Senior Producer
-
సీనియర్ నిర్మాత గురుపాదం కన్నుమూత
సాక్షి, హైదరాబాద్: సీనియర్ నిర్మాత ఆర్.వి.గురుపాదం కన్నుమూశారు. శనివారం ఉదయం గుండెపోటు రావడంతో బెంగళూరులోని తన స్వగృహంలో ఆయన తుదిశ్వాస విడిచారు. గురుపాదం తెలుగు, తమిళ, కన్నడం, హిందీ భాషల్లో దాదాపు 25 సినిమాలను నిర్మించారు. ఎన్టీఆర్, కృష్ణతో ‘వయ్యారి భామలు వగలమారి భర్తలు’, కృష్ణంరాజు, చిరంజీవితో ‘పులి బెబ్బులి’చిత్రాలు తీశారు. ‘తిరుపతిక్షేత్ర మహత్యం’, జితేంద్ర, శ్రీదేవి హీరోహీరోయిన్లుగా హిందీలో ‘అకల్మంద్’(1984) చిత్రాలను నిర్మించారు. -
నిర్మాత సత్యనారాయణ ఇకలేరు
సీనియర్ నిర్మాత కందేపి సత్యనారాయణ ఆదివారం రాత్రి కన్నుమూశారు. బెంగళూరులో నివాసం ఉంటున్న ఆయనకు గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రాత్రి 9 గంటల ప్రాంతంలో తుదిశ్వాస విడిచారు. కొంత కాలంగా ఆయన గుండెకు సంబంధించిన వ్యాధితో బాధపడుతున్నారని కుటుంబ సభ్యులు తెలిపారు. ‘పాండురంగ మహాత్మ్యం’ అనే డబ్బింగ్ సినిమా ద్వారా సత్యనారాయణ నిర్మాతగా మారారు. ‘కొంగుముడి, శ్రీవారు, సక్కనోడు, మాయా మోహిని, దొరగారింట్లో దొంగోడు’ వంటి సినిమాలు నిర్మాతగా ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. తెలుగులోనే కాదు.. తమిళంలోనూ ఆయన పలు సినిమాలు నిర్మించారు. మొత్తం 40 చిత్రాలకుపైగా ఆయన నిర్మాతగా వ్యవహరించారు. సత్యనారాయణ మృతికి తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమలకు చెందిన పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. -
సీనియర్ నిర్మాత కొసరాజు భానుప్రసాద్ కన్నుమూత
సీనియర్ నిర్మాత కొసరాజు భానుప్రసాద్ (84) బుధవారం చెన్నైలో మృతి చెందారు. ప్రముఖ పాటల రచయిత కొసరాజు రాఘవయ్య చౌదరి కుమారుడిగా భానుప్రసాద్ అందరికీ సుపరిచితమే. ‘రోజులు మారాయి’ కోసం రాఘవయ్య చౌదరి రాసిన ‘ఏరు వాకా సాగారో...’, ‘రాముడు–భీముడు’ కోసం రాసిన ‘సరదా సరదా సిగరెట్టు’ వంటి పాటలు ఎవర్ గ్రీన్. ఎకనామిక్స్‌లో ఎం.ఏ చేసిన అనంతరం బి.ఎల్ చదివినప్పటికీ తండ్రి ప్రభావంతో 26 ఏళ్లకే భాను ప్రసాద్ సినిమా రంగంలోకి అడుగుపెట్టారు. అయితే తండ్రిలా రచయితగా కాకుండా నిర్మాతగా ప్రవేశించారు. ‘కాంభోజరాజు కథ, రాధాకృష్ణ’ చిత్రాలకు సహ నిర్మాతగా వ్యవహరించారు భాను ప్రసాద్. 1981లో కవిరత్నా మూవీస్ బ్యానర్‌ని స్థాపించి ఎన్టీఆర్ హీరోగా దాసరి నారాయణరావు దర్శకత్వంలో ‘విశ్వరూపం’ సినిమాని నిర్మించారు భానుప్రసాద్. అనంతరం ‘ఓ ఆడది ఓ మగాడు’(1982), ‘భోళాశంకరుడు’(1984) సినిమాలు రూపొందించారాయన. దాదాపు 12ఏళ్ల తర్వాత 1997లో ఎన్.ఆర్. అనురాధా దేవితో కలిసి ‘ప్రియా ఓ ప్రియా’ చిత్రాన్ని నిర్మించారు. ఆ తర్వాత భానుప్రసాద్ సినిమా నిర్మాణానికి దూరంగా ఉన్నారు. భానుప్రసాద్ అంత్యక్రియలు ఈ రోజు ఉదయం 10 గంటలకు చెన్నైలో జరగనున్నాయి. ఆయన మృతికి తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి సంతాపం తెలిపింది. -
సినీ భీష్మ
-
పెంపుడు కుక్క కథతో సినిమా
సీనియర్ నిర్మాత, రాజకీయవేత్త చేగొండి హరిరామ జోగయ్య చాలా ఏళ్ల విరామం తర్వాత చిత్ర నిర్మాణం చేపట్టారు. డా. రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రలో రాజా వన్నెంరెడ్డి దర్శకత్వంలో బాబు పిక్చర్స్ పతాకంపై ఆయన ఓ చిత్రం నిర్మించనున్నారు. ఆ విశేషాలను బుధవారం హైదరాబాద్‌లో పత్రికల వారికి ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా హరిరామ జోగయ్య మాట్లాడుతూ, ‘‘నాకు పెంపుడు కుక్కలంటే చాలా ఇష్టం. కుక్కపై సినిమా తీయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా. ఇప్పటికి చక్కటి కథ కుదిరింది. ఓ పెంపుడు కుక్క యథార్థగాథ ఆధారంగా ఈ సినిమా తీస్తున్నాం. ఈ నెల 15న చిత్రీకరణ ప్రారంభించి, నెల రోజుల్లో పూర్తి చేస్తాం’’ అని తెలిపారు. కథ చాలా బాగా వచ్చిందని దర్శకుడు పేర్కొన్నారు. కుక్కపై చక్కని పాటరూపొందిస్తున్నామని సంగీత దర్శకుడు చక్రి చెప్పారు. ఈ చిత్రానికి రచన: రాజేంద్ర కుమార్, పాటలు: చక్రి, కెమెరా: మోహన్, నిర్మాతలు: హరిబాబు చేగొండి, బోనం చినబాబు.