పెంపుడు కుక్క కథతో సినిమా | The film is based on the the investi dog-existent story | Sakshi
Sakshi News home page

పెంపుడు కుక్క కథతో సినిమా

Published Thu, Jun 5 2014 1:02 AM | Last Updated on Sat, Sep 2 2017 8:19 AM

పెంపుడు కుక్క కథతో సినిమా

పెంపుడు కుక్క కథతో సినిమా

 సీనియర్ నిర్మాత, రాజకీయవేత్త చేగొండి హరిరామ జోగయ్య చాలా ఏళ్ల విరామం తర్వాత చిత్ర నిర్మాణం చేపట్టారు. డా. రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రలో రాజా వన్నెంరెడ్డి దర్శకత్వంలో బాబు పిక్చర్స్ పతాకంపై ఆయన ఓ చిత్రం నిర్మించనున్నారు. ఆ విశేషాలను బుధవారం హైదరాబాద్‌లో పత్రికల వారికి ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా హరిరామ జోగయ్య మాట్లాడుతూ, ‘‘నాకు పెంపుడు కుక్కలంటే చాలా ఇష్టం. కుక్కపై సినిమా తీయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా.
 
ఇప్పటికి చక్కటి కథ కుదిరింది. ఓ పెంపుడు కుక్క యథార్థగాథ ఆధారంగా ఈ సినిమా తీస్తున్నాం. ఈ నెల 15న చిత్రీకరణ ప్రారంభించి, నెల రోజుల్లో పూర్తి చేస్తాం’’ అని తెలిపారు. కథ చాలా బాగా వచ్చిందని దర్శకుడు పేర్కొన్నారు. కుక్కపై చక్కని పాటరూపొందిస్తున్నామని సంగీత దర్శకుడు చక్రి చెప్పారు. ఈ చిత్రానికి రచన: రాజేంద్ర కుమార్, పాటలు: చక్రి, కెమెరా: మోహన్, నిర్మాతలు: హరిబాబు చేగొండి, బోనం చినబాబు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement