసిన సినిమాలు కూడా ఎన్నో ఉన్నాయి. అయితే 2017లో ఎంఎస్ నారాయణ మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత వయసు రీత్యా బ్రహ్మానందం కూడా సినిమాలు తగ్గించారు. ఆడపాదడపా సినిమాలు చేస్తూ సందడి చేస్తున్నారు. ఈ క్రమంలో ఆయన ఓ టీవీ షోకు ఇంటర్య్వూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన పలు సంఘటనలను గుర్తు చేసుకుని భావోద్వేగానికి లోనయ్యారు. చదవండి: ఊహ నన్ను చూసి వణికిపోయింది: శ్రీకాంత్ ఆసక్తికర వ్యాఖ్యలు ముఖ్యంగా పరిశ్రమలో తన తమ్ముడిగా చెప్పుకునే ఎంఎస్ నారాయణను గుర్తు చేసుకుని కన్నీటి పర్యంతం అయ్యారు. కాగా ఈ షో హోస్ట్ తెలుగులో మీకు నచ్చిన కమెడియన్ ఎవరని అడగగా.. దానికి ఎంఎస్ నారాయణ అని సమాధానం చెప్పారు. ఇక తనకు దేవుడు ఇచ్చిన తమ్ముడు ఎంఎస్ అని.. అతడిలో కేవలం కమెడియన్ మాత్రమే కాదు ఒక మంచి విద్యావేత్త ఉన్నాడంటూ ప్రశంసించారు. ఇక ఆయన చనిపోయే ముందు జరిగిన ఓ సన్నివేశం గురించి కూడా గుర్తు చేసుకుని ఆయన ఎమోషనల్ అయ్యారు. ‘హాస్పిటల్లో చావు బతుకుల మధ్య ఉన్న ఎంఎస్ నారాయణ తానను తలుచుకున్నారని, ఒక పేపర్‌పై బ్రహ్మానందం అన్నయ్యను చూడాలని ఉంది అని రాసి తన కూతురుకు చూపించారట. చదవండి: ‘ఆర్ఆర్ఆర్’ ట్రైలర్‌పై చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు దీంతో ఎంఎస్ కూమార్తె తనకు ఫోన్ చేసి విషయం చెప్పిన వెంటనే షూటింగ్ మధ్యలో నుంచే కిమ్స్ హాస్పిటల్‌కు వెళ్లాను. అక్కడికి వెళ్లాక నా చేతిలో చెయ్యేసి అలా ఒకసారి కిందికి పైకి చూసి పక్కనే ఉన్న తన కొడుకును, నన్ను మరోసారి చూసి కన్నీరు పెట్టుకున్నారు. ఆ సమయంలో ఎమ్ఎస్ నారాయణ పరిస్థితి చూస్తుంటే గుండె తరుక్కుపోయింది. అక్కడే కాసేపు ఉండి ఎంఎస్‌తో మాట్లాడాను. ఆ తర్వాత హాస్పిటల్ నుంచి బయటకు వచ్చిన 15-20 నిమిషాల వ్యవధిలోనే ఎంఎస్ చనిపోయారు అనే చేదు వార్త తెలిసింది. ఆ రోజు జరిగిన సంఘటన ఇంకా గుర్తు ఉంది’’ అంటూ బ్రహ్మానందం చెప్పుకొచ్చారు. కాగా 2017 జనవరి 23న ఎమ్ఎస్ నారాయణ కన్నుమూశారు. -
ఎంఎస్ నారాయణ సతీమణి కన్నుమూత
హైదరాబాద్ : ప్రముఖ హాస్యనటుడు, దివంగత ఎంఎస్ నారాయణ సతీమణి కళాప్రపూర్ణ (63) కన్నుమూశారు. సోమవారం ఉదయం జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో ఆమె గుండెపోటుతో మృతి చెందారు. గత కొంతకాలంగా కళాప్రపూర్ణ గుండె సంబంధింత వ్యాధితో బాధపడుతున్నారు. కాగా ఎంఎస్ నారాయణ 2015 జనవరి 23న గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే. భర్త ప్రథమ వర్థంతి జరిగిన రెండు రోజులకే కళాప్రపూర్ణ మృతి చెందారు. దీంతో ఏడాది వ్యవధిలోనే వారి ఇంట మరో విషాదం చోటుచేసుకుంది. కాగా ఎంఎస్ నారాయణ భీమవరంలో మూర్తి రాజు కళాశాలలో భాషాప్రవీణ కోర్చు చదువుతున్నప్పుడు తోటి విద్యార్ధిని కళాప్రపూర్ణ ప్రేమలో పడ్డారు. ఇదే సమయంలో సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ ఆ కళాశాలలో అధ్యాపకునిగా పనిచేశారు. ఎమ్మెస్ ప్రేమ విషయం తెలిసిన కుటుంబ సభ్యులు కులాంతర వివాహానికి అడ్డు చెప్పారు. అవేవీ పట్టించుకోని ఎమ్మెస్ భాషా ప్రవీణ కోర్సు పూర్తి చేశాక లెక్చరర్ పరుచూరి గోపాల కృష్ణ సహకారంతో కృష్ణా జిల్లా చల్లపల్లిలో కళాప్రపూర్ణను 1972లో రిజిస్టర్ వివాహం చేసుకున్నారు. ఎమ్మెస్ మూర్తిరాజు హైస్కూల్లో, భార్య కళాప్రపూర్ణ జూపూడి కేశవరావు హైస్కూల్లో సెంకడరీ గ్రేడ్ తెలుగు పండిట్‌గా పనిచేశారు. -
కంట్రోల్... కంట్రోల్...
హిట్ క్యారెక్టర్ రైటర్‌గా వచ్చి కమెడియన్‌గా స్థిరపడినవాడు ఎమ్మెస్ నారాయణ. టైమింగ్ విషయంలో చితగ్గొట్టేస్తాడు. ఎక్కడ ఏ పంచ్ పడాలో, ఏ ఎక్స్ప్రెషన్ ఇవ్వాలో... ఆయనకు కొట్టిన పిండి. అది మామూలు పిండి కాదు... మైదా పిండి. అందుకే మన గుండెలమీద కామెడీ వాల్పోస్టర్లాగా అతుక్కుపోయాడు ఎమ్మెస్. అందరూ ఫ్యాక్షనిజమ్లో హీరోయిజమ్ చూపిస్తే... ఎమ్మెస్ ఏమో ఫ్యాక్షనిజమ్లోకామెడీయిజమ్ పండించాడు. ఒట్టేసి చెప్పినా... చెప్పకున్నా ఈ సినిమాలో ‘రేనా’ పాత్ర అది‘రేన్’! సినిమా పేరు : ఒట్టేసి చెపుతున్నా (2003) డెరైక్ట్ చేసింది : ఇ. సత్తిబాబు సినిమా తీసింది : కె. అనిల్ కుమార్ మాటలు రాసింది : చింతపల్లి రమణ రేనా అంటే ఓ మంచి పనోడు. ఆ కాలనీలో ఎవర్నడిగినా ఇదే చెబుతారు. రేనా గురించి హైదరాబాద్‌లో ఏదైనా సాంస్కృతిక సంస్థకు తెలిస్తే పిలిచి మరీ సన్మానం చేసేస్తారు. ఎందుకంటే రేనా పని చేసేది ‘రూల్స్ రంగారావు’ దగ్గర.అన్నీ రూల్స్ ప్రకారం జరగాలనే తలతిక్క మనిషి రంగారావు. కూచుంటే రూలు. నిలబడితే రూలు. పడుకుంటే రూలు. పడుకోకుంటే రూలు. లేకపోతే రూళ్ల కర్రతో కొట్టినంత పని చేస్తాడు. అలాంటి వాడి దగ్గర రేనా వంచిన తల ఎత్తకుండా, నోరు మెదపకుండా పని చేస్తున్నాడు. అయినా ఎప్పుడూ ఏదో ఒకటి సూటిపోటి మాటలు అంటూనే ఉంటాడు. రేనా లీవ్ పెట్టి ఊరెళ్లి వచ్చాడు. అంతే రూల్స్ రంగారావు గుమ్మంలోనే ఆపేసి కయ్మంటూ అరిచాడు. గోడకుర్చీ వేయమంటూ హుకుం జారీ చేశాడు. ‘‘నేను లీవ్ పెట్టింది... పని ఎగ్గొట్టడం కోసం కాదు. చిదంబరంలో కొలువైన మా వంశ మూల విరాట్‌ని దర్శించుకోవడం కోసం’’ అంటూ రేనా ఎక్స్ప్లనేషన్ ఇవ్వడానికి ప్రయత్నించాడు. అయినా రంగారావు తగ్గలేదు. ‘‘నువ్వే ఒక బెల్లంకొట్టిన రాయివి. ఆ రాయి దగ్గరకెళ్లి నువ్వేం మొక్కుకుంటావ్? రెండు వేలు వేస్ట్ చేసి అంత దూరం వెళ్లావ్. ఆ కొబ్బరి కాయేదో ఇక్కడే కొట్టేస్తే పచ్చడికైనా పనికొచ్చేది’’ అని క్లాస్ పీకాడు రంగారావు. రేనాకు కోపం వస్తోంది. కానీ కంట్రోల్ చేసుకోవడానికి శతవిధాల ప్రయత్నిస్తున్నాడు. ‘‘అది మా వంశ సంప్రదాయం’’ అని ఏదో చెప్పడానికి ప్రయత్నించాడు రేనా. ‘‘నీదొక వంశం... దానికో సంప్రదాయం’’ అంటూ రంగారావు చులకనగా మాట్లాడాడు. రేనా మొహంలో రంగులు మారుతున్నాయి. నరాలు ఆవేశంతో బుసాబుసా ఉప్పొంగుతున్నాయి. ‘‘అయ్గారు... నన్నేమన్నా అనండి. నా వంశాన్ని మాత్రం ఏమీ అనొద్దు’’ అని ఫైనల్‌గా చెప్పేశాడు రేనా. రంగారావు ఒక్క ఉదుటున ముందుకుదూకి ‘‘ఏం చేస్తావురా? చంపుతావా? నరుకుతావా?’’ అని రేనా చొక్కా పట్టుకున్నాడు. అయినా రేనా కంట్రోల్‌గానే ఉన్నాడు. ‘‘ఏం చేస్తావ్? ఏం చేస్తావ్? అని కన్ఫ్యూజ్ చేయకండి. ఏదో ఒకటి చేసెయ్యగలను’’ అని చెబుతూ తన చేతులతో చెంపలను గట్టిగా ప్రెస్ చేసుకుంటూ ‘కంట్రోల్.. కంట్రోల్’ అంటూ తనకు తానే కమాండ్స్ ఇచ్చుకున్నాడు. ‘‘ఏంట్రా సౌండు?’’ అంటూ గద్దించాడు రంగారావు. ‘‘జేబులో జంతికలు నలిపా... తినడానికి ఈజీగా ఉంటాయని’’ అనేసి అక్కడ్నుంచీ కామ్‌గా వెళ్లిపోయాడు రేనా. రూల్స్ రంగారావు ఇలా ఎంత ఇరిటేట్ చేసినా రేనా పాపం తనకు తానే ‘కంట్రోల్... కంట్రోల్’ అని చెప్పుకుంటున్నాడు. ఆ టైమ్‌లో రేనా తీరు చూస్తుంటే, అతను ఏ మాత్రం కంట్రోల్ తప్పినా పాశర్లపూడి బ్లో అవుట్లాగా ఏదో జరుగుతుందనే అనిపిస్తోంది. ప్రతి డాగ్కీ ఓ టైమొస్తుంది. డాగ్‌కే టైమొచ్చినపుడు... రేనాకు రాదంటారా!? వచ్చేసిందోచ్... ఓ పేద్ద డిపార్ట్మెంటల్ స్టోర్స్. రూల్స్ రంగారావు ఏవో సరుకులు కొంటుంటే, రేనా అతని వెనుకే సంచీతో నిలబడ్డాడు. ‘‘అయ్గారూ... ఈ నెత్తురు బాటిల్ కొనండి. ఎప్పుడైనా పనికొస్తుంది’’ అని ఓ సాస్ బాటిల్ చూపించాడు రేనా. రంగారావు ఇంతెత్తున లేచి ‘‘ఒరేయ్ తలకుమాసిన వెధవా... మాట్లాడితే నెత్తురంటావ్... బాంబులంటావ్... నీ జీవితంలో ఎప్పుడైనా కత్తి పట్టుకున్నావురా?’’ అని తిట్టాడు. పరమశివుడు గరళాన్ని తన గొంతులోనే దాచేసుకున్నట్టుగా, పాపం రేనా తన కోపాన్నంతా తనలోనే అణిచేసుకుంటున్నాడు. సరిగ్గా అదే టైమ్‌లో ఓ ప్రేమ జంట పరిగెత్తుకుంటూ ఈ స్టోర్స్‌లోకి వచ్చి, అక్కడ రేనాను చూసి షాకైపోయింది. ‘‘రెడ్డి నాయుడు గారూ... మీరా?’’ అని ఆశ్చర్యపోతూ రేనాకు పాదాభివందనం చేసేశారు. ఏ నిజమైతే ప్రపంచానికి తెలియకూడదని రేనా ఇన్నాళ్లూ కంట్రోల్డ్‌గా ఉన్నాడో, ఆ నిజం బ్లాస్ట్ అయిపోయింది. ఆ ప్రేమజంటను వెతుక్కుంటూ రాయలసీమలో ఫేమస్ ఫ్యాక్షనిస్ట్ వీరవంకర్రెడ్డి అండ్ కో వచ్చారు. రేనా ధైర్యంగా వీరవంకర్రెడ్డితో తలపడ్డాడు. ‘‘నీకు దమ్ముంటే మా పబ్లిక్ సెంటర్లోకి రా... చూసుకుందాం... నీ పెతాపమో... నా పెతాపమో...’’ అని హూంకరించాడు వీరవంకర్రెడ్డి. రేనా కూడా ఏ మాత్రం తగ్గలేదు.‘‘వస్తాన్రా... సీమ సందుల్లో సీమ పందుల్లా కొట్టుకుందాం’’ అని గర్జించాడు. ‘‘నీ అంతు చూస్తాన్రా’’ అంటూ వీరవంకర్రెడ్డి అండ్ కో పలాయనం చిత్తగించారు. ఆ గ్యాంగ్‌లో రేనాకు కరడు గట్టిన ఓ వీరాభిమాని ఉన్నాడు. అతను రేనా దగ్గరకొచ్చి ‘‘అన్నా... ఓసారి తొడగొట్టన్నా’’ అని విపరీతంగా బతిమిలాడాడు. ‘‘వద్దురా... కొంచెం వీగ్గా ఉంది’’ అన్నాడు రేనా. అక్కడే ఉన్న రూల్స్ రంగారావు ‘‘సోడా కొట్టమంటే కొడతాడు కానీ, తొడ కొట్టలేడులే’’ అని ఎకసెక్కమాడాడు. దాంతో రేనా అభిమానికి కోపం పొడుచుకొచ్చింది. ‘‘అసలు ఈ రేనా ఎవరో ఫ్లాష్‌బ్యాక్ తెలుసా మీకు?’’ అని చెప్పడం మొదలుపెట్టాడు. ఎవరి పేరు చెబితే సీమ ప్రజలు చిరాకు పడతారో... ఎవరి పేరు చెబితే శత్రువులు ఏ టెన్షనూ లేకుండా హాయిగా నిద్రపోతారో... ఎవరిని చూస్తే పసిపిల్లలు ఏడుపాపేసి హాయిగా పాలు తాగుతారో... అతనే ఈ రెడ్డి నాయుడు. షార్ట్ కట్లో ముద్దుగా ‘రేనా’ అని పిలుచుకుంటుంటారు. రేనా అంటే రాయలసీమలో తెలీనివాడు లేడు. ఆ చెట్టుకీ తెలుసు. ఆ పుట్టకీ తెలుసు. చివరకు ఆ కాకి రెట్టకూ తెలుసు. ఓ కాకి తనపై రెట్ట వేసి షర్టు ఖరాబు చేసిందని రేనా గన్‌తో సింగిల్ షాట్లో కాల్చిపారేశాడు కాకిని. ఆ దూకుడు చూసి రేనా తల్లి కకావికలమై పోయింది. రెట్ట వేసిందని కాకినే కడతేర్చినవాడు, రేపు ఈ సీమను వల్లకాడు చేసేస్తాడని తెగ భయపడిపోయింది. ‘‘పచ్చగా ఉన్న ఈ సీమ నీ వల్ల రక్తంతో ఎర్రగా మారడానికి వీల్లేదు. మర్యాదగా సీమను వదిలేసి వెళ్లిపో’’ అని ఆదేశించింది. తల్లి మాటకు బద్ధుడై రేనా అస్త్రసన్యాసం చేసి కట్టు బట్టలతో నగరవాసానికి బయలుదేరి వెళ్లిపోయాడు. ఇలా ఓ పనివాడిగా అజ్ఞాతవాసంలో బతుకుతున్నాడు. ఇదండీ రేనా ప్లాష్‌బ్యాక్. ‘సమరసింహారెడ్డి’, ‘నరసింహనాయుడు’, ‘ఇంద్ర’, ‘ఆది’... ఇలాంటి ఫ్యాక్షన్ సినిమాలను మించే విధంగా ఉంది కదూ రేనా ఫ్లాష్‌బ్యాక్. ఈ రేనా స్టోరీ అంతా విన్నాక మీకేమర్థమైంది? మీరేం తెలుసుకున్నారు? మీక్కూడా ఓ పనివాడు ఉండే ఉంటాడు. ఆ పనివాడికీ ఓ ఫ్లాష్‌బ్యాక్ ఉండే ఉంటుంది. వాడు రేనా కన్నా పవర్ఫుల్ అయ్యుండొచ్చు. ఓసారి ‘చెక్’ చేయండి. వీలైతే ‘డీడీ’ కూడా చేయండి. - పులగం చిన్నారాయణ అన్నీ మిక్స్ చేస్తే వచ్చిందే... ‘రేనా’ పాత్ర ‘‘దర్శకుడు ఇ. సత్తిబాబులో మంచి కామెడీ టింజ్ ఉంది. ఈ సినిమా స్టోరీ సిట్టింగ్స్‌లో... ఏదైనా పాపులర్ ఫ్యాక్షన్ సినిమాకు పేరడీగా ఓ కామెడీ కేరెక్టర్ సృష్టిద్దామని ఐడియా చెప్పారు. కథా రచయిత ఉదయ్‌రాజ్ కూడా మంచి ఆలోచనని సపోర్ట్ చేశారు. ఇలా ఒక సినిమాకే పరిమితం కాకుండా, రకరకాల ఫ్యాక్షన్ సినిమాలన్నీ కలగలిపి ఓ పాత్ర చేస్తే ఇంకా బావుంటుందని నేను సలహా ఇచ్చాను. వాళ్లు ప్రొసీడ్ అన్నారు. సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, ఇంద్ర, ఆది, బాషా... ఇలా అన్నీ ఓ మిక్సీలో వేస్తే ఫైనల్‌గా వచ్చిన ప్రొడక్టే ఈ రెడ్డినాయుడు పాత్ర. ఈ పేరు కూడా సత్తిబాబే పెట్టారు. ఎమ్మెస్ నారాయణ చేయడం వల్ల, ఆయన కామెడీ టైమింగ్ వల్ల ఈ పాత్ర బాగా పేలింది. మొదట్లో ఈ సినిమా యావరేజ్ అన్నారు. ఎమ్మెస్ కామెడీ ట్రాక్ గురించి ప్రచారం చేశాక సినిమా సూపర్‌హిట్ స్థాయికి వెళ్లిపోయింది.’’ - చింతపల్లి రమణ, మాటల రచయిత -
అసలేం జరిగింది! ఏం జరగబోతోంది?
కామెడీ సీన్ రమణ, గిరి... ఎన్నో ఏళ్ల తర్వాత ఇంటికి వచ్చిన పార్ధూని కలుసుకుంటారు. పలకరింపులయ్యాక కొద్దిసేపు బాల్యస్మృతులను గుర్తు చేసుకుంటారు. తెలిసీ తెలియని వయసులో జరిగిన ఒక పొరపాటుకు చింతిస్తారు. పార్థుకి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా గిరి, రమణ ఇద్దరే అంతా మాట్లాడేస్తారు. ఆ సందర్భంగా ఒక సరదా సంఘటన ఇది. గిరి: అలా బయటకు వెళ్లి, కాఫీ తాగి దమ్ము కొడదాం రారా!(పార్ధూతో) పార్ధు: ఒక్క నిమిషం అత్తయ్యకు చెప్పి వస్తా! రమణ: ఇప్పుడు సిగరెట్లు గురించి ఆవిడకెందుకు? అనవసరం కదా! పార్ధు: కాఫీ వరకూ చెప్పొస్తా రమణ: అయితే ఓకే కట్ చేస్తే...! (చిన్న హోటల్ ) (ఈ సీన్లోకి ఎమ్మెస్ నారాయణ కూడా ఎంటరవుతారు. ఆ సినిమాలో ఆయన పాత్రకు పేరు లేదు. అందుకే ఈ సందర్భంగా ఆ పాత్రకు ఎంకట్రావ్ అని పేరు పెట్టాం) అక్కడ ఎంకట్రావ్ అప్పుడే మినపట్టు తెప్పించుకుంటాడు. మినపట్టు ముక్కను సాంబారులో నంచుకుని తింటూంటాడు ఎంకట్రావ్: (అమాయకంగా) సాంబారు చప్పగా ఉంది! సర్వర్: ఒరేయ్ గ్లాస్ మార్చండి. సాంబార్ అనుకొని మంచి నీళ్లలో ముంచుకు తినేస్తున్నాడు. (ఇంతలో అదే హోటల్లోకి పార్ధూ, గిరి, రమణ వస్తారు...) గిరి: చాన్నాళ్లయిందిరా ఇక్కడకు వచ్చి రమణ: ఏ అప్పున్నావా..? (వాళ్లు ముగ్గురూ వచ్చి ఎమ్మెస్ వెనుక టేబుల్ దగ్గర కూర్చుంటారు) రమణ: (పార్ధూతో) బావా! నీకెప్పుడూ మన శేఖర్గాడి విషయంలో బాధనిపించలేదా? నాకు మాత్రం చాలా సార్లు తప్పు చేశాం అనిపించింది. గిరి: ఇప్పుడవన్నీ ఎందుకురా! (ఎంకట్రావ్ తినడం ఆపేసి మరీ వీళ్ల మాటలు వింటూ ఉంటాడు) రమణ: ఎందుకంటావ్ ఏంట్రా! వీడు చేసింది తప్పు కదా! (దోశె నోట్లో పెట్టుకోబోతూ టెన్షన్లో తినడం మర్చిపోతాడు) గిరి: మరప్పుడు చెప్పచ్చు కదా! రమణ: అప్పుడు నా వయసు పదేళ్లు గిరి: అప్పుడు ఆడి వయసూ పదేళ్లే! రమణ: ఎన్నయినా చెప్పరా... నువ్ అలా చేయడం మాత్రం తప్పే! ఎంకట్రావ్: (మధ్యలో తగులుకుంటూ) ఎలా చేయడం? (రమణ, గిరి వింతగా ఒకళ్ల మొహాలు, ఒకళ్లు చూసుకుంటారు) జీవితంతో పందెం కాయడం, అదీ పదేళ్ల వయసులో... కరెక్ట్ అంటారా? ఎంకట్రావ్: ఎవరి జీవితం? ఎవరు పందెం కాశారు. ఎవరి వయసు పదేళ్లు? రమణ: నేను ఇన్ఫర్మేషన్ గురించి చెప్పట్లేదు. ఫీలింగ్ గురించి చెబుతున్నా ఎంకట్రావ్: ఎందుకు ఫీల్ అవుతున్నావ్? రమణ: ఫీల్ అవ్వాల్సిన సంఘటన కాబట్టి! ఎంకట్రావ్: ఏంటా సంఘటన? గిరి: ఎందుకు సార్! పాత గాయాన్ని మళ్లీ రేపుతారు? ఎంకట్రావ్: ఎవరు రేపిందీ?. ఏంటా గాయం? రమణ: ఎప్పుడో పన్నెండు సంవత్సరాల క్రితం జరిగిన విషయం సార్ అది! ఎంకట్రావ్: అదే ఏంటా విషయం? రమణ: చెప్తే చెరిగిపోయే తప్పు కాదు సార్ అది! ఎంకట్రావ్: (కోపంతో ఊగిపోతూ) ఒరేయ్ అలాంటప్పుడు ఎందుకు మొదలెట్టార్రా?? నా మానాన నేను మాడిపోయిన మసాల దోశె తింటూంటే... జ్యోతిలక్ష్మి డాన్స్ చేసినట్టు వినిపించీ వినిపించ కుండా, కనిపించీ కనిపించకుండా, చూపించీ చూపించకుండా మాట్లాడింది ఎవరు?... అసలు ఏం జరిగింది? ఏం జరుగుతోంది? ఏం జరగబోతోంది తెలియాలి... తెలియాలి... తెలియాలి... తెలిసి తీరాలి! (త్రివిక్రమ్ పంచ్ డైలాగ్స్‌కు బాగా విజిల్స్ పడటం ఈ ‘అతడు’ సినిమా నుంచే మొదలైంది. పార్ధుగా మహేశ్‌బాబు, గిరి, రమణ పాత్రల్లో గిరి, సునీల్ నటించారు. ఇక ఎమ్మెస్ కనిపించింది ఒక్క సీన్ అయినా ఆయన చెప్పిన ఈ డైలాగ్ అందరి నోళ్లల్లో ఇప్పటికీ నానుతోంది) - శశాంక్ బి -
నేడు ఎమ్మెస్ నారాయణ జయంతి
-
స్టార్ స్టార్ సూపర్ స్టార్- ఎమ్మెస్ నారాయణ
-
మళ్లీ మళ్లీ రావాలి...
