Dr. Rajendra Prasad
-
కలిసి తినందే కడుపు నిండదు
మన తొలి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. ఆయనకు కొన్ని ఆదర్శాలు ఉండేవి. వాటిలో కొన్ని తనకు తానుగా పెట్టుకున్నవి. మరికొన్ని.. మహనీయుల నుంచి నేర్చుకున్నవి. రాష్ట్రపతికి ప్రభుత్వం అనేక సదుపాయాలను, సౌకర్యాలను కల్పిస్తుంది. వాటిని వద్దనుకున్నారు రాజేంద్ర ప్రసాద్. ఆఖరికి తన వ్యక్తిగత సహాయకుల సంఖ్యను కూడా ఒకటికి కుదించుకున్నారు. గాంధీజీ జీవితాన్ని సందేశంగా తీసుకుని ఆయన ఈ ఆదర్శాన్ని ఆచరించారు. అంతేకాదు, రాష్ట్రపతిగా సగం జీతాన్నే తీసుకున్నారు. అప్పట్లో రాష్ట్రపతి జీతం పదివేలు. ఐదువేలు చాలనుకున్నారు. అది కూడా చట్టాన్ని గౌరవించడం కోసం. పదవీ విరమణ నాటికి ఆ మొత్తాన్ని ఇంకా తగ్గించుకుని 2,500 రూ. మాత్రమే స్వీకరించారు. ఇంట్లో ఆయన రాష్ట్రపతీ కాదు, పెద్ద రాజకీయవేత్త కాదు. తాతయ్య మాత్రమే. మనవలు, మనవరాళ్లకు ఆయన తాతయ్యగా మాత్రమే తెలుసు. అది ఆయన కుటుంబం ఆచరించిన ఆదర్శం. వ్యక్తిగత అలవాట్లలో కూడా రాజేంద్ర ప్రసాద్ జీవన శైలి భిన్నంగా ఉండేది. ఆయన ఒక్కరే ఎప్పుడూ భోజనానికి కూర్చోలేదు. పిల్లలందరూ డైనింగ్ టేబుల్ దగ్గరకి వచ్చే వరకు ఓపిగ్గా ఎదురు చూసేవారు. ఆ తర్వాతే భోజనానికి ఉపక్రమించే వారు. కలిసి తినడం అనే అలవాటు ఈ తరం పెద్దలకు, పిల్లలకు వింతగా ఉండొచ్చు. కానీ కలిసి తినందే తనకు కడుపు నిండినట్లు ఉండదని రాజేంద్ర ప్రసాద్ అనేవారు. చివరి వరకు ఆయన జీవితం కుటుంబ, సామాజిక విలువలతో నిరాడంబరంగా గడిచింది. కుటుంబంలో పాటించిన విలువలనే సమాజంలో పాదుగొల్పాలని రాజేంద్ర ప్రసాద్ ప్రయత్నించారు. మత భావనలకు అతీతంగా మనుషులందరినీ కలిపి ఉంచే విలువలు అవి. ఇవాళ ‘అడ్వొకేట్స్ డే’. ‘లా’ కూడా చదివి, సమాజంలో సమన్యాయం కోసం పాటుపడిన డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ జయంతి సందర్భంగా ఏటా ఈ రోజు ‘న్యాయవాదుల దినోత్సవం’ జరుపుకుంటున్నాం. -
వైభవంగా ‘భాష్యం’ వేడుకలు
గుంటూరు ఎడ్యుకేషన్ : భాష్యం విద్యాసంస్థల 23వ వార్షికోత్సవాన్ని గోరంట్లలోని భాష్యం టీచర్స్ కాలనీ ప్రాంగణంలో మంగళవారం రాత్రి వైభవంగా నిర్వహించారు. ముందుగా భాష్యం విద్యాసంస్థల అధినేత భాష్యం రామకృష్ణ జన్మదినోత్సవాన్ని ఇదే వేదికపై జరిపారు. ముఖ్య అతిథిగా హాజరైన ప్రముఖ సినీ నటుడు, మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడు డాక్టర్ రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ విద్యతోనే మనిషికి సమాజంలో ఒక గుర్తింపు వస్తుందని చెప్పారు. జన్మనిచ్చిన తల్లిదండ్రులు, విద్యాబుద్ధులు నేర్పి జీవితాన్ని తీర్చిదిద్దే ఉపాధ్యాయుల పట్ల వినయ, విధేయతలతో నడుచుకోవాలని విద్యార్థులకు సూచించారు. రాష్ట్రంలో అగ్రగామి విద్యాసంస్థగా, విద్యార్థులను రాష్ట్ర, జాతీయ స్థాయిలో టాపర్లుగా తీర్చిదిద్దుతూ బ్రాండ్ ఇమేజ్ను భాష్యం సొంతం చేసుకుందని పేర్కొన్నారు. రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచే విలువలు కలిగిన మంచి పౌరులుగా ఎదగాలని సూచించారు. భాష్యం రామకృష్ణ మాట్లాడుతూ తల్లిదండ్రుల నమ్మకమే పునాదిగా భాష్యం ఎదిగిందని చెప్పారు. కార్యక్రమంలో భాష్యం పూర్వ విద్యార్థి గౌతమ్, సంస్థ సలహాదారు మైలవరపు శ్రీనివాసరావు, భాష్యం హనుమంతరావు, భాష్యం గోపి, ప్రిన్సిపాల్స్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు వేలాదిగా పాల్గొన్నారు. అనంతరం విద్యతో పాటు క్రీడా, సాంస్కృతిక పోటీల్లో ప్రతిభ చూపిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. విద్యార్థుల సంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. భారీ విద్యుత్ వెలుగుల నడుమ తీర్చిదిద్దిన వేదిక సినీ సెట్టింగ్‌ను తలపించింది. -
తొండి చేస్తే!
