దర్శకురాలిగా ఎమ్మెస్ నారాయణ కుమార్తె
నాటి తరంలో భానుమతి, సావిత్రి, విజయనిర్మల... ఇలా కొంతమంది కథానాయికలు దర్శకత్వంలోనూ ప్రతిభను చాటుకున్నారు. నేటి తరంలో బి. జయ, నందినీరెడ్డి, శ్రీప్రియలతో పాటు దర్శకత్వ శాఖలో ముగ్గురు, నలుగురు మహిళలున్నారు. తాజాగా ఈ జాబితాలోకి నటుడు ఎమ్మెస్ నారాయణ కుమార్తె శశికిరణ్ నారాయణ చేరారు. తొలి ప్రయత్నంగా నూతన నాయకా నాయికలతో ఆమె ఓ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇండో ఇంగ్లిష్ ప్రొడక్షన్స్ పతాకంపై డా. కొల్లా నాగేశ్వరావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎమ్మెస్ నారాయణ, రావు రమేష్, నగేష్, నాగినీడు, పూర్ణిమ తదితరులు నటిస్తున్న ఈ చిత్రం ఇటీవల మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి కెమెరా: సాయిప్రకాష్ ఉమ్మడిసింగు, సంగీతం: షాన్ రెహ్మాన్, ఎడిటింగ్: ప్రవీణ్ పూడి, ఆర్ట్: ధర్మేంద్ర, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: మాదల వేణు.