ప్రతిభ ఉన్న విద్యార్థి ఓ ప్రొఫెసర్ వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటే ఆ విద్యార్థి భవిష్యత్తు ఏంటి...? అన్న పరిణామాల నేపథ్యంలో సాగే చిత్రం ‘ఆదిత్య’. క్రియేటివ్ జీనియస్ అనేది ఉపశీర్షిక. బ్రహ్మానందం, సుమన్, ఎమ్మెస్ నారాయణ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు .సంతోష్ ఫిలింస్ పతాకంపై భీమగాని సుధాకర్ గౌడ్ స్వీయ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మంగళవారం హైదరాబాద్‌లో ఈ సినిమా ప్రచార చిత్రాన్ని బ్రహ్మానందం ఆవిష్కరించారు. బ్రహ్మానందం మాట్లాడుతూ -‘‘సుధాకర్ నాకు బాగా కావాల్సిన వ్యక్తి. ఈ చిత్రంలో ఓ ఫాల్స్ ప్రొఫెసర్‌గా నటించా. ఇలాంటి చిత్రాలు మళ్లీ మళ్లీ రావాల్సిన అవసరం ఉంది’’అన్నారు. సుధాకర్‌గౌడ్ మాట్లాడుతూ -‘‘సందేశంతో పాటు వినోదం ఉన్న సినిమా ఇది’’అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో శాసన సభ్యుడు చింతల రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఎంఎస్ నారాయణను అప్పడే మరిచిపోయారా?
కమెడియన్‌గా టాలీవుడ్లో ఓ వెలుగు వెలిగిన వ్యక్తి ఎంఎస్ నారాయణ. 700కు పైగా సినిమాలలో తన నటనతో ప్రేక్షకులకు ఆయన నవ్వుల జల్లులు కురిపించారు. ఆశ్చర్యకర విషయమేమంటే... ఇటీవలే మరణించిన ఎమ్మెస్ నారాయణ గౌరవార్థం సంస్మరణ సభను తెలుగు చిత్ర పరిశ్రమ ఇప్పటికీ ఏర్పాటు చేయకపోవడం. టాలీవుడ్ నటీనటులు ఎవరైనా మరణిస్తే వారి గౌరవార్థం సంస్మరణ సభను ఏర్పాటు చేయడం ఆనవాయితీగా వస్తుంది. అయితే ఎంఎస్ నారాయణ మరణించి వారం రోజులు అవుతున్నా ఏపీ ఫిల్మ్ ఛాంబర్ గాని, మూవీ అసోసియేషన్ కాని, తెలుగు చిత్ర నిర్మాతల మండలి గాని, దర్శకుల మండలి... ఇలా ఎవరూ ఎంఎస్ సంస్మరణ సభ ఏర్పాటు విషయాన్ని పట్టించుకోకపోవడం తెలుగు ప్రేక్షకులకు ఆశ్చర్యాన్ని కలిగించక మానదు. కాగా ఎంఎస్ కుటుంబసభ్యులు సంస్మరణసభ ఏర్పాటు విషయమై 'మూవీ ఆర్ట్ అసోసియేషన్ (మా) 'ని సంప్రదించగా, సభ లాంటివి నిర్వహించేది లేదనే సమాధానం వారిని బాధకు గురి చేసిందని సమాచారం. ఓ నటుడు టాలీవుడ్‌కి పరిచయమైన 20 ఏళ్లలోనే 700 సినిమాలలో నటించడం అనేది మామూలు విషయం కాదు. ఎంఎస్ నారాయణ నటుడుగానే కాకుండా దర్శకత్వంతో పాటు రచయితగానూ చిత్ర పరిశ్రమకు సేవలందించారు. అనారోగ్యంతో ఎంఎస్ నారాయణ జనవరి 24న మృతి చెందిన విషయం తెలిసిందే. -
ఎంఎస్ నారాయణకు కన్నీటి వీడ్కోలు
హైదరాబాద్: అశ్రునయనాల నడుమ సినీ హాస్యనటుడు ఎం.ఎస్.నారాయణ అంత్యక్రియలు శనివారం ఎర్రగడ్డ ఇఎస్ఐ హిందూ శ్మశానవాటికలో జరిగాయి. ఎం.ఎస్ అంతిమయాత్ర వెంకటగిరి హైలం కాలనీ నుంచి కొనసాగింది. ఆయన అంత్యక్రియలకు పలువురు సినీ నటులతోపాటు అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై పార్థివ దేహానికి నివాళులు అర్పించారు. హిందూ సాంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించగా ఎం.ఎస్. తనయుడు విక్రమ్ చితికి నిప్పంటించారు. ఈ అంత్యక్రియల్లో నటులు శ్రీకాంత్, శివాజీరాజా, వేణుమాధవ్ తదితరులు పాల్గొన్నారు. -
ఎంఎస్ నారాయణ అంత్యక్రియలు
-
నవ్వుల 'నారాయణ'కు.. కన్నీటి వీడ్కోలు..
-
పరిశ్రమకు ఏదో పట్టింది.. అవసరమైతే పూజలు..
-
ఎమ్మెస్ నారాయణ అంత్యక్రియలు పూర్తి
-
కోనసీమ ఆప్యాయత నన్ను కట్టిపారేస్తుంది
కోనసీమ అభిమానం, ఆప్యాయత తనను కట్టి పారేస్తాయని దివంగత హాస్యనటుడు ఎమ్మెస్ నారాయణ పలు సందర్భాల్లో చెప్పేవారు. కావడానికి పశ్చిమగోదావరి వాస్తవ్యుడే అయినా.. ఆయనకు తూర్పుగోదావరి జిల్లాతోను, అందునా కోనసీమ ప్రాంతంతోను అనుబంధం జాస్తి. ఎమ్మెస్ 700 చిత్రాల్లో నటించగా, వాటిల్లో 100కు పైగా సినిమాల షూటింగ్‌లు ఈ జిల్లాలోనే జరిగాయి. దీంతో ఆయనకు తూర్పుగోదావరిలో పలువురు అభిమానులే కాకుండా సన్నిహితులు కూడా అయ్యారు. ఇక్కడ జరిగిన పలు సినిమా షూటింగ్లలో ఆయన పాల్గొన్నారు. కోనసీమలో జరిగిన కబడ్డీ.. కబడ్డీ, చెడుగుడు, రామదండు, పందెం, ప్రేమలో పావని-కళ్యాణ్, చందమామ కథలు, శశిరేఖ పరిణయం, బావ వంటి పలు చిత్రాల్లో ఆయన నటించారు. పెదపట్నం లంక, మామిడికుదురు, నగరం, సోంపల్లి, అంతర్వేది, అంతర్వేదికర, దిండి, చింతలపల్లి, గుడిమూల వంటి ప్రాంతాల్లో షూటింగ్‌లు జరిగాయి. అమలాపురంలో 2004లో జరిగిన చెన్నమల్లేశ్వర కళా పరిషత్ నాటకోత్సవాలకు ఎమ్మెస్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పరిషత్ అధ్యక్షుడు నల్లా సత్యనారాయణ ఆయనకు మంచి మిత్రుడు. కోనసీమ అంటే మాత్రం ఎమ్మెస్‌కు ప్రత్యేక అభిమానం. 'ఇక్కడి పచ్చని వాతావరణం.. ప్రజలు చూసే ఆత్మీయత.. ఆతిథ్యం నన్ను కట్టిపడేస్తుంటాయి' అని పలు సందర్భాల్లో చెప్పేవారు. గత డిసెంబర్ 21న భట్లపాలెం బీవీసీ ఇంజనీరింగ్ కళాశాలకు వచ్చిన ఆయన విద్యార్థులను కలుసుకున్నారు. బహుశా తనకు ఇష్టమైన కోనసీమను చూడడం అదే ఆఖరుసారి అవుతుందని ఎమ్మెస్ అనుకుని ఉండరు. ఆయన దర్శకత్వం వహించిన భజంత్రీలు సినిమా షూటింగ్లో కొంతభాగం కోరుకొండలో జరిగింది. ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరంలో 'నువ్వే.. నువ్వే' చిత్రంలో కానిస్టేబుల్‌గా ఎమ్మెస్ నటించింది పది నిమిషాలే అయినా ఆయన పండించిన కామెడీ ప్రేక్షకుల గుండెల్లో కలకాలం నిలిచిపోతుంది. రచయితగా, హాస్య నటునిగానే కాదు.. కుమారుడు విక్రమ్‌ను హీరోగా పరిచయం చేస్తూ దర్శకునిగా కూడా ఎమ్మెస్ మారారు. ఈ చిత్రానికి జిల్లాలోని ముమ్మిడివరానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, దివంగత తాడి తాతారావు నిర్మాతగా వ్యవహరించారు. -
కోల్పోయిన చిరునవ్వు
-
ఎంఎస్ నారాయణ అంత్యక్రియలు పూర్తి
హైదరాబాద్ : ప్రముఖ హాస్యనటుడు ఎంఎస్ నారాయణ అంత్యక్రియలు పూర్తయాయి. అశ్రునయనాల మధ్య ఆయన అంతక్రియలు శనివారం ఉదయం ఈఎస్ఐ శ్మశానవాటికలో నిర్వహించారు. తండ్రి చితికి కుమారుడు విక్రమ్ నిప్పంటించారు. అంతకు ముందు ఎంఎస్ నారాయణకు పలువురు సినీ ప్రముఖులు నివాళులు అర్పించారు. అనంతరం ఎంఎస్ నివాసం నుంచి అంతిమయాత్ర ప్రారంభమైంది. ఈ యాత్రలో పలువురు సినీనటులతో పాటు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. -
ఎంఎస్ నారాయణ అంతిమ యాత్ర ప్రారంభం
హైదరాబాద్ : ప్రముఖ హాస్య నటుడు ఎంఎస్ నారాయణ శనివారం అంతిమ యాత్ర ప్రారంభమైంది. ఆయన నివాసం నుంచి ప్రారంభమైన ఆ యాత్రలో పలువురు సినీ నటులు పాల్గొన్నారు. ఎంఎస్ నారాయణ అంత్యక్రియలు ఈరోజు ఉదయం ఈఎస్ఐ శ్మశానవాటికలో జరుగుతాయి. ఇటీవల అస్వస్థతకు గురైన ఎంఎస్ నారాయణ శుక్రవారం హైదరాబాద్‌లోని కొండాపూర్‌లోని కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. -
మా‘స్టారు’.. వెళ్లిపోయారు
జనవరి నెలొచ్చింది. భీమవరం కేజీఆర్ జూనియర్ కాలేజీకి సంక్రాంతి సెలవులు ఎప్పుడిస్తారనేది అప్పటికింకా ప్రకటించలేదు. ఆ రోజు తెలుగు పాఠం అరుుపోరుుంది. విద్యార్థులంతా లెక్చరర్ చుట్టూ చేరి ‘మాస్టారూ.. సంక్రాంతి సెలవులు ఎప్పటినుంచి’ అనడిగారు. ‘నాకూ తెలీదురా.. అరుునా ఆ విషయం మేం చెప్పకూడదు. నోటీసు బోర్డులో పెడతార్లే’ అన్నారాయన. ‘ఎవర్నడిగినా చెప్పట్లేదు.. మీరైనా చెప్పండి మాస్టారూ’ విద్యార్థులు బేలగా అడిగారు. ‘సర్లే.. చెబుతా ఏడు’ అని సెలవిచ్చారు. విద్యార్థుల మొహాల్లో ఒకటే వెలుగు. ఆయన ఉచ్ఛారణలోని చమత్కారం జనవరి 7నుంచి సెలవులు ఇస్తున్నారని చెప్పకనే చెప్పింది. విద్యార్థులంతా ఎంఎస్ఎన్గా పిలుచుకునే ఆ మాస్టారి పేరు ఎంఎస్ నారాయణ. లెక్చరర్‌గా చక్కనైన తెలుగును ఎంచక్కా నేర్పించారు. వెండి తెర వెలుగుల్లో జనమంతా హారుుగా నవ్వుతూ మైమరిచిపోతే హఠాత్తుగా అదృశ్యమై నవ్వునూ ఏడిపించారు. శిష్యులను.. అభిమానులను దుఃఖసాగరంలో ముంచేశారు. నిడమర్రు అది జనవరి 13వ తేదీ. నిడమర్రులోని ఓ ఇల్లు సందడిగా ఉంది. అది హాస్యనటుడు ఎమ్మెస్ నారాయణ సోదరుడిది. ‘ఆ రోజు తమ్ముడు సరదాగా మాతో గడిపాడు. అందరికీ మిఠాయిలు పంచిపెట్టాడు. ఆరోగ్యం జాగ్రత్త అని చెప్పాడు. అనారోగ్యంతో తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయాడు’ అంటూ ఎమ్మెస్ సోదరుడు లాలయ్య విలపించారు. జనవరి 13న పెదనిండ్రకొలనులోని మాజీ సొసైటీ అధ్యక్షుడు కూనపురాజు కుమారస్వామిరాజు నివాసంలో స్నేహితులతో చివరి సారిగా గడిపారు. దొంగ సూరిగాడు నిడమర్రు గ్రామంలోని రైతు కుటుంబానికి చెందిన మైలవరపు బాపిరాజు, వెంకటసుబ్బమ్మ దంపతులకు మూడో సంతానంగా 1951 ఏప్రిల్ 16న ఎమ్మెస్ నారాయణ జన్మించారు. ఆయనకు అక్క, అన్న, అయిదుగురు తమ్ముళ్లు, ఇద్దరు చెల్లెళ్లున్నారు. బాల్యంలో తోటి స్నేహితులతో కలసి రాత్రి వేళల్లో గ్రామంలోని మోతుబరి పొలాల్లో పండించిన కూరగాయలు, ఆకుకూరలు దొంగిలించి పేదవారి ఇళ్ల గుమ్మాల ముందుంచేవారని గ్రామస్తులు చెబుతారు. దీంతో గ్రామంలో ఎంఎస్‌ను దొంగ సూరిగాడు అంటూ పిలిచేవారు. వ్యవసాయ పనులకు వెళ్లమంటే తప్పించుకుని తిరిగేవారు. గేదెల్ని కాసేందుకు పందికోడు వంతెన గట్టుకు వెళ్లి అద్దెకు తెచ్చుకున్న నవలలను చదివేవారు. అమ్మ పోలిక వల్లే అదృష్టం పట్టింది తల్లి వెంకట సుబ్బమ్మ ముఖం..తనది ఒకేలా ఉంటుందని..అదే తన అదృష్టానికి కారణమని తరచూ ఎమ్మెస్ చెబుతూ మురిసిపోతుండేవాడు. ఏ కారు కొన్నా నిడమర్రు వచ్చి తల్లి వెంకట సుబ్బమ్మను తీసుకుని ద్వారకాతిరుమల తప్పని సరిగా వెళ్లేవారు. వచ్చిన ప్రతిసారి తల్లి వద్ద ఉండేందుకే సమయాన్ని కేటాయించేవారు. ఆమె 2011 సెప్టెంబర్ 25న మృతి చెందాక నిడమర్రు రావడం తగ్గించినట్టు కుటుంబసభ్యులు తెలిపారు. అవకాశం దొరికితే తండ్రికి తెలియకుండా గణపవరంలో రెండో ఆట సినిమాకు వెళ్ళిన ప్రతిసారి తల్లిని అడ్డు పెట్టుకుని తండ్రి నుంచి దెబ్బలు తప్పించుకునేవారని ఆయన సోదరులు తెలిపారు. పరుచూరి అండతో ప్రేమ వివాహం మూర్తి రాజు కళాశాలలో భాషాప్రవీణ కోర్చు చదువుతున్నప్పుడు తోటి విద్యార్ధిని కళాప్రపూర్ణ ప్రేమలో పడ్డారు. ఇదే సమయంలో సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ ఆ కళాశాలలో అధ్యాపకునిగా పనిచేశారు. ఎమ్మెస్ ప్రేమ విషయం తెలిసిన కుటుంబ సభ్యులు కులాంతర వివాహానికి అడ్డు చెప్పారు. అవేవీ పట్టించుకోని ఎమ్మెస్ భాషా ప్రవీణ కోర్సు పూర్తి చేశాక లెక్చరర్ పరుచూరి గోపాల కృష్ణ సహకారంతో కృష్ణా జిల్లా చల్లపల్లిలో కళాప్రపూర్ణను 1972లో రిజిస్టర్ వివాహం చేసుకున్నారు. ఎమ్మెస్ భీమవరంలోని మూర్తిరాజు హైస్కూల్లో, భార్య కళాప్రపూర్ణ జూపూడి కేశవరావు హైస్కూల్లో సెంకడరీ గ్రేడ్ తెలుగు పండిట్‌గా చేరారు. అనంతరం భీమవరంలోని కేజీఆర్ఎల్ జూనియర్ కళాశాలలో తెలుగు అధ్యాపకునిగా పనిచేశారు. సూర్యనారాయణ, ఆర్ఎంపీ చదువు మధ్యలో మానేశాక గ్రామంలోని ఆర్ఎంపీ వైద్యుడు లంకా వెంకట్రావు వద్ద సహాయకునిగా పనిచేశారు. తర్వాత కొంతకాలం గ్రామంలో ఆర్ఎంపీ అవతారం ఎత్తారు. నాటకాలంటే పిచ్చి నవలలు చదివి పాత్రల్లో లీనమైపోయేవారు. తోటి స్నేహితులతో చిన్న చిన్న నాటకాలు వేసేవారు. ఏ నాటకమైనా హాస్యభరితంగా ఉండేలా రచించేవారు. టీచరు, డాక్టర్ పాత్రల్ని ఇష్టపడేవారు. ‘చాకలి తిప్పడు’ ఏకపాత్రాభినయం ఆకట్టుకునేది. ఎక్కువగా గ్రామంలోని మంచినీటి చెరువులో ఈత కొట్టేవారు. ప్రతి నాయకుని పాత్ర కోరిక తీరకుండానే తెలుగు చలనచిత్ర సీమలో గుర్తుండిపోయే ప్రతి నాయకుని పాత్ర పోషించాలనేది ఎమ్మెస్ చిరకాల వాంఛ. అది నెరవేరకుండానే కన్నుమూశారు. అయిదు నందులు వచ్చిన అనందం కంటే మంచి ప్రతినాయకుని పాత్ర కోసం ఎదురు చూస్తున్నాననేవారు. హాస్యనటుడుగా రాణించడానికి కారకుడు దివంగత దర్శకుడు ఈవీవీ అని చెప్పేవారు. పాఠాలు చెబుతూనే అందరినీ నవ్వించేవారు మేం ఇంటర్మీడియెట్ చదివే రోజుల్లో ఎమ్మెస్ నారాయణ తెలుగు లెక్చరర్. చేతిలో పుస్తకం లేకుండానే పాఠం బోధించేవారు. తెలుగు వ్యాకరణంతోపాటు సినిమాలు, కథల చెబుతుండేవారు. పాఠానికి హాస్యాన్ని జోడించేవారు. ఒక్కోసారి డిటెక్టివ్ షాడో తరహాలో చెప్పి పాఠాన్ని రక్తికట్టించేవారు. ఆయన క్లాస్ అంటేనే పక్క గ్రూపుల విద్యార్థులు కూడా వచ్చి మావద్ద కూర్చునేవారు. గది చాలక కాలేజీ ఆవరణలోనూ నిలబడి ఆయన చెప్పే పాఠాలు వినేవారు. ‘ఎవరో మన గురించి ఏదో అనుకుంటారని మనం అనుకోకూడదు. ఎలాంటి విషమ పరిస్థితులొచ్చినా ముందుకు సాగాలి’ అని ఎమ్మెస్ నారాయణ చెప్పిన మాటలు నాకు ఇప్పటికీ గుర్తే. - బి.సాయిరమేష్, సీఐ, బొమ్మూరు పోలీస్ స్టేషన్ కలుపుగోలు మనిషి హాస్యనటుడు ఎంఎస్ నారాయణ కలుపుగోలు మనిషి. రంగస్థలం నుంచి వచ్చిన పేరుమోసిన రచయిత. అనవసరమైన డైలాగులు చెప్పకుండా పాత్రకు ఎంత అవసరమో అంతవరకే పరిమితమైన గొప్ప హాస్యనటుడు. తోటి హాస్యనటులను కూడా తనకంటే బాగా నటించేలా ప్రోత్సాహం అందించిన వ్యక్తి ఎమ్మెస్ నారాయణ. ఆయన మృతి తీరని లోటు. ఎంఎస్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. - కోడి రామకృష్ణ, సినీ దర్శకుడు -
మిస్ యు ఎం.ఎస్
-
గత నెలలో మెట్టకు వచ్చిన ఎమ్మెస్
జగ్గంపేట : తన హాస్యంతో థియేటర్లలో నవ్వుల వర్షం కురిపించే ఎమ్మెస్ నారాయణ మృతితో ఆయన అభిమానులు దిగ్భ్రాంతికి గురయ్యారు. గత ఏడాది డిసెంబర్ 25న జిల్లాకు వచ్చిన ఆయన ఏలేశ్వరం, జగ్గంపేట మండలం ఇర్రిపాక గ్రామాల్లో సర దాగా గడిపారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్ష ఉపనేత, జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూను ఆయన స్వగృహానికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలిశారు. రాజకీయాల్లో ఎదురు లేని నెహ్రూ అంటే తనకు ప్రత్యేక అభిమానమని, అందుకే సందర్భం లేకుండా కలిసేందుకు వచ్చానని అప్పట్లో ఆయన చెప్పారు. ఎమ్మెస్ మృతి వార్త తెలుసుకున్న అభిమానులు, ఇటీవల ఇర్రిపాకలో కలిసినవారు ఆయన జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటున్నారు. కడియం : ఎమ్మెస్ నారాయణ మృతి మండలంలో విషాదాన్ని నింపింది. ఎమ్మెస్ కుమారుడు హీరోగా నటించిన ‘కొడుకు’ సినిమా షూటింగ్ స్థానిక పల్ల వెంకన్న నర్సరీలో వారం రోజుల పాటు సాగింది. ఎమ్మెస్ స్వీయ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రం షూటింగ్ సందర్భంగా పలువురు నర్సరీ రైతులకు ఆయన పరిచయస్తులయ్యారు. ఆయన హఠాన్మరణంతో వారంతా తీవ్ర విషాదం వ్యక్తం చేశారు. తమ నర్సరీలో వారం రోజులపాటు ఉన్నప్పుడు ఆయనతో గడిపిన క్షణాలు మరువలేమని పల్ల వెంకన్న నర్సరీ రైతు పల్ల సత్తిబాబు గుర్తు చేసుకున్నారు. ఇదిలా ఉండగా ప్రముఖ దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ కుమారుడు ఆర్యన్ రాజేష్ వివాహ నిశ్చితార్థం 2012 జనవరిలో మండలంలోని జేగురుపాడులో జరిగింది. దీనికి వచ్చిన ఎమ్మెస్ అక్కడ నవ్వులపువ్వులు పూయించారు. -
'సన్నివేశాలు చేసి, పక్కకు వెళ్లి భార్య కోసం ఏడ్చేవారు'
ఎమ్మెస్ నారాయణ మరణం జూనియర్ ఆర్టిస్టులకు తీరని లోటు. చిన్న ఆర్టిస్టులను అనుక్షణం ప్రోత్సహిస్తూ ఉండేవారు. ఆయన నాకు గురువుతో సమానం. ఆయనతో కలిసి 20 చిత్రాల్లో నటించాను. నేను హీరోగా నటిస్తున్న ‘పులిరాజా ఐపీఎస్’ చిత్రంలో సిన్సియర్ పోలీసు అధికారి పాత్రలో ఎమ్మెస్ నారాయణ నా తండ్రిగా నటిస్తున్నారు. ఈ నెల 25 నుంచి మన జిల్లాలో ఈ చిత్రం షూటింగ్ జరగాల్సి ఉంది. ఇంతలోనే ఆయన మరణించడం మమ్మల్ని తీవ్ర దిగ్భాంతికి గురి చేసింది. - పొట్టి రాంబాబు, కమెడియన్ ఆయనతో నటించిన తర్వాతే మంచి గుర్తింపు హాస్య నటుడు ఎమ్మెస్ నారాయణతో కలిసి నటించిన తర్వాతే నాకు మంచి గుర్తింపు లభించింది. ఆయన మృతి యావత్ సినీజగత్తుకు తీరనిలోటు. ఆయన హాస్యానికి ఎంతటివారైనా దాసోహమవుతారు. నాకు పెళ్లయిన తర్వాత చాలా కాలం సినీరంగానికి దూరంగా ఉన్నాను. ఆ సమయంలో దర్శకుడు త్రివిక్రమ్ మల్లేశ్వరి సినిమాలో ఎమ్మెస్ నారాయణతో నటించే అవకాశం ఇచ్చారు. ఆయనతో నటించేందుకు తొలుత సందేహాం వ్యక్తం చేస్తే.. నటించి చూస్తే నీకే తెలుస్తుందని త్రివిక్రమ్ నన్ను ఒప్పించారు. ఆ సినిమా ఒక రేంజ్లో నాకు గుర్తింపు తెచ్చింది. పెళ్లయిన తర్వాత నా కెరీర్‌కు మంచి పునాదిగా నిలిచింది. అప్పటినుంచీ ఎమ్మెస్ నారాయణ కాంబినేషన్‌తో నేను చేసిన ప్రతి సినిమా చాలా హిట్ అయింది. దుఃఖంలో ఉన్న సమయంలో కూడా హాస్య నటులు నవ్వుతూనే నటించాలని, అది మన వృత్తి అని ఆయన ‘దూకుడు’ చిత్రం షూటింగ్లో చెప్పారు. ఆ సినిమా షూటింగ్ సమయంలో ఆయన భార్యకు ఆపరేషన్ చేస్తున్నారు. షాట్లో హాస్య సన్నివేశాలు చేసి, పక్కకు వెళ్లి భార్య కోసం ఏడ్చేవారు. మళ్లీ షాట్‌కు సిద్ధమయ్యేవారు. ఒక అన్నలా నాకు నటనలో సూచనలు, సలహాలు ఇచ్చేవారు. ఆయన మృతి నన్ను తీవ్రంగా కలసివేసింది. - హేమ, ప్రముఖ సినీ నటి - రాజోలు పాఠాలు చెబుతూనే అందరినీ నవ్వించేవారు ఇంటర్మీడియట్ చదివే రోజుల్లో మాకు ఎమ్మెస్ నారాయణగారు తెలుగు లెక్చరర్. చేతిలో పాఠ్యపుస్తకం లేకుండానే పాఠం బోధిస్తూ తెలుగు గ్రామర్‌తో పాటు సినిమాల గురించి, కథల గురించి చెబుతూ అందరినీ నవ్విస్తూ ఉండేవారు. ఆయన క్లాస్ అంటేనే పక్క గ్రూపు వారు కూడా వచ్చి మావద్ద కూర్చొనేవారు. గది అంతా నిండిపోయేది. ‘ఎవరో మన గురించి అనుకుంటారని మనం అనుకోకూడదు. ముందుకు సాగాలి’ అని ఎమ్మెస్ నారాయణగారు చెప్పిన మాటలు నాకు ఇప్పటికీ గుర్తే. కళాశాలకు సెలవు పెట్టి ఆయన మద్రాసు వెళుతుంటే, ‘సినిమాపై మోజుతో భవిష్యత్తును పాడు చేసుకుంటున్నాడు’ అని అప్పటి లెక్చరర్లు అనుకునేవారు. సినిమాల్లో నటించి ఎంత పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నారో, లెక్చరర్‌గా కూడా ఆయనకు అంతే పేరుండేది. కళాశాలలో సాంస్కృతిక కార్యక్రమాలకు ఆయనే ఇన్చార్జిగా ఉండి, దేశభక్తియుత నాటకాలు ఎక్కువగా వేయించేవారు. ఆయన మృతి నిజంగా తీరనిలోటు. కళాశాల రోజులు తలచుకుంటే ఆయనే మొదట గుర్తుకు వస్తారు. - బి.సాయిరమేష్, ఇన్స్పెక్టర్, బొమ్మూరు పోలీస్ స్టేషన్, కేజీ ఆర్ఎల్ కళాశాల పూర్వ విద్యార్థి, భీమవరం, పశ్చిమ గోదావరి జిల్లా - రాజమండ్రి రూరల్ కోనసీమపై మక్కువ ఎమ్మెస్‌కు కోనసీమ అంటే చాలా ఇష్టం. రాజోలులో కబడ్డీ.. కబడ్డీ.. చిత్రం షూటింగ్ జరిగిన సమయంలో ఆయన తరచూ యూత్‌క్లబ్‌కు వచ్చేవారు. ‘దేవరాయ’ షూటింగ్ పశ్చిమ గోదావరి జిల్లాలో జరుగుతున్నప్పుడు రాజోలు వచ్చి కాయగూరలు కొనుక్కుని, స్వయంగా వంట చేసుకునేవారు. ‘దేవరాయ’ సినిమాలో తన క్యారెక్టర్ పేరును ‘అక్కిరాజు’గా పెట్టుకుని నాపై అభిమానం చాటుకున్నారు. ఆ సమయంలో నవ్వుతూ ‘అక్కిరాజుగారూ నేను పోయినా ఈ ‘దేవరాయ’ సినిమాలో మీ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది’ అని అన్నారు.- ముదునూరి అక్కిరాజు, యూత్‌క్లబ్ అధ్యక్షుడు -
నేను ఆఖరిసారి చూసిందదే!
