తొండి చేస్తే! | tondi movie | Sakshi
Sakshi News home page

తొండి చేస్తే!

Published Mon, Sep 7 2015 11:26 PM | Last Updated on Sun, Sep 3 2017 8:56 AM

తొండి చేస్తే!

తొండి చేస్తే!

చిన్నతనంలో ఎవరినైనా తొండి చేస్తే ఏదో సరదా కోసం అని ఊరుకుంటారు. మరి అదే పెద్దయ్యాక కూడా అలాగే చేస్తే మోసం చేశావంటారు. ఓ యువకుడు తన ప్రేమ విషయంలో ఇలానే ప్రవర్తించాడు. ఆ తర్వాత ఏం జరిగిందనే కథాంశంతో తెరకెక్కుతున్న చిత్రం ‘తొండి’. సందీప్, ప్రియ జంటగా శ్రీకృష్ణ శంకర ప్రొడక్షన్స్ పతాకంపై ప్రసాద్ వెలంపల్లి దర్శకత్వంలో కె. కోటేశ్వరరావు ఈ సినిమా నిర్మిస్తున్నారు. డా. రాజేంద్రప్రసాద్, బ్రహ్మానందం, సంపూర్ణేష్ బాబు, దీక్షాపంత్‌లు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ‘‘ఓ వాస్తవ సంఘటన ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం.

కచ్చితంగా అందరినీ అలరించే చిత్రమిది’’ అని దర్శకుడు చెప్పారు. నిర్మాత మాట్లాడుతూ-‘‘మలేసియా, హైదరాబాద్, వైజాగ్‌ల్లోని ఆసక్తికరమైన లొకేషన్స్‌లో చిత్రీకరణ జరిపాం. వచ్చేవారం పాటలను, త్వరలోనే చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అని తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా:జయరాం, అంజి, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్: ‘సాగర్’ మహతి, పాటలు: రెహమాన్, సహనిర్మాత: కె. వంశీధర్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement