ఎమ్మెస్, పోసానిపై రీమిక్స్ సాంగ్స్
ఎమ్మెస్, పోసానిపై రీమిక్స్ సాంగ్స్
Published Wed, Aug 21 2013 1:12 AM | Last Updated on Fri, Sep 1 2017 9:56 PM
డా.రాజేంద్రప్రసాద్ యముడిగా నటించిన చిత్రం ‘మనుషులతో జాగ్రత్త’. అక్షయ్‌తేజ్, సోనియా బిర్జి జంటగా నటిస్తున్నారు. గోవింద్ వరాహ దర్శకుడు. బి.చిరంజీవులు నాయుడు, రొట్టా అప్పారావు నిర్మాతలు.
సోషియో ఫాంటసీ కథాంశంతో రూపొందుతోన్న ఈ చిత్రం టాకీ పార్ట్ పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ -‘‘సమాజంలో జరుగుతున్న అన్యాయాలను ఎత్తి చూపుతూ వినోదాత్మకంగా దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇంకా రెండు పాటలు మాత్రమే
మిగిలి ఉన్నాయి’’ అని తెలిపారు. ‘‘డబ్బు రుచి మరిగిన మనిషి దాని కోసం ఎన్ని అడ్డదారులు తొక్కుతాడు? తద్వారా ఎంత నష్టపోతాడు? అనే ఆసక్తికరమైన కథాంశంతో రూపొందుతోన్న చిత్రమిది. ఎమ్మెస్ నారాయణ, పోసాని కృష్ణమురళిలపై ఇటీవలే రీమిక్స్ సాంగ్స్ చిత్రీకరించాం. ప్రేక్షకులు కడుపుబ్బ నవ్వేలా ఆ పాటలుంటాయి’’ అని దర్శకుడు చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: ప్రణవ్, కెమెరా: సతీష్, కళ: చిన్నా.
Advertisement
Advertisement