మొన్న గురువారం పొద్దున్నే శశి ఫోన్ చేసింది. శశి అంటే ఎమ్మెస్ నారాయణ కూతురు. ‘‘నాన్నగారు మిమ్మల్ని చూడాలనుకుంటున్నారంకుల్’’ అని చెప్పింది. అప్పుడు ఎమ్మెస్ కిమ్స్ హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్నాడు. పదకొండున్నర ప్రాంతంలో నేను వెళ్లా. నన్ను చూడగానే గుర్తుపట్టాడని ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం తెలిపారు. అప్పటివరకూ అచేతనంగా ఉన్నవాడు కాస్తా, నన్ను చూడగానే కదిలాడని డాక్టర్లు ఆశ్చర్యపోతూ చెప్పారు. నా చేయి దగ్గరకు తీసుకుని తన గుండెల మీద పెట్టుకున్నాడు. తర్వాత వాళ్లబ్బాయి విక్రమ్ చేతిని నా చేతిలో పెట్టాడు. ఏదో మాట్లాడాలనుకుంటున్నాడు. కానీ మాటలు రావడం లేదు. నేను బయటికి వచ్చేస్తుంటే రెండు చేతులెత్తి నాకు నమస్కారం పెట్టాడు. అదే నేను తనని ఆఖరిసారి చూడటం. నాకు మళ్లీ మళ్లీ అదే సీను గుర్తొస్తోంది. అందుకే, ఎమ్మెస్ పార్థివ దేహం చూడ్డానికి కూడా నా మనసు అంగీకరించడం లేదు. పదిహేను, 20 రోజుల క్రితమే... నేను, ఎమ్మెస్, బ్రహ్మాజీ, రఘుబాబు, వెన్నెల కిశోర్ ‘పండగ చేస్కో’ షూటింగ్లో కలిశాం. అందరం కలిసి లంచ్ చేశాం. మా ఇంటి నుంచే భోజనం వచ్చింది. ‘‘అన్నయ్యా... మీ ఇంటి భోజనం తింటే ట్యాబ్లెట్లు, ఇంజెక్షన్లతో పని ఉండదు’’ అన్నారు ఎమ్మెస్. నేనంటే ఎమ్మెస్‌కు చాలా ఇష్టం. ‘‘అన్నయ్య గారూ... అంటూ నాతో కష్టాసుఖాలన్నీ పంచుకునేవాడు. అన్నీ నాతో షేర్ చేసుకునేవాడు. మేమిద్దరం కలిసి చాలా సినిమాలు చేశాం. ‘అదుర్స్, కృష్ణ, దూకుడు’... అన్నీ మాకు మంచి పేరు తెచ్చాయి. అతని కామెడీ కొంచెం డిఫరెంట్. ఫన్‌తో పాటు ఆలోచింపజేసేలా అతని జోక్స్ ఉంటాయి. అతనిలో మంచి రైటర్ ఉన్నాడు. దర్శకునిగా కూడా సమర్థుడు. సరైన ఛాన్సులొచ్చి ఉంటే, దర్శకుడిగానూ పేరు తెచ్చుకునేవాడు. -
వికారాబాద్‌తో ఎమ్మెస్‌కు అనుబంధం
ఇక్కడి వాతావరణం చాలా బాగుంటుంది.. జీవన చరమాంకంలో ఇక్కడే గడపాలనుందనేవారు ఎమ్మెస్ నారాయణ మాటలను నెమరువేసుకున్న అభిమానులు వికారాబాద్: ప్రముఖ హాస్యనటుడు ఎమ్మెస్ నారాయణకు వికారాబాద్‌తో నాలుగేళ్ల అనుబంధముంది. పట్టణానికి చెందిన పలువురితో ఆయనకు మంచి పరిచయాలు ఉన్నాయి. శుక్రవారం ఉదయం ఆయన మరణించారనే వార్త తెలుసుకున్న పట్టణవాసులు విషాదంలో మునిగారు. ఆయన 2011లో వికారాబాద్‌లోని పర్యాటక కేంద్రానికి వచ్చారు. ఇక్కడి వాతావరణం చాలా బాగుందని.. తన చరమాంకంలో జీవితాన్ని ఇక్కడే గడపాలని కలలు కన్నారని స్థానిక అభిమానులు గుర్తు చేసుకున్నారు. ముఖ్యంగా కొత్తగడికి చెందిన ధవళగారి ప్రభాకర్‌రెడ్ది (చిన్నబాబు)తో ఎమ్మెస్ నారాయణకు కొన్నేళ్లుగా పరిచయం ఉంది. ఈ నేపథ్యంలో 2012లో వికారాబాద్ శివారు మోత్కుపల్లి సమీపంలో 20 ఎకరాల భూమిని ఎమ్మెస్ నారాయణకు ఇప్పించారు. దీంతో వీరిరువురి కుటుంబాలకు మంచి సాన్నిహిత్యం ఏర్పడింది. ఈ క్రమంలోనే ఎమ్మెస్ నారాయణతో తమకు వీడదీయరాని అనుబంధం ఏర్పడిందని ప్రభాకర్‌రెడ్డి, ఆయన కుటుంబసభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. ఎమ్మెస్ నారాయణ మంచి నటుడే కాకుండా గొప్ప మానవతావాది అని.. సహృదయుడని ప్రభాకర్‌రెడ్డి పేర్కొన్నారు. ‘చనిపోయింతర్వాత కేవలం మంచి పేరు తప్ప మన వెంట ఏమీ తీసుకుపోం’ అనేవారని గత స్మృతులను గద్గదస్వరంతో వెలిబుచ్చారు. -
ఎంఎస్ నారాయణ ఇక లేరు
చికిత్స పొందుతూ కన్నుమూత ఫిలిం చాంబర్లో పార్థివదేహానికి ప్రముఖుల నివాళి కేసీఆర్, చంద్రబాబు, జగన్ సహా పలువురు నేతల సంతాపం నేడు ఈఎస్ఐ శ్మశానవాటికలో అంత్యక్రియలు సాక్షి, హైదరాబాద్: ప్రముఖ హాస్యనటుడు, దర్శకుడు, రచయిత ఎం.ఎస్.నారాయణ (63) ఇక లేరు. ఇటీవల అస్వస్థతకు గురైన ఆయన శుక్రవారం హైదరాబాద్‌లోని కొండాపూర్‌లో ఉన్న కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఉదయం 9:45 గంటలకు కన్నుమూశారు. సంక్రాంతి సందర్భంగా స్వస్థలం భీమవరం వెళ్లిన ఎంఎస్‌కు ఫుడ్ పాయిజన్ కావడంతో కుటుంబ సభ్యులు ఆయన్ను స్థానిక ఆస్పత్రిలో చేర్చారు. గుండెపోటు రావడంతో అక్కడి వైద్యుల సూచన మేరకు మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్ తరలించగా పరిస్థితి విషమించి కన్నుమూశారు. శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో సినీప్రముఖులు, అభిమానుల సందర్శనార్థం ఎం.ఎస్. నారాయణ భౌతికకాయాన్ని కిమ్స్ ఆస్పత్రి నుంచి ఫిలిం చాంబర్‌కు తరలించారు. దర్శకుడు కె. రాఘవేంద్రరావు, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, నటులు మురళీమోహన్, బాబూమోహన్, తనికెళ్ల భరణి, సుమన్, వెంకటేశ్, రాంచరణ్ తేజ్, అలీ, వేణుమాధవ్, నాగబాబు, ఎల్బీ శ్రీరాం, అనంత్ తదితరులు ఎం.ఎస్. నారాయణ భౌతికాయానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన అంత్యక్రియలు శనివారం ఉదయం 10 గంటలకు ఈఎస్ఐ శ్మశానవాటికలో జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు. ఎం.ఎస్. నారాయణ మృతిపట్ల దావోస్ పర్యటనలో ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు, ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు, ఏపీ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్. జగన్మోహన్రెడ్డి, కేంద్ర సహాయ మంత్రి సుజనా చౌదరి, బీజేపీ తెలంగాణ రాష్ట్రశాఖ అధ్యక్షుడు జి. కిషన్‌రెడ్డి తదితరులు వేర్వేరు ప్రకటనల్లో సంతాపం తెలిపారు. 700 చిత్రాల్లో నవ్వులు... పశ్చిమ గోదావరి జిల్లా నిడమర్రు గ్రామంలో రైతు కుటుంబానికి చెందిన మైలవరపు బాపిరాజు, వెంకట సుబ్బమ్మ దంపతులకు మూడో సంతానంగా 1951 ఏప్రిల్ 16న జన్మించిన ఎం.ఎస్. నారాయణ ‘ఎం. ధర్మరాజు ఎం.ఎ’ చిత్రం ద్వారా నటుడిగా సినీరంగప్రవేశం చేశారు. ఆయన ఇప్పటివరకు 700పైగా చిత్రాల్లో నటించారు. రుక్మిణి, పెదరాయుడు, ఒట్టేసి చెబుతున్నా, సొంతం, దిల్, దుబాయ్ శీను, శశిరేఖా పరిణయం, దూకుడు.. వంటి చిత్రాల్లో తనదైన శైలిలో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించారు. తనయుడు విక్రమ్‌ను కథానాయకునిగా పరిచయం చేస్తూ, తొలి ప్రయత్నంగా ఆయన ‘కొడుకు’ అనే చిత్రానికి దర్శకత్వం వహించారు. ఆ తర్వాత ‘భజంత్రీలు’ సినిమాని తెరకెక్కించారు. శుక్రవారం విడుదలైన ‘పటాస్’లో ఆయన చేసిన ‘సునామీ స్టార్ సుభాశ్’ పాత్ర ఆ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. భీమవరంలో విషాద ఛాయలు ఎం.ఎస్. నారాయణ మృతితో పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం, నిడమర్రులో విషాదఛాయలు నెలకొన్నాయి. ఆయన నిడమర్రులో జన్మించినా.. సినీరంగానికి రాకముందు ఎక్కువ కాలం భీమవరంలోనే గడిపారు. భీమవరం ఏఆర్కేఆర్ మున్సిపల్ హైస్కూల్లో తెలుగు ఉపాధ్యాయునిగా పనిచేసిన ఎం.ఎస్. నారాయణ 1978 అక్టోబర్ 30న కేజీఆర్ జూనియర్ కళాశాలలో లెక్చరర్‌గా చేరి 23 ఏళ్లపాటు అందులో పనిచేశారు. ఆయన పాఠం చెబుతుంటే.. ఇతర తరగతుల విద్యార్థులంతా ఆ తరగతికి వెళ్లి మరీ ఎమ్మెస్ పాఠాలను వినేవారు. హాస్యం జోడించి ఆయన పాఠాలు చెప్పే విధానం విద్యార్థుల్ని విశేషంగా ఆకర్షించేది. ఎం.ఎస్. నారాయణ విద్యార్థులతో నాటకాలు వేయించేవారు. ఆంధ్రా యూనివర్సిటీ స్థారుులో నిర్వహించిన నాటక పోటీల్లో ఆయన రచించి, దర్శకత్వం వహించిన ‘రెండు రెళ్లు ఆరు’ నాటకానికి 8 బహుమతులు వచ్చారుు. ‘ఉపాధ్యాయుడి స్థారుు నుంచి ఎం.ఎస్. నారాయణ స్వయం కృషితో లెక్చరర్, ఆ తరువాత సినీ రంగానికి వెళ్లారు. కథా రచరుుతగా స్థిరపడాలనుకున్న ఆయన ప్రతి శనివారం సర్కార్ ఎక్స్‌ప్రెస్‌లో బయలుదేరి చెన్నై వెళ్లి సోమవారం తిరిగి వచ్చేవారు. అక్కడకు వెళ్లినప్పుడు ఉండటానికి రేలంగి నరసింహరావు ఇంటిని అద్దెకు తీసుకున్నారు. అనుకోకుండా హాస్యనటుడిగా స్థిరపడ్డారు’ అని ఎం.ఎస్. నారాయణతో కలసి పనిచేసిన లెక్చరర్లు జి.హరిప్రసాద్, తాడి లక్ష్మణరావు, టీవీ రమణ, జేవీవీ నాగేశ్వరరావు చెప్పారు. -
ఆయన సెన్సాఫ్ హ్యూమర్ సూపర్ - శ్రీను వైట్ల
సాగర్‌గారి దగ్గర నేను సహాయ దర్శకునిగా చేస్తున్నప్పుడు నారాయణగారు రచయితగా చేసేవారు. అప్పట్నుంచే మా ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఉంది. ‘నువ్వు పెద్ద డెరైక్టర్ అవుతావు’ అని ప్రోత్సహించేవారు. ఆయనకు విపరీతమైన సెన్సాఫ్ హ్యూమర్ ఉంది. మేం ఇద్దరం మంచి మిత్రులు కావడానికి ఒక రకంగా అదే కారణం. నా తొలి చిత్రం ‘ఆనందం’ నుంచి ఇప్పటివరకు ఒకటీ, రెండు సినిమాల్లో మినహా మిగతా అన్ని చిత్రాల్లోనూ ఆయన నటించారు. ఆ ఒకటి, రెండు చిత్రాలు కూడా డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో నటించలేకపోయారు. ఆయన మంచి టైమింగ్ ఉన్న నటుడు. ఏ పాత్ర ఇచ్చినా దాన్ని మరో స్థాయికి తీసుకెళ్లగలిగిన ప్రతిభావంతుడు. హార్డ్ వర్కర్ కూడా. అందుకు నిదర్శనం ‘దూకుడు’ సినిమా. అందులో ఇతర చిత్రాల హీరోలను ఎమ్మెస్‌గారు పేరడీ చేసే సన్నివేశాలున్నాయి కదా. వాటిని ఒకే రోజులో చేసేశారాయన. అన్ని గెటప్స్ మార్చుకుని ఒకే రోజులో చేయడం సులువు కాదు. సూపర్బ్ ఎనర్జీ ఉన్న నటుడు. ఆయన్ని కోల్పోవడం బాధాకరం. -
కాళిదాసంటే పులకించేవారు! - తనికెళ్ళ భరణి
ఎమ్మెస్ సారస్వత ప్రియుడు. మేము ఎప్పుడు కలిసినా, సాహిత్యం గురించే మాట్లాడుకొనేవాళ్ళం. కొత్తగా ఏం చదివావంటే, ఏం చదివావని పరస్పరం చర్చించుకునేవాళ్లం. ఆయనకు భారతీయ సంస్కృతీ సంప్రదాయాలన్నా, సంస్కృత సాహిత్యమన్నా అపారమైన అభిమానం. చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే, సంస్కృతం చదువుకున్న అతి తక్కువ మంది నటుల్లో ఆయన ఒకరు. ముఖ్యంగా మహాకవి కాళిదాసు ప్రస్తావన వస్తే, ఆయన పులకించిపోయేవారు. ‘కాళిదాసు పుట్టిన భూమిలో మనం పుట్టడం అదృష్టం సార్!’ అనేవారు. ‘కావ్యేషు నాటకం రమ్యం, నాటకేషు శకుంతల, తత్రాపి చతుర్థాంకం, తత్ర శ్లోక చతుష్టయమ్’ అని సంస్కృతంలో ఒక సూక్తి ఉంది. కావ్యాల్లో నాటకం... ఆ నాటకాల్లో కాళిదాసు ‘అభిజ్ఞాన శాకుంతలమ్’... అందులోనూ నాలుగో అంకం... అందులోని కీలకమైన నాలుగు శ్లోకాలు అతి రమ్యమైనవని దాని అర్థం. ఆ మాట చెబుతూ, ఆ నాలుగు శ్లోకాలనూ ఎమ్మెస్ అప్పజెప్పేవారు. సంస్కృతం చదువుకున్న నాకు కూడా ఆ శ్లోకాలు నోటికి రావని సిగ్గుపడి, స్కూలు పిల్లాడిలా ఒక వారం రోజులు కష్టపడి, ఆ శ్లోకాలు కంఠతా పట్టి, ఆయనకు అప్పజెబితే, ఆయన ఆనందంతో కౌగలించుకున్నారు. ఆ మధ్య కలిసినప్పుడు ‘నేను మీకు బాకీ తెలుసా?’ అన్నారు ఎమ్మెస్. అదేంటి అన్నా. ‘ఇంకా నటుడిగా స్థిరపడని రోజుల్లో 1994 ప్రాంతంలో హైదరాబాద్‌కు వచ్చిన కొత్తలో ఒకసారి నాకు బాగా డబ్బు అవసరమైంది. అప్పుడు మీరున్న డబ్బింగ్ థియేటర్ దగ్గరకు వచ్చి అడిగితే, జేబులో నుంచి 2 వేలు తీసి నా చేతిలో పెట్టారు. ఆ డబ్బు తీసుకొని నేను వెళ్ళిపోయా. ఆ తరువాత మీకు ఇవ్వలేదు’ అని ఎమ్మెస్ చెప్పారు. ఆ సంగతి నాకు గుర్తే లేదు. ఆ మాటే ఆయనతో అన్నా. ‘డబ్బు ఇచ్చిన మీరు కాదండీ, తీసుకున్న నేను గుర్తుపెట్టుకోవాలి!’ అన్న ఎమ్మెస్, ‘ఆ డబ్బులు మీకు తిరిగి ఇవ్వలేదు. ఇవ్వను కూడా. ఎందుకంటే, అది నా జీవితాంతం గుర్తుండిపోయే జ్ఞాపకం’ అని చెప్పారు. అంత స్నేహం మాది. ప్రాథమికంగా జీవితాన్ని ప్రేమించే తత్త్వం ఆయనది. ప్రతి చిన్నవిషయానికీ స్పందించే సాహితీపరుల లక్షణం ఆయనలో పుష్కలం. అలాగే, ఆయన చక్కటి ఛలోక్తులు విసురుతారు. ఎవరేమన్నా దానికి చక్కటి రిటార్ట్‌లు ఇస్తారు. అలాగే, ఎంత కష్టం ఎదురైనా ఎదుర్కొనే మొండితనం కూడా ఉండేది. ‘కొడుకు’ సినిమా తీసినప్పుడు ఆయన చాలా నష్టపోయారు. మధ్యవర్తిగా నేనుండగా, ఆయన కొన్ని లక్షల డబ్బు అవతలవాళ్ళకు చెల్లిస్తుంటే, నేను కదిలిపోయాను. ‘పైసా పైసా కష్టపడి సంపాదించినది అలా ఇచ్చేస్తుంటే, నాకే దుఃఖం వస్తోంది’ అంటూ నేను బాధపడ్డా. ఆయన మాత్రం ‘ఏం ఫరవాలేదు సార్! మళ్ళీ సంపాదిద్దాం’ అని నిబ్బరం ప్రదర్శించారు. అలాగే, ‘దూకుడు’ నుంచి మళ్ళీ నటుడిగా పుంజుకొని, మంచి స్టార్ కమెడియన్‌గా వెలిగారు. మంచి నటుణ్ణే కాకుండా మంచి స్నేహితుణ్ణీ, సాహితీప్రియుణ్ణీ, అంతకు మించి మంచి మనిషిని కోల్పోవడం బాధగా ఉంది. ఎమ్మెస్ నారాయణ, తనికెళ్ళ భరణి, కాళిదాసు, MS Narayana, Tanikella Bharani, Kalidasa -
పనే దైవం! - మోహన్‌బాబు
నేను, రవిరాజా మంచి స్నేహితులం. ‘నాకు తెలిసిన మంచి రైటర్ ఉన్నాడు. తనలో మంచి నటుడు కూడా ఉన్నాడు’ అని ఎమ్మెస్ గురించి రవిరాజా చెబితే, ‘ఎం. ధర్మరాజు ఎం.ఎ’ ద్వారా పరిచయం చేశాం. మనిషిని చూడకపోయినా రవిరాజా చెప్పాడు కాబట్టి, తీసుకున్నాం. ఆ తర్వాత మా సంస్థ నిర్మించిన పలు చిత్రాల్లో నటించాడు. ఎమ్మెస్ మంచి వ్యక్తి. లొకేషన్లో తానేంటో తన పనేంటో అన్నట్లుగా ఉండేవాడు. ఏదైనా సన్నివేశం తృప్తిగా అనిపించకపోయినా, డైలాగ్‌ని మార్చాలన్నా, మొహమాటపడకుండా చెప్పేవాడు. ఎంత బిజీగా ఉన్నా మా సంస్థలో నిర్మించే సినిమాకి డేట్స్ కేటాయించడానికి తపన పడేవాడు. ‘పెదరాయు డు’లో చూసి గొప్ప నటుడవుతాడనుకున్నాను. అది నిజమైంది. వ్యక్తిగతంగా సమస్య (ఆర్థికం కాదు) వచ్చినా నాతో పంచుకునేవాడు. నేనూ పరిష్కరించేవాణ్ణి. బిజీగా ఉన్నప్పటికీ ఫోన్ చేసేవాడు. నేను చేయకపోతే ‘మర్చిపోయారా’ అని ఫోన్ చేసేవాడు. -
ప్రయత్నిస్తూ మరణిస్తే గెలిచినట్లు..! ప్రయత్నం విరమిస్తే మరణించినట్లు!!
