Krishna Murali Posaani
-
'టోల్ ఫ్రీ నెంబర్ 143' టీజర్ లాంఛ్
-
టోల్ ఫ్రీ నెం.143 మూవీ స్టిల్స్
-
మహిళా రాజకీయ నేపథ్యంలో బ్రోకర్-2
నేటి రాజకీయాల్లో మహిళల పాత్ర ఏంటి? వారిని పావుల్లా ఎలా వాడుతున్నారు? అనే ప్రశ్నలకు సమాధానంగా రూపొందుతోన్న చిత్రం ‘బ్రోకర్-2’. పోసాని కృష్ణమురళి ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ చిత్రాన్ని మద్దినేని రమేష్ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్నారు. 70 శాతం చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం గురించి రమేష్ మాట్లాడుతూ- ‘‘మహిళలు, రాజకీయాలు అనే రెండు అంశాలతో పాటు కావల్సినన్ని వాణిజ్య అంశాలు కూడా ఈ కథలో ఉంటాయి. గతంలో వచ్చిన ‘బ్రోకర్’ చిత్రానికి కొనసాగింపు ఈ సినిమా. అయితే... ఆ సినిమాకు, ఈ సినిమాకు కథ పరంగా చాలా వ్యత్యాసం ఉంటుంది. ఈ నెలలోనే మిగతా టాకీతో పాటు అయిదు పాటల చిత్రీకరణను పూర్తి చేస్తాం. నవంబర్లో పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేసి, డిసెంబర్లో సినిమాను విడుదల చేస్తాం’’ అని తెలిపారు. నూతన నటి స్నేహ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో జీవా, బెనర్జీ, సిరి, కాదంబరి కిరణ్, ప్రభు, గిరి, శోభ ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి మాటలు: యార్లగడ్డ నాగేంద్రదేవ్, శ్రీని తేరాల, పాటలు: చైతన్య ప్రసాద్, ఛాయాగ్రహణం: వెంకట్, సమర్పణ: వెంకట్ వర్థినేని. -
కృష్ణచైతన్య దర్శకత్వంలో నారా రోహిత్
నారా రోహిత్ హీరోగా మూవీ మిల్స్ అండ్ సినిమా 5 సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం హైదరాబాద్లో ప్రారంభమైంది. గీత రచయితగా మంచి గుర్తింపు తెచ్చుకున్న కృష్ణచైతన్య ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నారు. విశాఖాసింగ్, నందినీరాయ్ కథానాయికలు. ఈ నెల 25న రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా సహనిర్మాత సందీప్ కొరిటాల మాట్లాడుతూ - ‘‘యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో హీరో పాత్ర వైవిధ్యంగా ఉంటుంది. అద్భుతమైన కథతో రూపొందిస్తున్న పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ ఇది. కథానుసారం భారీ వ్యయంతో ఈ చిత్రాన్ని నిర్మించనున్నాం’’ అని చెప్పారు. నాజర్, బ్రహ్మానందం, పరుచూరి వెంకటేశ్వరరావు, పోసాని కృష్ణమురళి, రావు రమేష్, అజయ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: అరవిందన్ పి.గాంధీ, సంగీతం: సన్నీ ఎమ్.ఆర్., ఎడిటింగ్: కార్తీక శ్రీనివాస్. -
ఎమ్మెస్, పోసానిపై రీమిక్స్ సాంగ్స్
డా.రాజేంద్రప్రసాద్ యముడిగా నటించిన చిత్రం ‘మనుషులతో జాగ్రత్త’. అక్షయ్తేజ్, సోనియా బిర్జి జంటగా నటిస్తున్నారు. గోవింద్ వరాహ దర్శకుడు. బి.చిరంజీవులు నాయుడు, రొట్టా అప్పారావు నిర్మాతలు. సోషియో ఫాంటసీ కథాంశంతో రూపొందుతోన్న ఈ చిత్రం టాకీ పార్ట్ పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ -‘‘సమాజంలో జరుగుతున్న అన్యాయాలను ఎత్తి చూపుతూ వినోదాత్మకంగా దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇంకా రెండు పాటలు మాత్రమే మిగిలి ఉన్నాయి’’ అని తెలిపారు. ‘‘డబ్బు రుచి మరిగిన మనిషి దాని కోసం ఎన్ని అడ్డదారులు తొక్కుతాడు? తద్వారా ఎంత నష్టపోతాడు? అనే ఆసక్తికరమైన కథాంశంతో రూపొందుతోన్న చిత్రమిది. ఎమ్మెస్ నారాయణ, పోసాని కృష్ణమురళిలపై ఇటీవలే రీమిక్స్ సాంగ్స్ చిత్రీకరించాం. ప్రేక్షకులు కడుపుబ్బ నవ్వేలా ఆ పాటలుంటాయి’’ అని దర్శకుడు చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: ప్రణవ్, కెమెరా: సతీష్, కళ: చిన్నా.