చిన్నతనంలో ఎవరినైనా తొండి చేస్తే ఏదో సరదా కోసం అని ఊరుకుంటారు. మరి అదే పెద్దయ్యాక కూడా అలాగే చేస్తే మోసం చేశావంటారు. ఓ యువకుడు తన ప్రేమ విషయంలో ఇలానే ప్రవర్తించాడు. ఆ తర్వాత ఏం జరిగిందనే కథాంశంతో తెరకెక్కుతున్న చిత్రం ‘తొండి’. సందీప్, ప్రియ జంటగా శ్రీకృష్ణ శంకర ప్రొడక్షన్స్ పతాకంపై ప్రసాద్ వెలంపల్లి దర్శకత్వంలో కె. కోటేశ్వరరావు ఈ సినిమా నిర్మిస్తున్నారు. డా. రాజేంద్రప్రసాద్, బ్రహ్మానందం, సంపూర్ణేష్ బాబు, దీక్షాపంత్‌లు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ‘‘ఓ వాస్తవ సంఘటన ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. కచ్చితంగా అందరినీ అలరించే చిత్రమిది’’ అని దర్శకుడు చెప్పారు. నిర్మాత మాట్లాడుతూ-‘‘మలేసియా, హైదరాబాద్, వైజాగ్ల్లోని ఆసక్తికరమైన లొకేషన్స్‌లో చిత్రీకరణ జరిపాం. వచ్చేవారం పాటలను, త్వరలోనే చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అని తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా:జయరాం, అంజి, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్: ‘సాగర్’ మహతి, పాటలు: రెహమాన్, సహనిర్మాత: కె. వంశీధర్. -
పెంపుడు కుక్క కథతో సినిమా
సీనియర్ నిర్మాత, రాజకీయవేత్త చేగొండి హరిరామ జోగయ్య చాలా ఏళ్ల విరామం తర్వాత చిత్ర నిర్మాణం చేపట్టారు. డా. రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రలో రాజా వన్నెంరెడ్డి దర్శకత్వంలో బాబు పిక్చర్స్ పతాకంపై ఆయన ఓ చిత్రం నిర్మించనున్నారు. ఆ విశేషాలను బుధవారం హైదరాబాద్‌లో పత్రికల వారికి ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా హరిరామ జోగయ్య మాట్లాడుతూ, ‘‘నాకు పెంపుడు కుక్కలంటే చాలా ఇష్టం. కుక్కపై సినిమా తీయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా. ఇప్పటికి చక్కటి కథ కుదిరింది. ఓ పెంపుడు కుక్క యథార్థగాథ ఆధారంగా ఈ సినిమా తీస్తున్నాం. ఈ నెల 15న చిత్రీకరణ ప్రారంభించి, నెల రోజుల్లో పూర్తి చేస్తాం’’ అని తెలిపారు. కథ చాలా బాగా వచ్చిందని దర్శకుడు పేర్కొన్నారు. కుక్కపై చక్కని పాటరూపొందిస్తున్నామని సంగీత దర్శకుడు చక్రి చెప్పారు. ఈ చిత్రానికి రచన: రాజేంద్ర కుమార్, పాటలు: చక్రి, కెమెరా: మోహన్, నిర్మాతలు: హరిబాబు చేగొండి, బోనం చినబాబు. -
ఎమ్మెస్, పోసానిపై రీమిక్స్ సాంగ్స్
డా.రాజేంద్రప్రసాద్ యముడిగా నటించిన చిత్రం ‘మనుషులతో జాగ్రత్త’. అక్షయ్‌తేజ్, సోనియా బిర్జి జంటగా నటిస్తున్నారు. గోవింద్ వరాహ దర్శకుడు. బి.చిరంజీవులు నాయుడు, రొట్టా అప్పారావు నిర్మాతలు. సోషియో ఫాంటసీ కథాంశంతో రూపొందుతోన్న ఈ చిత్రం టాకీ పార్ట్ పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ -‘‘సమాజంలో జరుగుతున్న అన్యాయాలను ఎత్తి చూపుతూ వినోదాత్మకంగా దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇంకా రెండు పాటలు మాత్రమే మిగిలి ఉన్నాయి’’ అని తెలిపారు. ‘‘డబ్బు రుచి మరిగిన మనిషి దాని కోసం ఎన్ని అడ్డదారులు తొక్కుతాడు? తద్వారా ఎంత నష్టపోతాడు? అనే ఆసక్తికరమైన కథాంశంతో రూపొందుతోన్న చిత్రమిది. ఎమ్మెస్ నారాయణ, పోసాని కృష్ణమురళిలపై ఇటీవలే రీమిక్స్ సాంగ్స్ చిత్రీకరించాం. ప్రేక్షకులు కడుపుబ్బ నవ్వేలా ఆ పాటలుంటాయి’’ అని దర్శకుడు చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: ప్రణవ్, కెమెరా: సతీష్, కళ: చిన్నా.