సినీ రంగంలో బ్రేక్ వచ్చేంత వరకు పడిన కష్టాల గురించి ఒకసారి ఎమ్మెస్ ‘సాక్షి’తో పంచుకుంటూ, ‘‘...ఆ పన్నెండేళ్ళు నేను పడిన కష్టాలు భయంకరం! ఒక దశలో విరక్తి చెంది, మా ఊరెళ్ళిపోదామనుకున్నాను. మర్నాడు రెలైక్కడానికి టికెట్ కూడా తెచ్చుకున్నా. ఆ రాత్రి రూమ్‌లో కూర్చొని ఆలోచనలో పడ్డా. అప్పుడు నేను రాసిన కథలు గుర్తొచ్చాయి. నా కథల్లో హీరో సినిమా మొత్తం కష్టపడి, చివరికి అనుకున్నది సాధిస్తాడు. ‘మనం రాసిన కథల్లో హీరోల్లా మనం కష్టపడకూడదా?’ అని ఎందుకో అనిపించింది. అంతే! ‘ప్రయత్నిస్తూ మరణిస్తే గెలిచినట్లు... ప్రయత్నం విరమిస్తే మరణించినట్లు’ అని పేపర్ మీద రాసుకున్నా. దాన్ని గోడకు అంటించా. టికెట్ చించేశా’’ అని చెప్పుకొచ్చారు. ఆ తరువాత దర్శకుడు రవిరాజా పినిశెట్టి దగ్గరకు రచయితగా వెళ్ళడం, నటుడిగా తెర మీదకు రావడం చరిత్ర. ప్రయత్నిస్తూ కెరీర్లో గెలుపు సాధించిన ఎమ్మెస్ అనారోగ్యంపై పోరులో అర్ధంతరంగా ప్రయత్నం విరమించి కన్నుమూయడం తీరని విషాదం. -
పేరడీ కామెడీలో సునామీ
హిట్టయిన పాత్రలు, నిజజీవిత మనుషులను వెండితెరపై అనుకరించడంలో అగ్రశ్రేణి నటుడు - ఎమ్మెస్. ఆ సినిమాలు ఇవాళ్టికీ టీవీ చానళ్ళలో వాటి ఒరిజినల్ హీరోలనూ, గెటప్లనూ గుర్తు చేస్తూ కామెడీ పండిస్తున్నాయి. ‘ఒట్టేసి చెబుతున్నా’లో ఫ్యాక్షన్ చిత్రాల హీరోలకు పేరడీగా రెడ్డినాయుడు (రెనా) పాత్రలో నవ్వించారు. ‘బాద్షా’లో హార్రర్ చిత్రాల రివెంజ్ నాగేశ్వరరావుగా ఒక ప్రముఖ దర్శకుణ్ణి గుర్తుకు తెస్తూ, పదే పదే ట్వీట్లు చేసే పాత్రను పండించారు. ‘దుబాయ్ శీను’లో నటుడు ఫైర్‌స్టార్ సాల్మన్రాజుగా నిన్నటి తరం అగ్రహీరో ఒకరిని అనుకరిస్తూ ఆయన చేసిన గోడ మీద పిడకల స్టెప్పు, డైలాగ్ మాడ్యులేషన్ తెగ నవ్వించాయి. ‘దూకుడు’లో పోషించిన బొక్కా వెంకటరత్నం పాత్ర రిపీట్ ఆడియన్స్‌ను రప్పించింది. దాంతో ఎమ్మెస్ పేరడీ కామెడీలో స్టార్ హీరో అయ్యారు. -
పరుచూరి చేసిన పెళ్లి
ఎమ్మెస్ నారాయణది కులాంతర వివాహం. భాషా ప్రవీణ చదువుతున్నప్పుడు తన క్లాస్మేట్ కళాప్రపూర్ణను ఆయన ప్రేమించారు. ఆమె కూడా ఇష్టపడింది కానీ, వీరి ప్రేమను కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. దాంతో భాషా ప్రవీణ ఫైనల్ ఇయర్లో తమకు లెక్చరరైన పరుచూరి గోపాలకృష్ణ సహాయం తీసుకున్నారు. స్వతహాగా కమ్యూనిస్టు భావాలున్న వ్యక్తి కావడంతో దగ్గరుండి ఎమ్మెస్ పెళ్లి జరిపించారు పరుచూరి. చిత్రపరిశ్రమకు వచ్చేటప్పుడు కూడా గోపాలకృష్ణను ఎమ్మెస్ సంప్రతించారు. సినిమాల్లోకొచ్చాక చానాళ్లు ఎమ్మెస్‌కి అవకాశాలు రాలేదు. దాంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇక ఊరెళ్లిపోతానని చెబితే, ‘మంచి టైమ్ వస్తుంది. ఓపిక పట్టు’ అని ఆయన గురువు పరుచూరి గోపాలకృష్ణ అన్నారు. ఆ మాటలకు విలువ ఇచ్చి, ఆయన ఉండిపోయారు. పైకొచ్చాక పలు సందర్భాల్లో ‘ఆ రోజు ఓపిక పట్టమని మాస్టారు నాకు మంచి సలహా ఇచ్చారు’ అనేవాడని గోపాలకృష్ణ గుర్తు చేసుకున్నారు. -
నీ దూకుడు సాటెవ్వరూ..!
‘ఈ నగరానికి ఏమైంది? ఒక వైపు నుసి... ఒక వైపు పొగ...’ తెలుగునాట థియేటర్లకు వెళ్ళి సినిమాలు చూసేవారందరికీ సుపరిచితమైన ధూమపాన వ్యతిరేక ప్రచార ప్రకటన ఇది. ఇప్పుడు ప్రేక్షకులతో పాటు తెలుగు సినీపరిశ్రమ వర్గీయులందరి మదినీ తొలిచివేస్తున్న ప్రశ్న - ‘ఈ చలనచిత్ర సీమకు ఏమైంది? దాదాపుగా వారానికి ఒకరుగా వెంట వెంటనే ఎంతోమంది ప్రముఖులను పోగొట్టుకుంటున్నాం’ అని! సంగీత దర్శకుడు చక్రి , దర్శకుడు కె. బాలచందర్, రచయిత గణేశ్ పాత్రో, నటుడు ‘ఆహుతి’ ప్రసాద్, నిర్మాత వి.బి. రాజేంద్రప్రసాద్... ఇప్పుడు నటుడు ఎమ్మెస్ నారాయణ... నిండా నెలరోజుల్లోనే ఆరుగురు ప్రముఖులు దూరమయ్యారు. సంక్రాంతి సందర్భంగా సొంత ఊరు వెళ్ళి, అక్కడ తీవ్ర అనారోగ్యం పాలైన ప్రముఖ హాస్యనటుడు ఎమ్మెస్ నారాయణ శుక్రవారం ఉదయం హైదరాబాద్‌లో కన్నుమూయడంతో - ఈ చలనచిత్ర నగరానికి ఏ శాపం తగిలిందంటూ అందరూ తీవ్ర విషాదంలో మునిగిపోయారు. కెరీర్లోనే కాదు... ఆఖరికి కన్నుమూయడంలోనూ తొందరపడి దూకుడు ప్రదర్శించిన ఎమ్మెస్ మరణంతో కామెడీ కన్నీళ్ళు పెడుతోంది. ‘‘నువ్వు హీరోవంటే ఎలా నమ్మావ్ రా కళ్ల కింద క్యారీ బ్యాగ్‌లు వేసుకుని’’ అని బ్రహ్మానందం అంటే ‘‘గ్రాఫిక్స్‌లో తీసేస్తారేమో అనుకున్నా’’అని అమాయకంగా చెప్పి, ‘దూకుడు’ చిత్రంలో కడుపుబ్బ నవ్వించిన కామెడీ యాక్టర్ ఎమ్మెస్ నారాయణ ఉరఫ్ మైలవరపు సూర్యనారాయణ. సమకాలీన నటుల్లో తాగుబోతు క్యారెక్టర్లకు బ్రాండ్ ఇమేజ్ తెచ్చిన నటుడు ఎమ్మెస్ ఇలా తెరపై పూయించిన నవ్వులు ఎన్నో. ‘‘నిద్రపోయేటప్పుడే విశ్రాంతి తీసుకో... మెలకువగా ఉండి పడుకోవద్దు ’’ అని తండ్రి చెప్పిన సూత్రాన్ని బాగా వంటబట్టించుకున్న ఒకప్పటి లెక్చరర్ సినీ రచయితగా ప్రారంభించి, నటుడిగా నిలదొక్కుకోవడానికి పడ్డ కష్టాలు అన్నీ ఇన్నీ కావు. 1951 ఏప్రిల్ 16న పశ్చిమగోదావరి జిల్లా నిడమర్రులో పుట్టిన ఎమ్మెస్ వ్యవసాయ కుటుంబీకులు. తెలుగంటే మక్కువ... తెలుగంటే ఎంతో ఇష్టమున్న ఎమ్మెస్ ‘భాషా ప్రవీణ ’ కోర్సులో చేరారు. అది పాసయ్యాక దగ్గర్లోని ఊళ్లోని ఓ హైస్కూల్లో తెలుగు పండి ట్‌గా పనిచేశారు. చదువుకొనే రోజుల్లోనే 1971లో తమ కాలేజీ లెక్చరర్ పరుచూరి గోపాలకృష్ణ రాసిన ‘సోషలిజం’ అనే నాటకంలో కథానాయకుడిగా నటించారు. పెన్నుతోనూ ప్రాణాలు కాపాడవచ్చన్న ఒకే ఒక్క ఆశయంతో 1977నాటి దివిసీమ ఉప్పెన బాధితులను ఆదుకోవడానికి ‘జీవచ్ఛవం’ అనే నాటిక రాసి, స్కూల్ పిల్లలతో వేయించారు. అలా చందాలు పోగుచేసి తన వంతు సాయం చేసిన ఉదార మనస్తత్త్వం ఎమ్మెస్‌ది. ఆ తరువాత ఆయన భీమవరం కాలేజీలో లెక్చరర్‌గా చేశారు. అక్కడ విద్యార్థులతో వేయించిన నాటకాలకు ప్రైజులు కూడా రావడంతో మంచి పేరు వచ్చింది. ‘‘మా నారాయణ మాస్టార్’’ అనిపించుకుని అభిమానానికి పాత్రుడయ్యారు. భార్య ప్రోత్సాహంతో సినిమాల్లోకి.... ఉద్యోగం చేస్తుండగానే కథలు రాయడం మొదలుపెట్టారు. భార్య కళాప్రపూర్ణ ప్రోత్సాహంతో శనివారాలు సర్కారు ఎక్స్‌ప్రెస్ ఎక్కి మద్రాసు వెళ్లి సినిమా అవకాశాల కోసం ప్రయత్నించారు. కానీ ఫలితం లేకపోయే సరికి ఉద్యోగానికి ‘లాస్ ఆఫ్ పే’ పెట్టి మద్రాసులోనే ప్రయత్నాలు ప్రారంభించారు. ఆ సమయంలోనే ‘పేకాట పాపారావు’, ‘హలో నీకు పెళ్లంట’,‘ ప్రయత్నం’, ‘అలెగ్జాండర్’ చిత్రాలకు కథలందించారు. ఎమ్మెస్ ఒకేరోజు ఏడుసార్లు కథ చెప్పిన రోజులున్నాయి. సీరియల్ రైటర్‌గా.. మేకప్‌మేన్ జాస్తి మాధవరావు టీవీ సీరియల్‌కు కథ రాసే అవకాశం వచ్చింది. వెంటనే ఒప్పుకొని ‘నారీమణిహారం’ పేరుతో స్త్రీ జీవితంలోని ముఖ్యఘట్టాలను 13 ఎపిసోడ్లుగా రాసి ఇచ్చారు. ఎమ్మెస్ ప్రతిభ చూసి ముచ్చటపడిన మాధవరావు ఆయనను నటుడు మురళీమోహన్‌కు పరిచయం చేశారు. ఆయన ఓ ఎపిపోడ్ కథ విని ఎమ్మెస్‌కు వెంటనే చాన్స్ ఇచ్చారు. కానీ అప్పుడే తండ్రి చనిపోవడం ఎమ్మెస్ జీవితంలో పెద్ద విషాదం. తరువాత మళ్ళీ మద్రాసు వెళుతూ, రాత్రి సర్కార్ ఎక్స్‌ప్రెస్‌లో రాసుకున్న ‘సవ్యసాచి’ కథ మురళీమోహన్కి వినిపించారు. ‘అది బాగా నచ్చింది కానీ, ఇంత మంచి కథకు నేను సరిపోను’ అని మురళీమోహన్ వెనక్కు తగ్గారు. అది రవిరాజా పినిశెట్టి చేతుల్లోకి వెళ్లింది. కానీ రవిరాజా ‘చంటి’ సినిమాతో బిజీ కావడంతో ‘సవ్యసాచి’ తెరకెక్కలేదు. రవిరాజా పరిచయంతో... ఎమ్మెస్ కథలు చెప్పే విధానం నచ్చడంతో దర్శకుడు రవిరాజా పినిశెట్టి ఆయనలో మంచి నటుడు దాగున్నాడని పసిగట్టారు. ‘ఎమ్. ధర్మరాజు ఎంఏ’లో చెవిటి వాడి పాత్రతో తొలి అవకాశమిచ్చారు. కాలక్రమంలో హాస్యనటుడిగా, ముఖ్యంగా తాగుబోతు పాత్రలకూ, పేరడీ రోల్స్‌కూ మారుపేరుగా నిలిచారు. ఆయన కామెడీకి వరుసగా ఐదు సార్లు (‘మా నాన్నకు పెళ్లి’ (1997), ‘రామసక్కనోడు’ (1999), ‘సర్దుకుపోదాం రండి’ (2000), ‘శివమణి’’ (2003), ‘దూకుడు’ (2011) చిత్రాలకు) నంది అవార్డులు అందుకున్నారు. ‘దూకుడు’ చిత్రానికే ఫిలింఫేర్ అవార్డు అందుకున్నారు. తాగుబోతు పాత్రలలో ఆయన నటించిన తీరు నిజంగా అద్భుతం. కెరీర్‌లోని 700కు పైగా చిత్రాల్లో సుమారు 200 సార్లు తాగుబోతు పాత్రలు పోషించి, ప్రతిసారీ మెప్పించారు. నవ్వించడమే కాక, గుండెలు పిండే పాత్రలతో కన్నీళ్లు కూడా పెట్టించారాయన. ‘పిల్ల జమిందార్’ చిత్రంలో తెలుగు మాస్టారు పాత్ర అందుకు ఒక మచ్చుతునక. దర్శకుడిగా.... స్వయానా రచయిత, నటుడైన ఎమ్మెస్ దర్శకుడిగానూ ప్రయత్నించారు. ఏకైక కుమారుడు విక్రమ్ కుమార్ హీరోగా ‘కొడుకు’ చిత్రాన్ని తెరకెక్కించారు. ఆ చిత్రం ఆయనను ఆర్థికంగా బాగా దెబ్బతీసింది. ఆ తరువాత శివాజీ నటించిన ‘భజంత్రీలు’ అనే మరో చిత్రానికీ దర్శకత్వం వహించారు. ఆయన కుమార్తె శశికిరణ్ సైతం ఇటీవలే ‘సాహెబా సుబ్రహ్మణ్యం’ సినిమాతో దర్శకురాలయ్యారు. పిల్లలు స్థిరపడాలంటూ చివరి వరకు ఆయన పడిన తాపత్రయం అంతా ఇంతా కాదు. అయితే, అలవాట్ల విషయంలో అజాగ్రత్త, ఆరోగ్యంపై చూపిన అశ్రద్ధ ఎమ్మెస్ను అర్ధంతరంగా 63 ఏళ్లకే మింగేశాయి. తెలుగు తెరపై నవ్వులు పూయించిన ఈ తెలుగు మాస్టారి హఠాన్మరణం సినీ పరిశ్రమను దిగ్భ్రాంతికి గురిచేసింది. విచిత్రం ఏమిటంటే, ఎమ్మెస్ కన్నుమూసిన శుక్రవారం ఉదయమే విడుదలైన ‘పటాస్’ చిత్రంలోనూ ఆయన ఒక పేరడీ హీరోగా నటిస్తే, ఆయన కుమారుడు విక్రమ్ దర్శకుడిగా తండ్రితో కలిసి ఒక షాట్లో కనిపిస్తారు. ఆ చిత్రం క్లైమాక్స్‌లో ‘సునామీ స్టార్ సుభాష్’ పాత్రలో ఎమ్మెస్ నారాయణ యాదృచ్ఛికంగా చెప్పిన ఆఖరి డైలాగ్ కూడా ‘ఈ నగరానికి ఏమైంది?...’ అన్నదే! చనిపోయిన రోజు కూడా థియేటర్లలో ప్రేక్షకులను నవ్వించిన ఆ హాస్య సంజీవికి చెమర్చిన కళ్ళతో శ్రద్ధాంజలి! -
ఎంఎస్ నారాయణ ఇకలేరు.
-
సినీనటుడు ఎంఎస్ నారాయణకు ప్రముఖుల నివాళి
-
ఎంఎస్ నారాయణ ఇకలేరు..
-
కంటతడి పెట్టిన నటులు
హైదరాబాద్: హాస్యనటుడు ఎంఎస్ నారాయణ భౌతికకాయాన్ని ఈ మధ్యాహ్నం ఫిలిం ఛాంబర్ కు తరలించారు. సినిమా ప్రముఖులు ఆయన పార్థీవదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. ఆయనతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. కొంత మంది నటులు భావోద్వేగానికి లోనయి కంటతడి పెట్టుకున్నారు. నటుడు బెనర్జీ దుఃఖాన్ని ఆపుకోలేక కన్నీళ్ల పర్యంతమయ్యారు. ఎంఎస్ నారాయణ భౌతికకాయానికి శనివారం అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఎర్రగడ్డ శ్మశానవాటికలో అంతిమ సంస్కారాలు నిర్వహిస్తామని ఎంఎస్ నారాయణ కుటుంబ సభ్యులు తెలిపారు. -
ఎమ్మెస్ మా గుండెల్లో ఉంటారు: ఆలీ
-
కామెడికి పెద్ద లోటు: ఎస్వీ కృష్ణారెడ్డి
-
"అందరూ నవ్వూతూ ఉండాలనుకునేవారు"
-
మిస్ యూ.. ఎమ్మెస్..!
-
'ఎంఎస్ ప్రేమపెళ్లి చేసింది నేనే'
హైదరాబాద్ : ఎంఎస్ నారాయణ నటుడుగా, రచయితగా మాత్రమే ప్రేక్షకులకు, చిత్ర పరిశ్రమకు తెలుసునని... అయితే అతడు తనకు విద్యార్థి అని సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ అన్నారు. ఎంఎస్‌కు తాను పాఠాలు చెప్పానని.. కులాంతర వివాహానికి ఇంట్లో పెద్దలు ఒప్పుకోకపోతే అతని పెళ్లికి పెద్దరికం వహించింది తానేనని చెప్పారు. కళాప్రపూర్ణను ఎంఎస్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారన్నారు. బతుకుదెరువు కోసం ఎంఎస్ ఓ సినిమా థియేటర్లో బుకింగ్ క్లర్క్‌గా పనిచేశాడని చెప్పారు. అనుకున్నది చేయాలి, ఎవరికీ అన్యాయం చేయకూడదనేది ఎంఎస్ నైజం అని పరుచూరి తెలిపారు. ఎంఎస్, అతని భార్య కళాప్రపూర్ణ భీమవరంలో ఉద్యోగం చేసేవారని, చిత్ర పరిశ్రమలోకి వచ్చే ముందు తననే కలిశాడని ఆయన పేర్కొన్నారు. సినీ రచయితగా తన ప్రస్థానం ప్రారంభించాడని, అయితే ఒకానొక సమయంలో అవకాశాలు రాకపోవటంతో పాటు ఆర్థిక ఇబ్బందులు ఎక్కువ కావటంతో తిరిగి వెళ్లిపోతానని చెప్పాడని, అయితే ప్రతి ఒక్కరికీ మంచి రోజు వస్తుందని, అప్పటివరకూ ఓర్చుకోవాలని ఎంఎస్‌కు తాను ధైర్యం చెప్పానన్నారు. ఆ తర్వాత 'మా నాన్నకు పెళ్లి' చిత్రం ద్వారా ఎంఎస్ దశ తిరిగిందని, అప్పటి నుంచి ఇప్పటివరకూ వెనక్కి తిరిగి చూడలేదని పరుచూరి అన్నారు. అనంతరం తనను కలిసిన ఎంఎస్ .. వెళ్లిపోవద్దని మంచి సలహా ఇచ్చారు మాస్టారు అని అన్నాడని ఆయన తెలిపారు. ఆరోగ్యం గురించి ఎంఎస్ అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాడని, గురువారం కూడా అతడిని చూశానని, అతనికి ఉన్న ధైర్యాన్ని చూస్తే త్వరగా కోలుకుంటాడనుకున్నానన్నారు. నిన్న ఉంటాడనుకున్న వ్యక్తి నేడు లేకపోవడం బాధాకరమని పరుచూరి గోపాలకృష్ణ పేర్కొన్నారు. -
పైన వినోదం కరువై తీసుకెళ్తున్నారేమో..
-
'ఎంఎస్‌తో అవే నా చివరి మాటలు'
హైదరాబాద్ : ఎంఎస్ నారాయణ గురించి ఎంత చెప్పినా తనివి తీరదని హాస్యనటుడు, రచయిత ఎల్బీ శ్రీరామ్ అన్నారు. ఆయన శుక్రవారం కిమ్స్‌లో ఎంఎస్ నారాయణ భౌతికకాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. అనంతరం ఎల్బీ శ్రీరామ్ మాట్లాడుతూ తామిద్దరం కలిసి అనేక సినిమాల్లో నటించామన్నారు. ఇటీవలే ఎంఎస్ నారాయణ తనకు ఫోన్ చేసి అరగంట మాట్లాడారన్నారు. ఆయన ఇటీవల తాను నటించిన ఓ సినిమాలో నటించికపోయినా...తన నటనను అభినందించారన్నారు. తన సినిమా ఇంకా విడుదల కాలేదని, అయితే ప్రివ్యూ చూసిన ఎంఎస్ నారాయణ... ఉండబట్టలేక తనకు ఫోన్ చేశానని చెప్పారన్నారు. 'ఎల్బీగారు మీ సినిమా చూశాను. అద్భుతంగా నటించారు. మీరు ఏడ్వకుండా..చూసేవారిని ఏడ్పించారని' ఎంఎస్ తనతో అన్నారని ఆ జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. అదే ఆయనతో తాను చివరిగా మాట్లాడటం అని తెలిపారు. తెల్లారి లేస్తే ఎంతోమందిని నవ్వించే కమెడియన్లకు అదే టానిక్ అని... అందర్ని నవ్వేంచేవాళ్లు భౌతికంగా లేకున్నా వందేళ్లు బతకాలని ఎల్బీ శ్రీరామ్ అన్నారు. -
ఏ అడ్రస్ పట్టుకొని వెళ్ళిపోయాడో..
-
నాన్న నన్ను ఒక్కరోజు కూడా తిట్టలేదు!
ప్రముఖ హాస్యనటుడు ఎమ్మెస్ నారాయణ కుమార్తె శశికిరణ్ దర్శకురాలిగా మారి, ‘సాహెబా సుబ్రహ్మణ్యం’ అనే చిత్రం చేశారు. గతంలో బుల్లితెరపై కొన్ని షోలు డెరైక్ట్ చేసిన అనుభవం శశికిరణ్కు ఉంది. భవిష్యత్తుపై తనకు స్పష్టమైన లక్ష్యం ఉంది. శశికిరణ్‌తో జరిపిన చిట్ చాట్. అసలు మీ కెరీర్ ఎలా ఆరంభమైంది? ముందు గ్రాఫిక్స్ విభాగంలో చేశాను. కానీ, ఒకేచోట కూర్చునే ఉద్యోగం అంటే నావల్ల కాలేదు. వేరే ఏదైనా చేద్దామనుకుని, టీవీకి సంబంధించిన డెరైక్షన్ డిపార్ట్మెంట్లో చేరాను. పలు టీవీ షోస్‌కి డెరైక్షన్ చేశాను. మాటీవీలో చేస్తూనే ఈ సినిమా డెరైక్ట్ చేయడం మొదలు పెట్టాను. ఆ తర్వాత నమ్మకం కుదిరి ఉద్యోగానికి రాజీనామా చేసేశా. ‘సాహెబా సుబ్రహ్మణ్యం’కి ఎలా అవకాశం వచ్చింది? యూఎస్‌లో ఉన్న కొల్లా నాగేశ్వరరావుగారికి నా గురించి ఫ్రెండ్ చెప్పారు. డెరైక్షన్ చేసే ప్రతిభ నాకుందని నా ఫ్రెండ్ చెప్పడంవల్లే నాగేశ్వరరావుగారు నన్ను సంప్రదించారు. మలయాళ సినిమా ‘తట్టత్తు మరియత్తు’ని రీమేక్ చేద్దామని ఆయనే అన్నారు. నాక్కూడా డెరైక్షన్ చేయగలననే నమ్మకం ఉండటంతో అంగీకరించాను. టీవీపరంగా అనుభవం సంపాదించుకున్నా.. సినిమాలపరంగా దర్శకత్వ శాఖలో అనుభవం లేదు కదా.. ఏమైనా ఇబ్బంది అనిపించిందా? ఎక్కడా చేయకపోవడమే మంచిదనిపించింది. ఎవరి దగ్గరైనా పని చేసి ఉంటే, వాళ్ల ప్రభావం నా మీద ఉండి ఉండేది. ఇప్పుడు నా ఆలోచనలు, నా పని తీరు.. ఇవే సినిమాలో ప్రతిబింబిస్తాయి.మలయాళంలో ఘనవిజయం సాధించిన సినిమాకి రీమేక్ ఇది. ఆల్రెడీ ప్రూవ్ అయిన కథ కాబట్టి, ‘సేఫ్’ అనుకున్నారా? అలా ఏం కాదు. ఎందుకంటే, మలయాళ సినిమా అక్కడి నేపథ్యంలో ఉంటుంది. తెలుగు సినిమాని ఇక్కడి నేపథ్యంలో, ఇక్కడివారి అభిరుచులకు తగ్గట్టుగా తీయాలి. మన నేటివిటీకి తగ్గట్టుగా కథాంశాన్ని మలచకపోతే అనువాద చిత్రంలా అనిపించే ప్రమాదం ఉంది. స్ట్రయిట్ సినిమా చేసినప్పుడు ఉన్న వెసులుబాటు రీమేక్ సినిమాకి ఉండదు. నేను ‘కట్ అండ్ పేస్ట్’లా ఈ సినిమా తీయలేదు. రీమేక్ అస్సలు సులువు కాదు. సినిమా పరిశ్రమలో పురుషాధ్యికత ఉంటుందని, స్త్రీలంటే చిన్న చూపు ఉంటుందనే అభిప్రాయం ఉంది.. అదెంతవరకు నిజం? మేల్ డామినేషన్ నిజమేనండి. మొదట్లో ‘ఈ అమ్మాయి ఏం చేస్తుందిలే’ అని తేలికగానే అనుకున్నారు. నా పనితీరు చూసిన తర్వాత గౌరవించడం మొదలుపెట్టారు. ఇక్కడ ఒకటేనండి.. నెమ్మదిగా చెప్పేవాళ్లకి నెమ్మదిగా.. కటువుగా చెప్పేవాళ్లకి ఆ విధంగా చెప్పాలి. ఆ లక్షణాలుంటే ఏ రంగంలోనైనా స్త్రీలు రాణించగలుగుతారు. మా నాన్నగారికి పరిశ్రమలో మంచి పేరుండటం హెల్ప్ అయ్యింది. ‘ఎమ్మెస్ నారాయణగారి అమ్మాయి’ అంటూ గౌరవ భావం, అభిమానంతో చూశారు. డెరైక్టర్ అవుతానని చెప్పగానే మీ నాన్నగారు ఏమన్నారు? సినిమా పరిశ్రమలో లేడీస్ ఇమడటం సులువు కాదన్నారు. ఈ సినిమా షూటింగ్ ఆరంభించక ముందు ఏడాది పాటు ప్రీ ప్రొడక్షన్ వర్క్ చేసుకున్నాను. అప్పుడే నాన్నగారికి నా మీద నమ్మకం కుదిరింది. నాన్నగారెప్పుడూ ‘సున్నాతో మొదలు కావాలి’ అంటారు. షాట్ డివిజన్ ఎలా చేయాలి? సీన్స్ ఎలా రాసుకోవాలి? అని నా అంతట నేను నేర్చుకుని, సున్నాతోనే మొదలుపెట్టాను. ఈ సినిమాలో మీ నాన్నగారు కూడా నటించారు కదా.. ఆయన్ను డెరైక్ట్ చేయడం ఎలా అనిపించింది? చాలా భయం అనిపించింది. సరిగ్గా చేయకపోతే చుట్టుపక్కల ఎంతమంది ఉన్నా, తిట్టేస్తారు. ఈ సినిమా షూటింగ్లో నన్ను ఒక్క రోజు కూడా తిట్టలేదు. సో.. బాగా చేశాననే అనుకుంటున్నా. దర్శుకుల్లో మీకెవరు ఆదర్శం? అందరూ ఆదర్శమేనండి. అయితే కె. విశ్వనాథ్‌గారు, బాలు మహేంద్రగారు, మణిరత్నంగార్ల సినిమాలు ఎక్కువగా చూసేదాన్ని. మహిళా దర్శకులందరూ ఆదర్శమే. మీరా నాయర్ చేసే సినిమాలంటే ఇష్టం. ’ఇంగ్లిష్ వింగ్లిష్’, ‘క్వీన్’లాంటి సినిమాలు చేయాలని ఉంది. డెరైక్షన్ కొనసాగిస్తారా? కచ్చితంగా. ప్రస్తుతం ఓ కథ సిద్ధం చేసుకున్నా. అవకాశాలు వస్తున్నాయి. నాన్నగారి దగ్గర అద్భుతమైన కథలున్నాయి. వాటిల్లో ఓ కథను ఎప్పటికైనా తెరకెక్కిస్తాను. -
ఎంఎస్ నారాయణకు ట్విట్టర్ లో నివాళులు
హఠాత్తుగా ఎం ఎస్ గారిని కోల్పోవడంతో షాక్‌కు గురయ్యాను...అయనతో రెండు చిత్రాల్లో నటించాను . ఆయన ఆత్మకి శాంతి చేకురాలి.. ఎంఎస్ కుటుంబానికి బాసటగా నిలుద్దాం. -రకుల్ ప్రీత్ సింగ్ ఎంఎస్ నారాయణ అంకుల్ చాలా త్వరగా వెళ్లిపోయారు. నాకు ఆయన చిన్నప్పటి నుంచి తెలుసు. నాన్నగారు ఆయన్ని చిత్ర పరిశ్రమకు పరిచయం చేశారు. వాళ్లమ్మాయి శశికిరణ్ దర్శకత్వం వహించిన సాహెబా సుబ్రహ్మణ్యం చిత్రం గురించి మాట్లాడారు. ఇంతలోనే ఇలా అయింది. మంచు లక్ష్మిప్రసన్న ఎంతో మందిని నవ్వించిన గొప్ప వ్యక్తి ....ఎంఎస్ నారాయణ గారి ఆత్మకి శాంతి చేకూరాలి. -నటుడు రాహుల్ రవీంద్రన్ మీతో కలిసి పని చేయడం అదృష్టంగా భావిస్తున్నాను. మిమ్మల్ని కోల్పోవడం చాలా బాధాకరం. మీ ఆత్మకు శాంతి చేకూరాలి . ఆయన కుటుంబానికి అండగా నిలుద్దాం. -నటుడు వరుణ్ తేజ్ మా అందరికి ఆనందాన్నిచ్చినందుకు మీకు కృతజ్ఞతలు....మా అందరిని వదిలి వెళ్లడం చాలా దారుణం. మీ ఆత్మకి శాంతి చేకూరాలి సర్. సుశాంత్ ఎంఎస్ నారాయణ ఉత్తమమైన వ్యక్తిత్వం గల వారు. అయనలాంటి నటున్ని తిరిగి పొందలేము. మీ ఆత్మకి శాంతి చేకూరాలి సర్. -సమంత ఎంఎస్ గారు అన్ని తెలిసిన వ్యక్తి. ఆయన ఒక బహుముఖ ప్రజ్ఞాశాలి, అంతేకాకుండా దయా హృదయం గలవాడు. తెలుగు చిత్ర పరిశ్రమకి, లక్షలాది అభిమానులకి ఆయన లేరనే వార్త నిజంగా తీరని లోటే -సిద్దార్థ -
నాన్నే నాకు స్ఫూర్తి
దర్శకురాలు శశికిరణ్ పేరొందిన హాస్య నటుడి కుమార్తె అయినా ఆమె దృష్టి మాత్రం ఎప్పుడూ దర్శకత్వంపైనే. విలువలతో కూడిన సినిమా తీయూలనే తపనపైనే. ఇలా.. ఎన్నో రోజులుగా ఆమె కన్న కలలు ఇప్పటికి నెరవేరాయి. ‘సాహెరా సుబ్రహ్మణ్యం’ అనే విభిన్న ప్రేమకథతో ప్రత్యేకమైన సినిమా తీశారు. సినీ రంగంలోనైనా.. నిజజీవితంలోనైనా నాన్నే నా స్ఫూర్తి అంటున్న ప్రముఖ హాస్యనటుడు ఎంఎస్ నారాయణ కుమార్తె శశికిరణ్‌తో ‘సాక్షి’ చిట్‌చాట్. ప్రశ్న : సినిమాలపై మక్కువకు కారణం.. జ : నా చిన్నతనం నుంచి సినిమాలంటే ఇష్టం. ప్రతి సినిమాను విశ్లేషణాత్మకంగా చూస్తాను. ఆ సినిమా ద్వారా దర్శకుడు ఏం చెప్పాలనుకున్నాడో అన్వేషిస్తాను. నాన్న ప్రోత్సాహంతో సినీ రంగాన్ని ఎంచుకున్నాను. ప్రశ్న : మీకు నచ్చిన దర్శకులు.. జ : నాన్నతో పాటు ప్రియద ర్శన్, కె.రాఘవేంద్రరావు, దాసరి నారాయణరావు.. ఇంకా చాలామందే ఉన్నారు. ప్రశ్న : సినీరంగంలో మీ అనుభవం.. జ : ‘సాహెబా సుబ్రహ్మణ్యం’ సినిమాలో ప్రముఖ నటులు నరేష్, రావు రమేష్ వంటి వారిని డెరైక్ట్ చేయడం ఆనందంగా ఉంది. ప్రతి ఒక్కరూ నాకు చాలా సహకరించారు. అన్ని సన్నివేశాలు బాగా పండాయి. ప్రశ్న : ఏ తరహా చిత్రాలంటే ఇష్టం.. జ : సమాజానికి ఎంతో కొంత మెసేజ్ ఇచ్చే సినిమాలను ఇష్టపడతాను. అలాంటి సినిమాల ద్వారా ప్రతి ఒక్కరూ స్ఫూర్తి పొందుతారు. నేను కూడా నా సినిమాలో ఓ సందేశం ఇవ్వనున్నాను. మన సంస్కతీ సంప్రదాయూలు ఇనుమడించేలా సన్నివేశాలు ఉంటాయి. ప్రశ్న : మీకు ఆదర్శం ఎవరు.. జ : కచ్చితంగా మా నాన్నే. నా ఎదుగుదలకు, అభివృద్ధికి ఆయనెంతో కారణం. ఆయనే నాకు స్ఫూర్తి. ఎప్పటికీ ఆయన బాటలోనే నడుస్తా.. -
నాన్న తిరిగి వస్తారనుకున్నాం...
హైదరాబాద్ : 'ఇది నిజంగా మాకు షాకింగ్. నాన్న తిరిగి వస్తారనుకున్నాం. మలేరియానే కదా తగ్గిపోద్దనుకున్నాం...ఇలా మనిషిని తినేస్తుందనుకోలేదు' అని ఎంఎస్ నారాయణ కుమార్తె శశికిరణ్ కన్నీటి పర్యంతమయ్యారు. అభిమానుల సందర్శనార్థం నాన్న భౌతికకాయాన్ని ఫిల్మ్ ఛాంబర్లో ఉంచుతామని, అనంతరం ఇంటికి తరలిస్తామన్నారు. అనారోగ్యంతో కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఎంఎస్ నారాయణ శుక్రవారం ఉదయం మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా ఎంఎస్ నారాయణ ఆరోగ్యం విషమంగా ఉందంటూ గురువారమే వార్తలొచ్చాయి. అయితే ఆయన కోలుకుంటున్నారని కుటుంబసభ్యులు చెప్పడంతో... అభిమానులు కూడా ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. కానీ ఇంతలోనే చేదువార్త. గుండెపోటు కారణంగా వెంటిలేటర్ సాయంతో వైద్యం అందుకుంటున్న ఎంఎస్ తుదిశ్వాస విడిచారంటూ కొద్దిసేపటి క్రితమే కిమ్స్ వైద్యులు ధృవీకరించారు. ఈ వార్తతో సినీ అభిమానులు, హాస్య ప్రియులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. సంక్రాంతికి భీమవరం వెళ్లిన ఎంఎస్‌కు అక్కడ ఫుడ్ పాయిజన్ అయ్యిందనే వార్తలొచ్చాయి. ఆ తర్వాత విషాహారం కారణంగానే ఆయన ఆస్పత్రి పాలయ్యారని కూడా చెప్పారు. అయితే కుటుంబ సభ్యులు ఆయన్ను హైదరాబాద్‌కి తీసుకొచ్చిన తర్వాత... ఆయనకు గుండెనొప్పి రావడంతో కిమ్స్ లో మూడు స్టంట్స్ వేసినట్టు కూడా చెప్పారు. దీంతో ఆయన అనారోగ్యానికి విషాహారం కారణం కాదని తేలింది. ఎంఎస్ నారాయణ మృతితో తెలుగు సినీ పరిశ్రమకు ఒక గొప్ప హాస్యనటుడు దూరమయ్యారు. దశాబ్దాలుగా నవ్వులు పంచిన ఎమ్మెస్ ఆ నవ్వుల్నే మిగిల్చి వెళ్లిపోయారు. -
మలేరియా ఇలా ప్రాణం తీస్తుందనుకోలేదు..
-
మల్టీ ఆర్గాన్స్ పని చేయకపోవటం వల్లే..
హైదరాబాద్ : ఎంఎస్ నారాయణ అంత్యక్రియలు శనివారం జరగనున్నాయి. అభిమానుల సందర్శనార్థం ఈరోజు మధ్యాహ్నం 1 గంటల నుంచి నాలుగు గంటల వరకూ ఎంఎస్ నారాయణ భౌతికకాయాన్ని ఫిల్మ్‌ఛాంబర్‌లో ఉంచుతారు. అనంతరం ఆయన నివాసానికి తరలిస్తారు. కాగా ఎంఎస్ నారాయణ అంత్యక్రియలు ఎక్కడ జరిపేది ఈరోజు సాయంత్రం ఆయన కుటుంబసభ్యులు నిర్ణయిస్తామని నటుడు అనంత్ తెలిపారు. మరోవైపు ఎంఎస్ మృతిపై కొండాపూర్ కిమ్స్ వైద్యులు శుక్రవారం హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. మధుమేహం, గుండెపోటుతో ఎంఎస్ ఆస్పత్రిలో చేరారని, గుండె, మూత్రపిండాలు, ఊపిరితిత్తులు పని చేయకపోవటంతో ఆయన మరణించారని వైద్యులు తెలిపారు. ఉదయం 9.40 నిమిషాలకు ఎంఎస్ తుదిశ్వాస విడిచినట్లు కిమ్స్ వైద్యులు వెల్లడించారు. -
ఎమ్మెస్ను గుర్తుతెచ్చే సన్నివేశాలివీ!
-
'ఎంఎస్ మరణం నాకు తీరని లోటు'
హైదరాబాద్ : ఎంఎస్ నారాయణ ఎంత గొప్ప నటుడో, అంత ఆత్మీయుడని హాస్యనటుడు కొండవలస అన్నారు. ఆయన స్వర్గస్తులయ్యారంటే మనసు చలించిపోతోందన్నారు. తాను అనారోగ్యంతో బాధపడుతుంటే ఎంఎస్ ఆదరించి, అధైర్యపడవద్దని ధైర్యం చెప్పారన్నారు. విభిన్న పాత్రలు చేసిన ఎంఎస్...సెట్లో ఉన్నప్పుడు తోటి నటులకు సలహాలు ఇచ్చేవారని, అనవసరపు ఎక్స్ప్రెషన్స్ ఇవ్వొద్దు... అవసరం ఉన్నంతవరకూ నటించాలని అనేవారని కొండవలస తెలిపారు. క్రమశిక్షణ లేనిదే సినిమా రంగంలో రాణించలేరని, డిసిప్లెస్ వల్లే ఎంఎస్ ఈ స్థాయికి ఎదగగలిగారన్నారు. ఎంఎస్ నారాయణ మృతి తనకు, తెలుగు చలన చిత్ర రంగానికి తీరని లోటు అని.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కొండవలస అన్నారు. ఎంఎస్ కుటుంబసభ్యులకు కొండవలస ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఎంఎస్ నారాయణ గురించి మాట్లాడేందుకు తనకు మాటలు రావటం లేదని కన్నీటిపర్యంతమయ్యారు. -
టాలీవుడ్‌కు ఏదో పట్టుకుంది...
రాజమండ్రి : హాస్య నటుడు ఎంఎస్ నారాయణ మృతి తెలుగు చిత్రపరిశ్రమకు షాకింగ్ న్యూస్ అని సినీనటుడు, టీడీపీ ఎంపీ మురళీమోహన్ అన్నారు. ఆయన శుక్రవారమిక్కడ మాట్లాడుతూ ఎమ్మెస్ నారాయణ ఎన్నో అద్భుతమైన పాత్రలు పోషించారన్నారు. సినిమా, సినిమాకు ఆయన హావభావాలు, బాడీ లాంగ్వేజ్ కొత్తగా ఉండేవన్నారు. మొదటి సారిగా ఎంఎస్ నారాయణ తన దగ్గరకు కథ చెప్పడం కోసం వచ్చారని, అనుకోకుండా ఈవీవీ సత్యనారాయణ ద్వారా నటుడుగా మారారని మురళీమోహన్ తెలిపారు. మొదటి సినిమా నుంచి ఇప్పటి వరకూ ఆయన నటన వినూత్నంగానే ఉండేదని గుర్తు చేసుకున్నారు. నిన్న ఆయన మృతిపై వదంతులు వచ్చాయని, దాంతో వెంటనే ఎంఎస్ కుమార్తె శశికిరణ్‌తో ఫోన్లో మాట్లాడినట్లు చెప్పారు. అలాగే కిమ్స్ ఆస్పత్రి వైద్యులకు ఫోన్ చేసి ఎంఎస్ నారాయణ ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వాలని కోరినట్లు మురళీమోహన్ తెలిపారు. తెలుగు చిత్ర పరిశ్రమలో ఏదో పట్టుకుందని, 23 రోజుల్లో ఇది నాలుగో చావు అని ఆయన వ్యాఖ్యానించారు. ఎంఎస్ నారాయణ ఆత్మకు శాంతి చేకూరాలని మురళీమోహన్ పేర్కొన్నారు. -
ఎంఎస్ నారాయణ ఇకలేరు..
-
ఎం.ఎస్.నారాయణ ఆరోగ్యం విషమం
హైదరాబాద్: ప్రముఖ హాస్యనటుడు, దర్శకుడు ఎం.ఎస్.నారాయణ ఆరోగ్యం విషమంగా ఉన్నట్లు కొండాపూర్ కిమ్స్ ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు. సంక్రాంతి పండుగకని పశ్చిమగోదావరి జిల్లా భీమవరం వెళ్లిన ఆయన అనారోగ్యానికి గురయ్యారు. దీంతో చికిత్స నిమిత్తం కిమ్స్ ఆసుపత్రికి ఈ నెల 20న తీసుకొచ్చారు. అయితే ఎం.ఎస్. మరణించారని గురువారం పలు టీవీ చానళ్లలో వార్తలు రావడంతో సినీరంగ ప్రముఖులు, ఆయన సన్నిహితులు, అభిమానులు హతాశులయ్యారు. ఈ నేపథ్యంలో కిమ్స్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నారాయణ మాట్లాడుతూ ఎం.ఎస్.నారాయణ గుండెపోటుకు గురయ్యారని, ఆయనకు వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నామనీ, డయాలసిస్ కూడా నిర్వహిస్తున్నామని చెప్పారు. ఎం.ఎస్.నారాయణను సినీ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ, హాస్యనటుడు బ్రహ్మానందం, నటులు రావు రమేష్, శ్రీనివాస్ రెడ్డి, ఉత్తేజ్, అనంత్ తదితరులు పరామర్శించారు. నాన్న కోలుకోవాలని ప్రార్థిస్తున్నాం: శశికిరణ్ తమ తండ్రి ఎం.ఎస్. ఆరోగ్యం విషమంగా ఉందని ఆయన కుమార్తె శశికిరణ్ మీడియాకు తెలిపారు. త్వరగా కోలుకోవాలని దేవుని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. -
హెల్త్ బులెటిన్ : ఎంఎస్ నారాయణ ఆరోగ్య స్థితి
-
ఎంఎస్ నారాయణ హెల్త్ బులెటిన్ విడుదల
హైదరాబాద్ : ప్రముఖ హాస్యనటుడు ఎంఎస్ నారాయణ ఆరోగ్య పరిస్థితిపై కిమ్స్ వైద్యులు గురువారం హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. ఎంఎస్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని, వెంటిలేటర్లు అమర్చినట్లు వైద్యులు వెల్లడించారు. ఆయనకు డయాలసిస్ కొనసాగుతుందని కిమ్స్ వైద్యులు చెప్పారు. కాగా ఎంఎస్ నారాయణ మరణించారన్న వార్తను ఆయన కుమారుడు విక్రమ్ ఖండించిన విషయం తెలిసిందే. ఎంఎస్ నారాయణ ప్రస్తుతం మాదాపూర్ కిమ్స్ లో చికిత్స పొందుతున్నారు. -
'ఎంఎస్ నారాయణ చనిపోలేదు'
-
'ఎంఎస్ నారాయణ చనిపోలేదు'
హైదరాబాద్ : ప్రముఖ హాస్య నటుడు ఎంఎస్ నారాయణ మరణించారన్న వార్తను ఆయన కుమారుడు విక్రమ్ ఖండించారు. కొన్ని మీడియాల్లో వస్తున్న వార్తలు అవాస్తవమని ఆయన తెలిపారు. ఎంఎస్ నారాయణ ప్రస్తుతం మదాపూర్ కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు చెప్పారు. వైద్యులు ఎంఎస్ నారాయణకు వైద్యం అందిస్తున్నట్లు విక్రమ్ చెప్పారు. కాగా ఎంఎస్ నారాయణ ఆరోగ్యం విషయంలో కొన్ని వదంతులు చెలరేగడంతో సినీ అభిమానులు ఆందోళనకు గురయ్యారు. ఆయన ఇటీవల భీమవరంలో అస్వస్థతకు గురయ్యారు. గత రెండు రోజులుగా ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. కుటుంబ సభ్యులు ఎంఎస్ నారాయణ వెంటే ఉన్నారు. ఎంఎస్ నారాయణను సహచరులు, సన్నిహితులు ఆయన్ను పరామర్శిస్తున్నారు. ఈ సమయంలోనే ఎమ్మెస్ ఆరోగ్య పరిస్థితిపై వదంతులు చెలరేగాయి. అయితే అవన్నీ తప్పంటూ ఆయన కొడుకు విక్రమ్ తెలిపారు. వదంతులు నమ్మొద్దని విక్రమ్ సూచించారు. కాగా గురువారం మధ్యాహ్నం 12.30గంటల సమయంలో ఎంఎస్ నారాయణను కమెడియన్లు బ్రహ్మానందం, రావు రమేష్‌లు.. కిమ్స్ ఆస్పత్రిలో పరామర్శించారు. బ్రహ్మానందం, రావు రమేష్ పలకరించగా.. ఎంఎస్ నారాయణ స్పందించారని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన్ను జాగ్రత్తగా చూసుకోవాలని బ్రహ్మానందం కుటుంబ సభ్యులకు సూచించినట్టు తెలిసింది. -
సినీ నటుడు ఎంఎస్ నారాయణకు అస్వస్థత
-
సినీ నటుడు ఎంఎస్ నారాయణకు అస్వస్థత
భీమవరం: సినీ హాస్యనటుడు ఎంఎస్ నారాయణ అస్వస్థతకు గురయ్యారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో ఆయనకు చికిత్స అందించి అనంతరం విజయవాడ ఆయుష్ ఆస్పత్రికి తరలించారు. ఎంఎస్ నారాయణ స్వస్థలమైన భీమవరానికి సంక్రాంతి పండుగని వచ్చి ఆదివారం సాయంత్రం స్థానిక హోటల్లో గది తీసుకున్నారు. ఆహారం తీసుకున్న అనంతరం రాత్రివేళ ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. సన్నిహితులు ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా ఫుడ్ పాయిజన్ జరిగినట్లు వైద్యులు చికిత్స చేశారు. విషయం తెలుసుకున్న ఎంఎస్ కుమారుడు, సినీ హీరో విక్రమ్ ఆసుపత్రికి చేరుకున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. మెరుగైన చికిత్స నిమిత్తం ఎంఎస్ నారాయణను హైదరాబాద్ లోని కిమ్స్ కు తరలించారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ఇలాంటి పాత్ర చేయలేదు
‘‘ఇప్పటి వరకూ నేను ఇలాంటి తరహా పాత్ర చేయలేదు. కామెడీ, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో ఈ సినిమా ఆద్యంతం ఆకట్టుకుంటుంది’’ అని ఆర్తీ అగర్వాల్ చెప్పారు. ఆమె ముఖ్య పాత్రలో నటిస్తున్న చిత్రం ‘ఆమె ఎవరు?’. అనీల్ మిత్ర నాయకా నాయికలు. రమేశ్ ముగడ దర్శకత్వంలో వీరగణేశ్ కర్రి, లక్ష్మీ సరోజ నిర్మిస్తున్న ఈ చిత్రం రెండో షెడ్యూలు హైదరాబాద్‌లో జరుగుతోంది. ఈ సందర్భంగా ఎమ్మెస్ నారాయణ మాట్లాడుతూ -‘‘ఇందులో ఆయుర్వేద కళాశాల ప్రిన్సిపాల్‌గా నటిస్తున్నా’’ అని చెప్పారు. సినిమా చాలా బాగా వస్తోందని, మార్చిలో చిత్రాన్ని విడుదల చేస్తామని దర్శక, నిర్మాతలు తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: చిన్నికృష్ణ, నిర్వహణ: పైలా సత్యనారాయణ కుమార్. -
మా అమ్మాయి బాగా తీసింది!
‘‘మా అమ్మాయికి దర్శకత్వం అంటే మొదట్నుంచీ మక్కువ. ఆ ఇష్టంతోనే ఈ సినిమా తీసింది. మా అమ్మాయి అని కాదు కానీ, ఈ సినిమా ఎంతో బాగా తీసింది’’ అని హాస్యనటుడు ఎమ్మెస్ నారాయణ చెప్పారు. ఆయన కుమార్తె శశికిరణ్ దర్శకత్వంలో రూపొందిన ‘సాహెబా సుబ్రహ్మణ్యం’ ఈ నెల 13న విడుదల కానుంది. దిలీప్‌కుమార్, ప్రియాల్గోర్ కాంబినేషన్లో డా. సువర్ణ కొల్ల సమర్పణలో డా. కొల్ల నాగేశ్వరరావు ఈ చిత్రాన్ని నిర్మించారు. శశికిరణ్ మాట్లాడుతూ -‘‘నా కుటుంబం వెన్నుదన్నుతోనే నేనీ స్థాయికి చేరుకున్నా. ఈ సినిమా ప్రేక్షకులను నిరాశపరచదు’’ అని అన్నారు. తెలుగుదనం ఉట్టిపడే సినిమా ఇదని నిర్మాత తెలిపారు. -
'మాది సినిమా కుటుంబం'
పూర్తి స్థాయి ప్రతినాయకుడిగా చేయాలనేది తన కోరిక అని ప్రముఖ హాస్యనటుడు, రచయిత, దర్శకుడు ఎమ్మెస్ నారాయణ తెలిపారు. ఇప్పటివరకు తాను విలన్ కేరెక్టర్ చేయలేదని, ఈ పాత్ర చేస్తే సంపూర్ణమైన నటుడు అనే పేరుస్తోందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. దీపావళి సందర్భంగా 'సాక్షి' టీ్వీకి ఆయన ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఉప్పలపాటి నారాయణరావు తనకు విలన్ వేషం ఇస్తానన్నారని వెల్లడించారు. తాగుబోతు పాత్రలు చేయడంలో తనది ప్రపంచ రికార్డు అని చెప్పారు. తానిప్పటికి 700 పాత్రలు చేస్తే అందులో 200 తాగుబోతు వేషాలు వేశానని వెల్లడించారు. తాను ఇన్నిసార్లు తాగుబోతుగా నటించినా ప్రేక్షకులు విసుగు చెందలేదని అన్నారు. ఇకముందు కూడా తాగుబోతు పాత్రలు చేస్తానని స్పష్టం చేశారు. తమది సినిమా కుటుంబమని ఎమ్మెస్ నారాయణ చెప్పారు. తన కుమార్తె దర్శకులిరాలిగా, కుమారుడు నటుడిగా కొనసాగుతున్నారని తెలిపారు. తనది ప్రేమ వివాహమని వెల్లడించారు. తన దగ్గరకు ట్యూషన్ కు వచ్చే స్టూడెంట్ నే ప్రేమించి పెళ్లిచేసుకున్నానని తెలిపారు. పెద్దలు పెళ్లికి ఒప్పుకోకపోవడంతో తన లెక్చరర్ అయిన పరుచూరి గోపాలకృష్ణ తమ పెళ్లి చేశారని చెప్పారు. తాను సినిమాల్లో రావడానికి తన భార్య ప్రోత్సాహం చాలా ఉందని ఎమ్మెస్ నారాయణ తెలిపారు. అవకాశమున్నంత వరకు నటుడిగానే కొనసాగుతానని చెప్పారు. -
దీపావళి స్పెషల్ : ఎమ్మెస్ నారాయణతో చిట్‌చాట్
-
శాస్త్రవేత్తగా...!
ఇప్పటివరకు వెండితెరపై పలు రకాల పాత్రలు పోషించిన బ్రహ్మానందం ఇప్పుడు ‘ఆదిత్య’ చిత్రంలో శాస్త్రవేత్తగా కనిపించనున్నారు. శ్రీ లక్ష్మీ ఎడ్యుకేషన్ చారిటబుల్ ట్రస్ట్ సమర్పణలో స్వీయదర్శకత్వంలో భీమగాని సుధాకర్ గౌడ్ ఈ చిత్రం నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతున్న సందర్భంగా సుధాకర్ గౌడ్ మాట్లాడుతూ -‘‘బాల్య దశలోనే విద్యార్థులు సృజనాతక్మ శక్తిని పెంపొందిస్తే వాళ్లు మంచి పౌరులుగా ఎదుగుతారనేది ఈ చిత్రం ప్రధాన ఇతివృత్తం. ఇందులో బ్రహ్మానందం శాస్త్రవేత్త పాత్రను పోషించడం ఆనందంగా ఉంది. అభ్యుదయవాదిగా సుమన్, స్కూల్ ప్రిన్సిపాల్‌గా ఎమ్మెస్ నారాయణ చేస్తున్నారు. ఇది చక్కని విద్యా వైజ్ఞానిక చిత్రం అవుతుంది. ఈ నెలాఖరున పాటలను విడుదల చేయాలనుకుంటున్నాం’’ అని చెప్పారు. ఈ చిత్రానికి కెమెరా: కందేటి శంకర్, ఎడిటింగ్: నందమూరి హరి. -
ఈ వారం స్టార్ రిపోర్టర్-ఎమ్మెస్ నారాయణ
-
బండెడు బాధలు
ఉదయాన్నే ఠంచనుగా వచ్చి టెన్షన్స్ క్లియర్ చేసే కూరగాయలబ్బి ఒకప్పుడు అందరివాడు. తోపుడు బండిపై తాజా తాజా కూరగాయలే కాదు, అంతకన్నా తాజా తాజా కబుర్లు మోసుకొచ్చే అతగాడంటే ఆడాళ్లకు ప్రత్యేక అభిమానం ఉండేది. ఆ వీధి విశేషాలు ఇక్కడ, ఇక్కడి విషయాలు పక్క వీధిలోని అమ్మలక్కల చెవిలో వేసే వార్తాహరుడుగా పనిచేసేవాడు. బేరం విషయంలో పేచీ పడ్డా.. కసురుకోకుండా కొసరు కొలుస్తాడు. కొన్నేళ్ల కిందటి వరకు మూడు ఆకుకూరలు.. ఆరు కాయగూరల్లా వ్యాపారం చేసుకున్న అతడు.. ఇప్పుడు భారంగా బండి తోస్తూ గొంతు చించుకున్నా.. ‘ఇటురా’ అన్న పిలుపునకు నోచుకోవడం లేదు. కూరగాయలబ్బి మారలేదు.. ఆయన తెచ్చే కూరగాయలూ మారలేదు. మారింది మనమే. ఏళ్లుగా ముంగిట్లోకి వస్తున్న ఆరోగ్యాన్ని కాదని కార్పొరేట్ కొట్టులో ఏసీలో మగ్గుతున్న కాయగూరలపై మనసుపడ్డాం. మనలోని ఈ మార్పే కూరగాయలబ్బి బతుకును పుచ్చుల్లో పడేసింది. అరకొర అమ్మకాలతో తోపుడు బండ్లు వేసుకుని వీధుల్లో తచ్చాడుతున్న కూరగాయలు అమ్మేవారిని ‘సిటీప్లస్’ తరఫున ‘స్టార్ రిపోర్టర్’గా కామెడీకింగ్ ఎమ్మెస్ నారాయణ పలకరించారు. ఎమ్మెస్ నారాయణ: ఎలా ఉన్నారయ్యా.. బాగున్నారా? లక్ష్మణ్: ఏదో ఉన్నం సార్. ఎమ్మెస్ నారాయణ: నీ పేరేంటి తమ్ముడు. మారెన్న: మారెన్న సార్... ఎమ్మెస్: ఏదీ ఒక్కసారి కూరగాయలూ.. అని పిలువ్. మారెన్న: కూరగాయలూ...(కాస్త మెల్లగా పిలిచాడు) ఎమ్మెస్: అలా మెల్లగా పిలిస్తే ఎలాగయ్యా.. మా వీధిలో అబ్బాయి అయితే.. ‘కురక్కాయలే...’ అని భలే వెరైటీగా అరుస్తాడు. వాడి అరుపు వింటే ఎంత నిద్రలో ఉన్నవాడైనా లేచి కూర్చుంటాడు.(నవ్వుతూ...) మారెన్న: అరవాలే సార్. లేదంటే మాకు గిరాకీ యాడికెళ్లి వొస్తది. లక్ష్మణ్: అరిచి.. అరిచి గొంతంతా ఎండిపోతది సార్. ఎమ్మెస్: నిజమే.. మారెన్న. నువ్వు రోజుకి ఎన్ని కిలోమీటర్లు నడుస్తావు? మారెన్న: నేను ఇక్కడే రెహ్మత్‌నగర్‌లో ఉంట సార్. పొద్దుగాల నాలుగు గంటలకు నిద్రలేచి మాల్ (పచ్చి మిరపకాయలు) కోసం మూసాపేటకు బండి తోసుకుంటూ పోత. బండి నిండా మాల్ ఏసుకుని తోలుకుంట వచ్చేసరికి ఏడెనమిదైతది. దానికే తొమ్మిది కిలోమీటర్లు ఐతది. ఆడికెళ్లి ఇంటింటికీ తిరిగి మిరపకాయలు అమ్మేసరికి టైం పన్నెండైతది. పది కిలోమీటర్లు తిరుగుడైతది. రాము: ఎంత తిరిగితే గంత బిజినెస్. నడకనే మాకు సగం పెట్టుబడి సార్. ఎమ్మెస్: ఇంతలా తిరుగుతుంటారు కదా బోర్ కొట్టదా? రామకృష్ణ: గిరాకీ వస్తే ఏ బాధలుండవు సార్. ఒక్కోసారి బోణీలుండవు.. బేరాలాడేది మాత్రం మస్తుగుంటది. గప్పుడు చుక్కలు కన్పిస్తయ్. ఎమ్మెస్: అవునమను.. అదే అడుగుదామనుకుంటున్నాను. మార్కెట్‌తో పోలిస్తే కూరగాయుల బండి దగ్గర బేరాలు ఎక్కుమంటాయి, దాని గురించి చెప్పండి..? రామకృష్ణ: కొత్తిమీర కట్ట రూపాయి తగ్గితే కోట్లు సంపాదించినట్టు అనుకుంటరు సార్. గసొంటి బేరాల ను చూస్తే కోపమొస్తది. ఏంద అని గట్టిగంటే.. చానా ఎక్కువ మాట్లాడుతున్నవని తిడ్తరు. మహ్మద్ ఖలేద్: బిర్యానీ ప్యాకెట్ ధర పెరిగితే ఒక్క మాట మాట్లాడరు. సినిమా టికెట్ ధర పెరిగినా ఏమనరు. పొద్దుగాళ్ల లేస్తే వేల రూపాయలు ఖర్చు పెట్టేటోళ్లు మా దగ్గరికొచ్చేసరికి.. బేరమాడి రూపాయి రూపాయి మిగుల్చుకుంటరు. ఆ పైసలతో ఇల్లు కడతరా. ఎమ్మెస్: ఇల్లు అంటే గుర్తొచ్చింది.. మీలో సొంతిల్లు ఎంత మందికుంది ? మారెన్న: మాకు సొంతిల్లు యాడుంటయ్ సార్. నాకు నల్గురు ఆడపిల్లలు, ఇద్దరు మగపిల్లలు. ఇద్దరు ఆడపిల్లల పెండ్లి చేసిన. ఇంకా నలుగురి బాధ్యత ఉంది. రెండు పూటలు సరిగా తింటే ఆ రోజు సొంతిల్లు కట్టినట్టే అనుకుంటం. సంతోష్: మా నాయన తోలిన బండే నేను తోల్తున్నా. పొట్ట నిండనికి తప్ప.. పైసలు మూటగట్టడం ఈ బండితోని అయ్యే పనికాదు సార్. పూటకోసారి కూరగాయల ధరలు మారుతుంటయ్. ధరలు ఎక్కుమన్నప్పుడు కొంటం. తెల్లారి అమ్మే టైమ్‌కి ధరలు పడిపోతయ్. ఏం చేస్తం సార్. ఎమ్మెస్: నేనూ చాలాసార్లు గమనించాను. గిరాకీ లేక, అమ్ముడుపోక బండ్లమీద కూరగాయులు ఎండిపోయి కనిపిస్తాయి. వర్షాలు పడితే కొన్ని కాయుగూరలు, ఆకుకూరలు కుళ్లిపోతుంటాయి! లక్ష్మణ్: గిసొంటియి మాకు కొత్తకాదు సార్. పొట్ట ఊకోదు కాబట్టి అప్పు చేస్తం. ఎమ్మెస్: మీకు అప్పు కావాలంటే.. మీకు కూరలిచ్చే దళారుల దగ్గరికే వెళ్తారని విన్నాను, నిజమేనా? రామకృష్ణ: అంతేగా సార్. ఎమ్మెస్: నేరుగా రైతుల దగ్గర మాల్ కొంటే గిట్టుబాటు అవుతుంది కదా. ఇలా దళారీలపై ఆధారపడితే లాభాలు అతనికి.. నష్టాలు మీకు మిగులుతాయి. మారెన్న: నిజమే సార్. కానీ ఏం జేస్తం. పేదోళ్లం. మాకు రూపాయిచ్చేటోడే దేవుడు. ధరలతో సంబంధం లేకుండా కొంటం. కాళ్లరిగేలా తిరుగుతం. ఎమ్మెస్: ధరలన్నారుగా.., మీరు రేట్లు ఎక్కువ చెబుతారంటారు నిజమేనా..? సంతోష్: ఈ రోజు మార్కెట్ల ఆలుగడ్డల ధర 27 రూపాయలు. అదే మీరు పెద్ద పెద్ద షాపులల్ల (కార్పొరేట్) పొయ్ చూడండి 19 రూపాయలే ఇస్తుండ్రు. అదెట్లంటే షోరూమ్లోళ్లు బట్టల మీద, చెప్పుల మీద బగ్గ గుంజి.. కూరగాయల ధరలు తగ్గించి గిరాకీ రప్పించుకుంటున్నరు. దీంతో మా రేట్లు ఎక్కువగానే అనిపిస్తయ్. ఏసీ పెట్టి మరీ మా పొట్టలు కొడుతున్నరు సార్. ఎమ్మెస్: కష్టజీవులకు తెలిసినన్ని వాస్తవాలు మిగతావాళ్లకు తెలియవు. కార్పొరేట్ కల్చర్ సామాన్యుడ్ని ఎన్ని రకాలుగా మోసం చేస్తుందో చూడండి. ఇలా మీలో మీరు బాధపడితే ఎలా..? మీ కష్టాల గురించి ప్రభుత్వానికి తెలియజేశారా ? లక్ష్మణ్: ఏడ చెబుతం సార్. ఎవరూ ముందుకు రారు. ఎమ్మెస్: అలా అంటే ఎలా? హైదరాబాద్ అభివృద్ధిలో భాగంగా.. సీఎం కేసీఆర్ గారు పేదల సంక్షేమం గురించి బోలెడన్ని పథకాలను ప్రవేశపెడుతున్నారు. మీరు గనక మీ డిమాండ్లను ఆయన ముందుంచితే మీకు తప్పకుండా న్యాయం జరుగుతుంది. రామకృష్ణ: అట్లనే జేస్తం సార్. ఎమ్మెస్: అసలు విషయం మరిచిపోయాను. ఈ బండి ఖరీదు ఎంత ? కొన్ని బండ్ల టైర్లలో గాలి కూడా ఉండదు. అయినా అలా తోసుకుంటూ వెళ్తుంటారు? రాము: కొత్తదైతే ఇప్పుడు 10 వేలకు తక్కువ లేదు సార్. టైర్లళ్ల గాలంటరా.. పంచరైనా, పాడైనా.. మార్పించే స్తోవుత లేక అట్లనే తోసుకుంటూ పోతరు. కొందరు కావాలనే అట్ల వదిలేస్తరు. ఎమ్మెస్: రైతు పొలంలోని కూరలను మార్కెట్‌కి తీసుకొస్తే మీరు ఇంటి ముందుకు తీసుకొస్తారు. వీధుల్లో మీ అరుపులు సందడి తీసుకొస్తాయి. ‘ఫలానా కూరలబ్బి చాలా మంచోడ’ని కితాబు పొందే మీలాంటి క ష్టజీవులను పలకరించినందుకు చాలా సంతోషంగా ఉంది. స్టార్ రిపోర్టర్‌కి స్పందన ఎమ్మెస్ నారాయణ రిపోర్టింగ్ గురించి తెలుసుకున్న ఆ ఏరియా కార్పొరేటర్ బి.చంద్రమ్మ వెంటనే స్పందించి తోపుడు బండ్లవారి సంక్షేమానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. విషయం తెలుసుకున్న ఎమ్మెస్ ఆమె ఇంటికి వెళ్లి కూరగాయలమ్మేవారి జీవితాలపై దృష్టి పెట్టాలని కోరారు. ‘సాక్షి’ తరఫున స్టార్ రిపోర్టర్‌గా పేదల పక్షాన నిలిచిన ఎమ్మెస్‌కు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. కూరగాయులు అమ్మేవారికి సొంతిళ్ల ఏర్పాటుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. పెండింగ్‌లో ఉన్న మార్కెట్వాసుల క్వార్టర్స్ ప్రాజెక్ట్‌ని పట్టుదలగా పూర్తిచేస్తానని తెలిపారు. తోపుడు బండ్లను నమ్ముకుని బతుకుతున్న మైనారిటీలకు బ్యాంకు రుణాలు అందేలా ప్రయత్నిస్తానని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెస్ ఆమెకు ధన్యవాదాలు తెలిపారు. - ప్రజెంటేషన్: భువనేశ్వరి ఫొటోలు: ఎస్.ఎస్.ఠాకూర్ -
మళ్లీ షూటింగ్లో బిజీ...
షూటింగుల్లో హీరోలకు అప్పుడప్పుడు ప్రమాదాలు వాటిల్లడం సహజం. కానీ... బాలకృష్ణకు మాత్రం అప్పుడప్పుడు కాకుండా తరచూ జరుగుతాయి. ‘భార్యాభర్తల బంధం’(1985) సినిమా పోరాట సన్నివేశాల చిత్రీకరణ సమయంలో... 30 అడుగులపై నుంచి సాహసోపేతంగా డూప్ లేకుండా దూకి, కాలు ఫ్రాక్చర్ చేసుకున్నారు. ఇది 30 ఏళ్ల క్రితం ముచ్చట. అప్పట్నుంచీ తరచూ ఆయన్ను ప్రమాదాలు పలకరిస్తూనే ఉన్నాయి. అయినా ఆయన తన సాహస ధోరణి మానలేదు. ఇప్పుడు బాలకృష్ణ ఫిఫ్టీ ప్లస్ ఏజ్‌లో ఉన్నారు. ఈ వయసులో కూడా ఆయన ప్రమాదాలకు వెరవరు. ఎంతటి రిస్కీ షాట్ అయినా సాధ్యమైనంతవరకూ డూప్ లేకుండా చేయడానికే ఇష్టపడతారు. అంత కష్టపడతారు కాబట్టే, తరగని అభిమాన ధనం ఆయన సొంతమైంది. తాజాగా సత్యదేవ్ దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా షూటింగ్లో బాలయ్య స్వల్ప ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. హైదరాబాద్ అవుటర్ రింగ్‌రోడ్‌పై బైక్ రైడింగ్ సన్నివేశాలు తీస్తున్నప్పుడు ఆయన ప్రమాదానికి గురయ్యారు. కాలికి గాయమై రెండు వారాలైనా గడవక ముందే మళ్లీ బాలకృష్ణషూటింగ్లో పాల్గొనడం విశేషం. గురువారం నుంచి ఆర్ఎఫ్సీలో బాలకృష్ణ, త్రిష, ఎమ్మెస్ నారాయణ తదితరులపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు దర్శకుడు సత్యదేవ్. బాలకృష్ణ, త్రిష కలిసి నటిస్తున్న తొలి సినిమా ఇది. ఇప్పటికే చిరంజీవి, నాగార్జున, వెంకటేశ్‌లతో జతకట్టిన త్రిష, ఇప్పుడు బాలయ్యతో కూడా జోడీ కట్టడంతో అగ్రహీరోలైన నలుగురితో నటించిన నేటితరం నాయికల్లో ఒకరయ్యారు. తాజా షెడ్యూల్ సెప్టెంబర్ దాకా నిర్విరామంగా హైదరాబాద్ పరిసరాల్లో జరుగనుంది. ఎస్.ఎల్.వి. సినిమా పతాకంపై రుద్రపాటి రమణరావు చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కొమ్మినేని వెంకటేశ్వరరావు ఎగ్జిక్యూటివ్ నిర్మాత. -
అబ్దుల్ కలామ్ అవార్డు కోసం...
ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న ఓ అనాథ బాలుడు అబ్దుల్‌కలాం అవార్డును సొంతం చేసుకోవడానికి ఏ విధంగా కృషి చేశాడు అనే ఆసక్తికరమైన కథాంశంతో రూపొందుతోన్న బాలల చిత్రం ‘ఆదిత్య’. ‘క్రియేటివ్ జీనియస్’ అనేది ఉపశీర్షిక. విష్ణు, చెర్రీ, రోమీర్, అర్జున్ ఇందులో ప్రధాన పాత్రధారులు. సంతోష్ ఫిలింస్ పతాకంపై భీమగాని సుధాకర్‌గౌడ్ స్వీయ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సుమన్, బ్రహ్మానందం, ఎమ్మెస్ నారాయణ ప్రత్యేక పాత్రల్లో కనిపించే ఈ చిత్రం గురించి దర్శక, నిర్మాత మాట్లాడుతూ -‘‘ఎన్ని ఇబ్బందులు ఎదురైనా నిగ్రహశక్తితో ఎదుర్కొని, కార్పొరేట్ స్కూళ్ల విద్యార్థులతో పోటీ పడుతూ సైన్స్ అండ్ టెక్నాలజీలో అబ్బుర పరిచే ప్రతిభ కనబరిచిన ‘ఆదిత్య’ అనే బాలుడి కథ ఇది. రాము, పాపం పసివాడు, రేపటి పౌరులు లాంటి క్లాసిక్‌లను గుర్తు చేసేలా సినిమా ఉంటుంది. సెప్టెంబర్ 5న గురుపూజా దినోత్సవ కానుకగా విడుదల చేస్తాం’’ అని తెలిపారు. -
మంచి ప్రేమకథ ‘సాహెబా సుబ్రహ్మణ్యం’
ప్రేమకథ ఆధారంగా నిర్మించిన చిత్రం ‘సాహెబా సుబ్రహ్మణ్యం’ అని, దీనిని ప్రేక్షకులు తప్పక ఆదరిస్తారని హాస్యనటుడు ఎంఎస్ నారాయణ అన్నారు. హాయ్ లాండ్లో సినిమా ఆడియో ఫంక్షన్‌కు వెళుతూ నగరంలోని డీఎన్నార్ బ్రదర్స్‌లో ఆదివారం సాయంత్రం చిత్ర యూనిట్ విలేకరుల సమావేశం ఏర్పాటుచేసింది. ఈ సందర్భంగా ఎంఎస్ నారాయణ మాట్లాడుతూ తన కుమార్తె శశి ఎంతో కష్టపడి ఈ సినిమాకు దర్శకత్వం వహించిందన్నారు. రేయింబవళ్లు కష్టపడి సినిమా సాంకేతిక వర్గాలను ఎంపిక చేసుకుందని, హీరోయిన్ ప్రియల్ గోర్‌ను ముంబయి నుంచి తెచ్చామని చెప్పారు. ఈ సినిమా మలయూళ మాతృక అని ఆయన వివరించారు. ఈ సినిమాలో విజయవాడకు చెందిన దిలీప్ హీరోగా నటించారన్నారు. ఈ సినిమాలో హింస ఏమీ ఉండదని, మొత్తం ప్రేమకథ ఆధారంగానే నడుస్తుందని చెప్పారు. హీరో దిలీప్ మాట్లాడుతూ ముస్లిం అమ్మాయి, హిందు అబ్బాయి మధ్య పుట్టినప్రేమతో తీసిన సినిమా అన్నారు. నాలుగు పాటలు ఎంతో చక్కగా వచ్చాయని, ఆగస్టు రెండోవారంలో చిత్రం విడుదల చేస్తామని చెప్పారు. కృష్ణా, గుంటూరు జిల్లాలోని కళాశాలలకు వెళ్లి విద్యార్థులను కలుస్తామన్నారు. ఈ సమావేశంలో హీరోయిన్ ప్రియల్ గోర్, దర్శకురాలు శశి, ఫొటోగ్రఫీ డెరైక్టర్ సాయి, సంభాషణల రచయిత కిట్టు, నటులు మీనాకుమారి, తాగుబోతు రమేష్ తదితరులు పాల్గొన్నారు. - విజయవాడ -
మా అమ్మాయి దర్శకురాలిగా విజయం సాధిస్తుంది :ఎమ్మెస్ నారాయణ
‘‘మా అమ్మాయి ఇప్పటివరకూ ఏం చేసినా విజయం సాధించింది. దర్శకురాలిగా కూడా తను విజయం సాధిస్తుంది. ఈ సినిమా విషయంలో నేను ఇన్వాల్వ్ కాలేదు. ఆమె పూర్తి స్వేచ్ఛతో చేసింది’’ అని నటుడు ఎమ్మెస్ నారాయణ చెప్పారు. ఆయన తనయ శశికిరణ్ నారాయణ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘సాహెబా సుబ్రహ్మణ్యం’. దిలీప్‌కుమార్, ప్రియాల్ గోర్ జంటగా ఇండో ఇంగ్లిష్ ప్రొడక్షన్స్ పతాకంపై డా॥కొల్లా నాగేశ్వరరావు నిర్మిస్తోన్న ఈ చిత్రం పాటల ఆవిష్కరణ హైదరాబాద్‌లో జరిగింది. ఎమ్మెస్ నారాయణ పాటల సీడీ ఆవిష్కరించి, దర్శకుడు దశరథ్కు ఇచ్చారు. బ్రహ్మానందం మాట్లాడుతూ, ‘‘టైటిల్ క్యాచీగా ఉంది. శశి మంచి దర్శకురాలిగా రాణించాలి’’ అన్నారు. పాటల్లో తెలుగుదనం ఉట్టిపడుతోందని కోట శ్రీనివాసరావు ప్రశంసించారు. దర్శకురాలు మాట్లాడుతూ, ‘‘మలయాళ చిత్రం ‘తట్టత్తిన్ మరియత్తు’కి ఇది రీమేక్. అవుట్‌పుట్ బాగా వచ్చింది’’ అని చెప్పారు. ఈ కార్యక్రమంలో నట శిక్షకులు ‘వైజాగ్’ సత్యానంద్, కొండవలస, సందీప్ కిషన్, ఉత్తేజ్ తదితరులు పాల్గొన్నారు. -
నవాబ్ భాషా మూవీ స్టిల్స్ మరియు పోస్టర్స్
-
'నవాబ్' అవతారంలో ఎమ్మెస్ నారాయణ
-
ఎమ్మెస్ నవాబ్ బాషా
ఎమ్మెస్ నారాయణ ‘నవాబ్ బాషా’గా రాబోతున్నారు. బి.రాజేశ్‌పుత్ర స్వీయ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రెండు పాటలు మినహా చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం విశేషాలను తెలుపడానికి హైదరాబాద్‌లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. దర్శకునికి ఇది తొలి సినిమా అయినప్పటికీ చాలా అనుభవం ఉన్నవాడిగా చిత్రాన్ని మలిచాడని, పనిచేసిన అందరికీ మంచి పేరు తెచ్చే సినిమా అవుతుందని ఎమ్మెస్ నారాయణ అన్నారు. రాజేశ్‌పుత్ర మాట్లాడుతూ- ‘‘నవాబుగా ఓ వెలుగు వెలిగి ప్రస్తుతం బీదరికం అనుభవిస్తున్న ఓ వ్యక్తి కథ ఇది. బీదరికంలో కూడా అతను ఇతరులకు ఎలా సహకరించాడు అనేది ఇందులో ఆసక్తికరమైన అంశం. నవాబుల కాలం నాటి యథార్థ సంఘటన ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. ఎమ్మెస్ నారాయణ పాత్ర ఈ చిత్రానికి హైలైట్. సాంకేతికంగా కూడా సినిమా బావుంటుంది. త్వరలో పాటల్ని, సినిమాను విడుదల చేస్తాం’’ అని తెలిపారు. ఇంకా చిత్రం యూనిట్ సభ్యులు మాట్లాడారు. రాహుల్, వరుణ్, జూనియర్ నగ్మా, శాంతి స్వరూప్, జెన్నీ, స్నేహ, విజయ్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: కె.శ్రీనివాసరెడ్డి, సంగీతం: బోలె, సునిల్పుత్ర, కూర్పు: సునిల్. -
అవకాశాలే కాదు.. అదృష్టమూ కలిసిరావాలి
ద్వారకాతిరుమల, న్యూస్‌లైన్ : చిత్రపరిశ్రమలో అవకాశాలతో పాటు అదృష్టం కూడా కలసిరావాలని సినీ హాస్యనటుడు ఎంఎస్ నారాయణ తనయుడు, సినీ నటుడు విక్రమ్ అన్నారు. ద్వారకాతిరుమలలోని శ్రీ వేంకటేశ్వరస్వామిని శనివారం ఆయన కుటుంబ సమేతంగా కలసి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ‘న్యూస్‌లైన్’తో ముచ్చటించారు. ఇప్పటివరకు ఎన్ని చిత్రాల్లో నటించారు విక్రమ్ : 10 చిత్రాల్లో నటించాను. అందులో కొడుకు, భజంత్రీలు, తెలుగమ్మాయి, బురిడి గుర్తింపుతెచ్చిన చిత్రాలు. ప్రస్తుతం ఏం చిత్రాల్లో నటిస్తున్నారు విక్రమ్ : మంచు విష్ణు కొత్త చిత్రంలో మంచి పాత్రలో నటిస్తున్నాను. విష్ణుతో ఉన్న స్నేహంతో గతంలో దేనికైనా రెడీ, పాండవులు పాండవులు తుమ్మెద చిత్రాలలో కలసి నటించాను. మీ తండ్రి ఎంఎస్‌తో మీరేమైనా చిత్రాల్లో నటిస్తున్నారా.. విక్రమ్ : క్రేజీవాలా అనే చిత్రంలో నటిస్తున్నాను. ఈ చిత్రం రాజకీయ ఇతివృత్తంతో సాగుతుంది. దీనిలో నా తండ్రి ఎంఎస్ పాత్ర హీరో అనే చెప్పాలి. ఆ సినిమాలో నేను స్టూడెంట్ క్యారెక్టర్లో నటిస్తున్నాను. నటనతో పాటు ఇంకేమైనా ఆశయాలు ఉన్నాయా విక్రమ్ : హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తూనే కాకినాడ రాజీవ్‌గాంధి లా కాలేజీలో ఎంఎల్ చదువుతున్నా. మొదటి ఏడాది పూర్తి అయింది. నటనతో పాటు న్యాయవ్యవస్థలో రాణించాలన్నది నా ఆశయం. -
దర్శకురాలిగా ఎమ్మెస్ నారాయణ కుమార్తె
నాటి తరంలో భానుమతి, సావిత్రి, విజయనిర్మల... ఇలా కొంతమంది కథానాయికలు దర్శకత్వంలోనూ ప్రతిభను చాటుకున్నారు. నేటి తరంలో బి. జయ, నందినీరెడ్డి, శ్రీప్రియలతో పాటు దర్శకత్వ శాఖలో ముగ్గురు, నలుగురు మహిళలున్నారు. తాజాగా ఈ జాబితాలోకి నటుడు ఎమ్మెస్ నారాయణ కుమార్తె శశికిరణ్ నారాయణ చేరారు. తొలి ప్రయత్నంగా నూతన నాయకా నాయికలతో ఆమె ఓ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇండో ఇంగ్లిష్ ప్రొడక్షన్స్ పతాకంపై డా. కొల్లా నాగేశ్వరావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎమ్మెస్ నారాయణ, రావు రమేష్, నగేష్, నాగినీడు, పూర్ణిమ తదితరులు నటిస్తున్న ఈ చిత్రం ఇటీవల మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి కెమెరా: సాయిప్రకాష్ ఉమ్మడిసింగు, సంగీతం: షాన్ రెహ్మాన్, ఎడిటింగ్: ప్రవీణ్ పూడి, ఆర్ట్: ధర్మేంద్ర, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: మాదల వేణు. -
ప్రేమ...పగ....
మానస్ హీరోగా సేవియర్ సెల్యులాయిడ్, సంధ్యా మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా రూపొందిస్తున్న చిత్రం పాటల రికార్డింగ్ హైదరాబాద్‌లో మొదలైంది. వెంకటస్వామి దర్శకత్వంలో ఎస్. రవికిషోర్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రవిశేషాలను దర్శక, నిర్మాతలు చెబుతూ - ‘‘లవ్, సస్పెన్స్, రివెంజ్, హారర్ సమాహారంతో ఈ చిత్రం ఉంటుంది. ఈ నెల 24న రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం. ఇద్దరు నూతన నాయికలు నటించనున్న ఈ చిత్రంలో ఓ మాజీ హీరో విలన్ పాత్ర చేయబోతున్నారు’’ అని చెప్పారు. ఎమ్మెస్ నారాయణ, రఘుబాబు, బెనర్జీ, సూర్య తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: హనుకాకా, సంగీతం: సాకేత్ నాయుడు. -
ప్రయత్నిస్తూ మరణిస్తే గెలిచినట్లు...ప్రయత్నం విరమిస్తే మరణించినట్లు!
ప్రయత్నం... ఎలాగైనా ఉండొచ్చు. అసలంటూ ఉండాలి. ఎమ్మెస్ నారాయణ చాలా ప్రయత్నాలు చేశారు. చదువుకోడానికో ప్రయత్నం. (నాన్నకు ఇష్టం లేదు) లెక్చరర్ అవడానికో ప్రయత్నం. (జీతం ఎక్కువ రాదు) సినీ రచయిత అయే ప్రయత్నం. (పడిన కష్టం ఒకటి కాదు) నటుడిగా నిలబడే ప్రయత్నం. (నో రెస్ట్, నో ఫియర్) కొడుకుని హీరో చేసే ప్రయత్నం. (లాస్‌ని లెక్కే చేయలేదు). గెలిచామా ఓడామా అని కాదు... ప్రయత్నం చేశామా? లేదా? ఇదీ ఎమ్మెస్ ఫిలాసఫీ! జీవితం ఆయనకి ఫస్ట్ టెస్ట్ పెట్టినరోజు... చిన్న కాగితం ముక్కమీద ఏం రాసుకున్నారో తెలుసా? ‘ప్రయత్నిస్తూ మరణిస్తే గెలిచినట్లు... ప్రయత్నం విరమిస్తే మరణించినట్లు’. ఇలాంటి మనిషిని... ఎన్ని టెస్టులు మాత్రం ఏం చెయ్యగలవు? ఈవారం ‘తారాంతరంగం’ చదవండి. అప్రయత్నంగా మీరూ ఏదో ఒకజీవిత సత్యాన్ని... కాగితం ముక్కపై రాసుకుంటారు! ఎమ్మెస్గారూ... ఓసారి మీ ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళ్దామా? ఎమ్మెస్: పశ్చిమ గోదావరి జిల్లాలో నిడమర్రు అనే అందమైన పల్లెటూరు మాది. మేం ఏడుగురు అన్నదమ్ములం, ముగ్గురు అక్కాచెల్లెళ్లు. అప్పటికి ఊరినిండా మట్టి రోడ్లు. అందరికీ సైకిళ్లే ఆధారం. మోటార్ సైకిల్ ఉందంటే దొరబాబు కింద లెక్క. ఊళ్లో పెద్దగా చదువుకున్నవాళ్లు లేరు. మా మేనమామ సత్యంగారు బీఏ చదివితేనే గ్రేట్‌గా చూసేవాళ్లు. నాన్నగారు వ్యవసాయం చేసేవారు. చదువంటే ఆసక్తి లేదాయనకు. నాకేమో బాగా చదువుకోవాలని ఉండేది. కానీ నాన్నగారు నాతో పొలం పనులు, పశువుల కాపలా చేయించేవారు. మరి మీ చదువు ఎలా సాగింది? ఎమ్మెస్: నాన్న ఎన్ని చెప్పినా నా దారి నాదే. ఆయన అలా వెళ్లగానే ఇలా నేను పొలం నుంచి పారిపోయేవాణ్ణి. మళ్లీ మా నాన్నగారు స్కూల్‌కి వచ్చి తీసుకెళ్లేవారు. అలా చిన్నప్పట్నుంచి చదువు, వ్యవసాయం రెండూ కలగలుపుగా పెరిగాను. అలా అలా ఐదోతరగతి వరకు బండి లాగించాను. ఆ తర్వాత మా ఊళ్లో హైస్కూల్ పెట్టారు. మూర్తిరాజుగారని పత్తేపురంలో ఓరియంటల్ కాలేజ్ పెట్టారు. పెద్ద చరిత్ర ఉన్న వ్యక్తి. మంత్రిగా కూడా చేశారు. ఆయన వెస్ట్ గోదావరిలో 60 స్కూల్స్, 12 కాలేజీలు పెట్టారు. మూర్తిరాజుగారితో నాకు మంచి అనుబంధం ఏర్పడి, ఆయన పెట్టిన హైస్కూల్లో చదువుకుని, ఆ తర్వాత పత్తేపురంలోని ఓరియంటెల్ కాలేజీలో చదివాను. అక్కడే భాషా ప్రవీణ పాసయ్యాను. ఆ తర్వాత ఆయన స్కూల్లోనే ఉద్యోగం ఇచ్చారు. మీ చదువు విషయంలో మీ అమ్మగారి ప్రోత్సాహం ఎలా ఉండేది? ఎమ్మెస్: మా నాన్నగారు చదువుకోలేదు కానీ, మా అమ్మగారు చదువుకున్నారు. ఆవిడ బాగా ప్రోత్సహించేవారు. పత్తేపురం కాలేజీలో చదువుతున్నప్పుడు నాన్నగారికి తెలియకుండా అమ్మ నాకు బట్టలు, బియ్యం పంపించేవారు. అసలు మీ నాన్నగారికి చదువంటే ఎందుకిష్టం లేదు? ఎమ్మెస్: మనుషులను నమ్మితే లాభం లేదు.. మట్టిని నమ్ముకుంటే అన్నం పెడుతుంది అనేవారు. కానీ ఓసారి నా చదువు గురించి మా ఊరి కరణంగారు, మరికొంతమంది ‘మీవాడు సంస్కృతం చదువుతున్నాడు. మా పిల్లల్ని చదివించాలని ఉన్నా చదువుకోలేకపోతున్నారు’ అనడంతో నాన్నగారు కన్విన్స్ అయ్యి, అప్పట్నుంచీ చదువుకోమని ప్రోత్సహించారు. ఆ సమయంలోనే కొన్ని రచనలు చేశారట? ఎమ్మెస్: హైస్కూల్లో పని చేస్తున్న సమయంలో 1977 నవంబర్ 19 అర్ధరాత్రి దివిసీమ ఉప్పెనలు వచ్చాయి. అక్కడికెళ్లి, శవాలను చూసి కదిలిపోయాను. ఆ మానసిక స్థితి నన్ను ‘జీవచ్ఛవాలు’ అనే నాటిక రాసేలా ప్రేరేపించింది. ఆ నాటికను జిల్లా అంతా ప్రదర్శించి, బట్టలు, బియ్యం సేకరించి, బాధితులకు అందజేశాం. ఆ నాటికలో నేను యాక్ట్ చేయలేదు. హైస్కూల్ పిల్లలతో యాక్ట్ చేయించాను. నాది రచన, దర్శకత్వం మాత్రమే. టీచర్‌గా మీ ప్రస్థానం గురించి... ఎమ్మెస్: తెలుగు పండిట్‌గా చేస్తూ.. ఎంఏకి కట్టాను. ఫస్ట్‌క్లాస్‌లో పాసయ్యాను. భీమవరంలోని కేజీఆర్ కాలేజీలో లెక్చరర్‌గా ఉద్యోగం సంపాదించాను. అదప్పుడు ఎయిడెడ్ కాలేజ్ కాదు... అన్ఎయిడెడ్. అందుకని నాకు 250 రూపాయలు మాత్రమే జీతం ఇచ్చేవారు. కానీ అంతకు ముందు మున్సిపల్ హైస్కూల్లో నాకు ఎనిమిది వేల రూపాయలు వచ్చేవి. లెక్చరర్ అవాలనే ఆకాంక్షతో ఆ జాబ్‌కి రిజైన్ చేసి, తక్కువ జీతమైనా కాలేజీలో చేరాను. ఆ తర్వాత రెండేళ్లకు ఎయిడెడ్ అయ్యింది. దాంతో పూర్తి జీతం వచ్చింది. కాలేజ్‌లో పని చేస్తున్నప్పుడూ మీ నాటక రచన కంటిన్యూ అయ్యిందా? ఎమ్మెస్: మా కాలేజీకి నేనే ఫైన్ఆర్ట్స్ కన్వీనర్‌ని. నాటకాల మీద ఇంట్రస్ట్ ఉన్నవారిని తీసుకుని, ‘ప్లస్ అండ్ ఇంటూ ఆర్ ఈక్వల్’ అనే నాటిక రాశాను. ప్లస్ అంటే కలిసి ఉండటానికి గుర్తు. ఇంటూ అనేది వ్యతిరేకతకు గుర్తు. కానీ ఈ రెండూ ఏదో ఒకచోట కలవక తప్పదనేది ఈ నాటిక సారాంశం. ఆంధ్రా యూనివర్శిటీ ‘యూత్ ఫెస్టివల్’లో ఈ నాటికను ప్రదర్శించాం. అక్కడ ఎనిమిది ప్రైజులుంటే, మా నాటికకు ఆరు వచ్చాయి. దాంతో అందరి దృష్టీ నా మీద పడింది! ‘నీలో చాలా టాలెంట్ ఉంది. సినిమా ఫీల్డ్కి వెళ్లొచ్చుగా’ అన్నారు చాలామంది. ఇదేదో బావుందనుకుని, సర్కార్ ఎక్స్‌ప్రెస్ ఎక్కి, మద్రాస్ వెళ్లాను. ఆ రకంగా ఆ నాటిక నా సినిమా జీవితానికి నాంది అయ్యింది. అప్పటికి మీకు పెళ్లయ్యిందా? ఎమ్మెస్: అప్పటికే (1972) పెళ్లయ్యింది. జనరల్‌గా సినిమా పరిశ్రమ అంటే పంపించడానికి ఇష్టపడరు. కానీ మా ఆవిడ నన్ను ప్రోత్సహించింది. దాంతో ఓ నమ్మకంతో మద్రాసు ప్రయాణమయ్యాను. మీది ప్రేమ వివాహమటగా? ఎమ్మెస్: అవును. నేను భాషాప్రవీణ చదువుతున్నప్పుడు తను నా క్లాస్మేట్. ప్రేమించి పెళ్లాడాను. ఇద్దరివీ వేర్వేరు కులాలు. ఆ రోజుల్లో కులాంతర వివాహం అంటే చిన్న విషయం కాదు.. మరి మీ ఇంట్లో ఒప్పుకున్నారా? ఎమ్మెస్: మా ఇద్దరి ఇళ్లలోనూ ఒప్పుకోలేదు. నేను భాషాప్రవీణ చదువుతున్నప్పుడు పరుచూరి గోపాలకృష్ణగారు ఫైనల్ ఇయర్లో మాకు లెక్చరర్. కమ్యూనిస్టు భావాలున్న వ్యక్తి. ఆయన ఆధ్వర్యంలోనే పెళ్లి చేసుకున్నాం. అప్పుడే నాకు భీమవరంలో జాబ్ వచ్చింది. మా ఆవిణ్ణి కూడా భాషాప్రవీణ చదివించాను. ఆవిడకీ భీమవరం హైస్కూల్లో జాబ్ వచ్చింది. ఇంతకూ మీ పెద్దలు ఎప్పటికి ఒప్పుకున్నారు? ఎమ్మెస్: నాలుగైదేళ్లు మేం పెద్దలకు దూరంగానే ఉన్నాం. మా అన్నదమ్ములు మాత్రం వస్తుండేవాళ్లు. ఆ తర్వాత నాలుగేళ్లకు మా నాన్నగారు మమ్మల్ని రానిచ్చారు. నటుడిగా మీ వైభవాన్ని మీ అమ్మానాన్నలు చూశారా? ఎమ్మెస్: మా నాన్నగారు చూడలేదు. రచయితగా నేను ప్రయత్నాలు చేస్తున్నప్పుడు ‘ఎందుకు రా జీవితాన్ని పాడు చేసుకుంటున్నావ్.. పిచ్చి వెధవా’ అని తిట్టేవారాయన. ఆ తర్వాత ‘పేకాట పాపారావు’ సినిమాకి రచయితగా నా పేరు చూసి, ఆనందించారు. అమ్మ రెండేళ్ల క్రితమే చనిపోయారు. ఆమె నా ఎదుగుదలను పూర్తిస్థాయిలో చూశారు. మద్రాసు లైఫ్కొద్దాం... ఊరు కాని ఊరు. లైఫ్ ఎలా ఉండింది? ఎమ్మెస్: ఆకురాజు పున్నంరావుగారని మా ప్రిన్సిపాల్ ఉండేవారు. ఓసారి ఆయన ‘ఒరేయ్.. మీ దగ్గర డిక్షనరీ ఉందా’ అని అడిగి, అందులో ‘ఫియర్, రెస్ట్ ’ అనే పదాలను కొట్టేయండన్నారు. అప్పట్నుంచీ ఇప్పటివరకూ నా జీవితంలో ఆ రెండూ లేవు. మా నాన్నగారు చదువుకోకపోయినా మహత్తరమైన వ్యక్తి! ఆయన ఓసారి ఏం చెప్పారంటే, ‘నిద్ర వచ్చినప్పుడే పడుకో. నిద్ర రాకుండా పడుకోవద్దు. ఏదో ఒక పని చేస్తుండు’ అన్నారు. అది ఫాలో అవుతుంటాను. ఖాళీ సమయంలో ఏదైనా పుస్తకం చదవడమో, ఏదో ఒక పని చేయడమో నాకు అలవాటు. అంతేకానీ ఖాళీ దొరికినప్పుడల్లా సోఫాలోనో, మంచం మీదో వాలిపోను. మద్రాసు వెళ్లేటప్పుడు ఒకటే అనుకుని రెలైక్కా - ‘మనం చేసేది మంచిపని. ఎవర్నీ మోసం చేయబోవడంలేదు. ప్రతిభ ఉంది కాబట్టి.. ఓ ప్రయత్నం చేయబోతున్నాం’ అని! అంటే.. ఆర్థికపరమైన భయం కూడా లేదా? ఎమ్మెస్: లేదు! దానికి కారణం మా ఆవిడ. నేను మంచి రచయితనవుతాననే నమ్మకం ఆవిడకి బలంగా ఉండేది. అప్పటికి మాకిద్దరు పిల్లలు. ఇద్దర్నీ చూసుకుంటాను మీరు వెళ్లండని భరోసా ఇచ్చింది. మరి ఉద్యోగం ఏమయింది? ఎమ్మెస్: శని, ఆదివారాల్లో మద్రాస్ వెళ్లేవాణ్ణి. బోల్డన్ని కథలు రాసుకుని, ఓ ఐదేళ్లపాటు చాలామందికి వినిపించాను. కానీ ఫలితం కనిపించకపోయేసరికి ‘లాస్ ఆఫ్ పే’ పెట్టి, మద్రాసులోనే ఉండటం మొదలుపెట్టాను. దాంతో అలెగ్జాండర్, పేకాట పాపారావు, హలో నీకు నాకు పెళ్లంట, ప్రయత్నం... ఇలా ఎనిమిది సినిమాలకు కథలందించగలిగాను. అప్పుడే రవిరాజా పినిశెట్టిగారితో పరిచయం ఏర్పడింది. ఆయన దర్శకత్వం వహించిన ‘ఎమ్. ధర్మరాజు ఎం.ఎ’లో వేషం ఇచ్చారు. అది నేనూహించలేదు! ఊహించని ఆ మలుపుకి ఎలా రియాక్ట్ అయ్యారు? ఎమ్మెస్: రవిరాజాగారితో ‘కాలేజీలో జాబ్ చేస్తున్నా.. వీలు పడదేమో’ అంటే, ‘మీరు మంచి నటుడవుతారు’ అని నమ్మకంగా చెప్పారాయన. ఆ మాటకు ఆ సినిమాలో యాక్ట్ చేశా. ఆ పాత్ర పండింది. ఆ తర్వాత ఆయనే పెదరాయుడు, అరణ్యం, రాయుడు... ఇలా వరసగా ఏడు సినిమాలకు అవకాశం ఇచ్చారు. ఏడో సినిమానే ‘రుక్మిణి’! అందులో మంచి వేషం చేశాను. కథ కూడా ఇచ్చాను. సినిమా అద్భుతంగా ఆడలేదు కానీ, నా పాత్రకు మంచి గుర్తింపు వచ్చింది. అది చూసి, ఈవీవీ సత్యనారాయణగారు ‘మా నాన్నకి పెళ్లి’లో మంచి కేరక్టర్ ఇచ్చారు. ఆ పాత్ర నా జీవితానికే మలుపయ్యింది. ఎలాంటి మలుపు అంటే ఒక వృత్తి నుంచి ఇంకో వృత్తికి మారేంత. ఆ సినిమా తర్వాత లెక్చరర్ జాబ్‌కి రిజైన్ చేయాలని నిర్ణయించుకున్నారా? ఎమ్మెస్: నేను డిసైడ్ చేయలేదు. ఇండస్ట్రీ డిసైడ్ చేసింది. ‘మా నాన్నకి పెళ్లి’ రిలీజైన ఐదారు రోజులకి ఇరవై సినిమాలు కమిట్ అయ్యాను. అది మొదలు ఇప్పటివరకు వెనక్కి తిరిగి చూసే పరిస్థితి రాలేదు. 1997 డిసెంబర్లో ‘మా నాన్నకి పెళ్లి’ చేశాను. ఆ సినిమాకి నంది వచ్చింది. ఆ తర్వాత 1999, 2000, 2003 సంవత్సరాల్లో నంది అవార్డులు తెచ్చుకున్నాను. ఇటీవల ‘దూకుడు’తో ఐదో నంది అందుకున్నాను. దాదాపు పది, పదిహేను సినిమాలు తక్కువగా 700 సినిమాలు చేశాను. ఒక లక్ష్యం సాధించిన తర్వాత జీవితం పూలబాట అవుతుంది. కానీ లక్ష్యసాధనలో భాగంగా పడిన కష్టాలు మామూలుగా ఉండవు. మరి.. బ్రేక్ వచ్చేంతవరకు మీరు పడిన బాధలు, అవమానాలు ఏమైనా ఉన్నాయా? ఎమ్మెస్: చాలా ఉన్నాయి! దాదాపు పన్నెండేళ్లు నేను పడిన కష్టాలు భయంకరం! ఎవరూ తట్టుకోలేరు. వెనక్కెళ్లిపోతారు. ఒక దశలో విరక్తి చెంది, మా ఊరెళ్లిపోదామనుకున్నాను. మర్నాడు రెలైక్కడానికి టిక్కెట్ కూడా తెచ్చుకున్నా. ఆ రాత్రి రూమ్‌లో కూర్చుని ఆలోచనలో పడ్డాను. ఆ ఆలోచనలను పేపర్ మీద పెట్టడం మొదలుపెట్టాను. అప్పుడు నేను రాసిన కథలు గుర్తొచ్చాయి. నా అన్ని కథల్లో హీరో సినిమా మొత్తం కష్టపడి చివరికి అనుకున్నది సాధిస్తాడు. ‘మనం రాసిన కథల్లో హీరోలు మాత్రం అష్టకష్టాలు పడాలి. మనం పడకూడదా?’ అని ఎందుకో అనిపించింది. అంతే.. ‘ప్రయత్నిస్తూ మరణిస్తే గెలిచినట్లు... ప్రయత్నం విరమిస్తే మరణించినట్లు’ అని పేపర్ మీద రాసుకున్నా. దాన్ని గోడకి అంటించి, టికెట్ చించేశాను. ఆ తర్వాతే రవిరాజాగారికి ‘సవ్యసాచి’ అనే కథ ఇచ్చాను. ఆ కథను తీసుకున్నారాయన. అప్పుడు ఆర్థికంగా చాలా ఇబ్బందిపడేవాణ్ణి. మా ఆవిడే డబ్బులిచ్చేది. రవిరాజాగారు ఆ కథ తీసుకుని, ‘ఎంతివ్వమంటారు’ అనడిగారు. ఎంతడగాలో తెలియక ‘మీ ఇష్టం’ అన్నాను. ‘యాభైవేలిస్తా’ అనగానే, ‘నా గుండె ఆగినంత పనయ్యింది’. అదే స్వీట్ షాక్ అంటే... ‘మీరు చెప్పిన పద్ధతికి ఓ ఐదు వేలు బహుమతి’ అంటూ మొత్తం యాభైఐదు వేలిచ్చారు రవిరాజాగారు. ఇదంతా ఆర్టిస్ట్ అవకముందు దశ. ఆ తర్వాతే ‘ఎమ్. ధర్మరాజు ఎంఎ’తో నన్ను నటుణ్ణి చేశారు. ఆ సినిమా తర్వాత పార్టీ ఇచ్చి, ‘మీరు నంబర్‌వన్ కమెడియన్ అవుతారు’ అన్నారు. అది సాధించడానికి చాలాకాలం పట్టింది. కానీ దర్శకుడిగా ఆయన విజన్‌ని మాత్రం అభినందించాల్సిందే. నటించగలిగింది నటుడే కావచ్చు.. కానీ నటుణ్ణి కనిపెట్టగలిగేది దర్శకుడే. అందుకే దర్శకుడు గ్రేట్. లెక్చరర్‌గా చేస్తూ కొన్నేళ్లపాటు ప్రతి శనివారం మద్రాసు వెళ్లేవాణ్ణన్నారు. కష్టమనిపించలేదా? ఎమ్మెస్: ‘స్ట్రగుల్ ఫర్ ఎచీవ్మెంట్’ పేరుతో ఒకాయన పుస్తకం రాస్తున్నారు. ఓ ఏడాదిలో ఆ పుస్తకం వచ్చేస్తుంది. ఒకటి ఎచీవ్ చేయడానికి నేనెంత స్ట్రగుల్ పడ్డానో వాటి సమాహారంతో ఈ పుస్తకం ఉంటుంది. నిడమర్రు టు మద్రాసు సాగించిన ప్రయాణాల్లో నేను పడ్డ కష్టాలు ఎనలేనవి. అవెలాంటి కష్టాలు? ఎమ్మెస్: ఓసారి టిక్కెట్ తీసుకుని, హాయిగా నా బెర్త్ మీద పడుకున్నాను. మిగతా బెర్తుల్లో ఉన్న ఏడుగురు విశాఖపట్నం నుంచి తిరుపతి వెళ్లడానికి అర్జంటుగా రెలైక్కడంతో టిక్కెట్స్ తీసుకోలేదట. ఆ విషయం గురించి వాళ్లు మాట్లాడుకుంటూ.. పక్క స్టేషన్లో దిగి, టికెట్ తీసుకోవాలనుకుంటున్నారు. అక్కడే ఉన్న మరో వ్యక్తి వీళ్ల మాటలు విని, ‘స్టేషన్ మాస్టర్ మా బాబాయే. ఒంగోలులో దిగి, నేను టిక్కెట్స్ తీసుకొస్తా’ అంటూ వాళ్ల దగ్గర డబ్బులు తీసుకున్నాడు. పైన నిద్రపోతున్న నన్ను చూపించి ‘తను నా తమ్ముడే.. చూసుకోండి’ అంటూ నన్ను తాకట్టు పెట్టి, ట్రైన్ దిగాడు. ఇక వెనక్కి రాలేదు. దాంతో, వాళ్లు నన్ను నిద్ర లేపి, ‘మీ అన్నయ్య ఇంకా రాలేదేంటి’ అనడిగితే, నేను షాకయ్యాను! ‘మా అన్నయ్య ఎవరూ లేరు’ అని చెప్పినా వినకుండా, నా సూట్‌కేస్ లాకున్నారు. కొట్టడానికి సిద్ధపడితే, ‘కొట్టొద్దు.. చైన్ లాగేసి, పోలీసులకు పట్టిస్తా’ అని రివర్స్‌లో బెదిరించాను. నా సూట్‌కేస్ ఇవ్వకపోతుంటే, గూడూరులో ట్రైన్ ఆగగానే, పరిగెత్తుకుంటూ వెళ్లి.. స్టేషన్ మాస్ట్టర్ దగ్గర, నా టిక్కెట్ చూపించి, జరిగినదంతా చెప్పాను. దాంతో వాళ్ల దగ్గర్నుంచి సూట్‌కేసు లాక్కుని, నాకిచ్చి వాళ్లని కిందకు దించేశారు. నా ప్రయాణాల్లో ఇలాంటి చేదు అనుభవాలు బోల్డన్ని ఎదుర్కొన్నాను. నటుడిగా మారిన తర్వాత రచనకు దూరమయ్యారు కదా! అసలు రచయితగా మీకు తీరని కోరిక ఏమైనా ఉండేదా? ఎమ్మెస్: ఏ సినిమా సక్సెస్కైనా కథే ప్రధానం. సినిమా సక్సెస్‌కి హీరోయే కారణం అయితే.. ప్రతి సినిమా ఆడాలి కదా. కానీ ఆడటంలేదే. బాగున్న కథలే విజయం సాధిస్తున్నాయి. రచయిత అనేవాడు మంచి కథ ఇస్తేనే కదా, ఇళయరాజాలాంటి సంగీతదర్శకులు పాటలిచ్చేది. అలాంటప్పుడు, వారి ఫొటోలు పోస్టర్‌పైన వేస్తున్నప్పుడు, అన్నిటికీ మూలమైన రచయిత ఫొటో ఎందుకు వేయకూడదు అనిపించేది. కాబట్టి రచయిత బొమ్మ వేసేదాకా రాయాలని బలంగా నిర్ణయించుకున్నాను. కథలు బోల్డన్ని రాసుకుని, సినిమా ఆఫీసులకు వెళ్లేవాణ్ణి. మొదట్లో అన్ని ఆఫీసులకు కాలినడకన, ఆ తర్వాత అద్దె సైకిలు మీద వెళ్లేవాణ్ణి. అప్పుడు ఓ కో-డెరైక్టర్ ‘సైకిల్ మీద రాకండి. కథలు వినరు. ఓ స్టేచర్ ఉండాలి’ అన్నాడు. దాంతో వెళ్లగలిగితే ఆటోలో, లేకపోతే నడుచుకుంటూ వెళ్లేవాణ్ణి. అలాంటి సమయంలో ఓ దర్శకుడు నా కథ తీసుకున్నాడు. రచయితగా నా పేరు వేశారు. నేను మా ఊరెళ్లి మా కాలేజీలో కూడా చూపించుకున్నాను. కానీ ఆ తర్వాత నా పేరు తీసేసి ఇంకో రచయిత పేరు వేశారు. దాంతో కాలేజీలో నా పరువు పోయినంత పనయింది. అదో అవమానంగా భావించాను. ఆ నిర్మాతను అడిగితే, నా పేరు, ఇంకో రచయిత పేరు కలిపి వేశారు. ఆ సినిమాకి కథ, మాటలు మొత్తం నేనే అందించాను. ఆ కథను నిర్మాతకు, అతని బావమరిదికి, దర్శకుడికి... ఇలా ఒకే రోజులో ఏడుగురికి చెప్పించారు. ఇక, నా కష్టం ఎలా ఉంటుందో ఊహించుకోండి. ఆ రోజు నేను కష్టపడ్డాను. కానీ, నన్ను కష్టపెట్టినవారికన్నా నా భవిష్యత్తే బాగుంది. భగవంతుడు నాకే మంచి మార్గం చూపించాడు. దానికి కారణం నా నిజాయితీ, ప్రతిభ, నా కష్టమే. వాల్‌పోస్టర్ మీద రచయితగా మీ బొమ్మ చూసుకోకుండానే, రచనలు మానేశారు... బాధ అనిపించలేదా? ఎమ్మెస్: రచయిత అనేవాడు పుస్తకాలు రాయకపోయినా, రచన అనేది అతని జీవన పరిధిలో ప్రతిచోటా ఉపయోగపడుతుంది. ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు, ప్రవర్తించేటప్పుడు, నటించేటప్పుడు ఉపయోగపడుతుంది. జీవితాన్ని రచించుకోగలిగినవాడే మంచి రచయిత. ఆ విధంగా నాలో రచయిత మరుగునపడిపోలేదు. కానీ పేపర్ మీద రాయలేదనే ఫీలింగ్ కొంత ఉంది. నటన సులువు కాదు. పైగా నేను షిఫ్టులవారీగా చేయడంతో, ఒత్తిడికి గురవుతుంటాను. ఆ ఒత్తిడిలో ఇక ఏం రాయగలను? కానీ నాలోని రచయిత షూటింగ్స్‌లో సీన్స్‌కి ఉపయోగపడతాడు. లెక్చరర్ అంటే.. కొంచెం గంభీరంగా ఉంటారు. దానికి పూర్తి వ్యతిరేకంగా నవ్వించే పనిని అంగీకరించారు మీరు. అసలు మీకు సెన్సాఫ్ హ్యుమర్ ఎలా అలవడింది? ఎమ్మెస్: లెక్చరర్స్ అందరూ గంభీరంగా ఉండరు. కొంతమంది మాత్రమే. అలాగే వారిలో సెన్సాఫ్ హ్యూమర్ ఉన్నవాళ్లూ ఉంటారు. నాకు చిన్నప్పట్నుంచీ సెన్సాఫ్ హ్యూమర్ ఎక్కువ. క్లాస్‌రూమ్‌లో నేను పాఠాలు చెప్పేటప్పుడు సందర్భోచితమైన ఛలోక్తులు కలిపి చెప్పేవాణ్ణి. దాంతో పక్క క్లాసువాళ్లు కూడా వచ్చి వినేవాళ్లు. పిల్లలను విపరీతంగా నవ్వించేవాణ్ణి. భారత రామాయణాలని సోషలైజ్ చేసి, చెప్పేవాణ్ణి. అయితే స్టూడెంట్స్‌లో బాగా ఫాలోయింగ్ వచ్చుండాలే...! ఎమ్మెస్: అవును, సినిమాల్లోకి రాకముందు నాకు ఫాన్స్ ఉండేవారు. మా ‘నారాయణ మాస్టార్’ అంటూ అభిమానంగా ఉండేవాళ్లు. నా శిష్యుల్లో ఎంతోమంది జిల్లా కలెక్టర్లు, ఐఏయస్, ఐపీఎస్ ఆఫీసర్లు, అమెరికాలో జాబ్ చేస్తున్నవాళ్లు ఉన్నారు. ‘దేవదాస్’ సినిమా షూటింగ్ కోసం అమెరికా వెళ్లినప్పుడు పన్నెండు మంది శిష్యులు ప్రతి రాత్రి కార్లేసుకొచ్చి, అమెరికా అంతాతిప్పారు. జనరల్‌గా మన దగ్గర చదువుకున్న పిల్లలు, మనకన్నా గొప్పవాళ్లు అవుతారు. ఏ కలెక్టర్‌గానో, ఐపీఎస్గానో... అలా! కానీ నా శిష్యులతో పాటు నేనూ ఎదిగాను (నవ్వుతూ) ఓ మోస్తరు ఎక్కువగానే! నేను సాధించింది వాళ్లు సాధించినట్లుగా ఆనందపడేంత శిష్యులు ఉన్నారు నాకు. మీ అబ్బాయి గురించి మాట్లాడదాం... విక్రమ్ కెరీర్ విషయంలో ఎదురుదెబ్బ తిన్నట్టున్నారు? ఎమ్మెస్: నా ఇమేజ్ వాడికి అడ్డంకి అయ్యింది. నాలాగే వాడూ నవ్విస్తాడనుకున్నారు ప్రేక్షకులు. అందుకే ‘కొడుకు’ సినిమా వాళ్లని నిరుత్సాహపరిచింది. నాకు ఫైన్ ఆర్ట్స్ తెలుసు కానీ కామర్స్ తెలియదు. నేను చదివింది బీఏ... బీకామ్ కాదు. అందుకని కమర్షియల్ ఎస్టిమేషన్ తెలియలేదు. పెద్దపెద్ద నిర్మాతలే వాళ్ల తనయుల్ని సక్సెస్ చేయలేకపోతున్నారు. నేనెంత? డబ్బుపెట్టి, మంచి సినిమా తీయడం మాత్రమే కాదు.. ఆ సినిమాని కమర్షియల్‌గా వర్కవుట్ చేసుకోవడం కూడా తెలియాలి. మా అబ్బాయి హీరోగా నేను ‘కొడుకు’ సినిమాని బాగానే తీశాను. నన్నెవరూ తప్పు పట్టలేదు. విక్రమ్‌నీ తప్పు పట్టలేదు. బాక్సాఫీస్ దగ్గర సరిగ్గా రిలీజ్ చేయడం చేత కాలేదు. పంపిణీ వ్యవస్థ గురించి నాకిప్పటికీ తెలియదు. థియేటర్లో ప్రేక్షకులు కొనుక్కునే టికెట్ డబ్బు నిర్మాతకు ఎలా చేరుతుందో తెలియదు. ఆ మార్గం తెలిసుంటే ‘కొడుకు’ సేఫ్ ప్రాజెక్టే. కమెడియన్ కొడుకు కమెడియనే ఎందుకవ్వాలి.. హీరోగా ఎందుకు చేయకూడదని మీ అబ్బాయిని హీరోని చేశారా? లేక మీ అబ్బాయి హీరో మెటీరియలే అని నమ్మి చేశారా? ఎమ్మెస్: కమెడియన్ కొడుకు కమెడియనే ఎందుకవ్వాలి అని మనం అనుకోవచ్చు. కానీ ప్రేక్షకులు అనుకోరు. వాళ్ల అభిప్రాయాన్ని మార్చలేముగా! విక్రమ్‌తో సినిమా చేసేటప్పుడు.. నగేష్గారి కొడుకు ఆనంద్ సక్సెస్ అవ్వలేదు. ఇంకా కొంతమంది హాస్యనటుల కొడుకులు సక్సెస్ అవ్వలేదని కొంతమంది ఉదాహరణలు చెప్పారు. మా అబ్బాయి పక్కా హీరో మెటీరియలే అనే కాన్ఫిడెన్స్‌తోనే తీశాను. కెమెరా ముందు హైటు ప్రాబ్లమ్ ఉండదు. ఉదాహరణకు మన హీరోల్లో.. హైటు తక్కువ ఉన్నవాళ్లల్లో కూడా అద్భుతమైన హీరోలు ఉన్నారు. ఇతర భాషల్లో కూడా హైటు తక్కువ ఉన్నవాళ్లల్లో మంచి హీరోలు చాలామందే ఉన్నారు. ఆ చిత్రం ద్వారా ఆర్థికంగా బాగానే నష్టపోయారు కదా..? ఎమ్మెస్: అవును. అయినా అదేం పెద్ద లెక్క కాదు. ఎందుకంటే, దానికంటే ఎక్కువే సంపాదించాను. ఓ ప్రయత్నం చేయాలనుకుని చేశాను. దాన్ని ఓటమి అనుకోవడంలేదు. మళ్లీ మీ అబ్బాయి విక్రమ్ సినిమా చేస్తారా? ఎమ్మెస్: చేయొచ్చు. తన ప్లానింగ్స్ ఏవో తనకున్నాయి. ఆ ప్లాన్స్ గురించి తనే చెబుతాడు. ‘దుబాయ్ శీను’ సినిమాలో సాల్మన్ రాజు పాత్రకు ఓ పెద్ద నటుణ్ణి అనుకరించారు. ఆ తర్వాత కూడా అలాంటి పాత్రలు చేశారు. అలా చేయడం వివాదాస్పదం అవుతుందని ఎప్పుడూ అనిపించలేదా? ఎమ్మెస్: ఓ ఆర్టిస్ట్‌గా దర్శకుడు ఏం చెబితే అది చేయడమే నా బాధ్యత. ఆ స్టార్ ఎంతో ఫేమస్ అయితేనే దర్శకుడు పేరడీ చేయిస్తాడు. అయినా ఆ పేరడీలు వివాదం అవుతాయనుకోలేదు. ఎందుకంటే, అవన్నీ కామెడీ కోసమే. మందు కొట్టే పాత్రలను అద్భుతంగా పండిస్తారు. నిజంగా అలవాటుంది కాబట్టే.. అంతలా పండిస్తున్నారా? ఎమ్మెస్: రియల్ లైఫ్ అలవాటుకీ దానికీ సంబంధం లేదు. ఎందుకంటే, నిజజీవితంలో అలవాటుంది కాబట్టే.. బాగా చేస్తున్నానని అంటే, మరి ఆ పాత్రలు చేసేటప్పుడు తాగి నటించాలిగా. నేనలా చేయను. రవిరాజాగారు ఫస్ట్ తాగుబోతు పాత్ర ఇచ్చినప్పుడు, అసలు తాగినవాడు నత్తిగానే ఎందుకు మాట్లాడాలి? కిక్కుండాలి.. నత్తి ఉండకూడదని మంచి డిక్షన్‌తో డైలాగ్ చెప్పాను. ఆ మాడ్యులేషన్లో ఓ స్వీట్నెస్ ఉంటుంది. అది ప్రేక్షకులకు నచ్చింది. నేను చేసే తాగుబోతు పాత్రలు సక్సెస్ అవ్వడానికి కారణం, ఆ పాత్ర మర్డర్లు, మానభంగాలు చేయదు, దుష్ట పనులేవీ చేయదు. నవ్విస్తుంది. అందుకే అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. ఓ సినిమాలో మందు తాగే పాత్రలో ‘నేను టాక్స్ పేయర్’ని అంటూ తాగడాన్ని కన్విన్సింగ్‌గా డైలాగ్ రూపంలో చెప్పారు? నిజంగా కూడా అలానే ఫీలై, తాగుతారా? మందు తాగడం మంచిది కాదని మీకు తెలియదా...? ఎమ్మెస్: మందు నాకు హాని కాదు. నా లైఫ్‌ని తీసుకుందాం. షూటింగ్స్ కారణంగా రెస్ట్‌లెస్‌గా ఉంటాను. ఆ అలసట పోగొట్టుకోవడానికి చిన్న పెగ్ తీసుకుని, హాయిగా నిద్రపోతాను. దానివల్ల నాకు ఎనర్జీ వస్తుందే తప్ప, జీవితం నాశనం అయిపోయే రేంజ్ ఉండదు. ఇంకోటి ఏంటంటే, ఆరోగ్యాన్ని పాడు చేసే చీప్ లిక్కర్ జోలికి వెళ్లను. చాలామంది ప్రచారం చేస్తున్నట్లుగా నేను బీభత్సమైన తాగుబోతుని కాదు! అలా మీ మీద దుష్ర్పచారం చేస్తున్నదెవరంటారు...? ఎమ్మెస్: పేర్లు అనవసరం. అసూయతో ప్రచారం చేస్తుంటారు. అవన్నీ పట్టించుకోను. మనం గొప్పవాళ్లమైతేనే ఎదుటివాళ్లకు అసూయ కలుగుతుంది. అలాగే ఎప్పుడైతే మన గురించి అలా లేనిది ప్రచారం చేస్తున్నారో అప్పుడు వాళ్లు మనకు భయపడుతున్నట్లే లెక్క. నేనెప్పుడూ నా గురించి ఆలోచిస్తాను. ఎదుటివాడి గురించి అస్సలు ఆలోచించను. - డి.జి. భవాని *********** నా పూర్తి పేరు మైలవరపు సూర్యనారాయణ. స్కూల్లో ఎమ్మెస్గారనేవారు. పెద్దవాళ్లు ‘సూన్నారాయణ’ అనేవాళ్లు. లెక్చరర్ అయ్యాక తొలి ఉగాదికి ‘ఎమ్మెస్ నారాయణ’ అని మార్చుకున్నాను. అప్పుడో గేయం రాశాను. ఇంత పొడుగు పేరెందుకని, ‘ఎమ్మెస్ నారాయణ’ అని పెట్టుకున్నాను. నేను ‘కాళిదాసు’ని ఎక్కువగా చదివాను. ఎంఏ ప్రీవియస్‌లో ‘ఇండియా ఈజ్ కాళిదాస్’ అని రాశాను. ఎందుకంటే, భారతదేశం అంటే.. నా దృష్టిలో ఉత్తరాన హిమాలయాలు, దక్షిణాదిన సముద్రం.. ఇది కాదు.. ‘కల్చర్’. వాటీజ్ ది ఇండియన్ కల్చర్ అనేది కాళిదాసు రాశారు... వివేకానందుడు ప్రపంచానికి చెప్పారు. 1921లో చికాగోలో జరిగిన హిందూ మత మహాసభల్లో వివేకానందుడు మాట్లాడి ఉండకపోతే.. మన దేశం గురించి ప్రపంచ దేశాలకు తెలిసి ఉండేది కాదు. దేవుణ్ణి నమ్ముతాను. పొద్దుటే లేచి, నమస్కారం పెట్టుకుంటాను. అప్పుడు నా మనసులో ఏమీ ఉండదు. దేవుడి ముందు ఎలాంటి ఎజెండాలూ పెట్టను. భగవంతుడి ముందు ఒక ఎజెండాను పెట్టడం ఆయన్ను ఫూల్ చేసినట్లేనని నా అభిప్రాయం. ఎందుకంటే నీ గురించి ఆ దేవుడికి తెలియదా? ఒకవేళ తెలియదని నీకనిపిస్తే.. సమస్యలు తెలియని దేవుడికి దణ్ణం పెట్టుకోవడం ఎందుకు? నీ గురించి ఆయనకు తెలుసు.. ఏం చేయాలో అది చేస్తాడు. పానగల్ పార్కులో పస్తులున్నవాళ్లల్లో పైకొచ్చినవాళ్లు చాలామంది ఉన్నారని ఎక్కడో చదివాను. ఆ జాబితాలో చిత్తూరు నాగయ్యగారు కూడా ఉన్నారు. అందుకని నా జేబులో డబ్బులున్నప్పటికీ కావాలనే భోజనం చేయకుండా, ఓ రోజంతా పానగల్ పార్క్‌లో గడిపాను (నవ్వుతూ). -
ఎమ్మెస్, పోసానిపై రీమిక్స్ సాంగ్స్
డా.రాజేంద్రప్రసాద్ యముడిగా నటించిన చిత్రం ‘మనుషులతో జాగ్రత్త’. అక్షయ్‌తేజ్, సోనియా బిర్జి జంటగా నటిస్తున్నారు. గోవింద్ వరాహ దర్శకుడు. బి.చిరంజీవులు నాయుడు, రొట్టా అప్పారావు నిర్మాతలు. సోషియో ఫాంటసీ కథాంశంతో రూపొందుతోన్న ఈ చిత్రం టాకీ పార్ట్ పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ -‘‘సమాజంలో జరుగుతున్న అన్యాయాలను ఎత్తి చూపుతూ వినోదాత్మకంగా దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇంకా రెండు పాటలు మాత్రమే మిగిలి ఉన్నాయి’’ అని తెలిపారు. ‘‘డబ్బు రుచి మరిగిన మనిషి దాని కోసం ఎన్ని అడ్డదారులు తొక్కుతాడు? తద్వారా ఎంత నష్టపోతాడు? అనే ఆసక్తికరమైన కథాంశంతో రూపొందుతోన్న చిత్రమిది. ఎమ్మెస్ నారాయణ, పోసాని కృష్ణమురళిలపై ఇటీవలే రీమిక్స్ సాంగ్స్ చిత్రీకరించాం. ప్రేక్షకులు కడుపుబ్బ నవ్వేలా ఆ పాటలుంటాయి’’ అని దర్శకుడు చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: ప్రణవ్, కెమెరా: సతీష్, కళ: చిన్నా.